కిరణ్‌ది ఉన్మాదం: నాగం | Nagam Janardhan Reddy takes on Kiran kumar reddy | Sakshi

కిరణ్‌ది ఉన్మాదం: నాగం

Jan 23 2014 3:51 AM | Updated on Jul 29 2019 5:31 PM

ముఖ్యమంత్రి కిరణ్ సమైక్య నినాదం ఒక విధానం కాదని, అది కేవలం ఉన్మాదమేనని ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ సమైక్య నినాదం ఒక విధానం కాదని, అది కేవలం ఉన్మాదమేనని ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై బుధవారం శాసనసభలో మాట్లాడుతూ తెలంగాణ కోసం 1,200 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేస్తే కనీసం సంతాపం ప్రకటించేందుకు సభలో అవకాశం కల్పించలేదని, ఇది ఆంధ్రజాతి వివక్షేనని ఆరోపించారు. సమైక్యాంధ్రలో తెలంగాణ అన్ని రకాలుగా దోపిడీకి గురైందన్నారు. తెలంగాణ జాప్యం కావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. చంద్రబాబు తెలంగాణకు జై కొడితే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడతారని నాగం ఈ సందర్భంగా సూచించడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement