హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును తిరస్కరించి వెనక్కి పంపాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన తీర్మానాన్ని చేపట్టాలని అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కోరామని శాసనసభ వ్యవహారాల మంత్రి శైలజానాథ్ చెప్పారు. బిల్లుపై చర్చించేందుకు అసెంబ్లీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన గడువు గురువారంతో ముగుస్తున్నందున రేపు స్పీకర్ తీర్మానాన్ని చేపట్టే అవకాశముందని చెప్పారు.
విభజనపై బిల్లుపై ఓటింగ్ జరిగే ఆస్కారమూ ఉందని మంత్రి తెలిపారు. తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ అసెంబ్లీకి వచ్చి కూర్చున్న విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు శైలజానాత్ చెప్పారు.
సీఎం తీర్మానాన్ని రేపు చేపట్టే అవకాశం
Published Wed, Jan 29 2014 8:33 PM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement