shobha nagi reddy
-
చున్నీ లాగానని కేసు పెట్టడం బాధ కలిగించింది
నంద్యాల: మాజీ మంత్రి భూమా అఖిలప్రియవి దిగజారుడు రాజకీయాలని సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆమె తనపై చున్నీలాగానని కేసు పెట్టడం బాధ కలిగించిందన్నారు. పట్టణంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కొత్తపల్లె గ్రామం వద్ద జరిగిన ఘటనలో తండ్రి లాంటి వయసు ఉన్న తనపై చున్నీ లాగి, హత్యాయత్నం చేసినట్లు అఖిలప్రియ కేసు పెట్టడం మహిళా సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల ఇద్దరి పరువు పోతుందని, కేసు పెట్టాలంటే ఎన్నో రకాల కారణాలు ఉంటాయని, మరీ ఇంత దిగజారడం ఏమిటని ప్రశ్నించారు. అఖిలప్రియ విధానాల వల్ల ఆమె కుటుంబ సభ్యులే దూరమవుతున్నారన్నారు. ఆళ్లగడ్డలో భూమా వర్గాన్ని, టీడీపీ కార్యకర్తలను దూరం చేసుకుందన్నారు. తనపై తప్పుడు ఫిర్యాదు చేయడంతోనే పోలీసులు తనను అరెస్టు చేయలేదన్నారు. పలుచోట్ల అక్రమాలకు, భూ కబ్జాలకు పాల్పడటంతోనే అఖిలప్రియను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, ఇందులోనూ తన ప్రమేయం ఏమీ లేదన్నారు. అప్పు చెల్లించాలని బంధువులే ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారని, తల్లి, తండ్రి నుంచి రాజకీయ వారసత్వం ఆశించినప్పుడు వారి అప్పులు కూడా కట్టాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే రాబోయే ఎన్నికల్లో ఆళ్లగడ్డ, నంద్యాలలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. -
Bhuma Family: భూమా కుటుంబంలో 'దావా'నలం
దివంగత భూమా నాగిరెడ్డి దంపతులపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఆళ్లగడ్డ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనను నిశితంగా పరిశీలిస్తే భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ ప్రధాన అనుచరుడు గుంటూరు శీను తండ్రి మాదాల వెంకటరమణయ్య ఈ దావా వేశారు. దీనికి ప్రధాన కారణం నంద్యాల ఆంధ్రా బ్యాంకులోని అప్పును ఎగవేసేందుకు ఓ పథకం ప్రకారం కోర్టులో దావా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్న ఈఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి, ఆళ్లగడ్డ: భూమా నాగిరెడ్డి తన పేరుపై ఉన్న భూమిని నంద్యాల ఆంధ్రా బ్యాంకులో తనఖాపెట్టి రుణం తీసుకున్నారు. నాగిరెడ్డి బతికి ఉన్నంత వరకూ నెలవారీగా వాయిదాలు చెల్లించారు. వారు చనిపోయిన తర్వాత అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.19 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటిని చెల్లించాలని బ్యాంకు నుంచి భూమా వారసులపై ఒత్తిడి పెరిగింది. దీని నుంచి బయట పడేందుకు వారు పథకం రచించారు. బ్యాంకులో రుణం తీసుకునేందుకు ముందే తనఖా పెట్టిన ఆస్తి మాదాల వెంకటరమణయ్య అనే వ్యక్తికి విక్రయించినట్లు ఓ అగ్రిమెంట్ సృష్టించారు. తర్వాత తమకు విక్రయించిన ఆస్తిని తమకు తెలియకుండా బ్యాంకులో తనఖా పెట్టి మోసం చేశారని కోర్టులో దావా వేశారు. అయితే, ఈ దావా దాఖలు వెనుక భూమా వారసుల ప్రమేయం ఉందనే చర్చ జిల్లాలో జోరుగా నడుస్తోంది. ఈ దిశగానే సోషల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. బకాయిల బాగోతం ఇదీ 2011 డిసెంబరు నెలలో భూమానాగి రెడ్డి పేరు మీద ఉన్న సర్వే నంబర్ 66/1 లో 1.94, 66/1 లో 4.37, 73 లో 6.17, 370/1ఎ లో 1.50, 370/ఏ2 లో 4.10, 370 /ఏ3 లో 0.40, 370/బి3లో 0.43, ఎకరాలు, భూమా శోభానాగి రెడ్డి పేరుమీద ఉన్న 356/ఏ, 170/ఏ లోని 1190 చదరపు గజాలు, 75/3 లో 1.08, 75/1లో 013 ఎకరాలు, భూమా శివలక్షమ్మ పేరుమీద ఉన్న 574/1లో 1.00, 574/2లో 1.40 ఎకరాల భూము లను ఉమ్మడిగా నంద్యాల ఆంధ్రా బ్యాంకులో కుదువ పెట్టి రుణం తీసుకున్నారు. ఈ ఆస్తులను బ్యాంకు తనఖా కంటే 4 నెలల ముందే అంటే 2011 ఆగస్టు 10న తనకు విక్రయించారని, అందుకు సంబంధించి అగ్రిమెంట్ రాసిచ్చారని వెంకటరమణయ్య ఓ అగ్రిమెంట్ సృష్టించినట్లు తెలుస్తోంది. రూ. 30 లక్షలు అగ్రిమెంట్ రోజు ఇచ్చారని, ఆపై 2014 ఫిబ్రవరి 10న మరో రూ.3 లక్షలు ఇచ్చారని దావాలో పేర్కొన్నారు. శోభానాగిరెడ్డి మృతి తర్వాత వారి వారసులు అఖిల, నాగమౌనిక, జగత్ విఖ్యాత్ రెడ్డిలు 2016 జనవరి 5న రూ.5 లక్షలు, భూమానాగిరెడ్డి మృతి తర్వాత 2019 డిసెంబర్ 26న రూ.6 లక్షలు తీసుకున్నారని, మిగిలిన సొమ్ము చెల్లిస్తామని సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించాలని ఆళ్లగడ్డ కోర్టులో ఈ నెల 6న వెంకటరమణయ్య దావా వేశారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు! తల్లిదండ్రులు మృతి చెందిన తరువాత వారి పేరు ప్రతిష్టలు తగ్గకుండా వారసులు చూస్తారు. ఎవరైనా వారి గురించి తప్పుగా మాట్లాడినా జీర్ణించుకోలేరు. ఇందుకు విరుద్ధంగా భూమా వారసులు రాజకీయంగా పదవులు.. కోట్లాది రూపాయల ఆస్తుల అనుభవిస్తూ వారిపైనే కోర్టులో దావా వేయించడం పట్ల భూమా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడమే కాదు వారు చేసిన అప్పులను కూడా చెల్లించాలని చర్చించుకుంటున్నారు. దీనికి తోడు పై ఆస్తుల విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సుమారు రూ 100 కోట్ల దాకా ఉంటుంది. ఇంత విలువైన ఆస్తులను భూమా దంపతులు మాదాల వెంకటరమణయ్యకు కేవలం రూ. 45 లక్షలకు విక్రయించారంటే నమ్మశక్యం కావడం లేదని భూమా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎవరీ మాదాల వెంకటరమణయ్య గుంటూరు పట్టణానికి చెందిన వెంకటరమణయ్య ఇటీవల ఆళ్లగడ్డ ప్రాంతంలో తరచూ వినపడుతున్న గుంటూరు శీనుకు తండ్రి. అఖిలప్రియ భర్త భార్గవరామ్‌కు శీను అత్యంత సన్నిహితుడు. టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి హత్యాయత్నం కేసు, హైదరాబాద్‌లో స్థలం విషయంలో జరిగిన కిడ్నాప్ కేసులు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఆయా కేసుల్లో అఖిలప్రియ, భార్గవరామ్‌తో పాటు గుంటూరు శీను ప్రధాన నిందితుడు. ఇప్పుడు అతని తండ్రి వెంకటరమణయ్య భూమా దంపతులతో పాటు వారి వారసులైన భూమా అఖిలప్రియ, నాగమౌనిక, జగత్ విఖ్యాత్ రెడ్డిలపై కోర్టులో కేసు వేయడం ఒక ఎత్తైతే ఆ దావాకు వకాల్తా పుచ్చుకున్నది అభిలప్రియ వ్యక్తిగత లాయరే కావడం విశేషం. బ్యాంకుకు శఠగోపం పెట్టేందుకే! భూమా దంపతులు ఉన్నప్పుడు తీసుకున్న రుణానికి సంబంధించి 2015 సంవత్సరం వరకు క్రమం తప్పకుండా కంతులు చెల్లిస్తూ వచ్చారు. వారు మృతి చెందినప్పటి నుంచి వారసులు కంతులు కట్టక పోవడంతో ప్రస్తుతం సుమారు రూ. 19 కోట్ల వరకు బకాయి పడ్డట్టు తెలుస్తోంది. ఈ రుణం చెల్లించాలని అనేక దఫాలుగా వారి వారసులైన కూతుర్లు, కొడుకుకు నోటీసులు పంపినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. దీంతో విసిగి పోయిన బ్యాంకర్లు తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తామని ఇటీవల నోటీసులు పంపించారు. అయితే, సదరు షెడ్యూల్ ఆస్తులు వివాదాస్పదంగా ఉన్నాయని సృష్టిస్తే వేలం పాటలో ఎవ్వరూ పాల్గొనరు. తద్వారా బ్యాంకులకు శఠగోపం పెట్టొచ్చనే ఉద్దేశంతో తమకు అత్యంత సన్నిహితుడు అయిన గుంటూరు శీను తండ్రి మాదాల వెంకటరమణయ్యతో దావా వేయించారని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. -
జోహార్ శోభమ్మ
జ్ఞాపకాల జడిలో తడిసి ముద్దయ్యారు. కరిగిపోయిన కాలాన్ని గుర్తు చేసుకుని కన్నీరు కార్చారు. ఏడాది గడిచినా చెరగని అభిమానం.. తరగని అనురాగం ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. పిలిస్తే పలికే నేతగా.. ఆపదలో నేనున్నాననే భరోసానిచ్చే ఇంటి మనిషిగా.. తలలో నాలుకగా మెలిగిన శోభమ్మ ప్రథమ వర్ధంతిన ఆళ్లగడ్డ జనసంద్రమైంది. ఆమె నిలువెత్తు విగ్రహాలను చూసి.. ఘాట్ వద్ద చిత్రపటానికి నివాళులర్పించిన ప్రతి హృదయం చలించింది. చేతులెత్తి మొక్కి.. జోహార్ శోభమ్మ అంటూ నినదించారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: శోభా నాగిరెడ్డి పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రకటించారు. ట్రస్టుకు ఈ రోజే రిజిస్ట్రేషన్ చేయించానని, అన్ని వర్గాల ప్రజలకు చేయూతనందిస్తానని స్పష్టం చేశారు. ఆళ్లగడ్డలో శోభా ఘాట్ వద్ద మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత శోభానాగిరెడ్డి ప్రథమ వర్ధంతి సభ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది పేద విద్యార్థులు ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్నా సరైన ప్లాట్‌ఫాం లేక ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. వీరందరికీ ట్రస్టు ద్వారా సహాయం చేస్తామన్నారు. అదేవిధంగా కాలేజీలు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించామన్నారు. ప్రతి యేటా ఆమె జయంతి, వర్ధంతి రోజున కల్యాణమస్తు పేరిట పేదలకు పెళ్లిళ్లు చేస్తామన్నారు. తన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆమె ఆశయాల సాధనకు కృషి చేస్తామని వర్ధంతి సభకు తరలివచ్చిన అశేష జనవాహినికి హామీనిచ్చారు. తామంతా ఇంత ధైర్యంతో ముందుకు పోతున్నామంటే అది మీ అభిమానమేనని ప్రకటించారు. ‘ఆమె లేని లోటు నిజంగా మా కుటుంబానికి తీరనిలోటు. కేవలం భార్యగానే కాకుండా నాకు మంచి స్నేహితురాలిగా ఉంది. ఇటువంటి రోజు నా జీవితంలో ఉంటుందని నేనెన్నడూ ఊహించలేదు. ఆమె లేని జీవితం నాకు చాలా బాధాకరమైనది. ఈ రోజు నేను బతికి ఉన్నానంటే అది కేవలం పిల్లల కోసమే’ అని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. ‘మాది పెద్ద కుటుంబం. ప్రతి ఒక్కరి కష్టసుఖాలు ఆమె తెలుసుకునేది. ఈ రోజు అందరం కలిసి ఉన్నామంటే అది శోభ ఘనతే’ అన్నారు. ఎక్కడ ఉన్నా నెంబర్ 1గా ఉండాలన్నదే ఆమె అభిమతమని, ఏ పార్టీలో పనిచేసినా ఆ పార్టీ నెంబర్ 1గా ఉండేందుకు కృషి చేసేదన్నారు. ఆ నాయకుడు నెంబర్ 1గా ఉండాలని కోరుకునే మంచి స్వభావం ఆమెదని కొనియాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి ఇంత దగ్గర అవుతామని అనుకోలేదన్నారు. విజయమ్మ వెంట ఉండి ఆమెకు మద్దతుగా నిలిచిందని గుర్తుచేశారు. ‘జగన్మోహన్రెడ్డిని సీఎంను చేయాలని ఆమె భావించింది. ఆమె చివరిసారిగా మాట్లాడిన మాటలు కూడా అవే. బహుశా అది ఇప్పుడు కాదని భావించే ముందుగానే వెళ్లిపోయినట్టుంది’ అని బాధాతప్త హృదయంతో వ్యాఖ్యానించారు. ‘‘నంద్యాల బహిరంగ సభ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లు.. సమయం అయిపోయింది అని అన్నాను. బహుశా మేమే ఆమెను పంపించామని తలచుకున్నప్పుడల్లా బాధ అవుతుంది’’ అని భావోద్వేగానికి లోనయ్యారు. నియోజకవర్గానికి మమ్మీ అయ్యింది నంద్యాల ఎంపీగా పీవీ నరసింహారావు మీద తాను పోటీ చేసినప్పుడు ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఆమెను మొదటిసారిగా పోటీలోకి దింపితే అందరూ డమ్మీ అభ్యర్థిని తెచ్చారని వ్యాఖ్యానించారని భూమా గుర్తుచేశారు. అయితే, ఆమె ఈ నియోజకవర్గానికి మమ్మీ అయిందన్నారు. ఆళ్లగడ్డ ఇంత ప్రశాంతంగా ఉందంటే గ్రూపులన్నీ ఏకం చేసిన ఘనత శోభమ్మదేనని వ్యాఖ్యానించారు. అమ్మ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా...! ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. తనకు ఎంతో ధైర్యం ఇచ్చిన మీకు రుణపడి ఉంటానని ప్రకటించారు. ‘తప్పకుండా అమ్మ కోరిక నెరవేరుతుందని, అమ్మ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని మాట ఇస్తున్నాను. ఇంత మంది ఎంతో అభిమానంతో ఇక్కడకు వచ్చారని... ట్రాక్టర్ల మీద మహిళలు వచ్చారంటే అమ్మ మీద ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది. నంద్యాల సభ ముగిసిన తర్వాత చెల్లెలు ఆరోగ్యం బాగోలేదు చూసుకో.. నేను వస్తున్నా అని ఫోన్ చేసింది. అయితే, కొద్దిసేపట్లోనే మరణిస్తుందని ఊహించలేదని’ గద్గధ స్వరంతో వ్యాఖ్యానించారు. అమ్మ మరణించిన మూడు రోజులకే ప్రచారానికి వెళితే ఏమీ చెప్పాలో తెలియని పరిస్థితి ఉందని.. ప్రజలే తనను ఓదార్చి, మేమున్నామని ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. ‘చిన్నప్పుడు అమ్మ హాస్టల్ వద్దకు వస్తే గుర్తుపట్టలేదు. అప్పుడు అమ్మ ఎంతో బాధపడి ఇలాంటి పరిస్థితి రానివ్వనని మాట ఇచ్చింది. అయితే, ఎన్నికల సమయంలో అడిగితే ఒళ్లో తల పెట్టుకుని పడుకోబెట్టుకుని మాట్లాడింది. అయితే, ఈసారి తోడుగా ఉంటానని హామీ ఇవ్వలేదు. బహుశా అమ్మకు ముందే తెలిసీ హామీ ఇవ్వలేదోమో’ అని బాధాతప్త హృదయంతో అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తోబుట్టువు పుట్టినప్పుడు తనకు మాత్రమే తోబుట్టువుని, ఇప్పుడు రా్రష్ట ప్రజలందరికీ తోబుట్టువుగా నిలిచిందని కర్నూలు ఎమ్మెల్యే, శోభానాగిరెడ్డి అన్న ఎస్వీ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న నాన్నకంటే గొప్పనేతగా ఎదిగిందన్నారు. ఇంత మంది మనస్సుల్లో అభిమానం సంపాదించిన ఆమె తనకు చెల్లెలు కావడం గర్విస్తున్నానని ప్రకటించారు. ‘ఇప్పటికీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ కలిసిన ప్రతిసారి శోభక్క ప్రస్తావన వస్తుంది. అనేక మంది నన్ను కర్నూలు ఎమ్మెల్యేగా కంటే శోభమ్మ అన్న అని పరిచయం చేయడం నాకు ఎంతో గర్వంగా ఉంటోంది. పార్టీ నాయకురాలిగా, తల్లిగా, ప్రజా ప్రతినిధిగా సమన్వయంతో చక్కటి బాధ్యతలు నిర్వర్తించారు’ అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విజయమ్మ తర్వాత పేరు తెచ్చుకున్న వ్యక్తి శోభక్క అని చెప్పడంలో అతిశయోక్తి కాదని ప్రకటించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత విజయమ్మ వెంట ఉండి నడిపించిందని, విజయమ్మకు సలహాలు, సూచనలు ఇచ్చిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర రెడ్డి, గౌరు చరిత, సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఐజయ్య, గుమ్మనూరు జయరాం, రఘురామిరెడ్డి, శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి, అంజద్ బాషా, విశ్వేశ్వర రెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, చాంద్ బాషా, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి, పార్టీ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కుటుంబ సభ్యులు భూమా నారాయణ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, బీవీ రామిరెడ్డి, నాగమౌనిక, జగత్ విఖ్యాత్ రెడ్డి, డాక్టర్ హరికృష్ణ, బుడ్డా శేషారెడ్డి, చెరకులపాడు నారాయణ రెడ్డి, రామకృష్ణ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి, డాక్టర్ రవికృష్ణ, తెర్నేకల్లు సు రేందర్ రెడ్డి, వంగాల భరత్‌కుమార్ రెడ్డి, డీకే రాజశేఖర్, యాలూరు కాంతారెడ్డి, వంగాల ఈశ్వర్ రెడ్డి, ఎస్వీ ప్రసాద్ రెడ్డి, కర్రా హర్షవర్దన్ రెడ్డి, భూమా నర్శిరెడ్డి, పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన జనం శోభానాగిరెడ్డి ప్రథమ వర్ధంతి సభకు రా ష్ట్రం నలుమూలల నుంచి జనం భారీగా తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. మరోవైపు పేదల కోసం మె గా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచే భారీ సంఖ్య లో ప్రజలు తరలివచ్చి... ఆమె చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు శోభానాగిరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. అదేవిధంగా శోభానాగిరెడ్డి గురించి రచించిన పాటల సీడీని జగన్ ఆవిష్కరించారు. సభలో ఆమెలేని జీవితం నరకప్రాయమని... కేవలం పిల్లల కోసమే బతుకుతున్నానని మాట్లాడుతూ భూమా నాగిరెడ్డి కంటతడి పెట్టుకున్నారు. అమ్మను తలచుకుని భూమా అఖిలప్రియ మాట్లాడినప్పుడు ఆమెతో పాటు సభలో పలువురు కంటతడి పెట్టుకుని జోహార్ శోభమ్మ అని నినాదాలు చేశారు. ఇక శోభా నాగిరెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎస్వీ మోహన్‌రెడ్డి తర్వాత ఏడేళ్లకు జన్మించిన సంతానం కావడంతో పువ్వుల్లో పెట్టి చూసుకున్నామన్నారు. ఆమె గురించి మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదని.. మాటలు కూడా రావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. పోటెత్తిన అభిమానులు ఆళ్లగడ్డ :శోభమ్మ సంస్మరణ సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామాల నుంచి ట్రాక్టర్లు, ఆటోలు, మినీ బస్సులు, మోటారు సైకిళ్లలో ఉదయం 9 గంటల నుంచే జనం శోభా ఘాట్ చేరుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సభా ప్రాంగణం చేరుకునే సరికి 20వేల కుర్చీలు జనంతో నిండిపోయాయి. జగన్ రాకతో ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కుర్చీలు సరిపడక ప్రజలు నిలబడే అభిమాన నేత ప్రసంగం ఆలకించారు. శోభానాగిరెడ్డి చిత్రపటాల పంపిణీ శోభానాగిరెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా నంద్యాల నంది ప్రింటింగ్ ప్రెస్ యజమాని ముద్రించిన 40వేల శోభానాగిరెడ్డి చిత్రపటాలను సంస్మరణసభలో పంపిణీ చేశారు. నాయకులు ప్రసంగిస్తున్న సమయంలో శోభా నాగిరెడ్డి పేరు చెప్పినప్పుడల్లా ప్రజలు ఆమె చిత్రపటాన్ని చూపుతూ శోభమ్మ ఇంకా తమ మదిలోనే ఉందంటూ నినదించారు. శోభానాగిరెడ్డి సంస్మరణసభకు వచ్చిన అందరూ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లో వచ్చి శోభమ్మకు నివాళులర్పించి సభా ప్రాంగణంలోకి వెళ్లేందుకు దారి కల్పించారు. అభిమానులందరికీ భోజన వసతి కల్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వలంటీర్ల సమన్వయంతో సంస్మరణ సభ ప్రశాంతంగా సాగింది. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్ల ద్వారా శోభా నాగిరెడ్డి జ్ఞాపకాలతో రూపొందించిన డాక్యుమెంటరీని ప్రసారం చేశారు. -
శోభానాగిరెడ్డికి వైఎస్సార్సీపీ నేతల నివాళి
సాక్షి, హైదరాబాద్: దివంగత శోభానాగిరెడ్డికి వైఎస్సార్సీపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శోభ ప్రథమ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు ఆమె సేవలను కొనియాడారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు, వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డితోపాటు పార్టీ నేతలు పుత్తా ప్రతాప్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, విజయచందర్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, సయ్యద్ ముజ్తబ అహ్మద్, జార్జి హెర్బర్ట్ తదితరులు పాల్గొన్నారు. -
శోభమ్మను ఎప్పటికీ మరువలేం
ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుండేవారు శోభా నాగిరెడ్డి ప్రథమ వర్ధంతి సభలో వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నానంటూ శోభా నాగిరెడ్డి ముందుండేవారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని శోభాఘాట్ వద్ద శుక్రవారం నిర్వహించిన దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ప్రథమ వర్ధంతి సభకు ఆయన హాజరయ్యారు. ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం.. ప్రత్యేకంగా తయారు చేయించిన శోభా నాగిరెడ్డి విగ్రహాలు రెండింటిని వైఎస్ జగన్, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మలు ఆవిష్కరించారు. అలాగే శోభానాగిరెడ్డిపై రచించిన పాటల సీడీని కూడా జగన్ ఆవిష్కరించారు. వర్ధంతి సభలో జగన్ మాట్లాడుతూ ఎండలను సైతం లెక్కచేయకుండా ఎంతోమంది ఇక్కడకు వచ్చారని.. అభిమానం ఉంటే దేనినీ ఖాతరు చేయరని, సమస్యలను లెక్కపెట్టరని ఇక్కడికొచ్చిన అభిమానుల్ని చూస్తే అర్థమవుతోందన్నారు. భూమా కుటుంబానికి మేమందరం తోడుగా ఉన్నామని ఇక్కడికొచ్చిన ప్రతి స్వరం చెబుతోందన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు 65 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలం మేనమామలుగా తోడుగా ఉంటామన్నారు.శోభమ్మను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారంటే ఆమెపై ఎంత అభిమానం ఉందో ఇట్టే అర్థమవుతుందన్నారు. ‘ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉంటారు. అందులో మంచి ఎమ్మెల్యేలు కొందరే ఉంటారు. ప్రజల సమస్యలను తీర్చేందుకు, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ఉన్నవాళ్లు మంచి ఎమ్మెల్యేలుగా నిలిచిపోతారు. శోభానాగిరెడ్డి అలాంటి నేత’ అని జగన్ కొనియాడారు. జగన్ మీద ఈగ వాలనీయకుండా శోభమ్మ చూసిందన్న సాయన్న(ఆదోని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి) మాటల్లో నిజముందన్నారు. ‘నాకు షర్మిల అనే ఒక చెల్లెలు ఉంది.. శోభమ్మ అనే అక్క కూడా ఉంది’ అని గద్గద స్వరంతో అన్నారు. ‘అన్యాయంగా నన్ను జైల్లో పెట్టి’... నాలుగైదు నెలల తర్వాత విచారణకోసం కోర్టుకు తీసుకువచ్చినప్పుడు సొంత అక్క తమ్ముడికోసం బాధపడినట్టు శోభమ్మ నా చేయి పట్టుకుని ‘నీకు ఎందుకు ఇన్ని బాధలు అని ఎంతో బాధపడింది’ అని జగన్ గుర్తుచేసుకున్నారు. శోభమ్మను పోగొట్టుకుని కుటుంబం ఎంత బాధపడిందో.. తనకూ అంతే బాధ ఉందన్నారు. ఆమెను ఏ ఒక్కరూ మర్చిపోలేరన్నారు. మాట్లాడలేకపోతున్నా... రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నాలుగేళ్లపాటు శోభమ్మ తనకు ఎంతో చేదోడువాదోడుగా నిలిచిందని పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుర్తు చేసుకున్నారు. ప్రతీ నిమిషం, ప్రతీ సెకను ప్రజాసమస్యల గురించి ఆలోచించేదని... ఆమె చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. ఆమె గురించి మాట్లాడలేకపోతున్నానని దుఃఖస్వరంతో విజయమ్మ విలపించారు. ఆమె లేని లోటు తీరనిదన్నారు. ఆమె సహాయం చేసే గుణం, సమయస్ఫూర్తి మనందరికీ ఆదర్శనీయమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. పిల్లల కోసమే బతుకుతున్నా... శోభమ్మ లేని జీవితం నరకప్రాయంగా ఉందని పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గద్గద స్వరంతో చెప్పారు. కేవలం పిల్లలకోసమే బతికి ఉన్నానంటూ కన్నీంటి పర్యంతమయ్యారు. ఆమె ఆశయాలను కొనసాగించేందుకు శోభమ్మ ట్రస్టు పేరుతో ఏటా జయంతి, వర్ధంతుల రోజున సహాయ కార్యక్రమాలు చేపడతానని ప్రకటించారు. శోభమ్మది అనుకున్నది సాధించేతత్వమని ఆమె తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి అన్నారు. కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖరరెడ్డి, గౌరు చరిత, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఐజయ్య, గుమ్మనూరు జయరాం, రఘురామిరెడ్డి, శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, అంజద్ బాషా, విశ్వేశ్వరరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, చాంద్ బాషా, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, పార్టీ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కుటుంబ సభ్యులు.. నాగమౌనిక(చిన్నకుమార్తె), జగత్ విఖ్యాత్‌రెడ్డి(కుమారుడు), భూమా నారాయణరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
శోభమ్మ కళ్లలో ఆ బాధను చూశా: వైఎస్ జగన్
ఆళ్లగడ్డ: తనకు షర్మిల అనే చెల్లెలే కాదని, శోభమ్మ అనే అక్క కూడా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో వైఎస్ జగన్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. శోభా నాగిరెడ్డి ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ శోభమ్మ భౌతికంగా లేకపోయినా.. అందరి హృదయాల్లో ఉన్నారన్నారు. తాను జైలులో ఉన్నప్పుడు కోర్టుకు హాజరు పరిచిన సందర్భంగా తన అమ్మ, తన భార్య భారతితో పాటు శోభమ్మ కూడా వచ్చారని, ఆ సందర్భంగా ఆమె తన చేయి పట్టుకుని, 'నీకే ఇన్ని సమస్యలు ఎందుకుని' బాధపడిందని, ఆ సమయంలో తమ్ముడి కోసం పడుతున్న బాధను శోభమ్మ కళ్లల్లో చూశానని వైఎస్ జగన్ అన్నారు. శోభమ్మను పోగొట్టుకోవటం ఆ కుటుంబంతో పాటు, అందరికీ తీరని నష్టమన్నారు. ఇక రాజకీయాల్లో చాలామంది ఎమ్మెల్యేలు ఉంటారని,అయితే మంచి ఎమ్మెల్యేల కోవలో శోభా నాగిరెడ్డి ముందుంటారన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానని రుజువు చేశారని అన్నారు. అనంతరం వైఎస్ జగన్.. శోభా నాగిరెడ్డిపై రూపొందించిన పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దివంగత మహానేత రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు. -
'శోభమ్మ కళ్లలో ఆ బాధను చూశా'
-
శోభా నాగిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
ఆళ్లగడ్డ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దివంగత భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
శోభానాగిరెడ్డికి ఘన నివాళి
-
శోభానాగిరెడ్డికి ఘన నివాళి
హైదరాబాద్: ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ ముఖ్య నేతలు శోభా నాగిరెడ్డికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, పలువురు పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. అదే విధంగా ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో కూడా శోభానాగిరెడ్డి ప్రథమ వర్ధంతి నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో నివాళులు అర్పించిన వారిలో మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. శోభానాగిరెడ్డి సొంత జిల్లా కర్నూలులో భారీగా వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి హాజరయ్యారు. నగరంలోని చాంద్రాయణ గుట్టలో వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్తానిక వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆమె చిత్రపటం వద్ద పుష్ఫ గుచ్ఛలతో నివాళులు అర్పించారు. -
నేడు శోభానాగిరెడ్డి మొదటి వర్ధంతి
-
నేడు శోభమ్మ ప్రథమ వర్ధంతి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన శోభానాగిరెడ్డి ప్రథమ వర్ధంతి నేడు ఆళ్లగడ్డలో జరగనుంది. కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో పాటు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం కొనసాగుతుందని శోభానాగిరెడ్డి భర్త, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తెలిపారు. సాధారణ ఎన్నికల సందర్భంగా గత ఏడాది నంద్యాలలో జరిగిన పార్టీ మహిళా నేత షర్మిల బహిరంగ సభ అనంతరం తిరిగి ఆళ్లగడ్డకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం శోభమ్మ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభమవుతుందని భూమా వెల్లడించారు. 9.30 గంటలకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు. ప్రముఖ గాయని, వైఎస్సార్ సీపీ సాంసృతిక విభాగం నాయకురాలు వంగపండ ఉష బృందం... శోభానాగిరెడ్డి చేసిన సేవలను వివరిస్తూ సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. అనంతరం 11 గంటలకు సంస్మరణ సభలో పార్టీ గౌవర అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధినేత వైఎస్ జగన్‌తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేయించిన శోభానాగిరెడ్డి విగ్రహాలను విజయమ్మతో పాటు జగన్ ఆవిష్కరిస్తారని వివరించారు. వర్ధంతి కార్యక్రమానికి దాదాపు 20వేల నుంచి 25వేల మంది వరకూ హాజరవుతారని అంచనా. -
నేడు ఆళ్లగడ్డకు జగన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దివంగత భూమా శోభా నాగిరెడ్డి తొలి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఆళ్లగడ్డకు వెళుతున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్ చేరుకుంటారని గురువారం పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.శోభా తొలి వర్ధంతిని హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు పాల్గొంటారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి గురువారం వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం మాచునూరులో బండలాగుడు పోటీలను ప్రారంభి ంచారు. తలపాగా చుట్టిన ఆయన చర్నాకోలా చేతబట్టి ఎద్దులను అదిలించి ఆకట్టుకున్నారు. - సాక్షి, కడప -
ఆత్మీయత ఆమె ఆరోప్రాణం
కుటుంబాన్ని తీర్చి దిద్దుతూనే రాయలసీమ రాజకీయాల్లో ఓ మహిళ రాణించడమంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ సాధించడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ కీలకమైన నేతగా శోభా నాగిరెడ్డి ఎదిగారు. నేటితరం రాజకీయ నాయకులలో రెండు రకాల వారు కనిపిస్తుంటారు. ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాగానే తమ కు ఓ పదవి వచ్చిందని కాలర్ ఎగరేసి ప్రజలకు దూర మైపోయేవారు మొదటిరకం. జనం తమకు ఓ బాధ్యత అప్పగించారనుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత మెరుగ్గా పనిచేసేవారు రెండోరకం. దివంగత శోభా నాగిరెడ్డి రెండో కోవకు చెందినవారు. ప్రజలకు, అభిమానులకు, ఆత్మీయులకు, పార్టీ శ్రేణులకు ఆమె దూరమై అప్పుడే ఏడాది గడచిపోయింది. పార్టీ శ్రేణులు ఆప్యాయంగా, ఆత్మీయంగా ‘శోభ మ్మ’, ‘శోభక్క’ అని పిలుచుకునే శోభా నాగిరెడ్డికి కుటుంబ నేపథ్యం వల్లనో ఏమో రాజకీయాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి పంచాయ తీ బోర్డు ప్రెసిడెంట్‌గా ఉన్నపుడే ఆయనతోపాటు కార్యాలయానికి వెళ్లేవారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ ఆయన వెన్నంటి ఉండేవారు. ప్రజల సమస్యలను సన్ని హితంగా పరిశీలించడంతో పాటు పరిష్కారాల గురిం చి తండ్రితో చర్చించేవారు. తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న శోభ 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా బరిలో నిలబడాల్సి వచ్చింది. అప్పుడే కాదు ఆ తర్వాత మరో నాలుగుసార్లు ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికై సంచల నం సృష్టించారు. రోడ్డు ప్రమాదం కబళించడంతో భౌతికంగా లేకపోయినా 2014 ఎన్నికల్లో సాంకేతిక కారణాలతో ఆమె పేరు బ్యాలెట్ పత్రంలో ఉండడం, 18 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఓ అరుదైన సంఘటన. మంచి వాగ్ధాటి, సమస్యల పట్ల అవగాహన వంటి ప్రత్యేక లక్షణాలు ఆమె ఏ పార్టీలో ఉన్నా కీలకమైన బాధ్యతలను నిర్వర్తించేలా చేశాయి. విమర్శలను దీటు గా తిప్పికొట్టడమే కాదు ప్రత్యర్థులను సునిశితమైన విమర్శలతో ఎదుర్కొనడం ఆమెకు ప్రత్యేకమైన గుర్తిం పును తెచ్చిపెట్టింది. రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కి మొట్టమొదటి మహిళా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన శోభ కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషిచేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే వైఎస్ కుటుంబంతో ఆమె అనుబంధం మరో ఎత్తు. వైఎస్ మరణానంతరం తలె త్తిన సంక్షోభ సమయంలో శోభా నాగిరెడ్డి కుటుంబం జగన్మోహన్రెడ్డికి అండగా నిలిచారు. జగన్ అక్రమ నిర్బంధ సమయంలో ఆ కుటుంబానికి వెన్నంటే ఉండి మనోధైర్యాన్నిస్తూ కొండంత అండలా నిలబడ్డారు. పార్టీ శ్రేణులలో ఆత్మస్థయిర్యాన్ని నింపడంలోనూ, పార్టీని ముందుకు నడిపించడంలోనూ కీలకంగా ఉన్న అతి కొద్దిమంది నేతలలో శోభ కూడా ఒకరు. ‘మహా నేత వైఎస్ మరణం తర్వాత జగన్‌ను అంతలా కుంగ దీసిన మరో ఘటన ఏదైనా ఉందంటే అది సోదరి సమానురాలైన శోభ దూరం కావడమే’ అని పార్టీ నాయకులు అంటారు. అందుకే వైఎస్ కుటుంబాన్ని అభిమానించే ప్రతి కుటుంబమూ ఓ ఆడపడుచును కోల్పోయామన్నంతగా బాధపడింది. ఆమెకు ఒక్కసారి పరిచయమైతే చాలు పేరుతో సహా గుర్తుంచుకుని పలకరిస్తారని చెబుతారు. సీమ యాసలో ‘అన్నా’ అని ఆప్యాయంగా పిలుస్తారని జర్న లిస్టు సోదరులూ గుర్తుచేసుకుంటుంటారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలూ ఆమెకు చిరపరి చితమైనవే. అనేక గ్రామాల్లో కమ్యూనిటీహాళ్లు, హాస్పి టల్స్, రోడ్లు, తాగునీటి సదుపాయాలను కల్పించి జనం గుండెల్లో ఆ కుటుంబం చోటు సంపాదించింది. కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాల రైతులకు సాగునీరు, తాగునీటికి అత్యంత కీలకమైన కేసీ కెనాల్ నీటి కోసం శోభ తరచూ అధికారులతో గొడవ పడుతుండేవారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను నిలదీస్తుండేవారు. ఆళ్లగడ్డ రైతుల కోసం అనేక సార్లు ధర్నాలు చేశారు. సాగునీటి సలహా మండలి, డీడీఆర్సీ సమావేశాలు జరుగుతున్నాయంటే ఎవరు వచ్చినా రాకపోయినా ఎమ్మెల్యే శోభ తప్పనిసరిగా హాజరయ్యేవారు. ఒక్క ఆళ్లగడ్డ నియోజకవర్గానికే శోభ పరిమితం కాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, పార్టీ కేంద్ర గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలిగా, పార్టీ అత్యు న్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన పొలిటికల్ అఫై ర్స్ కమిటీ సభ్యురాలిగా అనేక రకాల బాధ్యతలు నిర్వ ర్తించారు. 2011 కడప లోక్‌సభ ఉప ఎన్నికల సంద ర్భంగా మైదుకూరు నియోజకవర్గ ఇన్చార్జిగా పని చేసిన శోభ, అక్కడి కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపి పార్టీని పటిష్టం చేశారు. అలా డీఎల్ రవీంద్రారెడ్డి కం చుకోట బద్దలు కొట్టడంలో తన వంతు పాత్ర పోషించా రు. బద్వేలు, ప్రొద్దుటూరు, పులివెందుల నియోజక వర్గాల్లో సైతం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో శోభ స్ఫూర్తిని నింపారు. పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్ని కతో పాటు పార్టీ తరఫున ఏ కార్యక్రమం జరిగినా, దీక్ష చేపట్టినా, పోరాటం చేసినా విజయమ్మ వెన్నంటి శోభ ఉన్నారు. షర్మిల మరో ప్రజాప్రస్థాన పాదయాత్ర సమ యంలోనూ తోడుగా నడిచారు. భార్యగా, తల్లిగా కుటుంబాన్ని తీర్చి దిద్దుతూనే రాజకీయంగానూ.. అందులోనూ రాయలసీమ రాజ కీయాల్లో ఓ మహిళ రాణించడమంటే మామూలు విష యం కాదు. ఇవన్నీ సాధించడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ కీలకమైన నేతగా శోభా నాగిరెడ్డి ఎదిగారు. జీవితంలో ఎన్నో కష్టాలకు, ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలిచినా విధి చేతిలో ఓడిపోయారు. భౌతి కంగా దూరమైనా శోభమ్మ జ్ఞాపకాలు మాత్రం మాసి పోవు. అవి ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి. - పోతుకూరు శ్రీనివాసరావు -
శోభా నాగిరెడ్డికి కుటుంబ సభ్యుల నివాళి
కర్నూలు : దివంగత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఆళ్లగడ్డ పట్టణ శివార్లలోని కర్నూలు, కడప జాతీయ రహదారిలోని శోభాఘాట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అంజలి ఘటించారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎస్వీ మోహన్ రెడ్డితో పాటు ఇతర కుటుంబసభ్యులు, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా గత ఏడాది ఏప్రిల్ 23వ తేదీన రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. హిందూ సాంప్రదాయ ప్రకారం ఏడాది సంవత్సరికాన్ని 11 నెలలకే నిర్వహించే పద్ధతి ఉంది. కాగా వచ్చే నెల 23వ తేదీన ప్రజల సమక్షంలో శోభా నాగిరెడ్డి తొలి వర్థంతి వేడుకను నిర్వహించనున్నారు. -
నాకు స్పష్టమైన జవాబు కావాలి అధ్యక్షా!
రోడ్డు ప్రమాదాలపై అసెంబ్లీలో శోభానాగిరెడ్డి తనయ ప్రశ్న సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభలో మొట్టమొదటిసారి మాట్లాడిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అందర్నీ ఆకట్టుకున్నారు. దివంగత శోభా నాగిరెడ్డి స్థానంలో ఎన్నికైన అఖిల సోమవారం జీరో అవర్‌లో మాట్లాడారు. తన తల్లి మృతికి కారణమైన రోడ్డు ప్రమాదాలను తొలి అంశంగా ఎంచుకుని సభను ఆకట్టుకున్నారు. ఎంతో అనుభవజ్ఞులైన పెద్దల ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్‌కు ధన్యవాదాలు తెలుపుతూనే తాను ఏ పరిస్థితుల్లో అసెంబ్లీకి ఎన్నికైందీ వివరించారు. ‘అమ్మ స్థానంలో ఉండి నేను ఈవేళ మాట్లాడుతున్నాను. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. చాగలమర్రి-నంద్యాల రోడ్డులో ఇటీవలి కాలంలో 12 ప్రమాదాలు జరిగాయి. అయినా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. చిన్నచిన్న కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లపై దారి మళ్లింపు గుర్తులు, గుంతల పూడ్చివేతలు, మరమ్మతులు చేపట్టమని మా అమ్మ ఎన్నో లేఖలు రాసింది. అయినా పట్టించుకోలేదు. ఫలితంగా అమ్మనే కోల్పోయా. నా అనుభవం మరెవ్వరికీ రాకూడదు. అందువల్ల చూస్తాం, చేస్తాం, సంబంధిత మంత్రికి చెబుతాం.. అని చెప్పకుండా సూటిగా నా ప్రశ్నకు సమాధానం కావాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారో సంబంధిత మంత్రితో చెప్పించాలని కోరుతున్నా అధ్యక్షా..’ అంటూ ముగించినప్పుడు పార్టీలతో నిమిత్తం లేకుండా సభ్యులు అభినందించారు. రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యల్ని వివరించారు. సభ్యురాలు చెప్పిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ సమస్య తీవ్రమైందని, ఆ అంశంపై మాట్లాడేందుకు అఖిల అర్హమైన సభ్యురాలని అన్నారు. -
రోడ్డు ప్రమాదం వల్లే అమ్మను పోగొట్టుకున్నా..
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది మృత్యువాత పడుతుండటంపై ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదం కారణంగా తాను తన తల్లిని పొగొట్టుకున్న విషయాన్ని ఆమె సోమవారం అసెంబ్లీలో జీరో అవర్‌లో ప్రస్తావించారు. తొలిసారి సభలో మాట్లాడిన అఖిల ప్రియ... రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొక్కుబడి సమాధానం కాకుండా చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆమె రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నవారి వివరాలతో సహా సభలో ప్రస్తావించారు. -
ఘనంగా శోభమ్మ జయంతి
సాక్షి, కర్నూలు : వైఎస్సార్సీపీ నాయకురాలు దివంగత శోభా నాగిరెడ్డి ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఏడాది పొడవునా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేర్కొన్నారు. నంద్యాలలోని అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న నవజీవన్ బధిరుల పాఠశాల, ఆర్ఎస్ రోడ్డులోని సెయింట్ లూక్ అంధుల పాఠశాలల్లో మంగళవారం శోభా నాగిరెడ్డి 46వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శోభా నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్‌లు కట్ చేసి విద్యార్థులకు అందజేశారు. టీవీ, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే భూమా మాట్లాడుతూ చిన్న వయస్సులోనే శోభాను భగవంతుడు తీసుకెళ్లడం బాధాకరమన్నారు. సమాజంలో ఎవరికీ తీసిపోని విధంగా బతికే శక్తిని బధిర, అంధ విద్యార్థులకు ప్రసాదించాలని దేవున్ని వేడుకుంటానన్నారు. శోభానాగిరెడ్డి ట్రస్టు ద్వారా విద్య, క్రీడలు,పేదవారి ఆశలను నెరవెర్చడమే తమ కర్తవ్యమన్నారు.పట్టుదలతో పనిచేసి శోభా నాగిరెడ్డి ట్రస్టు ద్వారా శోభా నాగిరెడ్డిని బతికించుకుంటామన్నారు. నంద్యాలలోని రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి మూడు చోట్ల అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. నడిగడ్డలోని మాస్టర్ పబ్లిక్ స్కూల్లో శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా నంద్యాల వైద్యుల సహకారంతో కేబుల్ ఆపరేటర్ల సంఘం, ఆర్వీఎఫ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి 46వ జయంతి సందర్భంగా ఆమె కుమార్తె ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రక్తదానం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆళ్లగడ్డ పట్టణంలోని ఏవి కళ్యాణమండంలో శోభా నాగిరెడ్డి కుమార్తె మౌనిక, శోభా నాగిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు 200 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతు సేవా కార్యక్రమాలంటే ఆమ్మకు చాలా ఇష్టమని, అందుకే అమ్మ జయంతి రోజున సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగ పడేవిధంగా సేవా కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. -
శోభా నాగిరెడ్డికి భూమా, అఖిలప్రియ నివాళులు
కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దివంగత శోభా నాగిరెడ్డి (46) జయంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా నంద్యాల ఎమ్మెల్యే, భర్త భూమా నాగిరెడ్డి, కుమార్తె అఖిలప్రియలు శోభా ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏవీ కళ్యాణ మండపంలో నేత్ర, రక్తదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 200 మంది రక్త దాతలు, అభిమానుల, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దీంతో పాటు అన్ని హాస్టళ్లలో అన్నదాన కార్యక్రమం, హరిజనవాడ, మురికివాడలల్లో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించనున్నారు. -
ప్రత్యేక చర్చ : తప్పిదాలే ప్రాణాలు తీస్తున్నాయా?
-
తప్పిదాలే ప్రాణాలు తీస్తున్నాయా?
-
విషాదం నింపుతున్న రోడ్డు ప్రమాదాలు
*వరుస ప్రమాదాల్లో బలవుతున్న ప్రముఖులు *ప్రాణాలు తీస్తున్న అతి వేగం *గమ్యస్థానానికి చేరాలన్న తొందరలో దూకుడు ప్రయాణం *సీటు బెల్ట్ వాడరు *ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన *డ్రైవర్ల పట్ల పర్యవేక్షణా లోపం *చిన్న అశ్రద్ధకు భారీ మూల్యం *రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది బలి త్వరగా వెళ్లాలనే ఆరాటం... ఆ ఆత్రుతే ప్రాణాల మీదకు తెస్తోంది... ఆ తొందర్లోనే చిన్న చిన్న జాగ్రత్తలను గాలికి ఒదిలేయడం ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఎందరో ప్రముఖులు, మరెంతో మంది భవిష్యతారలు ఇలాగే మృత్యువాతపడ్డారు. అతి వేగం ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తుంటుంది. కాని భయపడేవారేవరూ. కేర్లెస్గా ఉండటమే తమకు ఇష్టమని ఆధునిక యూత్ ర్యాష్ డ్రైవింగ్‌తో మరీ చెప్తోంది. వేగంగా వాహనాలు నడిపి ప్రాణాలు పొగొట్టుకుంటే... ఎవరికి నష్టం. చెట్టంత ఎదిగిన కొడుకులు కళ్ల ముందు కన్నుమూస్తే ఆ తల్లిదండ్రులు పడే వేదనను ఎవరు తీర్చుతారు? *శోభానాగిరెడ్డి వైఎస్ఆర్ సీపీ నేత *ఎర్రన్నాయుడు టీడీపీ నేత *లాల్‌జాన్ బాషా టీడీపీ నేత *కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి (s/o కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి) *కోటా వెంకట ప్రసాద్ (s/o కోటా శ్రీనివాసరావు) *పి.పవన్ కుమార్ (s/o బాబూమోహన్) *మహ్మద్ అయాజుద్దీన్ (s/o మహ్మద్ అజారుద్దీన్) ఇపుడు.... *నందమూరి జానకిరామ్.. (s/o నందమూరి హరికృష్ణ) వీరంతా రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన రాజకీయ, సినీప్రముఖులు. *వైఎస్ఆర్ సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలోనే మృత్యువాత పడ్డారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన ఆ దుర్ఘటన ఇప్పటికీ కళ్లముందు కదులుతూనే ఉంటుంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఎన్నికల ప్రచారం ముగించుకొని కారులో ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పల్ని తప్పించే ప్రయత్నంలో జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. *ఇక రోడ్డు ప్రమాదాలు తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం మిగిల్చాయి. సీనియర్ నేతలు ఎర్రన్నాయుడు, లాల్ జాన్బాషాలు రోడ్డు ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద ఎర్రన్నాయుడు ప్రయాణిస్తున్న వాహనం పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో ఆయన కన్నుమూశారు. ఇక టీడీపీ ఉపాధ్యక్షుడు లాల్‌జాన్ బాషా వాహనం ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఘటనా స్థలిలోనే బాషా కన్నుమూశారు. *అలాగే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డిని రోడ్డు ప్రమాదమే పొట్టనపెట్టుకుంది. 2011లో మెదక్ జిల్లా కొల్లూరు సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ప్రతీక్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు ఘటనాస్థలంలోనే చనిపోయారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కారు నడపడం ఆ ప్రమాదానికి కారణం. *ఇక ఫాదర్స్ డే నాడే.. సినీ నటుడు కోట శ్రీనివాసరావుకు పుత్రశోకం కలిగింది. ఫంక్షన్‌కు అటెండయ్యేందుకు స్పోర్ట్స్ బైక్ మీద వెళ్తున్న కోట వెంకట ప్రసాద్.. నార్సింగి సమీపంలో అప్పా వద్ద డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డారు. బాబూమోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003లో జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పాయాడు. అలాగే వర్ధమాన నటుడు యశోసాగర్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. *హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ కన్నుమూశాడు. ఔటర్ రింగ్ రోడ్డుపై మితి మీరిన వేగంతో బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని అప్పట్లో వాదనలు వినిపించాయి. *ఇపుడు నందమూరి హరికృష్ణ కుమారుడు నందమూరి జానకిరామ్‌ను బలిగొంది రోడ్డుప్రమాదమే. జానకిరామ్ ప్రయాణిస్తున్న సఫారీ.. నల్లగొండ జిల్లా ఆకుపాముల శివారు వద్ద రాంగ్రూట్లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. చెప్పుకుంటూ పోతే ఎంతో మంది జీవితాల్లో రోడ్డు ప్రమాదాలు విషాదం నింపాయి. చిన్న అజాగ్రత్తలు ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. ప్రమాదాలకు కారణాలు ఏంటని ఆరా తీస్తే...అతివేగం ఒకరిదైతే.. నిర్లక్ష్యం ఇంకొకరిది. ప్రొఫెషనల్ డ్రైవర్లు కాకపోవటం.... డ్రైవర్లను పెట్టుకోకపోవటం...ఇలా ఎన్నో ప్రమాదానికి కారణాలవుతున్నాయి. ఇక అన్నిజాగ్రత్తలు తీసుకున్నా...రోడ్డుపై వెళ్లేటపుడు ఎదురుగా వస్తున్న వాహనదారుల తప్పిదాల వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. -
శోభానాగిరెడ్డికి భూమా అఖిలప్రియ నివాళులు
కర్నూలు: దివంగత నేత భూమా శోభానాగిరెడ్డి ఘాట్ వద్ద ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆదివారం ఉదయం నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి అఖిలప్రియ ఆళ్లగడ్డకు వచ్చారు. ఆళ్లగడ్డలో కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అఖిలప్రియకు ఘనస్వాగతం పలికారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. -
అమ్మ డైరీలో రాసుకున్నవన్నీ చేస్తా!
అంతర్వీక్షణం అఖిల ప్రియ అఖిలప్రియకు పాతికేళ్లు నిండి రెండేళ్లు కూడా కాలేదు. ఈ పిన్న వయసులోనే ఒక నియోజకవర్గ ప్రజలకు అండగా నిలవాల్సి వచ్చింది. ఆళ్ళగడ్డ ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికై, తల్లి స్వర్గీయ శోభా నాగిరెడ్డి నిలిపిన అంచనాలకు తగ్గట్టుగా ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఇప్పుడామె మీద పడింది. ఈ సందర్భంగా ఈ యువ ఎమ్మెల్యే ఆలోచనాంతరంగం... ► ఆళ్లగడ్డ ప్రజలు మీలో శోభమ్మను చూస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యత... రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి అమ్మకు కూడా ఇరవై ఆరేళ్లే. కొద్ది నెలల తేడాలో ఇద్దరం ఒకే వయసులో రాజకీయాల్లోకి వచ్చాం. అప్పుడు అమ్మకు ఇంటి బాధ్యతలు, మా పెంపకంతోపాటు చాలా కీలకమైన బాధ్యతలుండేవి. అలాంటప్పుడే ఆమె భయపడలేదు. ఆ స్ఫూర్తితోనే పనిచేస్తాను. ► మీ మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయేమో? నిజమే... ఎమ్మెల్యేగా అద్భుతమైన పనితీరు చూపింది. నేను ఆ స్థాయిని చేరాలంటే చాలా శ్రమించాలి. ముందుగా ప్రతి విషయాన్నీ లోతుగా అధ్యయనం చేయాలి. అందుకు నేను సిద్ధమే. ► ఆళ్లగడ్డలో పర్యటిస్తుంటే... ప్రతి ఒక్కరూ అమ్మను తలుచుకుంటూ, నాకు ధైర్యం చెబుతున్నారు. వారితో ఉంటే, అమ్మ దగ్గర ఉన్నట్లే అనిపిస్తోంది. ఆ ప్రజల మధ్యే ఎక్కువ సమయం గడపాలనిపిస్తోంది. ► అమ్మ కోసం ఎన్నికల ప్రచారం చేసినప్పటి ఫీలింగ్స్...! అమ్మానాన్నల కోసం పిల్లలం ముగ్గురం చిన్నప్పటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే ఉన్నాం. చిన్నప్పుడు ఎగ్జయిట్మెంట్ ఉండేది. అమ్మ లేనప్పుడు ఆమె కోసం చేసిన ప్రచారంలో ప్రజల్లో అంతులేని బాధ, భయం కనిపించాయి. మా కుటుంబం నుంచి ఒకరు వస్తారని తెలిసిన తర్వాత వారిలో ధైర్యాన్ని చూశా. ► ఆళ్లగడ్డ కోసం ఏం చేయాలనుకుంటున్నారు? అమ్మ ఒక డైరీలో ఆమె చేయాలనుకున్న పనులను రాసుకుంది. అవి ఆళ్లగడ్డ కోసం ఆమె అనుకున్న పనులు మాత్రమే కాదు ఆళ్లగడ్డ ప్రజలు కోరుకున్న పనులు కూడా! ఆమె పోయాక ఆ డైరీ గురించి తెలిసింది. ఇప్పుడు వాటన్నింటినీ పూర్తి చేయాలనుకుంటున్నాను. ► రాజకీయాల్లోకి రాకముందు వ్యాపార రంగంలో స్థిరపడాలనుకున్నారు కదా! నియోజక వర్గ ప్రజలకు ఉపాధి ఇవ్వగలిగితే బావుణ్ణనేది అమ్మ. అందుకోసమే డైరీ ఫామ్, రైతులకు ఉపయోగపడే పరిశ్రమలు అనుకున్నాం. ► మీ అమ్మగారికి ఇంత ప్రజాదరణ ఉందని ఎప్పుడు తెలిసింది? అమ్మ మాకు ఎప్పుడూ గృహిణిగానే కనిపించేది. తాను రాజకీయాల్లో ఉండడం వల్ల మేము తనని మిస్ కాకూడదని తపన పడేది. ఎక్కడున్నా గంట గంటకూ ఫోన్ చేసి ‘తిన్నారా, ఇంకా పడుకోలేదా’ అని అడిగేది. మాకు ఒంట్లో బాగాలేదని తెలిస్తే ఉన్న పళంగా వచ్చేసేది. మాకు అలాగే తెలుసు. కానీ ఆమె పోయాక మాత్రమే ఇంతటి ఆదరణ ఉందని తెలిసింది. ► పెద్దకూతురిగా మీ బాధ్యతలు... చెల్లి, తమ్ముడు చిన్నవాళ్లు. వాళ్లకు ధైర్యం చెబుతుండాలి. అమ్మ కోరుకున్నట్లు వాళ్లు తయారయ్యే వరకు పర్యవేక్షించాలి. నాన్న డీలా పడకుండా చూసుకోవాలి. ఇక నా జీవితానికి గమ్యం అంటారా... ఒక లక్ష్యంతో సాగుతున్న వారికి జీవితమే గమ్యాన్ని సూచిస్తుంది. నేను జీవితంలో అమ్మను తప్ప మరి దేనిని మిస్ కావడం లేదు. - వి.ఎం.ఆర్ -
ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా అఖిలప్రియ ఏకగ్రీవం
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతితో వచ్చిన ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున అఖిలప్రియ పోటీ చేశారు. ఎంఎల్ఏ మరణానంతరం ఆ స్థానంలో నిర్వహించే ఉప ఎన్నికలో కుటుంబ సభ్యులు పోటీ చేస్తే ఇతర పార్టీలేవీ తమ అభ్యర్థులను పోటీలో నిలపరాదనే సంప్రదాయానికి కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర పార్టీలన్నీ కట్టుబడ్డాయి. అఖిలప్రియతో పాటు ఆరుగురు స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. నలుగురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి పలు కారణాలతో తిరస్కరించారు. శుక్రవారం ఉపసంహరణకు అవకాశం కల్పించడంతో మిగిలిన ఇద్దరు స్వతంత్రులూ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. తహశీల్దార్ కార్యాలయంలో నంద్యాల ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డితో కలసి అఖిలప్రియ డిక్లరేషన్ ఫాం అందుకున్నారు. ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు సహకరించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, భూమా నాగిరెడ్డి.. తెలుగుదేశం, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు, ప్రజలకు అఖిలప్రియ కృతజ్ఞతలు తెలిపారు. -
ఆళ్లగడ్డలో పోటీ చేయం: టీడీపీ
హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. తమ పార్టీ నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సి.ఎం. రమేశ్ సోమవారం సచివాలయంలో వెల్లడించారు. ఆళ్లగడ్డ ఎన్నిక విషయంలో వైఎస్సార్సీపీ చేసిన వినతిని పరిగణనలోకి తీసుకుని వచ్చే నెల 8న జరిగే ఎన్నికలో టీడీపీ పోటీలో ఉండదని కేఈ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరఫున భూమా శోభా నాగిరెడ్డి పోటీ చేశారు. అయితే ఎన్నికల ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. అయినా ఆ ఎన్నికల్లో ఆమెకు ప్రజలు ఘనవిజయం అందించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును కలసి పోటీ విషయమై విజ్ఞప్తి చేయాలని వైఎస్సార్సీపీ నేతలు నిర్ణయించారు. అయితే హుదూద్ సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు బాబు వైజాగ్ వెళ్లడంతో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని వైఎస్సార్సీపీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు కలిశారు. అనంతరం కేఈతో పాటు టీడీపీ ఎంపీలు సత్యనారాయణచౌదరి, సి.ఎం రమేశ్, ఎస్పీవై రెడ్డి సీఎం చంద్రబాబుతో సమావేశమై ఆళ్లగడ్డలో పోటీ విషయంపై చర్చించారు. ఇటీవల నందిగామ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థిని నిలబెట్టలేదని, గతంలో పలు సందర్భాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినపుడు పోటీ పెట్టిన సందర్భాలు లేవని నేతలు ఆ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున అభ్యర్థిని పోటీకి పెట్టకూడదని నిర్ణయించారు. పోటీపై కాంగ్రెస్ నేడు నిర్ణయం ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో పోటీ విషయమై కాంగ్రెస్ పార్టీ మంగళవారం నిర్ణయం తీసుకోనుంది. కాగా పోటీకి దూరంగా ఉండాలని కర్నూలు జిల్లా డీసీసీ నేతలు తీర్మానం చేసి ఆ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి తెలిపారు. -
ఆళ్లగడ్డ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి నామినేషన్లు ఈ నెల 21వ తేదీ వరకు స్వీకరిస్తారు. గ త ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా శోభా నాగిరెడ్డి పోటీ చేశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటన పూర్తి అయినందున ఎన్నికలు నిర్వహించారు. మరణించిన శోభా నాగిరెడ్డి ఎన్నికల్లో గెలుపొందారు. శోభా నాగిరెడ్డి భౌతికంగా లేకపోవడంతో మళ్లీ ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది. ఉప ఎన్నికలో భూమా శోభా నాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిల ప్రియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అఖిల ప్రియను ప్రకటించారు. మరోవైపు ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. కాగా ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా నంద్యాల ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి వ్యవహరిస్తారు. ఆళ్లగడ్డ తహశీల్దార్.. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారు. ఎన్నికల షెడ్యూలు : నామినేషన్లు - ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు పరిశీలన - ఈనెల 22న ఉపసంహరణ - ఈనెల 24న పోలింగ్ - నవంబర్ 8న ఓట్ల లెక్కింపు - నవంబర్ 12న -
ఆళ్ళగడ్డ ఉపఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా..
-
'ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి ప్రయత్నిస్తాం'
హైదరాబాద్: ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరఫున దివంగత శోభానాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ పోటీ చేయనున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి. మైసూరారెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మైసూరారెడ్డి మాట్లాడుతూ... ఆ ఉప ఎన్నికల్లో మిగిలిన రాజకీయ పార్టీలు పోటీ పెట్టకుండా ఉండే సంప్రదాయాన్ని అనుసరించాలని సదరు పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ఈ నెల 15న టీడీపీ నేతలను కలుస్తామన్నారు. అలాగే మిగిలిన రాజకీయ పార్టీల నేతలతో కూడా చర్చలు జరుపుతున్నామన్నారు. ఆయా పార్టీలు తమ పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామన్నాయని ఆయన వివరించారు. ఇటీవల జరిగిన నందిగామ ఉప ఎన్నిక సమయంలో తాము ఇదే సంప్రదాయం పాటించామని మైసూరారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
ఆళ్లగడ్డకు నవంబర్ 8న ఉప ఎన్నిక
* షెడ్యూలు జారీచేసిన కేంద్ర ఎన్నికల సంఘం * ఈనెల 14న జారీకానున్న నోటిఫికేషన్ సాక్షి, న్యూఢిల్లీ: ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గానికి వచ్చే నెల 8న ఉప ఎన్నిక జరగనుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూలు విడుదల చేసింది. ఈ నియోజకవర్గం నుంచి గత సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన భూమా శోభానాగిరెడ్డి ఎన్నికలకు ముందు ఏప్రిల్ 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికలో ఆమెకు అత్యధిక ఓట్లు పోలవడంతో ఆమె విజయం సాధించినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ప్రజాప్రాతినిథ్య చట్టం, 1951లోని సెక్షన్-151 ఏ ప్రకారం నవంబరు 15, 2014 నాటికి ఆళ్లగడ్డ స్థానాన్ని భర్తీ చేయాలి. అయితే ఈ ఎన్నికపై రెండు పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉండడంతో ఎన్నికల సంఘం ఉప ఎన్నికల సందర్భం గా ఈ స్థానానికి నోటిఫికేషన్ జారీచేయలేదు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘానికి తగు ఆదేశాలు జారీచేయాలని భూమానాగిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆళ్లగడ్డకు చట్టప్రకారం ఉప ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు పే ర్కొంది. ఈ మేరకు ఉప ఎన్నికకు షెడ్యూలు జా రీచేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈవీఎంల ద్వారా పోలింగ్ ప్రక్రియ ఉప ఎన్నిక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొం ది. 2014 జనవరి ఒకటో తేదీనాటికి సవరించిన ఓటరు జాబితాల ఆధారంగా 2014 జనవరి 31న ప్రచురితమైన తుది జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారు. ఆళ్లగడ్డ ఎన్నికపై మొదలైన తుది విచారణ ఆళ్లగడ్డ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి పేరును బ్యాలెట్ పేపర్లో యథాతథంగా ఉంచుతూ, ఆమెకు అత్యధిక ఓట్లు వస్తే ఆమె గెలిచినట్లు ప్రకటిస్తామంటూ కేంద్ర ఎన్నికల ఇచ్చిన సర్కులర్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం తుది విచారణ ప్రారంభమైంది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎం.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ... ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం బతికున్న అభ్యర్థుల్లో ఎవరు ఎక్కువ ఓట్లు సాధిస్తారో వారే గెలిచినట్లవుతుందని కోర్టుకు నివేదించారు. చనిపోయిన వ్యక్తి పేరును బాలెట్లో ఉంచడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ... ఎన్నిక జరగడానికి ముందే శోభా నాగిరెడ్డి మరణించినా కూడా ఎన్నికల నిబంధనల మేరకు ఆమె పేరును బ్యాలెట్ పేపర్లో యథాతథంగా కొనసాగించామని తెలిపారు. నిబంధనల ప్రకారం పోటీలో ఉన్న అభ్యర్థులను అధికారికంగా ఒకసారి ప్రకటించిన తరువాత వారి పేర్లను తొలగించడం కుదరదని పేర్కొన్నారు. తదుపరి వాదనల నిమిత్తం ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
ఆళ్లగడ్డ ఉపఎన్నికకు మోగిన నగారా
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి మృతితో ఖాళీ ఏర్పడిన ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల 8న ఉప ఎన్నికను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఈ నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికల సందడి మొదలుకానుంది. అయితే ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేస్తుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. మానవతా దృక్పథంతో పోటీ నుంచి తప్పుకున్నట్లు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి దిగిన భూమా శోభా నాగిరెడ్డి ఏప్రిల్ 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే ఈవీఎంలలో శోభా నాగిరెడ్డి పేరు నమోదై ఉండటంతో పోటీ నుంచి ఆమె పేరును తొలగించడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. అత్యధిక ఓట్లు వస్తే శోభా నాగిరెడ్డి గెలిచినట్లు ప్రకటించి, ఆ తరువాత ఉప ఎన్నిక నిర్వహిస్తామని కూడా ప్రకటించింది. అయితే అభ్యర్థి శోభా నాగిరెడ్డి మరణించినందున ఆమెకు అత్యధిక ఓట్లు వచ్చినా ఆమె ఎన్నిక చెల్లదని, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటించాలని రుద్రవరం మండలం చిన్నకంబలూరు గ్రామానికి చెందిన జంగా వినోద్‌కుమార్‌రెడ్డి, యర్రగుడిదిన్నె గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌రెడ్డి.. హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. రాష్ట్రంలో ఖాళీ ఏర్పడిన నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 16న షెడ్యూల్‌ను విడుదల చేసింది. కానీ హైకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున ఆళ్లగడ్డ స్థానాన్ని నాటి షెడ్యూలులో చేర్చలేదు. దీంతో అళ్లగడ్డ ఉప ఎన్నిక నిర్వహించాలని కోరుతూ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఉప ఎన్నిక నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. 14 నుంచి నామినేషన్లు: ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు ఈ నెల 14 నుంచి 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉప సంహరణ ఉంటుంది. నవంబర్ 8న ఎన్నిక, అదే నెల 12న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమం కొనసాగుతుందా లేదా అని సందేహాలు తలెత్తుతున్నాయి. బుధవారం జన్మభూమి కార్యక్రమాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నిక కోడ్ జిల్లా అంతటికి వర్తిస్తుందా లేదా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతుందా అనే దానిపై స్పష్టత కోసం కలెక్టర్ విజయమోహన్ మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. వారి నుంచి వచ్చే సమాచారం మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. కాగా.. ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపటంతో ఓటర్లు శోభా నాగిరెడ్డి కుటుంబానికి మరోసారి ఓట్లతో నివాళి అర్పించడానికి ఉత్సాహంగా ఉన్నారు. 15లోపు ఆధార్ నెంబర్లు అందజేయండి కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ వినియోగదారులు తమ ఆధార్ కార్డు నెంబర్‌ను ఈ నెల 15 లోపు అందజేయాలని ఎస్పీడీసీఎల్ కర్నూలు డివిజినల్ ఇంజినీర్(ఆపరేషన్స్) ఎం.ఉమాపతి కోరారు. మంగళవారం స్థానిక పవర్ హౌస్‌లోని తన కార్యాలయంలో ఏడీఈలు, ఏఈలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ఆధార్ నెంబర్లతో పాటు సెల్‌ఫోన్ నెంబర్లను విద్యుత్ కనెక్షన్ సర్వీసు నెంబర్లకు అనుసంధానం చేస్తున్నామన్నారు. ఈ నెల 2వ తేదీ నుంచే నెల వారీ బిల్లులు అందజేస్తున్నట్లు చెప్పారు. స్పాట్ బిల్లింగ్‌కు వచ్చే సిబ్బందికి ఆదార్, సెల్‌ఫోన్ నెంబర్ల ఇచ్చి సహకరించాలన్నారు. లేని పక్షంలో ఈఆర్ఓ, సెక్షన్(ఏఈ) కార్యాలయాల్లో ఆధార్ కార్డు జిరాక్స్ కాపీపై విద్యుత్ సర్వీసు కనెక్షన్ నెంబర్, సెల్‌ఫోన్ నెంబరు రాసి అందివ్వాలని సూచించారు. యజమానులు అందుబాటులో లేకపోతే వారసులు, లేదా అద్దెకుంటున్న వారి ఆధార్ నెంబర్ ఇవ్వొచ్చన్నారు. ఈ నెల 15 లోపు ఆధార్ నెంబర్లు ఇవ్వని పక్షంలో విద్యుత్ కనెక్షన్లు తొలగించి సరఫరా నిలిపేస్తామని హెచ్చరించారు. కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి అన్ని ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ నెంబర్ ఇస్తేనే కనెక్షన్ మంజూరు చేయాలని ఆదేశించారు. సమావేశంలో కర్నూలు ఏడీఈలు -1, 2 విజయసారథి, ఈదన్న, ఏఈలు పాల్గొన్నారు. -
ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు టీడీపీ దూరం?
ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో పోటీకీ టీడీపీ దూరంగా ఉండాలని భావిస్తోందా. మానవతాదృక్పథంతో అభ్యర్థిని బరిలోకి దింపకూడదని టీడీపీ ఆలోచిస్తోందా. అంటే అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని అధికార పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల సంఘం పోలింగ్ తేదీ ప్రకటించిన తర్వాత దీనిపై టీడీపీ అధికారిక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. వైఎస్సార్సీపీ తరఫున పోటీకి దిగిన భూమా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆళ్లగడ్డలో ఉప ఎన్నిక అనివార్యమైంది. నందిగామ, మెదక్ ఉప ఎన్నికలతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలనుకున్నా న్యాయపరమైన సమస్యల వల్ల కుదరలేదు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోటీపై ఆసక్తి నెలకొంది. మానవతా దృక్పథంతో నందిగామ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ పోటీకి దిగలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించడంతో పోలింగ్ నిర్వహించాల్సివచ్చింది. ఇక ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు తమ పార్టీ దూరంగా ఉండడమే మంచిదని సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. నందిగామలో వైఎస్సార్సీపీ చూపిన వైఖరిని ఆళ్లగడ్డలో టీడీపీ చూపాల్సిన అవరముందని ఆయన అభిప్రాయపడ్డారు. శోభా నాగిరెడ్డి కుటుంబంపై సానుభూతి బాగా ఉన్నందున తమ పార్టీ రిస్క్ చేయకపోచ్చునని చెప్పారు. మరోవైపు ఆళ్లగడ్డలో సరైన అభ్యర్థి లేకపోవడంతో టీడీపీ వెనుకంజ వేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు పోటీ చేసిన ఓడిపోయిన గంగుల ప్రభాకర్ రెడ్డి మాత్రం మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీ పెద్దలు మాత్రం రిస్క్ చేయడానికి సిద్దంగా లేరని సమాచారం. -
ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, కర్నూలు: ఎట్టకేలకు ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఉప ఎన్నిక నిర్వహించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ఈ నెల మొదటివారంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం చట్టప్రకారం ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంటూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీకి దిగిన భూమా శోభా నాగిరెడ్డి ఏప్రిల్ 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటికే ఈవీఎంలలో శోభా నాగిరెడ్డి పేరు చేర్చి ఉన్నందున, పోటీ నుంచి ఆమె పేరును తొలగించడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అత్యధిక ఓట్లు వస్తే శోభా నాగిరెడ్డి గెలిచినట్లు ప్రకటించి, ఆ తరువాత ఉప ఎన్నిక నిర్వహిస్తామని కూడా ప్రకటించింది. అయితే అభ్యర్థి శోభా నాగిరెడ్డి మరణించినందున ఆమెకు అత్యధిక ఓట్లు వచ్చినా ఆమె ఎన్నిక చెల్లదని, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటించాలని రుద్రవరం మండలం చిన్నకంబలూరు గ్రామానికి చెందిన జంగా వినోద్‌కుమార్‌రెడ్డి, యర్రగుడిదిన్నె గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈలోగా, కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 16న ఉప ఎన్నిక షెడ్యూలును విడుదల చేసింది. కొన్ని సాంకేతిక కారణాలు చూపుతూ ఆళ్లగడ్డ స్థానాన్ని నాటి షెడ్యూలులో చేర్చలేదు. అళ్లగడ్డ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం అలసత్వం ప్రదర్శిస్తోందని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమని భూమా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉప ఎన్నిక నిర్వహించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. -
నిబంధనల మేరకే శోభా నాగిరెడ్డి పేరు ఉంచాం
హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నిక జరగడానికి ముందే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి భూమా శోభా నాగి రెడ్డి మరణించినప్పటికీ.. ఎన్నికల నిబంధనల మేరకే ఆమె పేరును బ్యాలెట్ పేపర్లో యథాతథంగా కొనసాగించామని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. ఎన్నికలకు ముందు గుర్తింపు పొం దని రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి మరణిం చినప్పుడు, సదరు అభ్యర్థి పేరును బ్యాలెట్ పేపర్ నుంచి తొలగించే పక్షంలో.. ఎన్నికల్లో గెలిచేందుకు లేదా ఫలితాన్ని తారుమారు చేసేం దుకు ప్రత్యర్థులు సదరు అభ్యర్థిని అంతమొందించేందుకు ప్రయత్నించే అవకాశం ఉం టుందని తెలిపింది. గుర్తింపు పొందని పార్టీ అభ్యర్థి మరణించినట్లైతే ఎన్నిక వాయిదా వేయడానికి గానీ, అభ్యర్థిని మార్చడానికి గానీ ఎన్నికల నిబంధనలు అంగీకరించవని వివరించింది. ఇటీవలి సాధారణ ఎన్నికల్లో శోభా నాగి రెడ్డి గెలుపొందారని, ఆమె మరణించినందున ఆళ్లగడ్డ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమని నివేదిం చింది. ఎన్నిక ప్రక్రియను న్యాయస్థానాల్లో సవాలు చేయడంపై రాజ్యాంగంలోని అధికరణ 329 (బి)లో నిషేధం ఉందని తెలి పింది. ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని అభ్యర్థిం చింది. మంగళవారం ఈ కౌంటర్‌ను పరిశీ లించిన జస్టిస్ ఖండవ్లలి చంద్రభాను నేతృత్వం లోని ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయూలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను పది రోజు లకు వాయిదా వేసింది. ఎన్నికలకు ముందు రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మరణించారు. అయినా ఎన్నికల సంఘం ఆమె పేరును బ్యాలెట్ పేపరులో ఉంచింది. ఎన్నికల సంఘం చర్యలను కర్నూలు జిల్లాకు చెందిన బి.హర్షవర్థన్‌రెడ్డి, జంగా వినోద్‌కుమార్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో సవాల్ చేశారు. -
శాంతి భద్రతలకు పెద్దపీట
నంద్యాల టౌన్: పట్టణంలో నేరాలను అదుపు చేసి శాంతి భద్రతలను కాపాడేందుకు రూ.20 లక్షలతో సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తెలిపారు. భూమా శోభా మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన పట్టణ నిఘా నేత్ర పర్యవేక్షణ కేంద్రాన్ని సోమవారం ఆయన స్థానిక ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో ప్రారంభించారు. అనంతరం సీసీ కెమెరాలను ఇన్చార్జి డీఎస్పీ రామాంజనేయులురెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ శోభా నాగిరెడ్డి జ్ఞాపకార్థం చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా నిఘా విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పట్టణంలోని పలు సెంటర్లలో 20 కెమెరాలను అమర్చామని.. వీటిని కేబుల్ నెట్వర్క్ ద్వారా అనుసంధానించి ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో కంట్రోల్ పాయింట్ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడి నుండే పోలీసు అధికారులు సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ను పర్యవేక్షించవచ్చన్నారు. అవసరమైతే అదనపు పరికరాలను అందజేస్తామన్నారు. హైదరాబాద్ తర్వాత నంద్యాలలోనే ఇలాంటి నిఘా వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందన్నారు. పోలీసులు ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. డీఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా చైన్ స్నాచింగ్, చిల్లర దొంగతనాలతో పాటు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. సీసీ కెమెరాలు నిరంతరం దృశ్యాలను చిత్రీకరిస్తుంటాయని.. వీటి ద్వారా ఫొటోలు కూడా తీయవచ్చన్నారు. ఆర్డీఓ నరసింహులు మాట్లాడుతూ పలు కేసుల్లో పోలీసులకు ఈ సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరమన్నారు. పట్టణంలో ఏమి జరుగుతుందనే విషయాలను ఆ శాఖ ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుందన్నారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ శోభా నాగిరెడ్డి పేరిట సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. వీటి వల్ల ఆమె పేరు ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో కేబుల్ నెట్వర్క్ మేనేజర్ జయచంద్రారెడ్డి, సీఐ జయరాముడు, ఎస్ఐలు రాము, సూర్యమౌళి, అశోక్, పుల్లయ్య, కౌన్సిలర్లు కొండారెడ్డి, ముర్తుజా, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు. -
శోభానాగిరెడ్డి మృతి తీరని లోటు
సంతాపం తెలిపిన ఏపీ అసెంబ్లీ ఆమెతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు, జగన్, భూమా, ఇతర సభ్యులు సాక్షి, హైదరాబాద్: రాజకీయ కుటుంబంలో పుట్టి అతి చిన్న వయసులోనే ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయాలకే కొత్త ఒరవడి తెచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మృతి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పేర్కొంది. గురువారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ.. తొలి రోజు శోభా నాగిరెడ్డి మృతికి సంతాపం తెలియజేస్తూ ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా వైఎస్సార్ కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమె మృతికి సంతాపం తెలియజేశారు. ఇటీవల ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మరణించడం, అయినప్పటికీ ఎన్నికల్లో ఆమె మంచి మెజార్టీతో గెలవడం తెలిసిందే. సమస్యలపై పోరాటం చేసిన మహిళ: బాబు ‘‘పలు ప్రజా సమస్యలపై శోభానాగిరెడ్డి పోరాటాలు చేశారు. రాయలసీమ రైతులకు ప్రధాన నీటి వనరు అయిన కేసీ కెనాల్ నీటి కోసం ఆమె అలుపెరగకుండా పోరాటం చేశారు. గత శాసనసభలో ఆమె చురుకైన పాత్ర పోషించారు. ఆర్టీసీ చైర్‌పర్సన్‌గా ఆమె తనదైన శైలిలో బాధ్యతలు నిర్వర్తించారు. విధి ఎంత బలీయమైనదో శోభా నాగిరెడ్డి మృతి ఒక ఉదాహరణ. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.’’ సోదరికన్నా ఎక్కువే: జగన్మోహన్రెడ్డి ‘‘శోభమ్మ నాకు సొంత అక్కలాంటిది. నాన్న చనిపోయాక రాష్ట్రంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆయన మృతి అనంతరం రాజకీయంగా వైఎస్ కుటుంబం అంతరించిపోతుందని అనుకుంటున్న సమయంలో శోభమ్మ నాకు సొంత సోదరికంటే ఎక్కువగా అండగా నిలిచింది. ఓటమి ఎరుగకుండా గెలుస్తూ వచ్చింది. నేను గుంటూరు ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆమె మరణించిన వార్త తెలిసింది. వెంటనే పర్యటన ఆపేసి వచ్చేశాను. ఆమె మరణం నన్నెంతో కలచివేసింది. నాగిరెడ్డి అన్నతో మాట్లాడాను. ముగ్గురు చిన్నపిల్లలను ఎలా ఓదార్చాలో తెలియని పరిస్థితి. సమాధానం చెప్పలేని పరిస్థితి. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా ఆళ్లగడ్డ ప్రజలు ఆమెను గెలిపించారంటే ఆ నియోజకవర్గ ప్రజల గొప్పతనం ఏమిటో తెలుస్తోంది. నాగిరెడ్డి అన్న కుటుంబానికి అండగా ఉంటాం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమె కుటుంబానికి మనోస్థైర్యాన్నివ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా.’’ దేశ చరిత్రలో తొలిసారి: ఎస్వీ మోహన్‌రెడ్డి(వైఎస్సార్ సీపీ) ‘‘మృతి చెందిన మహిళకు ఓట్లేసి గెలిపించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. శాసనసభలో తొలిసారి అడుగుపెట్టిన నాకు తొలిసారి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు చెల్లెలి సంతాప తీర్మానం మాట్లాడాల్సి రావడం బాధాకరం. ఆమెను 18వేల మెజార్టీతో గెలిపించిన ఆళ్లగడ్డ ప్రజలు చాలా గొప్పవాళ్లు.’’ మంచి స్నేహితులం: భూమా నాగిరెడ్డి (వైఎస్సార్సీపీ) ‘‘నాకు ఆమె భార్య మాత్రమే కాదు మంచి స్నేహితురాలు కూడా. ఫ్యాక్షన్ రాజ్యమేలుతున్న ఆళ్లగడ్డలో అయిన వాళ్లతో పాటు, కార్యకర్తలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నాకు ఆమె భరోసా ఇచ్చింది. చిన్న వయసులోనే ఇంటికి పెద్దదిక్కుగా నిలబడింది. నేను ఆమెను ప్రేమవివాహం చేసుకున్నాను. మనిద్దరం అసెంబ్లీకి వెళ్లాలని ఆమె అంటూ ఉండేది. అన్నిటికీ మించి రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్మోహన్రెడ్డికి అండగా ఉండాలనుకున్నాం. షర్మిల సభ ముగిసిన అనంతరం విశ్రాంతి తీసుకుని వెళ్లాలని చెప్పాను. కానీ ఆమె ఉదయాన్నే నియోజకవర్గంలో పర్యటించాలని వెళ్లారు. భార్య సంతాప తీర్మానంలో భర్తగా నేను మాట్లాడాల్సి రావడం దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితి శత్రువుకు కూడా రాకూడదు.’’ ఆమె కుటుంబంతో పాతికేళ్ల సాన్నిహిత్యం: కోడెల(టీడీపీ) ‘‘శోభానాగిరెడ్డి కుటుంబంతో నాకు పాతికేళ్ల సాన్నిహిత్యం ఉంది. ఎస్వీ సుబ్బారెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉండేవాళ్లం. ఆమె మరణవార్త తెలిసి నమ్మలేకపోయాను. అత్యంత దురదృష్టకర సంఘటన. ఆమె మనమధ్య లేకపోయినా ప్రజలు వేల మెజారిటీతో గెలిపించారంటే శోభ గొప్పతనమేంటో తెలుస్తోంది.’’ ఇతర సభ్యుల సంతాపం.. మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, గౌరు చరితారెడ్డి, ఆర్.శివప్రసాద్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బి.రాజశేఖరరెడ్డి, గద్దె రామ్మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు శోభా నాగిరెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆమె లేనిలోటు తీర్చలేనిదంటూ సంతాపం తెలిపారు. తంగిరాల లేని లోటు తీర్చలేనిది.. తెలుగుదేశం పార్టీకి చెందిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావు ఆకస్మిక మృతికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ గురువారం సంతాపం తెలియజేసింది. ఆయన లేని లోటు తీర్చలేనిదని సభ పేర్కొంది. సామాన్య కుటుంబంలో పుట్టి మంచి నాయకుడిగా ఎదిగారని, నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచారని కొనియాడింది. తంగిరాల ప్రభాకర్‌రావు ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. -
శోభ భర్తగా గర్వపడుతున్నా: భూమా నాగిరెడ్డి
హైదరాబాద్: శోభానాగిరెడ్డి తనకు భార్య మాత్రమే కాదని మంచి స్నేహితురాలు కూడా అని భూమా నాగిరెడ్డి అన్నారు. దివంగత శోభానాగిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ... చాలా బాధతో అసెంబ్లీలో నిలుచున్నానని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఆమె గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నా కుటుంబాన్ని ఆమె నిర్లక్ష్యం చేయలేదని తెలిపారు. అన్ని విషయాలపై తామిద్దరం మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు. ప్రతి విషయంపై చర్చించుకున్న తర్వాత తమ దినచర్య మొదలయ్యేదని వెల్లడించారు. తన నియోజకవర్గ ప్రజల కోసం ఆమె ఎంతో తపించేవారని తెలిపారు. తనను మించి నాయకురాలిగా ఎదిగారని ప్రశంసించారు. శోభ భర్తగా గర్వపడుతున్నానని పేర్కొన్నారు. తామిద్దం అసెంబ్లీలో ఉండి జగన్ కు అండదండగా ఉండాలని శోభ ఆలోచించారని, కానీ ఆమె మనమధ్య లేకుండా వెళ్లిపోయారంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని నాగిరెడ్డి ప్రార్థించారు. -
శోభానాగిరెడ్డి సౌమ్యశీలి, స్నేహశీలి: చంద్రబాబు
హైదరాబాద్: దివంగత భూమా శోభానాగిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ శోభానాగిరెడ్డి సేవలను కొనియాడారు. చిన్న వయస్సులోనే ఆమె ఎమ్మెల్యే అయ్యారని ప్రశంసించారు. తాగునీటి సమస్య పరిష్కారంకోసం అనేక పోరాటాలు చేశారని, రైతు సమస్యలకోసం రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. శోభానాగిరెడ్డి సౌమ్యశీలి, స్నేహశీలి కొనియాడారు. శోభానాగిరెడ్డి కుటుంబానికి చంద్రబాబు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. -
చివరిచూపు దక్కేనా..
రుద్రవరం : కుటుంబ భారంమోస్తూ అన్ని విధాలుగా అండగా ఉండే తమ కుమారుడు ప్రహ్లాదుడు హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతై చివరి చూపుకు కూడా నోచుకోలేక పోతున్నామని ఆలమూరు గ్రామానికి చెందిన కొర్రె పెద్ద నాగిశెట్టి, లక్ష్మీ నర్సమ్మ, అక్కా చెల్లెళ్లు నాగలక్ష్మి,లక్ష్మిదేవిలు కన్నీరుమున్నీరు అయ్యారు. దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి పెద్ద కుమార్తె భూమా అఖిల ప్రియ గురువారం గ్రామంలోని బాధితుడికి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించింది. ఈ సందర్భంగా వారు తమ బాధ్యను వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న టూర్ ప్లాన్‌లో మామ మురళిని కలిశాడు. విద్యార్థులు తక్కువగా హాజరు కావడంతో తోడుగా ఉంటాడని మామ తనను తీసుకెళ్లాడన్న విషయం ప్రహ్లాదుడు ఈ నెల ఒకటో తేదీ ఢిల్లీ నుంచి ఫోన్లో తమకు సమాచారం అందించాడని కుటుంబసభ్యులు తెలిపాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నది సమీపంలో రోడ్డుపై బస్సు వద్ద మామ మురళితో ప్రహ్లాదుడు ఉండగా విద్యార్థులు నదిలో ఆడుకుంటూ, ఫొటోలు దిగుతున్నారని నదిలో నీటి ప్రవాహం పెరగడంతో సమాచారం తెలియజేసేందుకు వెళ్లి ఒక్కొక్కరిని ఒడ్డుకు చేర్చే క్రమంలో నీటి ప్రవాహంలో కొట్టుక పోయి గల్లంతు అయ్యాడని తల్లిదండ్రులు వివరించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: భూమా అఖిల ప్రియ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని నాన్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చెప్పమన్నాడని తెలిపింది. బాధితుడి బంధువులు, గ్రామస్తులతో జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ రుద్రవరం మండల ఇన్చార్జి పత్తి సత్యనారాయణ ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. ప్రహ్లాదుడు గల్లంతైన విషయం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి నాన్న భూమా నాగిరెడ్డి తీసుకెళ్లాడన్నారు. భాదితుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆర్థికసాయం సరిపోదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వత్తిడి పెంచి సాయం పెంచేలా కృషి చేస్తాడని చెప్పింది. ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం రూ.1.50 లక్షల తక్షణ ఆర్థికసాయం ప్రకటించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన రూ.5లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించే ఆర్థికసాయం భాదిత కుటుంబానికి అందేటట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో బీవీ రామిరెడ్డి, బంగారు రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
శవరాజకీయాలు మానుకో..:ఎస్వీ మోహన్‌రెడ్డి
సోమిశెట్టికి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి హితవు కర్నూలు, న్యూస్‌లైన్: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మరణాన్ని కూడా రాజకీయం చేసి లబ్ధిపొందాలని చూడటం తెలుగుదేశం పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనమని కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి శవరాజకీయాలు చేయడం తగదని టీడీపీ జిల్లా అద్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు ఎస్వీ హితవు పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దివంగత శోభానాగిరెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో పోలీసులు గౌరవ వందనం సమర్పించడాన్ని సోమిశెట్టి వెంకటేశ్వర్లు వివాదం చేయడం అర్ధరహితమన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం ప్రధాని అధికారిక నివాసంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దు నిర్ణయానికి ముందే శోభానాగిరెడ్డి అంత్యక్రియలు జరిగాయన్న వాస్తవ విషయాన్ని సోమిశెట్టి గ్రహించాలని సూచించారు. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరిగిన రెండు గంటల తర్వాత కేంద్ర మంత్రివర్గ నిర్ణయం అమలులోకి వచ్చిందని ఎస్పీ రఘురాంరెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఈ అంశంపై రాద్ధాంతం చేయడం సోమిశెట్టి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. చనిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిందంటే ప్రజల్లో ఆమె పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు, 11 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారంటే ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమన్నారు. రెండు లోక్‌సభ, 11 శాసనసభ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారో ఆలోచించి పార్టీని పటిష్టం చేసుకునే దిశగా ఆలోచించకుండా శోభానాగిరెడ్డి అంత్యక్రియల అంశాన్ని రాద్ధాంతం చేయడం తగదని విమర్శించారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు చీము నెత్తురు ఉంటే జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులు భారీ సంఖ్యలో ఓడిపోయినందుకు నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చినందున జిల్లా ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తారో సోమిశెట్టి ప్రకటిస్తే బాగుంటుందన్నారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు అనవసర విషయాలను రాద్ధాంతం చేస్తే జిల్లాలో టీడీపీ గల్లంతు కావడం ఖాయమని హెచ్చరించారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తేలుతుందన్నారు. -
శోభా నాగిరెడ్డి ప్రమాదం కేసు... వ్యక్తి అరెస్టు
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి మృతికి కారణమైన గూభగుండం సుబ్బారెడ్డిని అరెస్టు చేసినట్లు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ సాయినాథ్ సోమవారం రాత్రి తెలిపారు. ఏప్రిల్ 24న జాతీయ రహదారిపై ఆరబోసిన వరిధాన్యం కుప్పల కారణంగా శోభా నాగిరెడ్డి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఆమె మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణం వరి ధాన్యం కుప్పలే కావడంతో ఆరబోసిన గూభగుండం సుబ్బారెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించినట్లు ఎస్ఐ వెల్లడించారు. -
వైఎస్సార్సీపీ జైత్రయాత్ర
ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డికి ఘన నివాళి ఆళ్లగడ్డ ఎన్నిక చరిత్రలో నిలిచిపోయింది. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి శోభా నాగిరెడ్డి మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం తలెత్తింది. రాజ్యంగం ప్రకారం మరణించిన శోభా నాగిరెడ్డికి ఓట్లేస్తే ఆమె గెలిచినట్లేనని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఆళ్లగడ్డ ప్రజలు శోభా నాగిరెడ్డికి ఓట్లు వేసి ఘనమైన నివాళి అర్పించాలని నిర్ణయించుకున్నారు. ఆమె మరణించినా.. జనం మధ్య శోభా నాగిరెడ్డి లేకపోయినా... ఆమెను ప్రజలు తమ నేతగా ఎన్నుకోవడం విశేషం. సాక్షి ప్రతినిధి, కర్నూలు: సీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలో మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక వరుస ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 8 స్థానాలను గెలుపొందగా.. టీడీపీ మూడింటితో సరిపెట్టుకుంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 30 స్థానాలను దక్కించుకుని జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఎంపీటీసీ స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఇక శుక్రవారం వెలువడిన అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రెండు పార్లమెంట్, 11 అసెంబ్లీ స్థానాల్లో తిరుగులేని విజయం కట్టబెట్టారు. టీడీపీ మూడు అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోగా.. కాంగ్రెస్ పార్టీ మట్టికరిచింది. కోట్ల కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న కర్నూలులో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. ఎక్కడా ఒక్క స్థానంలోనూ ఓటర్లను ప్రభావితం చేయలేకపోయింది. అదేవిధంగా మున్సిపాలిటీ.. ప్రాదేశిక పోరులోనూ కర్నూలు జిల్లా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే అత్యధిక స్థానాలను కట్టబెట్టి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. కర్నూలు జిల్లాలో రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీలకు శుక్రవారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆదోని, ఆలూరు, శ్రీశైలం, కోడుమూరు, నందికొట్కూరు, డోన్, మంత్రాలయం, పాణ్యం అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. బనగానపల్లి, ఎమ్మిగనూరు, పత్తికొండ అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. కర్నూలు, నంద్యాల పార్లమెంట్ స్థానాలు రెండింటినీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు నమ్మలేదనే విషయం ఈ ఫలితాలతో తేలిపోయింది. టీడీపీ హామీలు, నరేంద్రమోడి చరిష్మా కర్నూలు జిల్లా ప్రజలను ప్రభావితం చేయలేకపోయాయి. టీడీపీ గెలుపొందిన మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ నాయకులతో రహస్య ఒప్పందాలు చేసుకోవటంతో పాటు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు తెలుస్తోంది. కర్నూలులో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు... ద్వితీయ స్థానానికే పరిమితమైన టీడీపీ జిల్లాలో కాంగ్రెస్ చిరునామా గల్లంతైతే.. టీడీపీ రెండో స్థానానికే పరిమితమైంది. కర్నూలు పార్లమెంట్ పరిధిలో మొత్తం 14,81,190 ఓట్లు ఉంటే.. 10,62,242 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 4,68,358 ఓట్లు వచ్చాయి. టీడీపీకి 4,24,380 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,15,772 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా నంద్యాల పార్లమెంట్ స్థానంలో మొత్తం 15,75,677 ఓట్లలో 11,95,733 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 6,20,482, టీడీపీకి 5,14,189, కాంగ్రెస్‌కు 1,21,261 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతైంది. ముఖ్యంగా కేంద్ర మంత్రిగా పనిచేసిన కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించిన కర్నూలు పార్లమెంట్లో ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు. సొంత నియోజకవర్గం కోడుమూరులోనూ ఆయన మూడో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. ఇకపోతే 14 అసెంబ్లీల్లోని 30,56,867 ఓట్లలో 22,57,975 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 10,28,056.. టీడీపీకి 9,08,199.. కాంగ్రెస్‌కు మొక్కుబడి ఓట్లు పోలయ్యాయి. కోడుమూరులో బీజేపీకి హ్యాండిచ్చిన టీడీపీ బీజేపీ హవాతో ఓట్లను రాబట్టుకున్న టీడీపీ కోడుమూరులో కమలం అభ్యర్థికి హ్యాండిచ్చింది. పొత్తులో భాగంగా కోడుమూరు అసెంబ్లీలో టీడీపీ.. బీజేపీకి మద్దతివ్వాల్సి ఉంది. అయితే ఇక్కడున్న టీడీపీ నేతలెవ్వరూ బీజేపీ అభ్యర్థి రేణుకమ్మకు సాయం చేయలేదనే చర్చ జరుగుతోంది. కేవలం ఆమెకున్న పరిచయాలు, బంధుత్వాల నుంచే 30 వేల పైచిలుకు ఓట్లను రాబట్టుకోగలిగారు. ఇక్కడ టీడీపీ నేతలు బీజేపీకి సహకరించి ఉంటే ఓట్లు పెరిగేవని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
'శోభా నాగిరెడ్డికి ఓటేస్తే చెల్లదంటూ ప్రచారం'
కర్నూలు : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారానికి దిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభా నాగిరెడ్డికి వేసే ఓటు చెల్లదంటూ టీడీపీ కార్యకర్తలు ఓటర్లకు ప్రచారం చేస్తున్నారు. కాగా రోడ్డు ప్రమాదంలో గత నెల 24న శోభా నాగిరెడ్డి దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మరోవైపు ఆత్మకూరులో టీడీపీ కోడ్ ఉల్లంఘించింది. పోలింగ్ బూత్‌ల వద్ద శిల్పా మోహన్ రెడ్డికి ఓటేయాలంటూ బ్యానర్లు పెట్టారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. -
ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రచారం
-
శోభానాగిరెడ్డి పేరును తొలగించండి: టీడీపీ
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి శోభానాగిరెడ్డి పేరును బ్యాలెట్ పేపర్ నుంచి తొలగించాలని టీడీపీ ఎంపీ రమేశ్‌రాథోడ్ కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి గురువారం ఓ వినతిపత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం చనిపోయిన వ్యక్తిపేరు బ్యాలెట్ పేపర్లలో ఉండరాదని పేర్కొన్నారు. అదేవిధంగా చంద్రబాబు ఓటు చెల్లదంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రకటించడం బాధ్యతా రాహిత్యంగా ఉందని వ్యాఖ్యానించారు. -
ఆళ్లగడ్డలో భూమా కుటుంబం ప్రచారం
-
ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ ప్రచారం
కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ అభ్యర్థి దివంగత శోభానాగిరెడ్డి తరపును ఆమె పెద్ద కుమార్తె భూమా అఖిల ప్రియ గురువారం ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికల్లో శోభా నాగిరెడ్డికి ఓటు వేసి, అమ్మ ఆశయాలను నెరవేర్చండని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 'అమ్మను పోగొట్టుకొని అందరం పుట్టెడు దుఖంతో ఉన్నాం. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి నిజమైన నివాళి అర్పిద్దాం' అని అఖిల ప్రియ అన్నారు. అందరిని ఆప్యాయంగా పలకరించే అమ్మ భౌతికంగా దూరమైనా మన హృదయాల్లో మాత్రం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జగనన్న సీఎం అవుతారని, ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై అమ్మ కన్న కలలను నిజం చేస్తారని ఆమె అన్నారు. -
అమ్మను భారీ మెజార్టీతో గెలిపిద్దాం
ఆళ్లగడ్డ : దివంగత ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ, ఆమె చూపించిన ప్రేమ, అభిమానాలు అందరి హృదయాల్లో నిలిచి ఉన్నాయని కుమార్తె భూమా అఖిలప్రియ అన్నారు. అమ్మను భారీ మెజార్టీతో గెలిపించి ఆమెకు ఘనమైన నివాళి అర్పిద్దామని పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం మండలంలోని భాగ్యనగరం, కొండాపురం, రామచంద్రాపురం, దొర్నిపాడు, అమ్మిరెడ్డినగరం, అర్జునాపురం గ్రామాల్లో ఆమె రోడ్‌షో నిర్వహించారు. ప్రజలు అడుగడుగునా నిరాజనాలు పట్టి ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొండాపురం గ్రామంలోలో ఆమె మాట్లాడుతూ.. అమ్మ ఎల్లప్పుడూ ప్రజల క్షేమం కోసమె తపించేవారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి శోభానాగిరెడ్డి ఎంతో కృషి చేశారని విజయ డెయిరీ చైర్మన్ భూమా నారాయణ రెడ్డి అన్నారు. లక్ష మెజార్టీతో ఆమెను గెలిపించి రుణం తీర్చుకుందామన్నారు. -
శోభకు ఎక్కువ ఓట్లు వస్తే గెలిచినట్లు ప్రకటిస్తాం
* ఆమె మరణించినందు వల్ల ఉప ఎన్నిక నిర్వహిస్తాం * ఆళ్లగడ్డ ఎన్నికపై అనుమానాలు నివృత్తి చేసిన ఎన్నికల కమిషన్ సాక్షి, హైదరాబాద్: ఆళ్లగడ్డ శాసనసభా నియోజకవర్గం ఎన్నికపై ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. ఈ నియోజకవర్గానికి యథావిధిగా ఎన్నిక జరగనుండగా, ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడిన దివంగత శోభా నాగిరెడ్డికి ఎక్కువ ఓట్లు పోలైతే ఆమెను గెలిచినట్టుగా ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఆమె మరణించినందు వల్ల ఆ స్థానానికి తిరిగి ఉపఎన్నిక నిర్వహిస్తామని తెలిపింది. నిబంధనల మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి మరణించిన తర్వాత జరిగే పోలింగ్‌లో ఆ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పోలైతే గెలిచినట్టుగా ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వివరణ ఇస్తూ పంపిన సమాచారంలో పేర్కొంది. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఆమె పేరును వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బ్యాలట్ పత్రాల్లో ముద్రించామని, అందువల్ల మరణించిన అభ్యర్థికి ఓట్లేస్తే అవి ’నోటా’ ఓట్లు (ఎవరికీ చెందని ఓట్లు)గా పరిగణించబోమని కమిషన్ స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన శోభా నాగిరెడ్డి ఈ నెల 24న మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటినుంచీ ఈ ఎన్నిక తీరుపై ప్రజల్లోనూ, రాజకీయవర్గాల్లోనూ అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ కోశాధికారి పి.కృష్ణమోహన్‌రెడ్డి ఈ అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్ వివరణ కోరుతూ ఈ నెల 26వ తేదీన లేఖ రాశారు. దీనిపై ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి కె.ఎఫ్.విల్ఫ్రెడ్ వైఎస్సార్ కాంగ్రెస్‌కు రాసిన లేఖలో... ‘మృతి చెందిన శోభానాగిరెడ్డి పేరును ఇప్పటికే అభ్యర్థుల జాబితాలో పొందుపరిచాం. బ్యాలట్ పత్రాల్లోనూ ఈవీఎంపై ఉన్న బ్యాలట్ పత్రంపై కూడా ఆమె పేరును చేర్చాం. ఎన్నికల ఫలితాల ప్రకటన అనేది 1961 సంవత్సరపు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనల్లోని 64వ నిబంధన ప్రకారం బ్యాలట్ పత్రంపై ఉన్న ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని గెలుపొందినట్లుగా ప్రకటించాలి. ఇక్కడ ‘అభ్యర్థి’ అంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలో ఉన్న వారు అని అర్థం. అందువల్ల మరణించిన వ్యక్తి కూడా 64వ నిబంధన కింద అభ్యర్థే అవుతారు. చనిపోయిన వ్యక్తికి వేసిన ఓట్లు ‘నోటా’ ఓట్లుగా పరిగణించడానికి గాని, మిగతా అభ్యర్థుల కన్నా మృతి చెందిన అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చినపుడు మరణించినవారిని గెలిచినట్లుగా ప్రకటించకపోవడానికి ఎలాంటి అవకాశం లేదు. ఈ సందర్భంలో మరణించిన ఆమె ఎక్కువ ఓట్లు కనుక పొందితే వారినే ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. ఎన్నికైన తరువాత ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని 150, 151-ఏ, నిబంధనల ప్రకారం ఆ స్థానంలో ఉప ఎన్నికను నిర్వహిస్తారు’ అని వివరణ ఇచ్చారు. -
శోభమ్మ చివరి కోరికను నెరవేరుద్దాం
జగన్ సీఎం అయితేనే శోభమ్మ ఆత్మకు శాంతి - ఆళ్లగడ్డలో సంతాప సభ - ఉద్వేగంతో ప్రసంగించిన భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డ న్యూస్‌లైన్: జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి శోభమ్మ చివరి కోరికను నెరవేరుద్దామని నంద్యాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. ఆళ్లగడ్డ పట్టణంలోని శోభమ్మ ఘాట్‌లో సోమవారం శోభానాగిరెడ్డి సంతాపసభ వేలాది మంది కార్యకర్తల మధ్య జరిగింది. శోభా నాగిరెడ్డికి ఓటు వేస్తే చెల్లుతుందని కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి గంట ముందు ప్రకటించడంతో కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఆమె చిత్రపటానికి నివాళ్లు అర్పించి ఆత్మశాంతి కోసం అందరూ ఒక్క నిమిషం మౌనం పాటించారు. అనంతరం సభలో భూమా ఉద్వేగంతో మాట్లాడారు. ‘శోభానాగిరెడ్డికి ఓటు వేస్తే చెల్లదని రెండు రోజుల క్రితం తెలిసినప్పుడు నాతో పాటు అభిమానులు ఆందోళన చెందారు. ఆళ్లగడ్డను టీడీపీ ఖాతాలోకి పోనియమని వైస్ జగన్మోహన్రెడ్డికి చెప్పాను. అవసరమైతే ఇండిపెండెంట్‌కు మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామనే ధీమా ఉండేది. శోభానాగిరెడ్డి మొండి మనిషి, చనిపోయిన తరువాత కూడా బరిలో నిలిచి తనకు పడే ఓట్లు చెల్లించుకునేలా చేసుకుంది. ఆమెకు ఓటు వేస్తే చెల్లదని చెప్పినపుడు బాధపడిన కార్యకర్తలు ఈసీ ప్రకటనతో ప్రస్తుతం ఆనందపడుతున్నారు. ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని అరుదైన గుర్తింపును శోభానాగిరెడ్డికి దక్కబోతుంది. చనిపోయిన తరువాత లక్ష ఓట్ల మెజార్టీతో వచ్చేలా గిన్నిస్ రికార్డు సాధిం చడానికి కార్యకర్తలు కృషి చేయాలి. చిన్న వయస్సులో తండ్రిని పొగొట్టుకున్నాను. పెరుగుతున్న వయస్సులో ముగ్గురు అన్నలు దూరమైనారు.. కోలుకుంటున్న సమయంలో శోభమ్మను కోల్పోయాను. శోభానాగిరెడ్డి మరణంతో బరువెక్కిన మనస్సును వేలాది కుటుంబాల కోసం నిబ్బరం చేసుకుంటున్నాను. ధైర్యంగా ప్రజల కోసం కుటుంబం మొత్తం వస్తున్నాం.అందరం కలుద్దాం... జగనన్నను సీఎం చేసి.. శోభమ్మ చివరి కోరికను నెరువెరుద్దాం’ అంటూ ప్రసంగించారు. ఘాట్‌ను ఆహ్లాదంగా తీర్చిదిద్దుతా: శోభానాగిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతాన్ని శోభమ్మ ఘాట్‌గా భూమా నాగిరెడ్డి నామకరణం చేశారు. అక్కడ ఆమె జ్ఞాపకాలను భద్రపరిచి ఇల్లు కూడా నిర్మించుకుంటానని తెలిపారు. శోభమ్మ ఘాట్‌ను ఆహ్లాదంగా తీర్చిదిద్దుతాన్నారు. సమావేశంలో మిల్క్ డైయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి, నాయకులు అన్సర్, రఘనాథరెడ్డి, నిజాం, శ్రీకాంతరెడ్డి, రాముయాదవ్, బీవీ రామిరెడ్డి, సింగం వెంకటేశ్వరరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శోభమ్మకు ఓటుతో నివాళి
సిద్ధమవుతున్న ఆళ్లగడ్డ ప్రజలు - ఎన్నికపై నెలకొన్న సస్పెన్స్‌కు తెర - ఆమె గెలిస్తే ఉప ఎన్నిక నిర్వహణ - ఈసీ నిర్ణయంతో అభిమానులకు ఊరటకుదుటపడిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆపదలో కొండంత అండ. ఎలాంటి సమయంలోనైనా నేనున్నాననే భరోసా. పార్టీలకు అతీతంగా.. వర్గాలకు తావివ్వక చిరునవ్వుతో ప్రజల హృదయాలను గెలిచిన శోభమ్మ మృతి జిల్లా ప్రజలను కలచివేసింది. ముఖ్యంగా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గ ప్రజలకు తీరని దుఃఖం మిగిల్చింది. ఇక గెలుపు లాంఛనమేనన్న పరిస్థితుల్లో ఆమె అకాలమరణంతో ఎన్నో ప్రశ్నలు తెరపైకొచ్చాయి. ఈవీఎంలలో ఆమె పేరును తొలగిస్తారని.. ఓటు వేసినా చెల్లదని.. గెలిచినా పరిగణనలోకి తీసుకోరనే ప్రచారం గందరగోళానికి తావిచ్చింది. ఎట్టకేలకు ఈ సస్పెన్స్‌కు ఎన్నికల కమిషన్ తెరదించింది. శోభా నాగిరెడ్డికి వేసే ఓట్లు చెల్లుబాటు అవుతాయని.. ఒకవేళ ఆమె గెలిస్తే ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పట్ల ఆమె అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆళ్లగడ్డ అసెంబ్లీ బరిలో నిలిచిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఈనెల 24న మరణించిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఎన్నిక నిర్వహణపై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. ఆడపడచులా భావించిన నియోజకవర్గ ప్రజలు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆదివారం ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డికి ఓటేస్తే చెల్లదని ప్రకటించారు. పారదర్శక పాలనతో తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్న ఆమెకు ఓటుతో నివాళి అర్పించాలనుకున్న ప్రజలకు ఆ ప్రకటన ఆశ్చర్యం కలిగించింది. దీంతో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి.. జిల్లా కలెక్టర్, జేసీలతో సంప్రదింపులు జరిపారు. అదేవిధంగా సోమవారం ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ అధికారులతో మాట్లాడి ఆళ్లగడ్డ ఎన్నికపై స్పష్టత కోరారు. ఆర్టికల్ 52 ఆర్పీ యాక్ట్ 1951 ప్రకారం ఆళ్లగడ్డ ఎన్నికకు ఎలాంటి అభ్యంతరం లేదని.. మెజార్టీ ప్రజలు ఎవరికి అధికంగా ఓట్లు వేస్తారో వారినే ఎమ్మెల్యేగా ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు. అయితే గెలిచిన అభ్యర్థి అప్పటికే మృతి చెందినట్లయితే ఉప ఎన్నిక నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఎట్టకేలకు నిర్ణయం వెలువడటంతో ఊపిరి పీల్చుకున్న అధికారయంత్రాంగం సోమవారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై బ్యాలెట్ యూనిట్‌ను అమర్చే కార్యక్రమం పూర్తి చేశారు. -
శోభకు ఎక్కువ ఓట్లు వస్తే గెలిచినట్లు ప్రకటిస్తాం
* ఆమె మరణించినందు వల్ల ఉప ఎన్నిక నిర్వహిస్తాం * ఆళ్లగడ్డ ఎన్నికపై అనుమానాలు నివృత్తి చేసిన ఎన్నికల కమిషన్ సాక్షి, హైదరాబాద్: ఆళ్లగడ్డ శాసనసభా నియోజకవర్గం ఎన్నికపై ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. ఈ నియోజకవర్గానికి యథావిధిగా ఎన్నిక జరగనుండగా, ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడిన దివంగత శోభా నాగిరెడ్డికి ఎక్కువ ఓట్లు పోలైతే ఆమెను గెలిచినట్టుగా ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఆమె మరణించినందు వల్ల ఆ స్థానానికి తిరిగి ఉపఎన్నిక నిర్వహిస్తామని తెలిపింది. నిబంధనల మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి మరణించిన తర్వాత జరిగే పోలింగ్‌లో ఆ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పోలైతే గెలిచినట్టుగా ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వివరణ ఇస్తూ పంపిన సమాచారంలో పేర్కొంది. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఆమె పేరును వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బ్యాలట్ పత్రాల్లో ముద్రించామని, అందువల్ల మరణించిన అభ్యర్థికి ఓట్లేస్తే అవి ’నోటా’ ఓట్లు (ఎవరికీ చెందని ఓట్లు)గా పరిగణించబోమని కమిషన్ స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన శోభా నాగిరెడ్డి ఈ నెల 24న మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటినుంచీ ఈ ఎన్నిక తీరుపై ప్రజల్లోనూ, రాజకీయవర్గాల్లోనూ అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ కోశాధికారి పి.కృష్ణమోహన్‌రెడ్డి ఈ అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్ వివరణ కోరుతూ ఈ నెల 26వ తేదీన లేఖ రాశారు. దీనిపై ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి కె.ఎఫ్.విల్ఫ్రెడ్ వైఎస్సార్ కాంగ్రెస్‌కు రాసిన లేఖలో... ‘మృతి చెందిన శోభానాగిరెడ్డి పేరును ఇప్పటికే అభ్యర్థుల జాబితాలో పొందుపరిచాం. బ్యాలట్ పత్రాల్లోనూ ఈవీఎంపై ఉన్న బ్యాలట్ పత్రంపై కూడా ఆమె పేరును చేర్చాం. ఎన్నికల ఫలితాల ప్రకటన అనేది 1961 సంవత్సరపు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనల్లోని 64వ నిబంధన ప్రకారం బ్యాలట్ పత్రంపై ఉన్న ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని గెలుపొందినట్లుగా ప్రకటించాలి. ఇక్కడ ‘అభ్యర్థి’ అంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలో ఉన్న వారు అని అర్థం. అందువల్ల మరణించిన వ్యక్తి కూడా 64వ నిబంధన కింద అభ్యర్థే అవుతారు. చనిపోయిన వ్యక్తికి వేసిన ఓట్లు ‘నోటా’ ఓట్లుగా పరిగణించడానికి గాని, మిగతా అభ్యర్థుల కన్నా మృతి చెందిన అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చినపుడు మరణించినవారిని గెలిచినట్లుగా ప్రకటించకపోవడానికి ఎలాంటి అవకాశం లేదు. ఈ సందర్భంలో మరణించిన ఆమె ఎక్కువ ఓట్లు కనుక పొందితే వారినే ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. ఎన్నికైన తరువాత ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని 150, 151-ఏ, నిబంధనల ప్రకారం ఆ స్థానంలో ఉప ఎన్నికను నిర్వహిస్తారు’ అని వివరణ ఇచ్చారు. -
భారీ మెజారిటీతో శోభకు నివాళి: గట్టు
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం అభ్యర్థిగా దివంగత భూమా శోభానాగిరెడ్డి పోటీలో ఉన్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో... ఆమెకు భారీ మెజారిటీ తీసుకొచ్చి ప్రజలు నివాళి అర్పిస్తారని వైఎస్సార్సీపీ నేత గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. శోభమ్మ లేకపోయినప్పటికీ... ఈ ఎన్నికల్లో ఆమెకు ఓట్లేసి అధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి ఆళ్లగడ్డ ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘శోభానాగిరెడ్డి మరణం తర్వాత రకరకాల తప్పుడు ప్రచారాలు జరిగాయి. శోభ పేరును బ్యాలెట్ నుంచి తొలగిస్తారని, ఆమె పేరున్నప్పటికీ... పడిన ఓట్లన్నీ నోటా కింద లెక్కేస్తారని... రకరకాల తప్పుడు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టతనిచ్చింది. ఎన్నికల్లో శోభ పేరుంటుందని, శోభకు ఎక్కువ ఓట్లు వస్తే ఆమె గెలుపును ప్రకటిస్తూ... ఆ తర్వాత ఉప ఎన్నిక జరుపుతామంటూ ఎన్నికల కమిషన్ పేర్కొంది’ అని గట్టు వివరించారు. -
శోభానాగిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి: గట్టు
-
మెజార్టీ ఓట్లు వస్తే శోభానాగిరెడ్డి గెలిచినట్టే
-
మెజార్టీ ఓట్లు వస్తే శోభానాగిరెడ్డి గెలిచినట్టే
న్యూఢిల్లీ: ఆళ్లగడ్డ శాసన సభ నియోజకవర్గం ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆళ్లగడ్డ అభ్యర్థి శోభా నాగిరెడ్డికి అత్యధిక ఓట్లు వస్తే ఆమె గెలిచినట్టుగా ప్రకటిస్తామని ఈసీ స్పష్టం చేసింది. అలాంటి సందర్భంలో ఉప ఎన్నిక నిర్వహిస్తామని వివరణ ఇచ్చింది. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఈవీఎంలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి పేరు, ఫ్యాన్ గుర్తు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. గత బుధవారం కర్నూలు జిల్లా నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డకు తిరిగి వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ శోభా నాగిరెడ్డిని తొలుత నంద్యాలలో చికిత్స చేయించి అనంతరం హైదరాబాద్ తరలించారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. కాగా గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థి ఎవరైనా మరణిస్తే అక్కడి ఎన్నికలను వాయిదా వేస్తారు. అయితే వైఎస్ఆర్సీపీ గుర్తింపు పొందిన పార్టీ కాకపోవడంతో ఆళ్లగడ్డ ఎన్నికలను వాయిదా వేయబోమని, శోభానాగిరెడ్డికి ఓట్లు వేసినా ఆ ఓట్లు లెక్కలోకి రావని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఇంతకుముందు ప్రకటించారు. ఆమెకు అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినా ఓట్లకు విలువ ఉండదని, నోటాగా పరిగణిస్తామని చెప్పారు. ఆ తరువాత పోటీలో ఉన్న వారిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వారే గెలిచినట్లు పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన వివరణ ఇచ్చింది. -
తేరుకోని ఆళ్లగడ్డ
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: సిట్టింగ్ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మృతి చెంది మూడు రోజులు కావస్తున్నా ఆళ్లగడ్డ నియోజకవర్గం కోలుకోలేదు. పరామర్శించడానికి వచ్చిన వారిని పట్టుకొని భూమా కుటుంబ సభ్యులు ఇప్పటికీ విలపిస్తున్నారు. ప్రజలు కూడా ఎక్కడికక్కడ గుమిగూడి చర్చించుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. శోభా నాగిరెడ్డి 16 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పని చేయడంతో స్థానిక ప్రజలు ఆమెకు తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ వచ్చారు. అర్థరాత్రి సైతం ఫోన్ చేస్తే స్పందిస్తూ.. ప్రజలతో ఆమె మమేకమవుతూ వచ్చారు. వేలాది మంది ప్రజలు శనివారం ఆళ్లగడ్డ పట్టణంలోని భూమా నివాసం చేరుకొని.. ఇక మాకెవరు దిక్కంటూ గుండెలవిసేలా రోదించారు. భూమా కుటుంబ సభ్యులైన అఖిల, నాగమౌనిక, జగత్ విఖ్యాత్‌రెడ్డిలు కూడా దుఃఖం ఆపుకోలేకపోయారు. కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందిన నాయకులు, ప్రజలు కూడా వచ్చి భూమా కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. శోభమ్మ అంత్యక్రియల్లో శుక్రవారం మూడు లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. నియోజకవర్గంలో శోభా నాగిరెడ్డి అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు మూడు రోజుల నుంచి భోజనాలు కూడా చేయకుండా దిగాలు పడిపోయారని తెలుస్తోంది. ఇప్పట్లో నియోజకవర్గం కోలుకునే పరిస్థితి లేదని స్థానిక నాయకులు వివరిస్తున్నారు. -
ఏమి తొందరొచ్చింది శోభమ్మా... వెళ్లిపోయావు?!
మరచిపోలేనంతగా మరదలిని ప్రేమించిన బావ అతను... బావను అపురూపంగా ఆరాధించిన మరదలు ఆమె... ఇంటికి చిన్నవాళ్లైనా, బాధ్యతల బరువుతో పిన్నవయసులోనే పెద్దరికాన్ని భుజాన వేసుకున్న భార్యాభర్తలు వారు... రాజకీయాల్లోనూ ఒకే మాటగా ఎదిగి, పార్టీలకతీతంగా ప్రజల్లో సంపాదించుకున్న ప్రేమమూర్తులు వారు... శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి దంపతులను రెండేళ్ల క్రితం ఇంటర్వ్యూ చేసినప్పుడు ‘కలకాలం హాయిగా కలిసున్నార’న్న కమ్మని కథకు కళ్లెదుటి సాక్ష్యం వారే అనిపించారు. కానీ, ... కాలానికి కన్ను కుట్టింది. ‘ఏ జన్మ లోనూ విడిపోము... మనము’ అని పెళ్లినాట ప్రమాణం చేసుకున్న... భూమా జంటను విధి విడదీసింది. నిన్నటి దాకా జనమే జగమై ఆప్యాయంగా పలకరించిన... ఆ చీరకట్టు చిరునవ్వు మోము ‘శోభమ్మ’ ఇవాళ కనిపించని తీరాలకు తరలిపోయింది. నమ్మశక్యం కాని ఈ నిజాన్ని సహిస్తూ, భరిస్తూ... అందరి వారైన ఆ దంపతులు ఏడాది క్రితం పంచుకున్న తమ అనురాగ క్షణాలను మరోసారి ప్రచురిస్తున్నాం. వారి అనుబంధానికి ఈ కథనాన్ని అంకితమిస్తున్నాం. ‘ఏవేవో పనుల కోసం వి.ఐ.పి లెటర్ ఇవ్వమని విజిటర్స్ వస్తూ ఉంటారు. వారు తెలివిగా మాకు తెలియకుండా ఇద్దరి దగ్గర నుంచి లెటర్స్ తీసుకుంటారు. ఆ లెటర్లు ఆఫీసర్ల దగ్గరకు వెళ్లాక, వారు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి వచ్చి ‘ఎవరిది ఓకే చేయమంటారు’ అని ఫోన్ చేస్తే ‘ఆవిడిచ్చిన లెటర్‌కే ఓకే’ చేయండని చెబుతాను’ అని భూమా నాగిరెడ్డి అంటే- ‘ఆయన ఇచ్చిన లెటర్‌కే ఓకే చే యండని నేను చెబుతాను’ అన్నారు శోభా నాగిరెడ్డి. హైదరాబాద్‌లోని వారి స్వగృహంలో రెండేళ్ళ క్రితం కలిసినప్పుడు ఈ దంపతులు చెప్పిన ఈ ఒక్క మాట చాలు - వారి దాంపత్యజీవితం ఎంత బలమైనదో చెప్పడానికి. నాగిరెడ్డి జన్మస్థలం కొత్తపల్లె, శోభారాణి పుట్టిన ఊరు ఆళ్లగడ్డ. నాగిరెడ్డి మేనత్తే శోభారెడ్డి తల్లి. ఆ విధంగా వీరి బంధానికి బంధుత్వం బలం చేకూర్చింది. నాగిరెడ్డి మాట్లాడుతూ ‘‘చెన్నైలో హోమియోపతి చదివాను. తమ్ముడి కొడుకునని నన్ను మా మేనత్త అచ్చం తల్లిలా ఆప్యాయంగా చూసేవారు. పాఠశాల స్థాయి నుంచీ సెలవులొస్తే చాలు వీరింటికే వెళ్లేవాడిని. అలా చిన్నప్పటి నుంచీ ఒకే ఇంట్లో ఉన్నట్టు పెరిగాం’’ అన్నారు. శోభ అందుకుంటూ, ‘‘మా పెద్దవాళ్లకు కూడా మా పెళ్లి చేయాలనే ఆలోచ న ఉండేది’’ అని నవ్వుతూ వివరించారు. ఫ్యాక్షన్ వెర్సెస్ ప్రేమ సినిమాల్లో చూపినట్టు ప్రేమికులకు తమ ప్రేమ సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ఓ పెద్ద పరీక్ష ఎదురవుతూ ఉంటుంది. వీరి ప్రేమకూ ఓ పెద్ద పరీక్ష ఎదురైంది. అది ఫ్యాక్షన్. ‘‘మా రెండు కుటుంబాల బంధం బలపడటానికి నన్ను తన కోడలిని చేసుకోవాలని మామకు ఉండేది. అయితే ఫ్యాక్షన్ కారణంగానే మామ చనిపోవడంతో ఫ్యాక్షన్ అంటే ఏ మాత్రం నచ్చని మా నాన్న నన్ను వీరింటికి కోడలిగా పంపడానికి ఇష్టపడలేదు’’ అని ఆ రోజుల్ని శోభ గుర్తుచేసుకున్నారు. ఇంట్లో వేరే సంబంధాలు చూస్తుం డడంతో భయం పట్టుకున్న ఈ ప్రేమికులు 1986 మే 25న ఇంట్లో వాళ్లకు చెప్పకుండా కొంతమంది సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చారు. ‘‘మా నాన్నగారు ఏమీ అనలేదు కానీ ఏడాది పాటు మాట్లాడలేదు’’ అన్నారు శోభ. శ్రీమతి మాటలకు బ్రేక్ వేస్తూ ‘‘ఇప్పుడు మాత్రం మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు’’ - నవ్వుతూ అన్నారు నాగిరెడ్డి. చిన్నతనంలోనే పెద్ద బాధ్యత ఫ్యాక్షన్ గొడవల్లో అన్నలు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తర్వాత కుటుంబాన్నీ, వర్గాన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీద పడటం ఉక్కిరిబిక్కిరి చేసిందని ఉద్వేగంతో చెప్పారు నాగిరెడ్డి. ‘‘నేను, శోభ - ఇద్దరం కుటుంబానికి చిన్నవాళ్లమే. కానీ అనుకోకుండా పెద్దవాళ్లమై బాధ్యతలను మోయాల్సి వచ్చింది. కుటుంబంలో పూటకు యాభైకి తక్కువ కాకుండా కంచాలు లేచేవి. మా అన్నపిల్లలు మరీ పసివాళ్లు. వారినీ శోభే సాకింది. కార్యకర్తలు మా కోసం ప్రాణాలు అడ్డుపెట్టేవారు. వాళ్ల కోసం ఏం చేయడానికైనా నేను వెనుకాడేవాణ్ణి కాదు. ఇంటి నుంచి బయటకు వెళ్లానంటే మళ్లీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే ఈ రోజుకు సేఫ్ అనుకునేవాళ్లం. అలాంటి విపత్కర స్థితిలోనూ శోభ బ్యాలెన్స్డ్గా ప్రవర్తించేది. బయట చికాకులెన్నో ఇంటికీ తేక తప్పేది కాదు నాకు. అన్నీ తట్టుకుంటూనే ఇంటి పెద్దగా అందరి బాగోగులు చూసుకునేది. శోభను అర్ధాంగిగా చేసుకోవడం వల్లే, బాధ్యతలన్నీ సవ్యంగా పూర్తి చేయగలిగా’’ అంటూ శ్రీమతి తనకు దన్నుగా నిలిచిన తీరును వివరించారు నాగిరెడ్డి. ‘‘ముందు నుంచీ కుటుంబ పరిస్థితులు తెలియడం ఒక కారణమైతే, ఈయన నాకు అన్నింట్లో స్వేచ్ఛ, సపోర్ట్ ఇవ్వ డంతో ఇవన్నీ సాధ్యమయ్యాయి’’ అని శోభ చెప్పారు. రాజకీయాల్లో సగభాగం ఉమ్మడి కుటుంబ బాధ్యతను మోస్తూ రాజకీయాల్లోకి వచ్చిన శోభ, ‘‘రాజకీయాల్లోకి రావడం మొదట నాకు ఇష్టం లేదు. పిల్లలు, వారి చదువులు, పెళ్లిళ్లు... (ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. నాగిరెడ్డి అన్నల పిల్లలూ వీరితోనే కలిసి పెరిగారు) ఇలా బాధ్యతలు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు రాజకీయాలు అంటే మాటలా? నేను రాలేనని చెప్పాను’’ అని అప్పటి సంగతులు వివరించారు. దానికి, నాగిరెడ్డి అందుకొని, ‘‘నేను ఎం.పీగా ఎన్నికైన తర్వాత ఎం.ఎల్.ఎ సీటు ఖాళీ అయింది. ‘ఆ స్థానంలో ఎవరిని పెట్టినా, డమ్మీగా నిలబెట్టారని ప్రజలనుకుంటారు. పార్టీ కోసం ఈ నిర్ణయం తప్పదు‘ అనడంతో కాదనలేక శోభ ఒప్పుకుంది. అప్పటికీ చాలామంది ఆమె డమ్మీ క్యాండిడేట్ అని అనుకున్నారు. కానీ బెస్ట్ క్యాండిడేట్ అని తర్వాత అందరికీ అర్థమయ్యేలా చేసింది’’ అన్నారు. ‘‘రాజకీయాల్లో తను ఫెయిర్’’ అని శ్రీమతికి కితాబిచ్చారు నాగిరెడ్డి. ఆ మాటలకు శోభారెడ్డి స్పందిస్తూ - ‘‘రాజకీయాల్లోకి రావడానికి ముందు ప్రజలతో మాట్లాడాలన్నా, మీటింగ్లన్నా చాలా ఇబ్బంది పడేదాన్ని. ఈయన బలవంతం మీద అవన్నీ నేర్చుకోగలిగా. ఇప్పుడు ఎక్కడ మీటింగ్ జరిగినా ఒక్కదాన్నే వెళ్లగలుగుతున్నా. నియోజకవర్గ ప్రజల అవసరాల కోసం పోరాడగలుగుతున్నా. ఏది జరిగినా నా వెనక ఈయన ఉన్నారు అనే ధైర్యమే నాకు భరోసా!’’ అన్నారు. ‘‘ఆయన కన్నా మంచి పేరు తెచ్చుకోవాలి’’ అనుకున్న శోభ తన ‘‘నియోజకవర్గం కోసం మొండిగా చేసే పనులు’’ నాగిరెడ్డికీ నచ్చాయి. ‘‘వచ్చిన ప్రతీ సినిమా చూస్తాం. వీలు దొరికితే విహారయాత్రలకు వెళ్లేవాళ్లం’’ అన్న ఈ దంపతులు - కుటుంబం, రాజకీయం... ఇలా ఎన్ని బాధ్యతలున్నా తమ ఇన్నేళ్ళ వైవాహిక జీవితంలో వ్యక్తిగతంగా మిస్ అయ్యామని ఎప్పుడూ అనిపించలేదన్నారు. కానీ, ఇవాళ శోభమ్మ లేని లోటు నాగిరెడ్డికీ, ఆయన కుటుంబానికీ ఉంటుంది. ‘‘రాజకీయాల్లో శోభ బిజీ అవడంతో ఆమె చేతి వంటను మిస్ అవుతున్నా’’ అన్న నాగిరెడ్డికి ఇవాళ ఆమె ప్రేమస్మృతులే కడుపు నింపాలి. జనానికి మంచి చేయాలని తపించిన శోభ లేకపోవడం ఆమె అభిమానించే - ఆమెను అభిమానించే సామాన్య ప్రజలందరికీ లోటే! కన్నవారికీ, కట్టుకున్నవాడికీ, కోట్లాది ప్రజలకూ తీరని దుఃఖం మిగిల్చి... ఏమి తొందరొచ్చిందమ్మా వెళ్లిపోయావు శోభమ్మా! -
కార్యకర్తలకు ధైర్యం చెప్పిన భూమా నాగిరెడ్డి
కర్నూలు : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన శోభా నాగిరెడ్డి సంతాప సభలో భూమా నాగిరెడ్డి శనివారం కన్నీటిపర్యంతమయ్యారు. నంద్యాలలో జరిగిన సంతాప సభలో ఆయన పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని భూమా నాగిరెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా శోభా నాగిరెడ్డి బుధవారం రాత్రి నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు వెళ్తుండగా గూబగుండం మిట్ట సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. -
ఆ పిలుపే ఆత్మీయం
-
అభిమానుల ఒత్తిడితోనే అధికార లాంఛనాలు
నంద్యాల, న్యూస్‌లైన్: శోభానాగిరెడ్డి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో పూర్తిచేయాలని అభిమానులు పట్టుబట్టీ మరీ చేయించారు. ముందుగా సాధ్యం కాదని చెప్పిన అధికారులు ప్రజలు, అభిమానుల ఒత్తిడి నేపథ్యంలో ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన శోభానాగిరెడ్డి అంత్యక్రియలు శుక్రవారం ఆళ్లగడ్డలో నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందునా అధికారులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రజ లు, అభిమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోతే ఇక్కడి నుంచి వెళ్లేందుకు అంగీకరించబోమని తెగేసి చెప్పారు. శోభానాగిరెడ్డి పార్థీవ దేహంతో ఉన్న వాహనాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ‘ఒకసారి కాదు నాలుగు సార్లు గెలుపొందిన శోభానాగిరెడ్డి అంత్యక్రియ లు లాంఛనాలతో నిర్వహించకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయంటూ’ భూమా నివాసం వద్ద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా సాధ్యం కాదని చెప్ప డం, ఇక్కడ జనం ఆగ్రహించడంతో జిల్లా పోలీసు అధికారులు తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు.అయితే సమస్య జఠిలమైతే శాంతి భధ్రతల సమస్యగా మారుతుందని భావించిన అధికారులు చివరకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాల్సి వచ్చింది. -
ప్రమాద స్థలం వద్ద జనం తాకిడి
నంద్యాల, న్యూస్‌లైన్: శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించి మూడురోజులవుతున్నా ఘటనాస్థలం వద్ద జనం తాకిడి తగ్గలేదు. వేలాదిగా జనం వచ్చి ప్రమాద స్థలాన్ని చూసి ఘటనపై ఆరా తీస్తున్నారు. బుధవారం రాత్రి నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు వెళ్తూ గూబగుండం మెట్ట దగ్గర శోభానాగిరెడ్డి వాహనం బోల్తాపడి ఆమె మరణించిన విషయం తెలిసిందే. అయితే సంఘటన ఎలా జరిగిందని నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు వెళ్తున్న వాహనాల యజమానులు అక్కడ నిలబడి చూసి వెళ్తున్నారు. వాహనం నాలుగు పల్టీలు కొట్టిందని సమాచారం ఉండటంతో ఎక్కడ బ్రేక్ పడింది.. ఎందుకు డ్రైవర్ బ్రేక్ వేశాడంటూ చర్చించుకుంటున్నారు. అంతేగాక శోభానాగిరెడ్డి మృతికి కారణమైన అంశాన్ని కూడా ప్రమాదానికి గురైన వాహనాన్ని చూస్తూ చర్చించుకున్నారు. ప్రమాదానికి కారణంగా చెబుతున్న ఆరబోసిన వడ్లు కూడా అలాగే ఉండటంతో చర్చనీయాంశమైంది. బోల్తా పడిన వాహనం ఘటనాస్థలంలోనే ఉండడంతో వేలాదిగా జనం వచ్చి చూస్తూ ప్రమాదంపై చర్చించుకుంటున్నారు. శోభమ్మే లక్ష్యంగా వెంటాడిన మృత్యువు : ప్రమాద సమయంలో శోభానాగిరెడ్డితోపాటు వాహనంలో ఉన్న గన్మేన్లు, డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారని, వారిలాగే శోభమ్మ కూడా గండం నుంచి బయటపడి ఉంటే బాగుండేదని ఘటనాస్థలం వద్ద జనం కన్నీరుపెట్టుకోవడం కనిపించింది. శోభానాగిరెడ్డి దాదాపు మూడు దశాబ్దాలుగా అధునాతన వాహనాలతో ఈ రహదారిపై పర్యటించేవారని, ఆమెతోపాటు ఆమె డ్రైవర్లకు కూడా రహదారిపై సంపూర్ణ అవగాహన ఉందని, అటువంటి పరిస్థితుల్లో ప్రమాదం ఎలా జరిగిందన్న ప్రశ్న జనం నుంచి తలెత్తుతోంది. బోల్తా పడిన సమయంలో వాహనం నుంచి శోభానాగిరెడ్డి మాత్రమే ఎగిరిపడడాన్ని కూడా దురదృష్టంగా చెప్పుకొంటున్నారు. ఉదయం నుంచి వేల సంఖ్యలో సంఘటనా స్థలం మీదుగా వాహనాలు వెళ్లాయని, వారందరికీ ఎదు రు కాని సమస్య ఇదే వాహనానికి ఎదురు కావడం కూడా బాధాకరమని పేర్కొంటున్నారు. శోభానాగిరెడ్డిని లక్ష్యంగా మృత్యు వు వెంటాడినట్లు సంఘటనా స్థలంలోని పరిస్థితులను బట్టి అర్థమవుతోందని, మృత్యువు ఎందుకు ఆమెపై ఇంత పగపట్టిందని ఆవేదన చెందారు. స్థానిక ప్రజలు సైతం ఘటనా స్థలానికి చేరుకొని అక్కా వెళ్లిపోయావా అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. భూూమా జోక్యంతో జనం బయటకు.. శోభా పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు వచ్చిన జనంతో భూమా నివాసం కిక్కిరిసిపోయింది. అయితే పార్థీవ దేహం సందర్శించిన వారు బయటకు రాకపోవడంతో జనం వెళ్లడానికి సాధ్యం కాలేదు. పోలీసులు వెళ్లి అదుపు చేయడానికి ప్రయత్నం చేయగా ప్రజలు సహకరించలేదు. సున్నితమైన వ్యవహారం కాబట్టి పోలీసులు కూడా వారిపై ఒత్తిడి తేకుండా భూమానాగిరెడ్డి దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. దీంతో విషాదంలో నుంచి బరువెక్కిన హృదయంతో భూమా బయటకు వచ్చి జనాలను బయటకు రావాలని పదేపదే కోరారు. సాధ్యం కాకపోవడంతో పార్థీవ దేహాన్ని ప్రధాన కూడలికి తెచ్చి ఇబ్బందులను తొలగించారు. -
శోభా నాగిరెడ్డికి కన్నీటి వీడ్కోలు
కడసారి చూపుకోసం భారీగా తరలివచ్చిన అభిమానులు విరిగిన బారికేడ్లు... సహకరించాలని విజ్ఞప్తిచేసిన భూమా నివాళులర్పించిన వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల, భారతి దుకాణాల మూసివేత... ఆళ్లగడ్డ మొత్తం అంతిమయాత్రలోనే కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి చేతులమీదుగా అంత్యక్రియలు ఆళ్లగడ్డ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. ఆళ్లగడ్డలోని భూమా స్వగృహంలో ఉంచిన శోభా నాగిరెడ్డిని కడసారి చూసేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, భూమా అభిమానులు భారీగా తరలివచ్చారు. ఉదయం 9.45 గంటల సమయంలో జనం తాకిడితో బారికేడ్లు విరిగిపోయాయి. పోలీసులు అతికష్టం మీద భూమా నివాసం గేట్లను మూసి వేశారు. దీంతో అంత బాధలో ఉన్నప్పటికీ భూమా నాగిరెడ్డి బయటికి వచ్చి జనాలను సముదాయించే యత్నం చేశారు. ప్రచార రథంపెకైక్కి అభివాదం చేస్తూ బొంగురుపోయిన కంఠంతో ‘‘ఏమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియడంలేదు. శోభ మృతదేహాన్ని రోడ్డుపైకి తెచ్చి ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి చూపించే యత్నం చేస్తాను. దయచేసి సహకరించండి’’ అంటూ విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత 10.28 గంటలకు శోభ పార్థివదేహాన్ని ట్రాక్టర్‌పైకి చేర్చి అభిమానుల సందర్శనార్థం రోడ్డుపై ఉంచారు. సాయంత్రం 3.30 గంటలకు శోభ పార్థివ దేహానికి చివరిసారి ‘ముత్తై ప్రక్రియ’ను పూర్తిచేసేందుకు ఇంట్లోకి తీసుకెళ్లారు. బంధువులు ఆ కార్యక్రమాలను పూర్తిచేసి అంతిమయాత్ర కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలోకి తీసుకొచ్చారు. శోభమ్మను చూసి అభిమానులు బోరున విలపించారు. ‘దేవుడా ఎంత పని చేశావయ్యా... శోభమ్మను ఇట్టా తీసుకుపోవడానికి నీకు చేతులెట్టా వచ్చాయయ్యా’ అంటూ రోదించారు. కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి చేతిలో నిప్పుకుండతో వాహనంలోకి రాగానే అందరూ కంటతడి పెట్టారు. తల్లి పార్థివదేహం వద్ద కన్నీరుమున్నీరవుతున్న కుమార్తెలు అఖిలప్రియ, మౌనికలను శోభ సోదరుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ఓదార్చారు. తమ చిన్న చెల్లెల్ని విగతజీవిగా చూసి శోభ అక్కలు రోదించారు. తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి విషాద వదనంతో ఉండిపోయారు. సాయంత్రం 4.16 గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల, వైఎస్ భారతి, వైవీ సుబ్బారెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్ర మొదలైంది. అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర భూమా నివాసం నుంచి టీబీరోడ్డు, గాంధీసెంటర్, పాతబస్టాండ్, కందుకూరు రోడ్డులోని భూమా పొలాల వరకూ యాత్ర సాగింది. కిలోమీటరు మేర అంతిమయాత్ర గంటకు పైగా సాగింది. అంతిమయాత్ర సందర్భంగా ఆళ్లగడ్డలోని దుకాణదారులందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఇళ్లకు తాళాలు వేసి ఆళ్లగడ్డ ప్రజానీకం మొత్తం అంత్యక్రియలకు హాజరయ్యారు. తమ అభిమాన నేత శోభను కడసారి చూసేందుకు దారిలోని దుకాణాలు, మిద్దెలపై గంటల తరబడి ఎదురు చూశారు. వాహనంపై విగతజీవిగా ఉన్న ప్రియతమ నేతను చూసి కంట తడిపెట్టారు. కడసారి చూసేందుకు వచ్చిన జనమంతా యాత్రను అనుసరించారు. అంతిమ యాత్ర కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేలాదిగా అభిమానులు ఎండను కూడా లెక్కచేయకుండా, మధ్యాహ్నం భోజనం చేయకుండా వేచి ఉన్నారు. పోలీసు లాంఛనాలతో వీడ్కోలు... సాయంత్రం 4.23 గంటలకు మొదలైన అంతిమయాత్ర 5.25 గంటలకు భూమా పొలాల్లోకి చేరింది. పార్థివదే హాన్ని వాహనంపై నుంచి తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఎమ్మెల్యే హోదాలో మృతి చెందిన శోభానాగిరెడ్డికి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పార్థివదేహాన్ని గంధపుచెక్కల చితిపై పేర్చారు. చివరిసారి భార్యను చూసుకున్న భూమానాగిరెడ్డి బోరున విలపించారు. పక్కనే ఉన్న కుటుంబీకులు, పిల్లలు ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు. కుమారుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి తల్లి చితికి నిప్పంటించారు. కళ్లెదుట కాలిపోతున్న తల్లిని చూసి పిల్లలు.. భార్యను చూసి భూమా.. సోదరిని చూసి ఎస్వీమోహన్‌రెడ్డి సోదరులు, సోదరీమణులు.. తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి.. అభిమానులు.. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు దుఃఖసాగరంలో మునిగిపోయారు. శోభా నాగిరెడ్డి మృతిని జీర్ణించుకోలేక నంద్యాలలో ఇద్దరు అభిమానులు గుండెపోటుతో మరణించారు. -
జగన్ ప్రగాఢ సానుభూతి
శోభకు పుష్పాంజలి ఘటించిన జగన్, విజయమ్మ, భారతి, షర్మిల నివాళులర్పించిన వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఆళ్లగడ్డ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రోడ్డు ప్రమా దంలో మరణించిన వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి కుటుంబసభ్యులకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జగన్ హైదరాబాద్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3.15 గంటలకు హెలికాప్టర్లో ఆళ్లగడ్డకు చేరుకున్నారు. ఆయనతో పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, సోదరి షర్మిల, జగతి పబ్లికేషన్స్ చైర్పర్సన్ వైఎస్ భారతి, చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వచ్చారు. నివాస ప్రాంగణంలో ఉంచి న శోభ భౌతిక కాయానికి తొలుత జగన్ పుష్పాంజలి ఘటించారు. అప్పటికే శోకసంద్రంలో మునిగి ఉన్న శోభ కుటుంబీకులు జగన్, విజయమ్మలను చూడగానే గుండెలవి సేలా విలపించారు. శోభ మృతితో పూర్తిగా డీలాపడిపోయిన భర్త భూమా నాగిరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. శోభ కుమార్తెలు, కుమారుడిని జగన్ అక్కున చేర్చుకుని ఓదార్చారు. విజయమ్మ కూడా ఆ పిల్లలను అనునయించారు. ఇలాంటి సమయంలో గుండె నిబ్బరంతో వ్యవహరించాలంటూ నాగిరెడ్డికి జగన్ ధైర్యం చెప్పారు. విజయమ్మ, షర్మిల, భారతి కంటతడిపెడుతూ శోభ తలను నిమిరినప్పుడు అక్కడున్న మహిళలు పెద్దపెట్టున రోదించారు. పది నిమిషాలకు పైగా శోభ భౌతికకాయం వద్ద ఉన్న జగన్, విజయమ్మ, షర్మిల, భారతి తదితరులు తర్వాత భూమా నివాసంలోకి వెళ్లి శోభ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శోభ తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి, సోదరుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఇతర కుటుంబసభ్యులతో జగన్ 45 నిమిషాలకు పైగా గడిపి వారికి ధైర్యం చెప్పారు. శోభలాంటి ఆత్మీయురాలిని కోల్పోవడం తనకు చాలా బాధగా ఉందని, ఆమె లేరనే వాస్తవాన్ని జీర్ణించుకుని ఇకపై జరగాల్సింది చూడాలని వారికి చెప్పారు. ఆ కుటుంబానికి తన సహాయసహకారాలు ఉంటాయని జగన్ భరోసా ఇచ్చారు. తర్వాత శోభ తుదియాత్ర కోసం పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనంలోకి చేర్చారు. జగన్, విజయమ్మ, షర్మిల, భారతి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి శోభకు పుష్పాంజలి ఘటించారు. సాయంత్రం 4.15 గంటలకు జగన్ కుటుంబసభ్యులతో కలసి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, తిమ్మల్లి రామకృష్ణారెడ్డి, కాటసాని రామిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, కేతినేని వెంకట్రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ఎం.లింగారెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎంపీలు ఎస్పీవై రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, అనంతపురం మాజీ జెడ్పీ చైర్పర్సన్ తోపుదుర్తి కవిత, కడప, రాజంపేట లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థులు వైఎస్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, నాయకులు కొణతాల రామకృష్ణ, వైఎస్ వివేకానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, మాజీ మంత్రి టి.రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, వైఎస్సార్సీపీ నాయకు లు డి.సి.గోవిందరెడ్డి, రెహమాన్, రాచమల్లు ప్రసాదరెడ్డి, జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ సహా పలువురు నేతలు శోభకు శ్రద్ధాంజలి ఘటించారు. అంత్యక్రియల కార్యక్రమంలో ఆళ్లగడ్డ, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, కడప, హైదరాబాద్ ప్రాంతానికి చెందిన నేతలు భారీగా హాజరయ్యారు. నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు డాక్టర్ నౌమాన్, రామకృష్ణా విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, శ్రీశైలం వైఎస్సార్సీపీ నేత బుడ్డా సీతారామరెడ్డి, కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ కేశవరెడ్డి, కోవెలకుంట్ల నేత కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డి, కాకనూరు పరమేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ కోడుమూరు ఇన్చార్జి మణిగాంధీ, కొప్పులు శివనాగిరెడ్డి తదితరులు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ సేవాదళ్ కార్యకర్తలు సందర్శనకు వచ్చిన వారికి సహాయపడ్డారు. -
శోభా నాగిరెడ్డి అంతిమయాత్ర
-
శోభా నాగిరెడ్డి అంత్యక్రియలు
-
జనసంద్రమైన ఆళ్లగడ్డ
కర్నూలు: వైఎస్సార్ సీపీ నేత భూమా శోభా నాగిరెడ్డి అంతిమయాత్ర సందర్భంగా ఆళ్లగడ్డ జనసంద్రమైంది. శుక్రవారం ఉదయం ఆమె భౌతిక కాయాన్నివేలాది సంఖ్యలో అభిమానులు సందర్శించారు. అనంతరం మధ్యాహ్నం ఆమె అంతిమ యాత్ర ఆరంభమైంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అభిమానులు ఆమె అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. శోభా నాగిరెడ్డి పార్థీవ దేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న సమయంలో ఆళ్లగడ్డ మొత్తం స్తంభించింది. ఆమె ముగింపు కార్యక్రమానికి హాజరైన అశేష జనవాహిని కన్నీటి పర్యంతమైయ్యారు. ఇక తమ నేత తిరుగురాదని తెలిసి దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఆ దుఃఖాన్ని అదిమిపెట్టుకుంటూనే శోభమ్మ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. జిల్లాలోని ఆళ్లగడ్డలో ఆమె అంత్యక్రియల కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర రాజకీయాల్లో మృధుస్వభావిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శోభా నాగిరెడ్డి ప్రస్థానం ముగిసిపోవడంతో రాష్ట్రం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. బుధవారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన శోభా నాగిరెడ్డి.. నిన్న చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. గురువారం ఆమె పార్థీవదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం నంద్యాలలో ఉంచారు. శోభమ్మ ఇక లేరని తెలిసి రాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతికి లోనైయ్యారు. శోభా నాగిరెడ్డి భౌతికకాయాన్ని అంతిమ యాత్రగా తీసుకుళ్లే ముందు ఆమె భర్త భూమా నాగిరెడ్డి కన్నీటిని దిగమింగుకుని అక్కడకు వచ్చిన వారికి చేతులు జోడించి అభివాదం చేయడం అందర్నీ కలచివేసింది. -
శోభా నాగిరెడ్డి అంత్యక్రియలు పూర్తి
-
శోభా నాగిరెడ్డి కి నివాళులు అర్పించిన జగన్
-
శోభానాగిరెడ్డి కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ
ఆళ్లగడ్డ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భూమా శోభానాగిరెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. ప్రత్యేక హెలికాప్టర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆళ్లగడ్డ చేరుకున్న జగన్... శోభానాగిరెడ్డి పార్థీవదేహాన్ని సందర్శించి అంజలి ఘటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్ సతీమణి వైఎస్ భారతి, జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా శోభానాగిరెడ్డి భౌతికకాయానికి నివాళి అర్పించారు. శోభానాగిరెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. కన్నీటి పర్యంతమవుతున్న శోభానాగిరెడ్డి కుమార్తెలు, కుమారుడిని జగన్ ఓదార్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు శోభానాగిరెడ్డి పార్థీవదేహానికి అంజలి ఘటించారు. మరోవైపు శోభానాగిరెడ్డిని చివరిసారిగా దర్శించుకునేందుకు భారీలో కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులు ఆళ్లగడ్డకు తరలివచ్చారు. -
శోభా నాగిరెడ్డి మరిలేరు
-
శోభానాగిరెడ్డికి నివాళి
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకురాలు శోభానాగిరెడ్డి మృతిపార్టీకి తీరని లోటని ఆ పార్టీ నాయకుడు, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శోభానాగిరెడ్డి సంతాప సభ గురువారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నగర అధికార ప్రతినిధి హెచ్.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. శోభానాగిరెడ్డి చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. సభలో పొంగులేటి మాట్లాడుతూ.. వైఎస్ మృతి అనంతరం జగన్మోహన్రెడ్డి కుటుంబానికి శోభానాగిరెడ్డి అండగా నిలిచారని, పార్టీలో కీల కంగా వ్యవహరించారని అన్నారు. వైఎస్ విజయమ్మకు కుడి భుజంలా వ్యవహరించిన శోభమ్మ మృతి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. ‘రాజన్న ఆశయ సాధనకు అహర్నిశలు కృషి చేస్తున్న జగనన్నకు శోభమ్మ అండగా ఉన్నారు. జగన్‌ను సీఎంగా చూడకుండానే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లడం బాధాకరం’ అని అన్నారు. సభలో పార్టీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి కూరాకుల నాగభూషణం, పార్టీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి శ్రీలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి నిరంజన్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు తోట రామారావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ముసా ్తఫా, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, నగర అధ్యక్షురాలు కొత్తగుండ్ల శ్రీలక్ష్మి, నాయకులు విఎల్‌ఎన్.రెడ్డి, జిల్లేపల్లి సైదులు, భీమనాధుల అశోక్‌రెడ్డి, ఆకుల మూర్తి, వంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, ఆరెంపుల వీరభద్రం, మేడా విజయ్‌కుమార్ పాల్గొన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో.. శోభానాగిరెడ్డి మృతిపట్ల కుక్కునూరులో పార్టీ మండల కన్వీనర్ కుచ్చర్లపాటి నరసింహరాజు ఆధ్వర్యంలో గురువారం ఇక్కడ సంతాప సభ జరిగింది. ఆమె చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పగిళ్ల అల్లేశ్, నాయకులు గంగుల రమణారెడ్డి, రాయి రవీందర్, పరవా రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దమ్మపేటలో సంతాప సభ జరిగింది. హాజరైన నాయకులు, కార్యకర్తలు రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. ఈ సభలో పార్టీ మండల అధ్యక్షుడు జూపల్లి ఉపేంద్రబాబు, పట్టణ అధ్యక్షుడు పగడాల రాంబాబు, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు దారా యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో.. భూమ శోభానాగిరెడ్డి మృతికి సంతాపంగా గురువారం భద్రాచలంలో సంతాపసభ జరిగింది. ఆమె చిత్రపటానికి నాయకులు పూలమాలలువేసి, కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సభలో నాయకులు కొవ్వూరి రాంబాబు, దామర్ల రేవతి, కొప్పినీడు నాని తదితరులు పాల్గొన్నారు. వెంకటాపురంలో పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిలిపేసి, అత్యవసర సమావేశం నిర్వహించి, రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ సమావేశంలో నాయకులు చిట్టెం సత్యనారాయణ(ఎర్ర బాబు), పాండియన్ రాకేష్, యన్నమల్ల దాసు, జెజ్జరి నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. చర్లలో జరిగిన పార్టీ అత్యవసర సమావేశంలో నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు రామగిరి యాకయ్య, నాయకులు కాళ్ల కృష్ణ, పొడుపుగంటి సమ్మక్క, తడికల అనుసూర్య తదితరులు పాల్గొన్నారు. ఇల్లెందు నియోజకవర్గంలో.. శోభానాగిరెడ్డి మృతికి సంతాపంగా బయ్యారం మండల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి సంతాపం తెలిపారు. టేకులపల్లిలోని పార్టీ కార్యాలయంలో సంతాప సమావేశం జరిగింది. హాజరైన వారంతా రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ ఏలూరి కోటేశ్వరరావు, నాయకులు బట్టు శివ, నర్సింగ్ లక్ష్మయ్య, పెద్దబోయిన మదనయ్య తదితరులు పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గంలో.. శోభానాగిరెడ్డి మృతిచెందారన్న వార్తతో కూసుమంచి మండలంలోని పార్టీ శ్రేణుల్లో విషాదాన్ని నింపింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూసుమంచిలో సమావేశమయ్యారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం, శాంతియాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బజ్జూరి వెంకట రెడ్డి, నాయకులు జర్పుల బాలాజీనాయక్, పిట్టా సత్యనారాయణరెడ్డి, టి.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేలకొండపల్లిలో సంతాపం సమావేశం జరిగింది. పార్టీ మండల అధ్యక్షుడు కొర్లకుంట్ల నాగేశ్వరరావు, నాయకులు కోటి సైదారెడ్డి, పాకనాటి సంగీత, కాకమాను మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. మణుగూరు నియోజకవర్గంలో.. మోరంపల్లి బంజరలో జరిగిన సంతాప సభలో నాయకులు కైపు సుబ్బరామిరెడ్డి, జె.మల్లారెడ్డి, బత్తుల రామకొండారెడ్డి, కైపు నాగిరెడ్డి తదితరులు మాట్లాడుతూ.. పార్టీలో శోభానాగిరెడ్డి మృతితో డైనమిక్ లీడర్‌ను పార్టీ కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. శోభానాగిరెడ్డి మృతికి సంతాపంగా బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు గ్రామంలో గురువారం రాత్రి శాంతి ర్యాలీ, స్కూల్ సెంటర్లో సంతాప సభ జరిగాయి. శోభానాగిరెడ్డి చిత్రపటం వద్ద నాయకులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాలలో పార్టీ నాయకులు మేడగం శ్రీనివాసరెడ్డి, కాటం వెంకట్రామిరెడ్డి, బానోతు రామదాసు, ఇమ్మడి రాము తదితరులు పాల్గొన్నారు. వైరా నియోజకవర్గంలో.. శోభానాగిరెడ్డి మృతిపట్ల వైఎస్ఆర్సీపీ నాయకుడు, వైరా అసెంబ్లీ అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైరాలోని పార్టీ కార్యలయంలో ఏర్పాటైన సంతాప సభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కోసం ఆవిర్భావం నుంచి ఆమె కృషి చేశారని, వైఎస్ఆర్ కుటుంబానికి అండగా నిలిచారని నివాళులర్పించారు. ఆమె మృతితో శక్తిమంతురాలైన నాయకురాలిని పార్టీ కోల్పోయిందన్నారు సంతాప సూచకంగా పార్టీ శ్రే ణులు నల్ల బ్యాడ్జీలు ధరించారు. తొలుత, రెండు నిముషాలపాటు సభికులు మౌనం పాటించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ షేక్ లాల్‌మహ్మద్, నాయకులు బొర్రారాజశేఖర్, సూతకాని జైపాల్, తేలప్రోలు నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు. జూలూరుపాడులో జరిగిన సంతాప సభలో పార్టీ మండల కన్వీనర్ పొన్నెకంటి వీరభద్రం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పూర్ణకంటి నాగేశ్వరరావు, నాయకులు దారావతు నాగేశ్వరరావు, కాళ్లూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఏన్కూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన సంతాప సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ ముక్తి వెంకటేశ్వర్లు, నాయకులు నలమల శివకుమార్, నలమల వెంకటేశ్వరరావు, భూక్యా సక్రునాయక్ తదితరులు పాల్గొన్నారు. శోభా నాగిరెడ్డి మృతికి సంతాపంగా కారేపల్లి మండలంలో పార్టీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించారు. కారేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సంతాప సమావేశంలో నాయకులు విష్ణువర్థన్‌రెడ్డి, ఇమ్మడి తిరుపతిరావు, కోట సత్యానారాయణ, మండెపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మధిర నియోజకవర్గంలో.. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద శోభానాగిరెడ్డి చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ అంకసాల శ్రీనివాసరావు, నాయకులు లక్కిరెడ్డి నర్సిరెడ్డి, తల్లపురెడ్డి అంకాలరెడ్డి, శీలం అక్కిరెడ్డి, జంగా పుల్లారెడ్డి పాల్గొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో.. శోభానాగిరెడ్డి మృతివార్త తెలియగానే కల్లూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిలిపివేసి, సంతాప సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కీసర వెంకటేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ పాలెపు రామారావు, పట్టణ కన్వీనర్ కర్నాటి అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేంసూరులో జరిగిన సంతాప సమావేశంలో పొంగులేటి మాధురి, పార్టీ మండల కన్వీనర్ అట్లూరి సత్యనారాయణరెడ్డి, నాయకులు జంగా శ్రీనివాసరెడ్డి, గండ్ర నరోత్తమరెడ్డి, బాపూజీ తదితరులు పాల్గొన్నారు. -
ఆ పిలుపే ఆత్మీయం
శోభానాగిరెడ్డి మృతితో నగరంలో విషాదం ప్రముఖుల నివాళి పలువురి సంతాపం సాక్షి, సిటీబ్యూరో : వైఎస్సార్ కాంగ్రెస్ నేత, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి భూమా శోభా నాగిరెడ్డికి హైదరాబాద్ నగరంతో విడదీయలేని అనుబంధం ఉంది. ఆడవారినైనా, మగవారినైనా రాయలసీయ ఆత్మీయ యాసలో ‘ఏమ్మా’ అని నవ్వుతూ పలకరించే శోభా నాగిరెడ్డి పిలుపు ఇక వినపడదని తెలిసి అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. మహానేత వైఎస్సార్ ఆశయాలకు ఆకర్షితులైన ఆమె.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషించారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబీకుల వెంట నడిచారు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరంలో ఇందిరా పార్క్, ఎమ్మెల్యే క్వార్టర్స్, అసెంబ్లీ, సెక్రటేరియట్ తదితర చోట్ల నిర్వహించిన పలు ఆందోళనల్లో ఆమె అగ్రభాగాన నిలిచేవారు. ఇటీవల సెక్రటేరియట్ వద్ద జరిగిన ఓ ఆందోళనలో పోలీసులు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించినా గట్టిగా ఎదిరించి అరెస్ట్ అయ్యారు. 1996లో రాజకీయాల్లోకి వచ్చిన శోభా నాగిరెడ్డి అప్పటి నుంచి నగరానికి ఎక్కువగా వచ్చి వెళ్లేవారు. టీడీపీ, పీఆర్పీలలో ఎమ్మెల్యేగా కొనసాగిన ఆమె వైఎస్సార్ సీపీలోకి వచ్చిన తర్వాత తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్రంలో ఓ స్ఫూర్తి వంతమైన మహిళా నాయకురాలిగా ఎదిగారు. ఏ పార్టీలో ఉన్నా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా, అన్నింట్లోనూ ఆమెది అగ్రభాగామే. ఆమె అకాల మరణాన్ని హైదరాబాదీవాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమెతో తమ జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. ఒకసారి పరిచయం అయితే గుర్తుపట్టి పేరుపెట్టి పిలిచే శోభానాగిరెడ్డి నగర వైఎస్సార్ సీపీ శ్రేణుల్లోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు. జర్నలిస్టులను ‘అన్నా’ అని పలకరించేవారు ‘నగరంలో ఏ కార్యక్రమంలో పాల్గొన్నా జర్నలిస్టులను ‘అన్నా’ అని అప్యాయంగా పలకరించేవారు శోభమ్మ. ఆమె ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని’ టీయూడబ్ల్యూజే అనుబంధ విభాగం హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) అధ్యక్ష, కార్యదర్శులు యాదగిరి, కోటిరెడ్డిలు తెలిపారు. గురువారం ఆమె ఆకాల మృతికి వారు సంతాపం ప్రకటించారు. ‘పత్రికా సమావేశాల్లో జర్నలిస్టులు ఎలాంటి క్లిష్ట ప్రశ్నలు వేసిన సంయమనంగా నవ్వుతూ సమాధానం చెప్పే మహిళ నేత ఆమె. ఇక అన్నా అనే పిలుపు మూగబోయిందన్న విషయం యావత్తు జర్నలిస్టు లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని’ అన్నారు. ప్రముఖుల సంతాపం శోభానాగిరెడ్డి అకాల మృతి రాష్ట్రానికి తీరని లోటని జనచైతన్య వేదిక అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి, పురావస్తు శాఖ మాజీ సంచాలకులు ఆచార్య పెద్దారపు చెన్నారెడ్డి, బీజేపీ నగర నాయకుడు బి.జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నేత శ్రీనివాసులు నాయుడు అన్నారు. వారు శోభమ్మ మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శోభానాగిరెడ్డి అకాల మృతి విచారకరమని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు బద్దం బాల్‌రెడ్డి మరో ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా నేతగా రాష్ట్ర సమస్యలపై ఆమె అసెంబ్లీలో గళమెత్తిన తీరు ఆదర్శప్రాయమని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. -
అభిమాన ‘శోభ
ఆమెది పరిచయం అవసరం లేని పేరు.పొరుగు జిల్లా అయిన కర్నూలు రాజకీయాలతో పాటు, రాష్ట్ర రాజకీయ యవనికపై తనదైన శైలిని చూపిన మహిళా నేత. పెదవులపై చెదరని చిరునవ్వు, సూటిగా నిలదీసే నైపుణ్యం, ఆమె సొంతం. ఆమెకు పాలమూరుతోనూ అనుబంధం ఉంది. ఇక్కడి నేతల్లో పలువురు ఆమెకంటే సీనియర్లో, సహచరులో కావడంతో వారితో ఆమె ఆత్మీయంగా మెలిగేవారు. అనుకోని రీతిలో ఆమెను రోడ్డు ప్రమాద దుర్ఘటన మృత్యువు ఒడికి చేర్చిందని తెలిసి జిల్లావాసులు తట్టుకోలేక పోతున్నారు. ఆమెతో ఉన్న పరిచయాన్ని ఆత్మీయులు గుర్తుకు తెచ్చుకొని కన్నులు చెమర్చారు. ఇదీ వైఎస్సార్సీపీ నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి శోభానాగిరెడ్డి ఇక లేరని తెలిసి జిల్లాలో కనిపించిన శోకతప్త పరిస్థితి. అలంపూర్,గద్వాల, న్యూస్‌లైన్ : చురుకైన నాయకురాలిగా తనదైన ముద్ర వేసుకున్న భూమా శోభానాగిరెడ్డికి మహబూబ్‌నగర్ జిల్లాతోనూ చక్కని అనుబంధం ఉంది. ముఖ్యంగా ఆమె అలంపూర్క్షేత్ర ఆలయాలను పలుమార్లు దర్శించి అమ్మవారు, బాలబ్రహ్మేశ్వరుని ఆశీర్వాదాలు పొందేవారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆమె బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ హైదరాబాదులో గురువారం తుదిశ్వాస విడిచిన సంగతి విదితమే. శోభ తరచూ అలంపూర్‌లో వెలిసిన శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయాన్ని, శ్రీబాలబ్రహ్మేశ్వర సామి వారి ఆలయాలను పలుమార్లు దర్శించుకున్నారు. ఆళ్ల గడ్డ నుంచి హైదరబాదు వెళ్లే సమయంలోనో..తిరుగు సమయంలోనో క్షేత్రాన్ని సందర్శించి అమ్మ వారి, స్వామివారి ఆలయంలో పూజలు జరిపే వారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై జరుగుతున్న కుట్రల నుంచి కాపాడాలని ఇక్కడ పూజలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. అమ్మవారి భక్తురాలిగా ఆమె ఈ ప్రాంతానికి సుపరిచితురాలు.ఇలా ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న ఆమె మరణాన్ని స్థానికులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆళ్లగడ్డ నియోజక వర్గ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డికి అలంపూర్ ఆలయాలంటే ఎంతో భక్తి ప్రపత్తులని ఆలయ అర్చకుడు ఆనంద్‌శర్మ ఈ సందర్భంగా తెలిపారు. తన నియోజక వర్గం నుంచి హైద్రాబాద్ వెళ్లే ప్రతి సారి ఆమె ఆలయాలను దర్శించేందుకు వచ్చేవారని తెలిపారు. శోభనాగిరెడ్డి మరణ వార్త ఆలయ సిబ్బందిని తీవ్ర ద్రిగ్భాంతికి గురి చేసిందన్నారు. విగత జీవిగా మారిన ఆమె పార్థివ శరీరం కూడా జాతీయ రహదారి మీదుగా ఆమె స్వస్థలానికి తరలించిన సంఘటన తమను మరీ కలచి వేస్తోందని స్థానికులు కన్నులు చెమర్చారు. కార్యకర్తలకు వెన్నంటి.. శోభానాగిరెడ్డి 2005,06లలో టీడీపీ తరపున గద్వాల పార్టీ పరిశీలకురాలిగా ఆ ప్రాంతంతో అనుబంధం పెంచుకున్నారు. అప్పట్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీడీపీ పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు టిక్కెట్లు ఇప్పించడం, పార్టీని గద్వాల ప్రాంతంలో బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. టీడీపీ పార్టీ సభ్యత్వాల కార్యక్రమాలకు కూడా ఆమెనే ఇన్చార్జిగా వ్యవహరించారు. రెండేళ్ల పాటు గద్వాల రాజకీయాలతో ఆమె మంచి పట్టు కలిగి ఉండేవారు. ఇక్కడి తెలుగుదేశం నేతలతో కూడా ఆమెకు మంచి పరిచయాలు ఉండేవి. -
నేతన్నకు అండగా నేనూ..
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గురువారం కన్నుమూసిన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శోభానాగిరెడ్డికి జిల్లాతోనూ అనుబంధం ఉంది. 2012, జూలై 23న వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ సిరిసిల్లలో చేపట్టిన ‘నేతన్న దీక్ష’లో ఆమె పాల్గొన్నారు. ఒకదశలో వేదికపైకి కొందరు రాళ్లు వేయగా.. అవి విజయమ్మకు తగలకుండా శోభానాగిరెడ్డి ముందుకు వచ్చి నిలుచున్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకురాలు రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తెలియగానే స్థానికులు పలువురు సంతాపం తెలిపారు. ఆనాటి సంగతులు గుర్తుకు తెచ్చుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు సిరిసిల్ల గాంధీచౌక్‌లో శోభానాగిరెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. -
కంటతడి
సాక్షి, కడప : భూమా శోభా నాగిరెడ్డి మరణాన్ని జిల్లా వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాతో ఆమెకు ఉన్న అనుబంధం తలచుకుని తల్లడిల్లిపోతున్నారు. కన్నీటిపర్యంతమవుతున్నారు. బాధాతప్త హృదయాలతో ఆమె జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ శోక సద్రంలో మునిగి పోయారు. వైఎస్సార్సీపీలో చురుకైన నేతగా జిల్లా వాసులలో ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు. శోభానాగిరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆళ్లగడ్డ జిల్లాకు పొరుగునియోజకవర్గమే. జిల్లాలోని ప్రజలతో వారి కుటుంబానికి ప్రత్యే క అనుబంధం ఉంది. ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు నియోజక వర్గాల ప్రజలతో ఆమెకు ప్రత్యక్ష సంబంధాలు, బంధుత్వాలున్నాయి. ఏదైనా అవసరం వస్తే కొన్ని సందర్భాలలో ఆమెను కలిసి పనులు చేయించుకున్న సందర్భాలున్నాయి. జిల్లాకు తరచూ రావడంతో పాటు తమకు తెలిసిన వారికి ఏదైనా ఆపద వస్తే తక్షణమే స్పదించి బాధితులకు అండగా నిలవడం ఆమె ప్రత్యేకతగా జిల్లావాసులు పేర్కొంటున్నారు. ఏదైనా శుభకార్యాలకు తరచూ జిల్లాకు రావడంతో ఆమెకు జిల్లా వ్యాప్తంగా విస్తృత సంబంధాలున్నాయి. మైదుకూరు ఇన్ఛార్జిగా... కడప లోక్‌సభకు 2011 మేలో జరిగిన ఉప ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా శోభానాగిరెడ్డి పనిచేశారు. అప్పట్లో మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని ధీటుగా ఎదుర్కొన్నారు. నాది మీ పక్క నియోజకవర్గమే.. ఏ సంఘటన జరిగినా అండగా ఉంటామని భరోసా ఇచ్చి కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపారు. డీఎల్ రవీంద్రారెడ్డి కంచుకోట ఖాజీపేటలో సైతం పాగా వేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ మెజార్టీ తెచ్చేందుకు కృషి చేశారు. అప్పట్లో అన్ని మండలాల్లోని గ్రామీణప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు మరింత చేరువయ్యారు. ఉప ఎన్నికల్లో 71 వేలకు పైగా మెజార్టీ సాధనలో ఆమె కీలక భూమిక పోషించారు. దీంతోపాటు బద్వేలు, ప్రొద్దుటూరు, పులివెందుల నియోజకవర్గాల్లో సైతం విసృ్తతంగా పర్యటించారు. పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు ప్రచారంలో చేదోడు వాదోడుగా ఉన్నారు. పార్టీ తరుపున ఏ కార్యక్రమం జరిగినా, దీక్ష చేపట్టినా, పోరాటం చేసినా విజయమ్మ వెంటే శోభా నాగిరెడ్డి ఉన్నారు. వైఎస్ జగన్ అరెస్టు అయిన సమయంలో ఆమె వైఎస్ కుటుంబానికి అండగా నిలిచారు. అవిశ్వాసానికి మద్దతుగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఇడుపులపాయలోని వైఎస్ సమాధి చెంతకు వచ్చినపుడు, పార్టీ ప్లీనరీ సమావేశం, షర్మిల పాదయాత్ర, వైఎస్ విజయమ్మ పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో ఆమె పార్టీకి అండగా ఉన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఈనెల 17వ తేదీన నామినేషన్ వేసే కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. వైఎస్ తనయ, జగన్‌సోదరి షర్మిల రోడ్‌షోలో చివరిసారి పాల్గొని ఇంటికి వె ళుతూ ప్రమాదానికి గురయ్యారు. శోభానాగిరెడ్డి పార్థివదేహాన్ని చూసి వైఎస్ విజయమ్మ చలించిపోయారు. కొద్దిసేపు కంటతడి పెట్టారంటే ఆమెతో విజయమ్మకు ఉన్న అనుబంధం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ప్రచారాన్ని నిలిపివేసి హుటాహుటిన హైదరాబాదుకు చేరుకుని నివాళులర్పించారు. షర్మిలతోపాటు వైఎస్ భారతి తదితరులు తరలివెళ్లారు. రెండు రోజులపాటు పార్టీ సంతాప దినాలుగా ప్రకటించి అధికార ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలను రద్దు చేశారు. శోభా నాగిరెడ్డి మృతి తీరనిలోటు కమలాపురం, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీ సీనియర్ మహిళా నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి తీరనిలోటు అని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఆమె మృతిపట్ల వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వల్లూరు మండలంలో చేస్తున్న ప్రచారాన్ని వారు అర్ధాంతరంగా ముగించుకుని శోభానాగిరెడ్డి అంత్యక్రియలకు తరలి వెళ్లారు. -
శోభానాగిరెడ్డి మృతి.. ప్రముఖుల సంతాపాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకురాలు శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారన్న సమాచారం రాష్ట్రంలోని ప్రముఖులు, రాజకీయ నేతలను విస్మయపరిచింది. మరణవార్త విన్న పలువురు రాజకీయ ప్రముఖులు గురువారం హైదరాబాద్ వచ్చి ఆమె పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వివిధ పార్టీల నేతలు వేర్వేరు ప్రకటనల్లో సంతాపాలను ప్రకటించారు. నరసింహన్, రోశయ్య, ప్రముఖుల సంతాపం శోభా నాగిరెడ్డి మృతి దురదృష్టకరమని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఢిల్లీలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. శోభా నాగిరెడ్డి మరణవార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన సేవాతత్వంతో ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఆమె లేని లోటు ఆ కుటుంబానికి తీరనిదని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. శోభ మరణం కుటుంబ సభ్యులకే కాకుండా కర్నూలు జిల్లా ప్రజలకు పూడ్చలేని లోటని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన సంతాపాన్ని ప్రకటించారు. శోభానాగిరెడ్డి దుర్మరణం పట్ల కేంద్రమంత్రి చిరంజీవి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, హరిబాబు, వెంకయ్యనాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, లోక్‌సత్తా అధినేత జేపీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, టీడీపీ ఎంపీలు దేవేందర్‌గౌడ్, సుజనా చౌదరి, ఎమ్మెల్యే వంగా గీత తమ సంతాపాన్ని ప్రకటించారు. శోభానాగిరెడ్డి మరణం తమ పార్టీకి, తమకు తీరని లోటని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, కొండేపి అభ్యర్థి జూపూడి ప్రభాకర్, పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సినీహీరో రాజా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాటలకందని విషాదం: తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి ‘‘శోభ మరణం ఊహకందని, మాటలకందని మహా విషాదం. చిన్నప్పటినుంచి చాలా ఉత్సాహంగా ఉండేది. నాతో ఎక్కువ చనువుగా ఉండేది. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు నాతోపాటు కార్యాలయానికి వచ్చేది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నాతో కలసి తిరిగేది. అందుకే ఆమెకు రాజకీయాలంటే మంచి ఆసక్తి. తండ్రి, కూతురు ఒకే శాసనసభలో కూర్చోవడం చాలా అరుదైన విషయం. అప్పట్లో మహబూబ్‌నగర్ నుంచి సి.నర్సిరెడ్డి, ఆయన తనయ డీకే అరుణ మాత్రమే మాలాగా ఎమ్మెల్యేలుగా ఉండేవారు. శోభ ప్రతి విషయం నాతో చర్చించేది. అసెంబ్లీలో ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడవచ్చా.. లేదా? అని అడిగి తెలుసుకునేది. చిన్నవయస్సులోనే రాజకీయాల్లో అందరి మెప్పు పొం దింది. బుధవారం రాత్రి 12 గంటలకు హైదరాబాద్‌లో ఉండే నా స్నేహితుడు టీవీల్లో శోభానాగిరెడ్డికి ప్రమాదం జరిగిందని స్క్రోలింగ్ వస్తోందని ఫోన్ చేసి చెప్పేవరకు నాకు తెలియదు. వెంటనే నా కుమారుడు మోహన్‌రెడ్డికి ఫోన్ చేశాను. నా కోడలుతో పాటు నంద్యాలకు వెళ్తున్నామని మోహన్ చెప్పాడు. నేను బయలుదేరుతానన్నాను. నీ ఆరోగ్యం బాగాలేదు వద్దని వారించారు. నేను యువకుడిగా ఉన్నప్పుడు రాజకీయాలంటే అసలు ఆసక్తే ఉండేది కాదు. అలాంటిది కాలేజీ సెలవుల్లో ఊరికి వచ్చి రాజకీయాల్లోకి వచ్చేశాను. శోభ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఓ మంత్రిగా ఉంటుందని అనుకున్నాను. అయితే మనం అనుకున్నవన్నీ జరగవు కదా. భూమా నాగిరెడ్డిని పెంచింది కూడా నా భార్యే. ఆళ్లగడ్డలో మా కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. రాజకీయంగా ఓ పేరుంది. ఆ స్ఫూర్తిని అందుకునే శోభ రాజకీయంగా ఎదిగింది’’ అని ‘సాక్షి’తో తనయ జ్ఞాపకాలను నెమరేసుకుని ఎస్వీ సుబ్బారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. -
ఆర్టీసీకి తొలి శోభ
- మొదటి మహిళా చైర్‌పర్సన్‌గా పని చేసిన శోభానాగిరెడ్డి - సంస్థ నష్టాల నివారణకు శ్రీకారం చుట్టిన కర్నూలు బిడ్డ - డిపోలను సందర్శించి లాభార్జన మార్గాలపై అన్వేషణ - కార్మిక సంక్షే మానికి కృషి చేసిన నారీమణి - ఆమె అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆర్టీసీ ఉద్యోగులు కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: దేశంలోనే అతిపెద్ద ప్రజా రవాణ సంస్థ.. ప్రయాణికుల సేవలో గిన్నిస్ రికార్డు సాధించిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు తొలి మహిళా చైర్మన్‌గా పని చేసిన భూమా శోభ నాగిరెడ్డి అకాల మరణాన్ని సంస్థ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన శోభా నాగిరెడ్డి 2002 నవంబరు 7వ తేదీన ఆర్టీసీ రథ సారథిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 16 నెలల పాటు చైర్‌పర్సన్‌గా పని చేసిన ఆమె సాధారణ ఎన్నికల నేపథ్యంలో 2004 ఏప్రిల్‌లో ముందస్తుగా పదవికి రాజీనామా సమర్పించారు. పదవీ కాలంలో సంస్థ నష్టాల నివారణపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. కర్నూలు జిల్లాకు చెందిన వారు కావడంతో జిల్లాలోని అన్ని డిపోల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. సంస్థను లాభాల పట్టించడం కోసం తానొక మహిళను అని కూడా చూడకుండా రాష్ట్రవ్యాప్తంగా నష్టాల్లో నడుస్తున్న డిపోలను గుర్తించి వాటిని ప్రత్యక్షంగా సందర్శించారు. అందుకు కారణాలు తెలుసుకుని నివారణ చర్యలు చేపట్టారు. ప్రమాదాలు, వాటి నివారణ, రూట్లు, ప్రయాణికుల అవసరాలు, సౌకర్యాల కల్పన, ఇంధన పొదుపు వంటి అంశాలపై దృష్టి సారించి భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఉన్నతాధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆర్టీసీకి కార్మికులే వెన్నెముకలాంటి వారని గుర్తించిన ఆమె కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. డిపోల సందర్శన సమయాల్లో కార్మికులతో ప్రత్యేకంగా మాట్లాడి సమస్యలు తెలుసుకొనేవారని, సంక్షేమానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేవారని ఉద్యోగులు గుర్తుచేసుకుంటున్నారు. -
ఆళ్లగడ్డ కంటతడి!
ఆళ్లగడ్డ టౌన్, న్యూస్‌లైన్: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి అకాల మృతితో నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ అభిమాన నాయకురాలు ఇక లేరని ప్రజలు దుఃఖసాగరంలో మునిగారు. బుధవారం రాత్రి తమ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రతి క్షణం ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు టీవీలకు అతుక్కుపోయారు. ప్రమాద సంఘటన స్థలాన్ని, గాయపడిన ఎమ్మెల్యేను ఆసుపత్రికి తరలించిన దృశ్యాలను టీవీల్లో చూస్తూ అభిమానులు కంటతడి పెట్టారు. ఆమె కోలుకోవాలని కులమతాలకు అతీతంగా ప్రజలు దేవుళ్లను ప్రార్థించారు. గురువారం ఉదయం ఎమ్మెల్యేను హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించిన తర్వాత కోలుకుంటారని అందరూ భావించారు. అయితే ఆమె మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించినట్లు టీవీల్లో న్యూస్ రావడంతో తట్టుకోలేక పోయారు. మహిళలు, వృద్ధులు దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించారు. తమ అభిమాన నాయకురాలు లేరని తెలుసుకుని ఆళ్లగడ్డలోని భూమా నివాసానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఎమ్మెల్యే చూపిన ఆప్యాయతను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. మారు మూల గ్రామాలకు చెందిన వ్యక్తి అయినా కనిపిస్తే పేరు పెట్టి ఆప్యాయంగా పలకరించేవారని, ఆమె కంటే కొంచెం వయస్సులో పెద్ద వారిని బాగున్నావా.. అన్నా.. అని ఎంతో మమకారంతో పిలిచేదని కొందరు చెప్పారు. ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మృతి వార్త తెలుసుకున్న ఆళ్లగడ్డ పట్టణ వ్యాపారులు దుకాణాలు మూసి స్వచ్ఛందంగా బంద్ పాటించారు. దీంతో అన్ని వీధులు నిర్మానుష్యంగా మారాయి. -
ఆళ్లగడ్డ ఎన్నికపై ఈసీ నుంచి స్పష్టత కోరాం: భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ నియోజకవర్గం ఎన్నికపై తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టత కోరినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి మృతి చెందితే ఎన్నిక వాయిదా వేయాలని చట్టంలో ఉందని, అయితే గుర్తింపు పొందని పార్టీ అభ్యర్థి మృతి చెందితే ఎన్నిక నిర్వహణ విషయమై స్పష్టత లేదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు ఇప్పటివరకు తనకు ఎదురుకాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ ఎన్నికపై వాస్తవ నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించానని చెప్పారు. కర్నూలు జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపినట్లు ఆయన గురువారం విలేకరులకు తెలిపారు. ఇప్పటికే అభ్యర్థులందరికీ గుర్తులు కేటాయించడంతో పాటు బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా పూర్తయిందని, ఈ నేపథ్యంలో బ్యాలెట్ పత్రం మార్చాలా? లేదా ఎన్నికలను వాయిదా వేస్తూ నోటిఫై చేయాలా? అనే అంశంపై కమిషన్ నుంచి స్పష్టత కోరినట్లు వివరించారు. శోభా నాగిరెడ్డి గుర్తింపు పొందని పార్టీ అభ్యర్థి అయినప్పటికీ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవటంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారని, ప్రస్తుతం పాపులర్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారని, ఇదే విషయాలను నివేదికలో కమిషన్‌కు వివరించామని ఆయన తెలిపారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో తనకు అవగాహన లేదని చెప్పారు. కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని.. కమిషన్ నుంచి శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆళ్లగడ్డ ఎన్నిక యథాతథం: కలెక్టర్ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శోభా నాగిరెడ్డి మరణించినా ఎన్నికలు యథాతథంగా జరుగుతాయని కర్నూలు జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను కూడా ప్రకటించినందున మే 7న జరిగే ఎన్నికలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి బ్యాలెట్ యూనిట్లో శోభానాగిరెడ్డి పేరు, ఎన్నికల గుర్తు ఉంటాయని చెప్పారు. ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి గెలిస్తే ఆమె మరణించినందున ఆ నియోజకవర్గానికి ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎన్నిక వాయిదా నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సీఈసీదే తుది నిర్ణయం సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్రలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 7వ తేదీన జరగనున్న విషయం విదితమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మరణం నేపథ్యంలో ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎన్నిక నిర్వహణ, లేక వాయిదా విషయంలో ఇంకా తుది నిర్ణయానికి రాలేదని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం చూస్తే.. గుర్తింపు ఉన్న పార్టీ అభ్యర్థి మరణించిన సందర్భంలోనే ఎన్నికల వాయిదాకు అవకాశం ఉంటుంది. ఎన్నికల సంఘం గుర్తింపు లేని వైఎస్సార్ సీపీ అభ్యర్థి శోభానాగిరెడ్డి మరణించిన నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలంటే కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీల గుర్తింపును ఎలక్షన్ సింబల్ (రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్) ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం నిర్ణయిస్తారు. వైఎస్సార్ సీపీకి ప్రస్తుతం కామన్ సింబల్ (ఫ్యాను గుర్తు)ను కేటాయించిన విషయం విదితమే. కామన్ సింబల్ కేటాయింపులో ఎన్నికల సంఘానికి విశేషాధికారం ఉన్నట్లే.. ప్రస్తుతం ఎన్నికల వాయిదా విషయంలోనూ నిర్ణయం తీసుకునే విశేషాధికారం ఉందని ఈసీ వర్గాలు చెప్తున్నాయి. శోభా నాగిరెడ్డి మృతిపై నివేదిక, ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎన్నిక విషయంలో రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ నుంచి నివేదిక వచ్చాక.. వాటిని పరిశీలించి, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని విధివిధానాలు, న్యాయనిపుణుల సలహాలను తీసుకుని ఈసీ ఒక నిర్ణయానికి రానున్నట్టు సమాచారం. -
మనసు కలచివేస్తోంది..: వైఎస్ జగన్
* ఆమె నా సోదరి లాంటిది * శోభానాగిరెడ్డి మృతిపై వైఎస్ జగన్ ఆవేదన * నా కోసం ప్రతి అడుగులో అడుగు వేసింది.. * ప్రతి కష్టంలోనూ మా కుటుంబానికి అండగా నిలిచింది.. * పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసింది.. * కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని పరామర్శకు బయలుదేరుతున్నా.. * బరువెక్కిన హృదయంతో పొన్నూరు ప్రజల వద్ద సెలవు తీసుకున్న జగన్ ‘వైఎస్సార్ జనభేరి’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘శోభమ్మ నాకు సోదరిలాంటిది. నా కోసం ప్రతి అడుగులోనూ అడుగు వేసింది. అలాంటి శోభమ్మ ప్రమాద వార్త తెలిసినప్పటి నుంచీ నా మనసుకు ఎంతో కష్టంగా ఉంది. నా కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని శోభమ్మను పరామర్శించడానికి వెళుతున్నా’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గురువారం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ ప్రజల వద్ద సెలవు తీసుకుని హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్రెడ్డి ఈ నెల 21న సోమవారం రాత్రి గుంటూరు జిల్లాలో ప్రవేశించారు. ఆయన మంగళ, బుధవారాల్లో జిల్లాలోని తెనాలి, మంగళగిరి, వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటించి పలు సభల్లో ప్రసంగించారు. బుధవారం రాత్రి బాగా పొద్దుపోయే సమయానికి పొన్నూరు చేరుకున్నారు. ఆ సమయానికే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ శోభానాగిరెడ్డిని నంద్యాల ఆస్పత్రిలో చేర్పించారన్న వార్తలు వచ్చాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో మెరుగైన చికిత్స కోసం గురువారం ఉదయం హైదరాబాద్ కేర్ ఆస్పత్రికి తరలించారన్న వార్త తెలిసినప్పటి నుంచి జగన్‌లో ఆందోళన ఎక్కువయ్యింది. కేర్ ఆస్పత్రి వర్గాలతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ శోభా నాగిరెడ్డి పరిస్థితి తెలుసుకుంటూ వచ్చారు. గురువారం ఉదయానికే జగన్ సభ కోసం పొన్నూరు నియోజకవర్గ కేంద్రానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో జగన్ పొన్నూరు ప్రజలనుద్దేశించి చాలా క్లుప్తంగా నాలుగు నిముషాలు ప్రసంగించి హైదరాబాద్ బయలు దేరారు. ‘‘మీకందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నా సోదరి శోభమ్మకు ప్రమాదం జరిగిందని తెలిసింది. ఆమె పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందట. నా మనసంతా కలతగా ఉంది. అందుకే నా కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని ఆమెను పరామర్శించడానికి వెళుతున్నా. శోభమ్మ నా సోదరి లాంటిది. నా కోసం ప్రతి అడుగులోనూ అడుగు వేసి నడిచింది. ప్రతి కష్టంలోనూ మా కుటుంబానికి అండగా నిలిచింది. పార్టీ బలోపేతానికి నిర్విరామంగా కృషి చేసింది. అందుకే నేను వెంటనే బయలు దేరి వెళ్లాల్సి ఉంది. జగన్ వచ్చాడు. రెండే నిమిషాలు మాట్లాడి వెళ్లి పోయాడని ఎవ్వరూ మరోలా భావించవద్దు. జగన్ మనవాడు. మనం అర్థం చేసుకోలేక పోతే ఎవరు అర్థం చేసుకుంటారన్న పెద్ద మనసుతో నన్ను దీవించి పంపండి. మీకందరికీ ఒక విజ్ఞప్తి. మరణించి ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి గుండెలోనూ గూడు కట్టుకుని ఉన్నాడు. రాబోయే ఎన్నికల్లో మనమంతా ఒక్కటైతేనే మళ్లీ ఆ సువర్ణయుగాన్ని సాధించుకోవడం సాధ్యమవుతుంది. పార్టీ తరఫున పొన్నూరు ఎమ్మెల్యేగా రావి వెంకటరమణను, గుంటూరు పార్లమెంటు స్థానానికి బాలశౌరిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించి జగన్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. చెమర్చిన కళ్లతో అభిమానులను పలకరించిన జగన్ నందిగామ, న్యూస్‌లైన్: శోభానాగిరెడ్డి మృతి వార్త తెలిసి హైదరాబాద్ వెళుతున్న జగన్మోహన్రెడ్డిని నందిగామ 65వ నంబర్ జాతీయ రహదారిపై చందాపురం బైపాస్ వద్ద పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు ఆపారు. ఆయన క్షణంపాటు ఆగి, శోభానాగిరెడ్డి ఇక లేరని చెమర్చిన కళ్లతో అభిమానులను ఓదార్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు శోభానాగిరెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ కార్యాలయ ఇన్చార్జి మొండితోక అరుణ్‌కుమార్, జాతీయ ఉక్కు వినియోగదారుల సలహా మండలి సభ్యుడు బొగ్గవరపు శ్రీశైల వాసు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మహ్మద్ మస్తాన్ తదితరులున్నారు. -
కోడ్ ఉపసంహరణ
ఎన్నికల సంఘం ప్రకటన నేటి నుంచి ప్రభుత్వ కార్యక్రమాలు యథాతథం మున్నార్ నుంచి తిరిగివచ్చిన ముఖ్యమంత్రి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇకమీదట యధావిధిగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రంలో మార్చి 5 నుంచి ఎన్నికల నియమావళి అమలులో ఉంది. ఈ నెల 17న ఒకే దశలో రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. అయితే ఓట్ల లెక్కింపు జరిగే మే 16 వరకు నియమావళి అమలులోనే ఉంటుంది. దీని వల్ల ప్రభుత్వ కార్యక్రమాలకు అవరోధం ఏర్పడుతోందని, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం లేదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన కమిషన్, అధికారులతో మంత్రులు సమీక్షలు, సమావేశాలు జరుపుకోవచ్చని, జిల్లా పర్యటనలూ చేపట్టవచ్చని సూచిస్తూ నియమావళిని పాక్షికంగా సడలించింది. తాగు నీటి ఎద్దడి తదితర అత్యవసర సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించింది. అయితే సిబ్బంది బదిలీలు లాంటి వ్యవహారాలకు సంబంధించి ముందుగా ఎన్నికల కమిషన్ అనుమతిని తీసుకోవాలని, ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులతో మంత్రులు సమావేశాలు నిర్వహించకూడదని షరతు విధించింది. ఎన్నికలు ముగిసి, ఈవీఎంలు స్ట్రాంగ్ రూములలో భద్రంగా ఉన్న నేపథ్యంలో నియమావళి కొనసాగింపు హేతుబద్ధంగా లేదని భావించిన ఎన్నికల కమిషన్, గురువారం నుంచి పూర్తిగా సడలించింది. దరిమిలా శుక్రవారం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు యధావిధిగా సాగనున్నాయి. విశ్రాంతి కోసం కేరళలోని మున్నార్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిరిగి వచ్చేశారు. -
గుంటూరుతో శోభకు అనుబంధం
- టీడీపీ జిల్లా పరిశీలకురాలిగా సుపరిచితం - వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలి సమరదీక్షలో విజయమ్మకు వెన్నంటే... - శోభానాగిరెడ్డి ఆకస్మిక మృతితో ఖిన్నులైన జిల్లా నాయకులు సాక్షిప్రతినిధి, గుంటూరు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు భూమా శోభానాగిరెడ్డి ఆకస్మిక మరణం జిల్లా వాసులను, వైఎస్సార్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను తీవ్రంగా కలిచివేసింది. పార్టీలకు అతీతంగా నాయకులు ఆమె మృతికి సంతాపం తెలిపారు. జల్లాతో శోభానాగిరెడ్డికి ఎంతో అనుబంధం ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆమె 2005-06లోపార్టీ పరిశీలకురాలిగా వ్యవహరించారు. పార్టీలో ట్రబుల్షూటర్గా ఆమెకు మంచి పేరుండేది. పరిశీలకురాలి హోదాలోనే ఏడాది కాలంలోనే ఆమె సుమారు ఏడెనిమిది సార్లు జిల్లాకు వచ్చారు. కార్యకర్తల సమస్యలను, విన్నపాలను ఆమె పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే వారు. అటు తరువాత ఆమె పీఆర్పీలో చేరడం తదనంతర పరిణామాలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబానికి అండగా నిలిచారు. వైఎస్సార్సీపీలో ప్రముఖ నాయకురాలిగా ఎదిగారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు తోడుగా ఉండేవారు. విజయమ్మ ఎక్కడ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నా వెంట శోభానాగిరెడ్డి ఉండేవారు. గత ఏడాది బాపట్లలో జరిగిన పార్టీ మహిళా సదస్సుకు హాజరై మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నినదించారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో గత ఏడాది ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు ఐదురోజుల పాటు గుంటూరు నగరంలోని ఆర్టీసీబస్టాండ్ ఎదుట విజయమ్మ సమరదీక్ష చేపట్టినపుడు ఆమెకు తోడుగా శోభ ఇక్కడే ఉన్నారు. పోలీసులు విజయమ్మను అన్యాయంగా, కనీస నియమ నిబంధనలను పాటించకుండా జీజీహెచ్‌కు తరలించడంతో ఆమె ఆసుపత్రి బయటే ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 25వ తేదీన విజయమ్మ దీక్ష విరమించే వరకు శోభానాగిరెడ్డి ఆమెకు తోడుగా ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన కృష్ణాట్రిబ్యునల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై విజయమ్మ పులిచింతల ప్రాజెక్టు వద్ద చేపట్టిన సాగుపోరుదీక్షకు శోభానాగిరెడ్డి హాజరై ప్రసంగించారు. ఆమె ఆకస్మిక మరణంతో జిల్లాలోని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
శోభానాగిరెడ్డి మృతికి సంతాపం
గరివిడి, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభానాగిరెడ్డి మృతి పట్ల ఆ పార్టీ నాయకులు గురువారం సంతాపం ప్రకటించారు. ఆమె మృతి పార్టీకి తీరని లోటని చీపురుపల్లికి చెందిన వైఎస్ఆర్ సీపీ నాయకుడు బెల్లాన రవి(చినబాబు) అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరలని కోరుతూ గరివిడిలో గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో శోభా నాగిరెడ్డి ముందంజలో ఉండేవారన్నారు. కార్యక్రమంలోఆ పార్టీ నేతలు వాకాడ శ్రీను, సి.హెచ్.సత్యనారాయణరెడ్డి, పి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎస్.కోటలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి రొంగళి జగన్నాథం పార్టీ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించి శోభా నాగిరెడ్డికి నివాళులర్పించారు. వైఎస్ఆర్ సీపీ పార్వతీపురం అసెంబ్లీ అభ్యర్థి జమాన్న ప్రసన్నకుమార్ పార్టీ కార్యాల యంలో సంతాపం ప్రకటించారు. ప్రచారంలో ఉన్న వైఎస్ఆర్ సీపీ సాలూరు అసెంబ్లీ అభ్యర్థి పీడిక రాజన్నదొర కూడా శోభా నాగిరెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు. శోభా నాగిరెడ్డి మృతి ఆమె కుటుంబానికి, పార్టీకి తీరని లోటని వైఎస్ఆర్ సీపీ ద్వారపురెడ్డి సత్యనారాయణ అన్నారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, వైఎస్ఆర్ సీపీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ వరుపుల సుధాకర్, వైఎస్ఆర్సీపీ నెల్లిమర్ల అసెంబ్లీ అభ్యర్థి పెనుమత్స సురేష్‌బాబు, కురుపాం అసెంబ్లీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి, గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. -
రాయలసీమ రాజకీయ ‘శోభ’
నిజానికి ఆమె సేవలు నేడు రాష్ట్రానికి ఎంతో అవసరం. ప్రత్యేకంగా రాయసీమలో, విభజన నేపథ్యంలో సమర్థులైన నేతల అవసరం ఎంతో ఉందన్న మాట కాదనలేనిది. కానీ శోభానాగిరెడ్డి అలాంటి సేవలు అందించకుండానే చిన్నతనంలోనే సీమను విడిచి వెళ్లిపోయారు. శోభా నాగిరెడ్డి అంటే..చిరునవ్వుకు, సమర్ధతకు, పట్టుదలకు, విశ్వసనీయతకు మారుపేరు. సహజ సిద్ధమైన శాంత స్వభావంతో కూడిన సీమ అంత ః సౌందర్యం శోభా నాగిరెడ్డిని చూసినప్పుడు తలపునకు వచ్చేది. ఫ్యాక్షన్ నేపథ్యమున్న కర్నూలు జిల్లాలో, అతి సున్నితమైన ఆళ్లగడ్డ, డోన్, పత్తికొండ, కర్నూలు ప్రాంతాలలో పుట్టినింటికీ, మెట్టినింటికీ వన్నె తేవడం శోభా నాగిరెడ్డిలో గమనించగలం. సీమలో ఫ్యాక్షనిజం తప్ప ఇంకేమీ లేదనీ, సీమవాసులంటే క్రూరులు, దయాదాక్షిణ్యాలు లేనివారనీ, బాంబు సంసృ్కతి తప్ప వేరొకటి తెలియనివారనీ హత్యలు, ద్వేషాలు మినహా వేరేవీ అక్కడ లేవనే అపోహలూ, భావనలూ శోభా నాగిరెడ్డి వ్యక్తిత్వం ముందు తలొంచాయి. శోభా నాగిరెడ్డి నాయకత్వ లక్షణాలు గమనించిన వారికి అవన్నీ ఎంత దారుణమైన కల్పనలో అవగతమవుతుంది. రాయలసీమ నాయకులలో ఇంత చక్కటి వాగ్ధాటి, సరళమైన వ్యక్తీకరణ, తెలుగుదనం, కృష్ణమ్మ పరవళ్ల లాగా, గోదావరి గలగల లాగా, కోనసీమ పచ్చదనం లాగా శోభాయమనంగా కన్పించే అరుదైన వ్యక్తిత్వం శోభానాగిరెడ్డిది. ఆమె పెద్ద చదువులు చదవలేదు. కానీ సామాన్యంగా కన్పిస్తూ వైవిధ్య, వైరుధ్య వ్యక్తిత్వం గల భిన్నమైన రాజకీయ వ్యవస్థల మధ్య తనకు నచ్చిన పార్టీకి మాత్రమే సన్నిహితంగా కొనసాగుతూనే పార్టీలకు, వర్గాలకూ అతీతంగా అందరి మన్నన పొందిన అరుదైన నేత ఆమె. పార్టీ ఏదైనా -తెలుగుదేశం, ప్రజారాజ్యం, వైఎస్సార్సీపీ- నాయకత్వం అప్పచెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నేరవేర్చిన నేర్పరి శోభ. ఆర్టీసీ ఛైర్మన్‌గా పనిచేసి కడు సమర్థవంతంగా నెగ్గుకొచ్చారు. తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల తరఫున శాసనసభ్యురాలిగా పనిచేసి, చివరిగా వైఎస్సార్సీపీలో తన ప్రయాణం సాగిస్తూ, కర్తవ్య నిర్వహణలోనే కన్నుమూశారు. వైఎస్ మరణానంతరం ప్రజారాజ్యం పార్టీని వీడి జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరి, క్రమశిక్షణ కలిగిన నేతగా వ్యవహరించారు. పార్టీలో ముఖ్యనేతగా ఎదిగి శాసన సభ్యుత్వం వదులుకుని, తిరిగి గెలిచి జగన్ కుటుంబం ఆదరణకు నోచుకున్నారు. వైఎస్ కుటుంబాన్ని అభిమానించే ప్రతి కుటుంబం ఓ అక్కను, ఓ ఆడపడుచునుపొగొట్టుకున్నామన్నట్టు బాధపడడం కనిపిస్తున్నది. ఒక రాజకీయ నేత మరణం ఇంతగా కదిలించడం అరు దు. ఏ పార్టీకి చెందినవారైనా ఆమె మరణం పట్ల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో మహిళల ప్రాతినిద్యం రాజకీయాల్లో పెరుగుతున్నది. ఇది ఆహ్వానిం చదగిన పరిణామం. రాజకీయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరగాలి. అలాగే రాజకీయ వ్యవస్థలోకి వచ్చిన మహిళలు శక్తిసామర్థ్యల్లో పురుషులకు తీసిపోమని కూడా నిరూపించుకోవాలి. ప్రస్తుత పురుషాధిక్య సమాజంలో అధికార రాజకీయాల్లో మహిళలు వ్యక్తిత్వం నిలుపుకోవడం అంత సులభం కాదు. ఇలాంటి గహనమైన సమస్యను శోభానాగిరెడ్డి ఎలా అధిగమించారో నేడు రాజకీయాలలోకి వస్తున్న మహిళలందరూ గమనించాలి. నిజానికి ఆమె సేవలు నేడు రాష్ట్రానికి ఎంతో అవసరం. ప్రత్యేకంగా రాయసీమలో, విభజన నేపథ్యంలో సమర్థులైన నేతల అవసరం ఎంతో ఉందన్న మాట కాదనలేనిది. కానీ శోభానాగిరెడ్డి అలాంటి సేవలు అందించకుండానే చిన్నతనంలోనే సీమవాసులను విడిచి వెళ్లిపోయారు. శోభానాగిరెడ్డి శక్తియుక్తులు ఎన్నో సందర్భాలలో రుజువైనాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత 3 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనడంలో అగ్రభాగాన నిలిచి వైఎస్ కుటుంబాన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనీ, జగన్మోహన్రెడ్డినీ సమర్థించి నిలిచిన నేత శోభానాగిరెడ్డి. ఇవాళ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు శరవేగంతో మారిపోతున్నాయి. ప్రజలు జగన్‌రెడ్డికీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హారతి పడుతున్నారు. దీనిని చూడలేని ప్రత్యర్థులు కూడా హద్దు మీరుతున్నారు. కానీ, ఈ విపరిణామాలను ఎదిరించి నిలిచేందుకు సన్నద్ధమైన ఒక యోధురాలు నిన్న ప్రమాదంలో మరణించింది. అదే విషాదం. ఏ ఆశయం కోసమైయితే శోభానాగిరెడ్డి చివరి నిమిషం వరకు పోరాడారో ఆ పోరాటం మనందరికీ స్పూర్తి కావాలి. వైఎయస్సార్సీపీ అధికారంలోకి రావాలని ఆమె కలగన్నారు. అది నెరవేరాలి. ఆ కలను సార్థకం చేయడమే శోభానాగిరెడ్డికి అర్పించే నిజమైన నివాళి. ఇమామ్ (వ్యాసకర్త ‘కదలిక’ ఎడిటర్) -
చిరునవ్వు ఆమెకో వరం
శోభా నాగిరెడ్డి నా కోడలు. శోభా నాగి రెడ్డితో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు. శోభ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. నేను 1983లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సమ యంలో శోభ తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి కర్నూలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్. ఆయనే ‘మీ అత్త’ అంటూ నన్ను శోభకు పరి చయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నేను ఎక్కడ కనిపించినా అత్తయ్యా బాగున్నారా అని ఆత్మీయంగా పలకరించేది. నా భర్త గురించి అడిగేది. సుబ్బారెడ్డి 1989లో కాం గ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అపుడు నేను కూడా ఎమ్మెల్యేనే. శోభ భర్త భూమా నాగిరెడ్డి, బావ వీర శేఖరరెడ్డి కూడా నాతో పాటు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. దీంతో శోభతో సాన్నిహిత్యం మరింత పెరి గింది. ఆ తరువాత నేను టీడీపీలో చేరాను. అప్పటి నుంచి మరింత సన్నిహితంగా మెలిగే వాళ్లం. శోభ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. నేను తెలు గుమహిళ అధ్యక్షురాలిగా పనిచేశాను. ఈ సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చేపట్టాల్సిన ఆందోళన కార్యక్ర మాలు, ప్రభుత్వ పరంగా మహిళల సంక్షే మం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చిం చుకునే వాళ్లం. శోభా నాగిరెడ్డి అక్క కుమార్తె, ప్రస్తుతం గుంటూరు జిల్లా వినుకొండ అసెం బ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా కుమార్తె నన్నపనేని సుధ బెంగళూరు వైద్య కళాశాలలో సహధ్యాయులు. ఈ విధంగా కూడా మా మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. నేను నిర్వహించే ప్రతి ఎగ్జిబిషన్‌కు శోభ హాజర య్యేది. రాజకీయాల్లోకి మహి ళలు రావటం తక్కువ. వచ్చినా రాణించిన వారు ఇంకా తక్కువ. ఇక రాయలసీమలో మహిళలు రాజకీయాల్లో రాణించటమంటే కత్తిమీద సామే. అలాంటిది శోభ బాగా రాణించింది. ఆమెది కష్టపడే తత్వం. మంచి వక్తగా పేరు తెచ్చుకుంది. ఎపుడూ నవ్వుతూ, సంప్రదాయబద్ధంగా కనపడేది. చిరునవ్వే శోభకు వరం. స్నేహానికి ప్రాణమిచ్చేది. శోభ మరణం బాధాకరం. (వ్యాసకర్త ఎమ్మెల్సీ) -
గెలుపు మాదే!
తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా ఈ ఎన్నికల్లో అంతిమ విజయం మాదే.... ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు. ఆయన మూడు దశాబ్దాలు ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తారు.... ఇవి ఆళ్లగడ్డ ైవె ఎస్సార్సీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి మరణానికి ముందు ‘సాక్షి’ టీవీ చానల్‌తో చెప్పిన మాటలు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడానికి కొంచెం ముందు ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ప్రచారం ఏ విధంగా సాగుతోంది? ప్రజలు జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం వైఎస్సార్సీపీ వెంటే ఉంది. పార్టీ కార్యకర్తలు, అభ్యర్థుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. అదే వాతావరణం ఆళ్లగడ్డలోనూ ఉంది. అంతా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. జగన్ చెబుతున్న సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. గతంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు భారీ మెజారిటీ వచ్చింది. రెండోసారీ వైఎస్సార్సీపీ తరఫున మీరు పోటీకి దిగుతున్నారు. ఎండనక, వాననక ప్రచారంలో ఉన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యల్ని మీకు చెబుతున్నారు? 2009లో ఎన్నికలైన కొన్నాళ్లకే వైఎస్ మృతి చెందారు. దీంతో రాష్ట్ర పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా పరిస్థితి తయారయ్యింది. ఆయన ఉన్నప్పుడు ప్రజలు దేనికీ ఇబ్బంది పడలేదు. పింఛన్లు, రేషన్‌కార్డుల సమస్యలుండేవి కాదు. అదో నిరంతర ప్రక్రియలా కార్డులు జారీ చేసేవారు. ఈ నాలుగేళ్లలో అభివృద్ధి ఆగిపోయింది. పక్కా ఇళ్లు, పింఛన్లు ప్రజలకు అందడం లేదు. కరెంట్ చార్జీలు, కోతలు పెరిగిపోయాయి. పంటలకు ధర రావడం లేదు. పేదల సమస్యలు మరింత పెరిగిపోయాయి. ఇక గ్రామాల్లో ఇబ్బందుల గురించి చెప్పాలంటే ఎంత సమయమైనా చాలదు. ఏ గ్రామానికి వెళ్లినా వారు ఇదే విషయాన్ని చెబుతున్నారు. మేం ఒకటే చెప్పదలచుకున్నాం. నెల రోజులు ఓపిక పట్టండి అని. జగన్ సీఎం అవుతారు. ఐదు సంతకాలతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. ఆ సమస్యలన్నీ పరిష్కారం కాగలిగినవే. ప్రజలకు న్యాయం జరుగుతుంది. మేం వివరిస్తున్న విషయం అదే. ప్రజా ప్రతినిధిగా ఉన్నారు, అయినా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు. అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎందుకు? వైఎస్సార్సీపీకి మద్దతిస్తున్నందుకా? పథకాలు అందకుండా చేస్తున్నారా? అసలే ం జరుగుతోంది? వైఎస్. రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత జగన్‌తోనూ, ఆయన కుటుంబసభ్యులతోనూ మేం కలిసి ఉన్నాం. ఆ కుటుంబంతో కలిసి ఉన్న ప్రతి సిటింగ్ ఎమ్మెల్యేకీ ఏ పనీ జరగకుండా చూస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆళ్లగడ్డకు వచ్చి చెప్పారు. ప్రజలు శోభానాగిరెడ్డికి ఓటేస్తే ఆళ్లగడ్డలో ఏ పనీ జరగదు అని.. ఒక సీఎం స్థాయి వ్యక్తి కక్ష కట్టి మా మీద పడితే ఏం చేస్తాం? మేం ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు దీనిని శత్రువుల నియోజకవర్గంలా చూస్తున్నారు. ప్రభుత్వం మామీద కక్ష కట్టడం వల్లనే ఏమీ చేయలేకపోతున్నామని, ఈ పరిస్థితి ఎంతో కాలం సాగదనీ ప్రజలకు వివరిస్తున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. గతంలో నా నియోజకవర్గ ప్రజలు నాకు 37 వేల మెజారిటీ ఇచ్చి గెలిపించారు. సాక్షాత్తూ కిరణ్‌కుమార్ చెప్పినా వినలేదు. అభివృద్ధి కోరుకున్నారు. తమ ఎమ్మెల్యే జగన్మోహన్రెడ్డితో కలిసి నడిస్తే అదే చాలంటున్నారు. అదే మెసేజ్‌ను ఓటు ద్వారా ఇచ్చారు. మేం జగన్ కుటుంబంతో ఉన్నామంటే మా ప్రజలు కూడా దానికి కట్టుబడి ఉన్నట్టే. మీరో సీనియర్ పొలిటీషియన్. చాలా ఎన్నికలు చూశారు. వాటిని 2014 ఎన్నికలతో ఏ విధంగా పోలుస్తారు? నేను ఐదోసారి పోటీలో ఉన్నా. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఉప ఎన్నికల్లో చూపిన ఉత్సాహమే ప్రజలు ఇప్పుడూ చూపిస్తున్నారు. పోటా పోటీగా ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు పార్టీల మధ్య ఫైట్ జరుగుతోంది. జగన్‌కు ఓటేయాలన్న ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తోంది. ఇప్పుడూ చూస్తున్నా. ప్రజలు మా వైపే ఉన్నారు. మిమ్మల్ని నిరోధించాలని కాంగ్రెస్, టీడీపీలు చేసే ప్రయత్నాలకు మీరెలా స్పందిస్తున్నారు? ఆ అంశం మీ ప్రచారంలో ఎలా ఉపయోగపడుతోంది? అది వాస్తవమే. నాపై పోటీ చేసే అభ్యర్థులతో ఆ రెండు పార్టీల వాళ్లు కాంప్రమైజ్ అవుతున్నారు. అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరుగుతోంది. వ్యక్తులు కలిస్తే ఏ మవుతుంది? ప్రజలు తమ అభిప్రాయాల్ని మార్చుకోలేరు. వాళ్లు డిసైడ్ అయిపోయారు. జగన్ సీఎం అవుతారని నమ్మకం ఉంది. బీజేపీ-టీడీపీ పొత్తును ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మోడీని తిట్టిన చంద్రబాబు.. హైదరాబాద్‌లో ఆయన్ను అడుగుపెట్టనీయబోమని ప్రకటించిన బాబును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం, మైనార్టీలకు బాబు క్షమాపణలు చెప్పారు. ఇవన్నీ తెలిసినా మళ్లీ యూ టర్న్ తీసుకుని వాళ్లతోనే జత కట్టారు. ప్రజల్ని బాబు కాంప్రమైజ్ చేయలేరు. ఇన్ని కుయుక్తుల మధ్య మీరు ఎలా ఎన్నికల్లోకి వెళ్తున్నారు. మీ హామీలేంటి? జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేను ఒకటే అడుగుతా. పులివెందులలా ఆళ్లగడ్డనూ అభివృద్ధి చేయమని. అంతకుమించి నేను ఏదీ కోరను. ప్రజలకూ అదే చెబుతాను. మనం ఇన్నాళ్లూ జగన్‌కు అండగా ఉన్నాం కాబట్టి, జగన్ కూడా మనకు అండగా ఉంటారని చెబుతున్నా. ఐదేళ్లుగా ఆళ్లగడ్డ అభివృద్ధిలో వెనకబడిపోయింది. ఆ ఐదేళ్ల అభివృద్ధినీ ఒక్క సంవత్సరంలోనే చేసి చూపిస్తా. ప్రజల సమస్యలకు మీ వద్ద ఎలాంటి పరిష్కారం ఉంది? రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, సిమెంట్ రోడ్లు.. ఇలా అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాం. ఐదు సంతకాలతో జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. నిధులు తెచ్చుకుంటే చాలు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థా మెరుగుపడుతుంది. వైఎస్సార్సీపీ పట్ల ప్రజల ఆదరణ ఎలా ఉంది? ఉప ఎన్నికల్లాగానే ప్రజలు డిసైడయిపోయారు. వైఎస్సార్ కొడుకుగా జగన్ అన్నీ చేస్తారు. సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తారు. అందుకే మనం కృతజ్ఞతలు చూపించాలి. ఒకసారి అవకాశం ఇస్తే జగన్.. ఇక మరెవ్వరికీ అవకాశం ఇవ్వరు. 30 యేళ్లపాటు జగన్ నిరాటంకంగా రాష్ట్రాన్ని పాలిస్తారు. -
రేపు జిల్లాకు జననేత
ఒక రోజు ఆలస్యంగా రానున్న జగన్ కోదాడ, హుజూర్‌నగర్‌లలో సభలు సాక్షిప్రతినిధి, నల్లగొండ, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన ఒకరోజు వాయిదా పడింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం ఒక ప్రకటన విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి ఆయా స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల పక్షాన ప్రచారం చేయడానికి జగన్మోహన్రెడ్డి 25న కోదాడ, హుజూర్‌నగర్‌లో జరిగే బహిరంగసభల్లో పాల్గొనాలని నిర్ణయించారు. అయితే, వైఎస్సార్ సీపీలో కీలకనేత, అసెంబ్లీ డిప్యూటీ లీడర్ అయిన శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు వెళుతున్నారు. దీంతో జిల్లాలో పర్యటన ఒకరోజు వాయిదా పడింది. ముందుగా అనుకున్న ప్రకారం 25వ తేదీన కాకుండా 26వ తేదీన ఆయన కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొనను న్నారు. 26వ తేదీన కోదాడ, హుజూర్నగర్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో జరిగే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
శోభానాగిరెడ్డి మృతికి సంతాపం
సాక్షి, ముంబై: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి మృతిపై నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆ పార్టీ నేతలు, తెలుగు ప్రజలు దిగ్బ్రాంతికి గురయ్యారు. శోభానాగిరెడ్డి ఇకలేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె కుటుంబానికి సంతాపం ప్రకటించారు. నంద్యాలలో ప్రచారం ముగించుకొని ఆళ్లగడ్డకు వెళుతున్న మార్గమధ్యంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 11.05 గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందారు. తీరని లోటు: మాదిరెడ్డి కొండారెడ్డి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి శోభానాగిరెడ్డి మరణం వైఎస్సార్ సీపీకి తీరని లోటని ముంబైకి చెందిన ఆ పార్టీ నాయకుడు మాదిరెడ్డి కొండారెడ్డి తెలిపారు. చివరివరకు పార్టీ కోసం కృషిచేసిన ఆమె ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. కర్నూలు జిల్లాలో బలమైన నేతగా ఎదిగిన శోభానాగిరెడ్డి ప్రజా సమస్యలపై చురుగ్గా స్పందించేదన్నారు. మహిళల సమస్యలపై పోరాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకోగలిగిందని తెలిపారు. ఆమె ఆళ్లగడ్డ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు.ప్రజావ్యతిరేక విధానాలపై అధికారపక్షాల తీరును ఎండగడుతూ రాజకీయాల్లో ఎదుగుతున్న ప్రముఖ మహిళ నేతల్లో ఒకరిగా ఆమె గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. భౌతికంగా ఆమె అందరికి దూరమైనా, భవిష్యత్ రాజకీయాలకు ఆమె అందరికి స్ఫూర్తిగా నిలుస్తారని కొండారెడ్డి అభిప్రాయపడ్డారు. పుణేలో... పుణే, న్యూస్‌లైన్: భూమా శోభానాగిరెడ్డికి పుణేలోని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. పెద్ద ఎత్తున కర్నూల్ జిల్లాతోపాటు ఇతర జిల్లా ప్రజలు నివసించే ఆదర్శ్‌నగర్‌లో గురువారం సాయంత్రం సంతాప కార్యక్రమం ఏర్పాటుచేశారు. మొదట ఆమె చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సేవలను కొనియాడారు. కర్నూలు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో శోభా నాగిరెడ్డి బలమైన మహిళ నేతగా ఎదిగారన్నారు. నాలుగుసార్లు శాసనసభకు ఎంపికైన ఆమె మరణం కర్నూల్ జిల్లా రాజకీయాలకేకాకుండా రాష్ట్ర రాజకీయాలకే తీరని లోటుగా అభివర్ణించారు. కార్యక్రమంలో రమారెడ్డి, వెంగల్ రెడ్డి, పుల్లయ్య, పంపాపతి, బోయబజారి, చరన్ రాజ్, బాగ్యమ్మ, అనురాధ, లక్ష్మిదేవి, నాగసుబ్బమ్మ పాల్గొన్నారు. -
శోభమ్మ డైరీలో చివరి పేజీ
-
ఆళ్లగడ్డకు చేరుకున్న శోభ పార్దీవదేహం
-
నంద్యాలలో సందర్శనార్ధం శోభ పార్దీవదేహం
-
ఆళ్లగడ్డ ఎన్నికపై రేపు స్పష్టత
హైదరాబాద్: ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డి మరణించిన విషయాన్ని కేంద్ర ఎన్నికల దృష్టికి తీసుకెళ్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఆళ్లగడ్డలో ఎన్నికలు నిర్వహించే విషయంలో ఈసీని స్పష్టత కోరుతున్నామని చెప్పారు. బ్యాలెట్ పేపర్‌ను మార్చడమా లేదా పోలింగ్‌ను వాయిదా వేసి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలా అనే దానిపై స్పష్టం చేయాలని కోరనున్నామని తెలిపారు. రేపటిలోగా ఆళ్లగడ్డ ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చే అవకాశముందని భన్వర్‌లాల్ అన్నారు. ఈ- సేవ, మీ సేవా కేంద్రాల్లో ఓటర్‌కార్డులు తక్షణం జారీ చేయాలని భన్వర్‌లాల్ ఆదేశించారు. ఏ కారణంతోనూ ఓటర్‌కార్డు జారీలో జాప్యం జరగకూడదన్నారు. ఓటర్ కార్డు జారీ కోసం పది రూపాయలు మాత్రమే తీసుకోవాలని సూచించారు. ఓటర్ కార్డు జారీలో ఆలస్యం జరిగినా, ఎక్కువ డబ్బులు తీసుకున్నా ఆయా సెంటర్లపై తక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఓటరు చైతన్యానికి ఈవీఎం వాడకంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. -
ఆళ్లగడ్డలో స్వచ్చందంగా బంద్
-
'వేగంగా వెళ్లొద్దని శోభానాగిరెడ్డి పదేపదే చెప్పారు'
కర్నూలు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన భూమా శోభానాగిరెడ్డి గన్మెన్లు శ్రీనివాస్, మహబూబ్‌భాషా, డ్రైవర్ నాగేందర్ కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కారులో ఇరుక్కుపోవడంతో శ్రీనివాస్, మహబూబ్ భాషాలకు గాయాలయ్యాయని, అన్నిరకాల పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న గన్మెన్లు ప్రమాదం జరిగిన తీరును 'సాక్షి'కి వివరించారు. గత రాత్రి 11:20 గంటలకు ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదం వెంటనే హెడ్‌క్వార్టర్స్‌కు సమాచారం అందించామన్నారు. శోభానాగిరెడ్డి భర్త భూమా నాగిరెడ్డికి కూడా ఫోన్ చేసి సమాచారం ఇచ్చామన్నారు. రాత్రి 10:50 ప్రాంతంలో నంద్యాలలో బయల్దేరినట్టు చెప్పారు. మితిమీరిన వేగంవల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. వేగంగా వెళ్లొద్దని డ్రైవర్‌కు శోభానాగిరెడ్డి పదేపదే చెప్పారని వెల్లడించారు. రోడ్డుపై వరికుప్ప ఉండడంతో డ్రైవర్ పక్కకు తప్పించే ప్రయత్నం చేశాడని, ఈ క్రమంలో వాహనాన్ని నియంత్రించలేకపోయాడని వివరించారు. దీంతో కారు అదుపు తప్పి వరి పొలాల్లోకి నాలుగు పల్టీలు కొట్టిందని తెలిపారు. మొదటి పల్టీకే శోభానాగిరెడ్డి కారులోంచి దూరంగా పడిపోయారని, మాత్రం వాహనంలోనే చిక్కుకుపోయామని వివరించారు. వెనుక వస్తున్న ఎస్కార్ట్... శోభానాగిరెడ్డిని ఆస్పత్రికి తీసుకెళ్లారన్నారు. రెగ్యులర్ డ్రైవర్‌కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో నిన్న తాత్కాలిక డ్రైవర్ వచ్చారని శ్రీనివాస్, మహబూబ్‌భాషా తెలిపారు. -
భూమా శోభానాగిరెడ్డి నేత్రదానం
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన వైఎస్సార్ సీసీ నాయకులు భూమా శోభానాగిరెడ్డి కళ్లను దానం చేశారు. శోభానాగిరెడ్డి కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆమె కళ్లను దానం చేశారు. శోభానాగిరెడ్డి పార్థీవదేహం నుంచి నయనాలను సేకరించి వైద్యులు భద్రపరిచారు. శోభానాగిరెడ్డి కళ్లతో ఇద్దరికి వెలుగు ప్రసాదించనున్నారు. శోభానాగిరెడ్డి మరణించినా తన కళ్లను దానం చేసి చీకటి జీవితాల్లో వెలుగు నింపారు. శోభానాగిరెడ్డి కళ్లు దానం చేయడాన్ని సామాజికవేత్తలు, వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశంసించారు. నేత్రదానం చేసి శోభానాగిరెడ్డి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శోభానాగిరెడ్డి సంతాపసభ నిర్వహించారు. శోభానాగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ఆర్ సీపీ నేతలు, అభిమానులు నివాళి అర్పించారు. శోభానాగిరెడ్డి హఠాన్మరణం పట్ల రాష్ట్ర వాప్తంగా ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. -
ఆటగదరా శివా...
-
ఆఖరి క్షణం వరకూ జనం కోసం... జనం నడుమ
-
శోభానాగిరెడ్డి మృతిపై వైసీపీ నేతల దిగ్భ్రాంతి
-
చివరి శ్వాస వరకు ప్రజల కోసమే...
