
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక విప్లవంతో కులవృత్తులకు దూరమైన వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఓబీసీ జనగణన చేపట్టాలని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దేశ ప్రధానిగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఓబీసీ గణన చేపట్టకపోవడం సరికాదన్నారు.
కేంద్రం ఓబీసీల గణన చేపట్టేలా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలిసి గురువారం శాసనసభ మీడియా పాయింట్ వద్ద శ్రీనివాస్‌గౌడ్ విలేకరులతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment