హైదరాబాద్ : రూల్ నంబర్ 77, 78 కింద ఇచ్చిన నోటీసుపై వెంటనే నిర్ణయం ప్రకటించాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ను వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేసింది. బిల్లును తిరస్కరిస్తూ సమైక్య తీర్మానం చేసి, దానిపై ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్ను కోరినట్టు ఆపార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తెలిపారు. ఓటింగ్ విషయంలో కాంగ్రెస్, టీడీపీలు ఇప్పుడు తమ దారిలోకి వచ్చాయని ఆమె అన్నారు. కిరణ్ ముందే ఇదే వైఖరి అనుసరించి ఉంటే బిల్లు ఇంతవరకూ వచ్చేదా అని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు.
కిరణ్, బాబు ఇద్దరూ... తెలుగు ప్రజలను నిట్టనిలువునా ముంచారని ఆమె మండిపడ్డారు. బిల్లు తిరస్కరణ నోటీసు విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కుమ్మక్కు మరాజకీయాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు, కిరణ్ ఇద్దరూ బీఏసీ సమావేశానికి రావాలని... వారి వైఖరి తెలపాలని శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు.
'తెలుగు ప్రజలను నిట్టనిలువునా ముంచారు'
Published Tue, Jan 28 2014 12:53 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement