సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయాలను కీలకమలుపు తిప్పనున్న నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యం కాదని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబునాయుడు తమ రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలను పెంచాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి అర్జీలు పెట్టగా కేంద్రం ఈ ప్రకటన చేసింది. విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలను పెంచాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో పేర్కొన్నప్పటికీ అది సాధ్యం కాదని పేర్కొంది. కాగా, తెలంగాణలోని 119 స్థానాలను 153కు, ఏపీలోని 175 స్థానాలను 225కు పెంచాలని విభజన చట్టంలో పొందుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment