సీల్డ్ కవర్ ద్వారా సీఎంను చేయడమే పెద్ద తప్పు'
సీల్డ్ కవర్ ద్వారా కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంని చేయడమే కాంగ్రెస్ అధిష్టానం చేసిన పెద్ద తప్పు అని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013 వచ్చింది శాసన సభ్యుల అభిప్రాయాల కోసమేననే విషయం తెలిసి కూడా సీఎం రాజ్యంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ నాగం విమర్శించారు. ఏ అంశంలోనైనా తెలంగాణకు సీఎం కిరణ్ న్యాయం చేశారా అంటూ ప్రశ్నించారు.
‘‘బిల్లు లోపభూయిష్టం, రాజ్యాంగ ఉల్లంఘనలున్నాయంటూ.. బిల్లును తిప్పి పంపాలని అంటూ అసెంబ్లీ లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలపై తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కిరణ్ తీరు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయంటూ తెలంగాణ మంత్రులు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు.