
కేసీఆర్ నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
ఆత్మహత్యలపై గవర్నర్‌ను కలసిన నాగం
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలను పట్టించుకోకుండా, ప్రశ్నించిన ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణ బచావో మిషన్ వ్యవస్థాపకు డు నాగం జనార్దన్‌రెడ్డి కోరారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో కలసి గురువారం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే రుణమాఫీ చేయాలని, ప్రైవేటు రుణాలపై మారటోరియం ప్రకటించాలని, కరువు మండలాలను ప్రకటించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.