రాష్ట్ర రాజకీయాల్లో తనదైన సేవా మార్గంతో ప్రజలను ఆకట్టుకున్న శోభానాగిరెడ్డి చివరి శ్వాస వరకు ప్రజాసేవకే అంకితమయ్యారు. కర్నూలు జిల్లా రాజకీయాలతో, ప్రజలతో శోభనాగిరెడ్డికి ఎనలేని అనుబంధం ఉంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా షర్మిలతో కలిసి బుధవారం అర్ధరాత్రి వరకు శోభానాగిరెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి 1996 లో అడుగుపెట్టిన శోభానాగిరెడ్డి ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున 1997లో ఆళ్లగడ్డకు జరిగిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో మరోదఫా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆతర్వాత చోటు చేసుకున్న పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ వీడి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున రాయలసీమలో గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కావడం విశేషం. పార్టీ, చిరంజీవి ప్రభావం వల్ల కాకుండా, వ్యక్తిగత పరపతి కారణంగానే ఎన్నికల్లో విజయం సాధించారు. వేదిక ఏదైనా కాని.. రైతుల సమస్యలు, విద్యార్ధుల స్కాలర్ షిప్, ప్రజా ఆరోగ్యం, ఇంకా ఏ అంశమైనా శోభానాగిరెడ్డి ముందుడి తన గళాన్ని వినిపించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాసటగా నిలిచారు. వైఎస్ జగన్ ఆలోచన విధానాన్ని, పార్టీ మార్గదర్శకాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ శోభానాగిరెడ్డి కృషి ఎనలేనిది. ప్రజా వ్యతిరేక విధానాలపై, ప్రతిపక్ష పార్టీల వ్యవహారతీరును, అధికార పక్ష విధానాలను ఎండకట్టడంలో తనదైన దూకుడును ఆమె ప్రదర్శించారు. రాజకీయం అనూహ్యం ఎదుగుతున్న మహిళానేతగా పేరు తెచ్చకుంటున్న తరుణంలో అతి చిన్న వయస్సులో ప్రజలకు, పార్టీకి, కుటుంబానికి భౌతికంగా దూరమయ్యారు. అయితే ఆమె గళం మూగపోవచ్చు.. వినిపించకపోవచ్చుకాని.. భవిష్యత్ రాజకీయాలకు శోభానాగిరెడ్డి స్పూర్తిగా నిలుస్తుందనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఆళ్లగడ్డకు బయలుదేరిన శోభానాగిరెడ్డి దురదృస్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన శోభానాగిరెడ్డిని కేర్ ఆస్పత్రికి తరలించగా.. గురువారం ఉదయం 11.05 మరణించారు. -
శోభానాగిరెడ్డి మృతి విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తాం
హైదరాబాద్: వైఎస్సార్ సీసీ నాయకులు భూమా శోభానాగిరెడ్డి మృతి విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు ప్రధానమైన పార్టీ నుండి పోటీలో ఉన్న విషయాన్ని ఈసీకి నివేదిస్తామన్నారు. ఎన్నిక నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయానికి అనుగుణంగా తాము ముందుకు వెళ్తామని భన్వర్‌లాల్ చెప్పారు. భూమా శోభానాగిరెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. అయితే రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో ఆళ్లగడ్డ ఎన్నికపై ఈసీ నిర్ణయం తీసుకోనుంది. -
శోభానాగిరెడ్డి మరణంపై నాయకుల దిగ్భ్రాంతి
-
జగన్ ను సీఎంగా చేయాలని ప్రజల్లో పట్టుదల: శోభానాగిరెడ్డి
కర్నూల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత భూమా శోభానాగిరెడ్డి ఆకస్మిక మరణం చెందారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చాగలమర్రులో సాక్షి టెలివిజన్ తో మాట్లాడారు. ప్రజా సమస్యలపై శోభానాగిరెడ్డి స్పందన ఆమె మాటల్లోనే .. 'రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని రాష్ట్ర ప్రజలు ఉన్నారన్నారు. ప్రజల్లో ఉత్సాహం ఉంది. ప్రజల్లో ఉత్సాహం చూసి పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ఆళ్గగడ్డలోనూ అలాంటి పరిస్థితి ఉంది. రాష్ట్రమంతటా అదే పరిస్థితి నెలకొని ఉంది. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. పేద ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. పెన్షన్లు అందడం లేదని ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదు. చార్జీలు పెంచారు. పంటలకు ధరలు లేవు. ప్రజలకు బతకలేని పరిస్థితి ఉంది. ఇలాంటి సమస్యలను ప్రజలు ఏకరువు పెడుతున్నారు. అయితే నెల ఓపిక పట్టండి. ప్రజా సమస్యలు తీరుతాయి. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సమస్యలు తీరుతాయనే విశ్వాసాన్ని నింపుతున్నాం. వైఎస్ జగన్ ఆరు సంతకాలే సమస్యలన్నింటికి పరిష్కారం చూపుతాయని చెబుతున్నాం. ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత రెండు నెలలకే మహానేత చనిపోయారు. ఆతర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనడవడంతో అధికారంలో ఉన్న ప్రభుత్వం కక్ష కట్టింది. శోభానాగిరెడ్డికి ఓటు వేస్తే అభివృద్ధి ఆగిపోతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించినా ప్రజలు వైఎస్ఆర్ సీపీతోనే ఉన్నారు. ప్రభుత్వం కక్ష కట్టి ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టకుండా చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని శత్రువుగా చూశారు. ప్రభుత్వమే కక్ష కట్టినా ప్రజలు తమ వెంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ వెంట ఉన్నారు' అని శోభానాగిరెడ్డి తెలిపారు. -
స్పృహ కోల్పోయిన భూమా నాగిరెడ్డి
హైదరాబాద: వైఎస్ఆర్ సీపీ నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి హఠాన్మరణం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శోభానాగిరెడ్డి మరణవార్త తెలియగానే ఆమె భర్త భూమా నాగిరెడ్డి కేర్ ఆస్పత్రిలో స్పృహ కోల్పోయారు. వైద్య సిబ్బంది సపర్యలు చేయడంతో ఆయన కోలుకున్నారు. తన భార్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందన్న వాస్తవాన్ని ఆయన జీర్ణించుకోలేకపోక విషాదంలో మునిగిపోయారు. ఇక భూమా దంపతుల ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. తల్లి మృతదేహాన్ని చూసి వారు భోరున విలపించారు. తమ తల్లి మరణాన్ని తట్టుకోలేక శోక సంద్రంలో మునిగిపోయారు. మిగతా కుటుంబ సభ్యులు కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. భూమా శోభానాగిరెడ్డి మరణంతో కర్నూలు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
ఎన్నికల ప్రచారం రద్దు చేసుకున్న జగన్, విజయమ్మ
హైదరాబాద్: తమ పార్టీ నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి హఠాన్మరణంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల నేడు, రేపు తమ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. శోభానాగిరెడ్డి మరణవార్త తెలియగానే వీరు తమ ఎన్నికల కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత వైఎస్ జగన్ హైదరాబాద్‌కు బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ విజయమ్మ అప్పటికప్పడు తన కార్యక్రమాలను రద్దుచేసుకుని హైదరాబాద్ వచ్చారు. కేర్ ఆస్పత్రికి వెళ్లి శోభానాగిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్దాంజలి ఘటించారు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కడప నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రేపు శోభానాగిరెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. -
శోభానాగిరెడ్డి హఠాన్మరణంపై గవర్నర్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి హఠాన్మరణంపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతికి సంతాపం తెలిపారు. శోభానాగిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శోభానాగిరెడ్డి మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శోభానాగిరెడ్డి మరణవార్త విని వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, మాజీ సీఎం కిరణ్, బీజేపీ నేత కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి, నటుడు రాజా హూటాహుటిన కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు. * శోభానాగిరెడ్డి మృతి పట్ల టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సంతాపం తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలి హోదాలో ఎమ్మెల్యేగా నిర్మాణాత్మకంగా వ్యవహరించారని అన్నారు. * మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తణుకు ఎమ్మెల్యే అభ్యర్థి చీర్ల రాధయ్య, గన్నవరం అభ్యర్థి దుట్ట రాంచదర్‌రావు... శోభానాగిరెడ్డి మరణం పట్ల సంతాపం తెలిపారు. * శోభానాగిరెడ్డి మృతికి సంతాపంగా హిందూపురం వైఎస్సార్ సీపీ అభ్యర్థి నవీన్‌నిశ్చల్ ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశారు. * శోభానాగిరెడ్డి మరణ వార్త విని వైఎస్ఆర్సీపీ నేత కొణతాల రామకృష్ణ విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. * శోభానాగిరెడ్డి మృతికి నిజామాబాద్ వైఎస్సార్ సీపీ నేతలు అంతిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సిద్ధార్థరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. * శోభానాగిరెడ్డి మృతి పట్ల రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శోభానాగిరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. * శోభానాగిరెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ అధికార ప్రతినిధి పద్మజా రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. * శోభానాగిరెడ్డి మృతి పట్ల కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ నేతలు కోనేరు ప్రసాద్, పార్థసారధి, కార్యకర్తలు ప్రగాఢ సంతాపం తెలిపారు. * శోభానాగిరెడ్డి మృతి పట్ల విశాఖ వైఎస్సార్ సీపీ శ్రేణులు సంతాపం ప్రకటించాయి. దక్షిణ అభ్యర్థి కోలా గురువులు ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. -
విషాదంలో కర్నూలు జిల్లా వాసులు!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శోభానాగిరెడ్డి మరణవార్తతో కర్నూలు జిల్లా వాసులు విషాదంలో మునిగిపోయారు. సన్నిహితులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చివరి శ్వాస వరకు శోభానాగిరెడ్డి ప్రజల కోసం సేవలందించారు. బుధవారం రాత్రి వరకు కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఉన్నారు. నిన్న షర్మిలతో కలిసి ర్యాలీలో పాల్గోన్న శోభానాగిరెడ్డి లేరనే వార్తను ఆళ్లగడ్డ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 1997 లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి శోభానాగిరెడ్డి ప్రజాసేవకు అంకితమయ్యారు. నిత్యం జనం కోసం తపించే శోభానాగిరెడ్డి భౌతికంగా దూరమయ్యారనే వార్త వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులను శోక సముద్రంలో మునిగిపోయారు. బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి తీవ్రంగా గాయపడటంతో హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం 11.05 గంటకు మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. -
'పవన్ కళ్యాణ్, మోడీలను చంద్రబాబు వాడుకుంటున్నాడు'
కర్నూలు: పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీవే అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శోభానాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్నూల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై శోభానాగిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో టీడీపీ, బీజేపీ పొత్తు చరిత్రాత్మక తప్పు అన్న చంద్రబాబు..ప్రస్తుత పొత్తుపై మైనారిటీలకు ఏం సమాధానం చెప్తారని శోభానాగిరెడ్డి నిలదీశారు. ఎన్నికల్లో పొత్తు కోసం చంద్రబాబు బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారని ఆమె విమర్శించారు. చంద్రబాబు ఓ పరాన్నజీవి అని వ్యాఖ్యలు చేశారు. ఎలాగైనా గెలువాలని చంద్రబాబు కేఏ పాల్, పవన్ కళ్యాణ్, మోడీలను వాడుకుంటున్నారని శోభానాగిరెడ్డి ఆరోపించారు. ఐనా అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని శోభానాగిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. -
సింగపూర్ కాదు శ్మశానం చేస్తాడు
టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే సీమాంధ్రను సింగపూర్ చేయడం కాదు కానీ శ్మశానంగా మార్చడం ఖాయమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆరేళ్లలోపు పాలన సాగించిన వైఎస్సార్‌ను ప్రజలు ఆయన ఫొటోల్లో చూసుకుంటూ పూజలు చేస్తున్నారని, అలాంటిది తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు ఫొటో కూడా ఏ పేదవాడి ఇంట్లో లేదన్నారు. ఇందుకు ఆయన సాగించిన ప్రజావ్యతిరేక పాలనే నిదర్శనమన్నారు. దొర్నిపాడులో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి అంకాలమ్మ గుడి వరకు నిర్వహించిన రోడ్‌షోకు జనం బ్రహ్మరథం పట్టారు. అంకాలమ్మ సెంటర్లో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి పాటుపడితే చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 1999లో గుజరాత్లో ముస్లింలపై దాడులు జరిగిన సమయంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న చంద్రబాబు అందుకు సంబంధించి రాష్ట్ర ముస్లింలకు క్షమాపణ చెప్పారని, నరేంద్రమోడీని రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వబోనని ప్రకటించారన్నారు. అయితే అందుకు విరుద్ధంగా ప్రస్తుతం అదే పార్టీతో పొత్తుకు కాళ్లబేరానికి వెళ్తున్నాడన్నారు. కేసీసీకి నీరు రాజశేఖరెడ్డి చలవే : కేసీ కాల్వకు సమృద్ధిగా నీరు పారుతూ ఇరుగారు పంటలు పండుతున్నాయంటే అందుకు వైఎస్సార్ కృషే కారణమని ఎమ్మెల్యే అన్నారు. పొతిరెడ్డిపాడు విస్తరణ పనులను వైఎస్సార్ చేపట్టడం వల్లే పంటలకు సాగునీటి సమస్య లేకుండా పోయిందన్నారు. వైఎస్సార్ ఆశయాలు సాధిస్తూ ప్రజారంజక పాలన అందించడమే వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని, ఓదార్పు యాత్ర ద్వారా పేదలను ప్రత్యక్షంగా కలుసుకున్న ఆయనకు వారి కష్టాలేంటో తెలుసని, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. వరుసగా జరిగే అన్ని రకాల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చాకరాజువేముల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తులసీరాముడు, మరో 150 మంది వైఎస్సార్సీపీలో చేరారు. ఆయా కార్యక్రమాల్లో డెయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి, నాయకులు రామకృష్ణారెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు భూమా వీరభద్రారెడ్డి, వేమయ్య తదితరులు పాల్గొన్నారు. -
డ్వాక్రా రుణాలు చెల్లించొద్దు
ఆళ్లగడ్డటౌన్, న్యూస్‌లైన్ : పొదుపు సంఘాల సభ్యులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించవద్దని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని శారదా నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా టీడీపీ చాగలమర్రి మండల ఉపాధ్యక్షుడు మహబూబ్‌బాషా, కాంగ్రెస్, టీడీపీకి చెందిన దుర్వేష్ అహమ్మద్, సుభాన్, ఖాదర్‌బాషా, అబ్దు ల్లా, మహమ్మద్‌హుస్సేన్, నాయబ్, తాజుద్దీన్, ఓబులంపల్లె మహబూబ్‌బాషా, మరో 200 మంది ముస్లింలు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరా రు. పార్టీ మండల కన్వీనర్ అన్షర్‌బాషా, నిజాముద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శోభానాగిరెడ్డి మాట్లాడా రు. మహిళలకు తోడ్పాటు ఇవ్వాలనే ఉద్దేశంతోనే రుణాలను రద్దు చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. అధికారంలోకి వస్తే సుమా రు రూ.17 వేల కోట్ల రుణాలను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మళ్లీ వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తామని హామీనిచ్చారు. దీంతో రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. పార్టీలో చేరిన ముస్లింలు మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో 4శా తం రిజర్వేషన్లు అమలు చేయడంతో లబ్ధిపొందామని, ఆయన కుమారుడిని సీఎం చేయాలనే పార్టీలో చేరామన్నారు. కార్యక్రమంలో నాయకులు టి.ఎన్.పుల్లయ్య, ఖాదర్‌బాషా, ఖాజారసూల్ ఉన్నారు. పార్టీలో చేరిన బాచేపల్లె టీడీపీ నాయకులు బాచేపల్లెకి చెందిన ఉప సర్పంచ్ నరసింహులు, గొల్ల లక్ష్మీనరసింహులు, పాములేటి, లక్ష్మీనరసయ్య, నాగేంద్ర, బుజ్యయ్య, రెండోఖాశీంసా, ఖాజావళి, నాగన్న, టీడీపీ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్పీలో చేరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ బాచ్చాపురం శేఖరరెడ్డి, లక్ష్మీరెడ్డి, గురుస్వామి, రెండోమస్తాన్ ఉన్నారు. విశ్వసనీయతకు కట్టుబడిన నేత జగన్ విశ్వసనీయతకు కట్టుబడి రాష్ర్టం సమైక్యంగా ఉంచేందుకు జగన్మోహన్ రెడ్డి పోరాటం చేశారని ఎమ్మెల్యే శోభానాగి రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జాతీయస్థాయిలో ధర్నాలు, నిరాహార దీక్షలు చేశారని గుర్తు చేశారు. శుక్రవారం రాత్రి మండలంలోని ఓబులంపల్లెలో ఆమె ప్రచారం చేశారు. గ్రామంలో దర్గావద్ద ప్రచార రథంపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించా రు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయు డు.. బీజేపీ అగ్రనాయకుడు మోడీని పొగుడుతూ ముస్లింలను దగా చేస్తున్నారన్నారు. తన సొంత సర్వేలో వైఎస్సార్సీపీకి 140 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని తెలిసి కంగారు పడుతూ.. చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీనాయకులను టీడీపీలో చేర్చుకుంటున్నారన్నారు. -
ఆ పార్టీలను ప్రజలు ఆదరించరు: శోభ
కర్నూలు: వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కి ఓటు వేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నారని ఆ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న చంద్రబాబు కాంగ్రెస్ ఐదేళ్లు అధికారంలో ఉండేందుకు దోహదపడ్డారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు సహకరించిన టీడీపీ, బీజేపీలను ప్రజలు ఆదరించరని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని శోభా నాగిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. -
'సీమాంధ్రలో 145కు పైగా సీట్లు వైఎస్ఆర్ సీపీవే'
కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేకే కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. సీమాంధ్రలో 145 నుంచి 150 స్థానాలను వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో టీడీపీని ఎవరూ నమ్మరని శోభానాగిరెడ్డి అన్నారు. కరెంట్ తీగలపై బట్టలారేసుకోవాలన్న చంద్రబాబు ఇపుడు ఉచిత విద్యుత్ అంటూ తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలను మోసగించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. 9గంటల ఉచిత విద్యుత్ అంటూ చంద్రబాబు చేస్తున్న వాగ్దానాల్ని ఓట్ల కోసమే అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. -
ఈ ఇద్దరి వల్లే రాష్ట్ర విభజన:శోభానాగిరెడ్డి
-
దేశాన్ని కూడా విభజిస్తారా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన రాజకీయ స్వార్థం కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని, ఇదే తీరులో రేపటి రోజున దేశాన్ని కూడా విభజిస్తారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు భూమా శోభానాగిరెడ్డి, మేకతోటి సుచరిత, కె.శ్రీనివాసులు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి, జుట్టు జగన్నాయకులు మాట్లాడారు. విదేశీ వ్యక్తుల ఆధిపత్యానికి పార్లమెంటు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేద్కర్ ఆత్మ ఘోషించేలా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ తీసుకొచ్చిన సోనియాగాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి తరిమికొట్టాలన్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఇంకా ఏమన్నారంటే... దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నన్నాళ్లూ ఢిల్లీ నాయకులు రాష్ట్రంవైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోయారు. ఆయన మరణం తర్వాత అసమర్థ సీఎం, చేతకాని ప్రధాన ప్రతిపక్షం వల్ల రాష్ట్రం ముక్కలయ్యే పరిస్థితి తలెత్తింది. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వంపై మేము అవిశ్వాసం పెట్టినప్పుడు చంద్రబాబు మద్దతిచ్చుంటే ఈరోజు రాష్ట్రాన్ని విభజించే పరిస్థితి వచ్చేదికాదు. రాష్ట్ర విభజనకు కుట్రపన్నిన చంద్రబాబు, కాంగ్రెస్‌తో కుమ్మక్కై అసెంబ్లీ వేదికగా డ్రామా నడిపించారు. సమైక్య తీర్మానం కూడా చేయకుండా అడ్డగించారు. కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లో పనిచేస్తున్న సీఎం కిరణ్‌ను, టీడీపీ అధినేత చంద్రబాబు పల్లెత్తు మాట కూడా అనడంలేదు. కిరణ్ అవినీతిని బాబు ఎందుకు ప్రశ్నించడంలేదు? దొంగతనంగా పెడతారా?: వాసిరెడ్డి పద్మ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని భారీ ఎత్తున ఉద్యమం సాగుతూంటే లెక్క చేయకుండా దొంగతనంగా దొడ్డిదారిన విభజన బిల్లును లోక్‌సభలోకి ఎందుకు తెచ్చారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. గురువారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ బిల్లు వస్తుందో రాదోనన్న సందిగ్ధంలో ఉన్నపుడు చివరి నిమిషంలో అనూహ్యంగా తీసుకురావడాన్ని రాష్ట్ర ప్రజలే కాదు, దేశంలో కూడా ఎవరూ హర్షించరని అన్నారు. ఈ విషయంలో టీడీపీ ద్వంద్వ వైఖరి పూర్తిగా బయట పడిందని ఆమె విమర్శించారు. ఆరు నెలల క్రితం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చెప్పినట్లుగా ఆనాడే ఎమ్మెల్యేలు, మంత్రులంతా రాజీనామాలు చేసి ఢిల్లీలో ధర్నాకు కూర్చుని ఉంటే విభజన వ్యవహారం ఇంత దాకా వచ్చి ఉండేది కాదన్నారు. చలో ఢిల్లీ - సేవ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం రూపొందించిన ‘చలో ఢిల్లీ’, ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పోస్టర్లను పార్టీ సీజీసీ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 17న చేపట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ రెండు పోస్టర్లను రూపొందించినట్లు విద్యార్థి విభాగం నాయకుడు మల్లాది సందీప్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కోశాధికారి కృష్ణమోహన్‌రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల, సీఈసీ సభ్యుడు కె.శివకుమార్ పాల్గొన్నారు. -
మా చిత్తశుద్ధినా టీడీపీ ప్రశ్నించేది ?
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి సమర్థవంతమైన నాయకుడు లేని లోటు నేడు స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్ఆర్ సీపీ స్పీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి వెల్లడించారు. ఆ మహానేత ఉండి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. ఆయన అకాల మరణంతో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారైందన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ...రాష్ట్ర విభజనపై ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ నేతల డ్రామాలు చూసి జాతీయ నేతలు నవ్వుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్‌తో కుమ్మకైన మీరా మమ్మల్నీ ప్రశ్నించేది అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులపై శోభానాగిరెడ్డి నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేత సమైక్యమన్న మాట అనిపించ గలిగే దమ్ము, ధైర్యం ఆ పార్టీ సీమాంధ్ర టీడీపీ నేతలకు ఉందా అని శోభా నాగిరెడ్డి ఈ సందర్భంగా సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచే క్రమంలో తమ పార్టీ చిత్తశుద్ధిని ప్రశ్నించే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని శోభానాగిరెడ్డి స్పష్టం చేశారు. -
మా చిత్తశుద్ధినా టీడీపీ ప్రశ్నించేది ?
-
రాజీనామా.. కిరణ్ కొత్త డ్రామా : శోభానాగిరెడ్డి
* వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి ధ్వజం * ముందే చేసుంటే ఈ పరిస్థితి వచ్చేదా * ఒకవైపు సహకరిస్తూ.. మరోవైపు ధిక్కరిస్తున్నట్లు నాటకాలు * అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాలేదంటూ బాబు మొసలి కన్నీళ్లు * ముందు బాబు కాళ్లు పట్టుకుని విభజన అనుకూల లేఖను వెనక్కు తీసుకోండి * టీడీపీ నేతలకు సలహా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు పక్కా రూట్ మ్యాప్‌తో చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. రెండు వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో రాజీనామా అంటూ కొత్త డ్రామాకు తెరదీశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి దుయ్యబట్టారు. సీడబ్ల్యూసీ సమావేశం మొదలుకొని విభజన బిల్లు అసెంబ్లీకి తీసుకురావడం, ఎలాంటి ఆటంకం లేకుండా చర్చ జరిపించి తిప్పి పంపడంతో పాటు విభజనకు కావాల్సిన సమగ్ర సమాచారాన్ని కేంద్రానికి చేరవేసింది కిరణ్ కాదా? అని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టిద్దామన్నప్పుడు ఆయన కూడా రాజీనామా చేసుంటే విభజన ప్రక్రియ ఇక్కడివరకు రాకపోయేది, తామంతా కూడా అభినందించేవారమని శోభానాగిరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు.. * రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్సార్సీపీ ప్రతీ ఒక్క అవకాశాన్ని వినియోగించుకుంటోంది. రాజీనామాలు చేయడం, రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చాం. నిరాహారదీక్షలు చేయడం, సమైక్యతీర్మానం చేయాలని అసెంబ్లీలో పట్టుబట్టడం సహా ఎన్నో కార్యక్రమాలు చే శాం. పార్టీ అధ్యక్షుడు జగన్ నేతృత్వంలో విజయమ్మతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును కేంద్రానికి పంపొద్దని విన్నవించాం. * రాష్ట్ర విభజనను అడ్డుకోవడం కోసం జాతీయపార్టీల నాయకులను గతంలో కలిసి మద్దతు కూడగట్టిన మా పార్టీ అధ్యక్షుడు జగన్... బిల్లు పార్లమెంటుకు రానున్న నేపథ్యంలో వారిని మరోసారి కలిసి మద్దతు కోరనున్నారు. * పాకిస్థాన్, చైనాలు ఆక్రమణలకు పాల్పడుతున్నా, బాంబు పేలుళ్లు జరిగినా, భారీ తుపాన్లు విరుచుకుపడినా స్పందించని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టడం కోసం మాత్రం ఎందుకంత తొందరపాటు ప్రదర్శిస్తోంది? * తెలుగుదేశం పార్టీ నేతలు ఢిల్లీలో ఎవరెవరివో కాళ్లు పట్టుకునే బదులు చంద్రబాబు కాళ్లు పట్టుకొని విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఉపసంహరింపచేయాలి. కాంగ్రెస్, టీడీపీ నేతలు తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టుపెట్టి, తెలుగువారంటే నవ్వుకునేలా చేస్తున్నారు. * విభజన బిల్లులో లోపాలున్నప్పుడు అసెంబ్లీలో ఎందుకు చర్చించారని, ముందే తిప్పి పంపొచ్చుకదా? అని దిగ్విజయ్‌సింగ్, తెలంగాణ నేతలు అడుగుతున్న ప్రశ్నకు సీఎం కిరణ్, టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి. * తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు బిల్లులో లోపాలున్నాయని కిరణ్ చెప్పేంత వరకు తెలియలేదా? సభలో తనకు మాట్లాడే అవకాశం రాలేదంటూ మళ్లీ మొసలి కన్నీరు కారుస్తున్నారు. * సీఎం కిరణ్ నిజంగా కేంద్రాన్ని వ్యతిరేకించి మౌనదీక్షకు కూర్చుంటే ఆయనతోపాటే పీసీసీ అధ్యక్షుడు ఎందుకు కూర్చుంటారు? * రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ పెట్టే అభ్యర్థుల గెలుపునకు పూర్తిగా సహకరించిన ముఖ్యమంత్రి.. కేంద్రాన్ని ఎదిరిస్తున్నానంటూ ప్రచారం చేసుకుంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. * ఆంధ్రజ్యోతి పత్రిక జగన్‌పై గాలి వార్తల దుష్ర్పచారం చేస్తోంది. పత్రికలు ప్రజల విశ్వాసం చూరగొనాలే తప్ప, కోల్పోయేలా వార్తలు రాయకూడదు. * ఒకవైపు నేతలెవరినీ జగన్ సరిగా పట్టించుకోరని, ఎవరితో మాట్లాడరని, సబ్బంహరిని కూడా పట్టించుకోలేదంటూ వార్తలు రాస్తూ.. మరోవైపు మళ్లీ సబ్బంహరిని జగన్ వేడుకున్నట్లు వార్తలు రాయడం ఆంధ్రజ్యోతికి సిగ్గుచేటు. -
'వెళ్లి బాబు కాళ్లు పట్టుకోండి'
-
'మంత్రుల కాళ్లు కాదు ... బాబు కాళ్లు పట్టుకోండి'
రాష్ట్ర విభజన వద్దని కేంద్ర మంత్రుల కాళ్లు పట్టుకోవడం కాదని, ముందు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్ర విభజనకు అనుకూలమని గతంలో కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడును శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఎవరిని నమ్మించడానికి పార్లమెంట్లో పగటి వేషాలు వేస్తున్నారని టీడీపీ నేతలను ఆమె ప్రశ్నించారు. శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబుకు సహాయం చేయాలనుకేంటే మంచిదే చేయండని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఈ సందర్భంగా హితవు పలికారు. చేతనైతే జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొండి, అంతేకానీ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై మాత్రం దిగజారి వార్తలు రాయడం మంచిది కాదన్నారు. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నీచంగా కథనాలు రాస్తున్నారని శోభా నాగిరెడ్డి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. రాజ్యసభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి వేంకటేశ్వరరావు వ్యాఖ్యాలను మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు శోభానాగిరెడ్డి తెలిపారు. విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా సహకరించారని ఆరోపించారు. అలాంటి ఆయన ఇప్పుడు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఏం సాధించబోతున్నారంటూ సీఎం కిరణ్‌ను ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అపాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతోపాటు పలువురు నేతలు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి, జీవోఎంలో సభ్యుడు జైరాంరమేష్ కాళ్లు పట్టుకుని వేడుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు గతంలో కేంద్రానికి లేఖ ఇచ్చారు. దాంతో పార్టీ అధ్యక్షుడు అనుకూలమని లేఖ ఇచ్చిన బాబు కాళ్లు పట్టుకోకుండా కేంద్ర మంత్రులు కాళ్లు పట్టుకోవడం వల్ల ఏం లాభం ఉంటుందంటూ శోభానాగిరెడ్డి టీడీపీ నేతలను శుక్రవారం బహిరంగంగా ప్రశ్నించారు. -
'టికెట్లు ఇస్తామంటే పార్టీలో చేరేందుకు నేతలు సిద్ధం'
వైఎస్సార్ జిల్లా: పార్టీ టిక్కెట్లు ఇస్తామంటే టీడీపీ ముఖ్య నేతలు, కాంగ్రెస్ మంత్రులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శోభానాగిరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నాయని శోభానాగిరెడ్డి విమర్శించారు. ఇక్కడ పార్టీలో అవకాశం లేనివారే ఇతర పార్టీలవైపు చూస్తున్నారని ఆమె చెప్పారు. విభజనపై అసెంబ్లీలో చర్చ సమయంలో చంద్రబాబు మాట్లాడకపోవడం ఒక డ్రామా అని శోభానాగిరెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా అఫిడవిట్లు ఇచ్చారని ఆమె చెప్పారు. చంద్రబాబు మాత్రం లేఖ గానీ, అఫిడవిట్లు గానీ ఇవ్వలేదని శోభానాగిరెడ్డి విమర్శించారు. -
రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం శోభా నాగిరెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి సమైక్య తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపాలని గతంలోనే స్పీకర్ గవర్నర్ నర్సింహన్, నాదెళ్ల మనోహర్, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలను కోరామని ఆమె గుర్తు చేశారు. బిల్లుపై చర్చకు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉందని, ఈ నేపథ్యంలో తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయం చెప్పలేదన్నారు. టి.బిల్లుపై చర్చను కొనసాగించేందుకు సమావేశాలు పొడిగించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, స్పీకర్‌కు లేఖ రాశామని శోభానాగిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం
-
మా తీర్మానాలన్నీ అడ్మిట్ అయ్యాయి:శోభా నాగిరెడ్డి
హైదరాబాద్: బీఏసీ సమావేశంలో తామిచ్చిన తీర్మానాలన్నీ అడ్మిట్ అయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని స్పీకర్ తెలిపినట్లు ఆమె స్పష్టం చేశారు. రూల్ 77 కింద ఎవరి తీర్మానాన్ని టేకప్ చేసిన తమ పార్టీకి అభ్యంతరం లేదని స్పీకర్ కు తెలిపినట్లు శోభా తెలిపారు. బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీఏసీ రాకుండా రెండు ప్రాంతాల వ్యక్తులను పంపించి రెండు విధానాలను చెప్పించారని శోభా నాగిరెడ్డి మండిపడ్డారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో అంత ఆవేశంగా మాట్లాడిన చంద్రబాబు బీఏసీ ఎందుకు హాజరు కాలేదని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో అన్ని పార్టీలు ఒక్కటై పోరాడుతున్నాయని కాని సీమాంధ్ర పార్టీలు మాత్రం తలోరకంగా వ్యవరించడం సరికాదన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ తప్పకుండా నిర్వహించాలని ఈ రోజు జరిగిన బీఏసీ సమావేశంలో వైఎస్సార్ సీపీ పట్టుబట్టింది. 77,78 నిబంధనల కింద తామిచ్చిన తీర్మానాలను సభలో ప్రవేశపెట్టాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్ సీపీ మరోసారి విజ్ఞప్తి చేసింది. -
'తెలుగు ప్రజలను నిట్టనిలువునా ముంచారు'
హైదరాబాద్ : రూల్ నంబర్ 77, 78 కింద ఇచ్చిన నోటీసుపై వెంటనే నిర్ణయం ప్రకటించాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేసింది. బిల్లును తిరస్కరిస్తూ సమైక్య తీర్మానం చేసి, దానిపై ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్‌ను కోరినట్టు ఆపార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తెలిపారు. ఓటింగ్ విషయంలో కాంగ్రెస్, టీడీపీలు ఇప్పుడు తమ దారిలోకి వచ్చాయని ఆమె అన్నారు. కిరణ్ ముందే ఇదే వైఖరి అనుసరించి ఉంటే బిల్లు ఇంతవరకూ వచ్చేదా అని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. కిరణ్, బాబు ఇద్దరూ... తెలుగు ప్రజలను నిట్టనిలువునా ముంచారని ఆమె మండిపడ్డారు. బిల్లు తిరస్కరణ నోటీసు విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కుమ్మక్కు మరాజకీయాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు, కిరణ్ ఇద్దరూ బీఏసీ సమావేశానికి రావాలని... వారి వైఖరి తెలపాలని శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. -
అసెంబ్లీలో బాబుది శిఖండి పాత్ర: శోభానాగిరెడ్డి
వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు శిఖండి పాత్ర పోషిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. రాష్ర్ట విభజన బిల్లు విషయంలో బాబు అనుసరిస్తున్న వైఖరిపై వారు మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బాలినేని శ్రీనివాసరెడ్డి, కె.శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి, కాటసాని రామిరెడ్డిలతో కలసి శోభానాగిరెడ్డి మాట్లాడారు. ‘‘చంద్రబాబు అసెంబ్లీలో తెలంగాణకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోడియంలోకి పంపిస్తారు. సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం వారి సీట్లలోనే కూర్చుంటారు. బీఏసీ సమావేశానికి బాబు రాకుండా ఇరు ప్రాంత నేతలను పంపి రెండు వాదనలు చేయిస్తారు. సభలో కూడా నోరు మెదపకుండా బాబు శిఖండిలా వ్యవహరిస్తూ, ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. అలాంటి వారికి వైఎస్సార్సీపీని, జగన్‌ను విమర్శించే అర్హత లేదు. సమైక్య తీర్మానం చేయాలని సభా నిబంధన 77 కింద డిసెంబర్ 16న మేము స్పీకర్‌కు నోటీసు ఇస్తే సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు అవహేళన చేశారు. ఇప్పుడు వారు కూడా మా దారిలోకే వచ్చారు. బిల్లులో లోపాలున్నాయని 43 రోజుల తర్వాత సీఎం కిరణ్‌కు తెలిసిందా? చిత్రమేంటంటే బిల్లుపై ఆయనే సంతకం చేసి అసెంబ్లీకి పంపారు. మరో విచిత్రమేంటంటే కిరణ్ చెప్పేం త వరకు బిల్లులో లోపాలున్నాయని బాబుకు కూడా తెలియకపోవడం. కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్టు కిరణ్, బాబు నడుచుకుంటున్నారు’’ అని విమర్శించారు. -
శిఖండి పాత్ర పోషిస్తూ..పైగా మాపై విమర్శలా?
హైదరాబాద్ : సమైక్య తీర్మానం కోసం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎవరి నోటీసును పరిగణనలోకి తీసుకున్నా తాము మద్దతు ఇస్తామని వైఎస్ఆర్సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభా నాగిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ విభజనవాదుల అంటూ తమను విమర్శించిన వారంతా ఇప్పుడు తమ బాటలోకే వచ్చారని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సంతకం అయిన తర్వాతే విభజన బిల్లు సభలోకి వచ్చిందని శోభా నాగిరెడ్డి అన్నారు. బిల్లు తప్పుడు తడక అని అప్పుడు తెలిదా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. కిరణ్ చెప్పేవరకూ చంద్రబాబుకు ఈ సంగతి తెలియాదా అని మండిపడ్డారు. సభలో బిల్లు చర్చకు రావటానికి కిరణ్, చంద్రబాబే కారణమని శోభా నాగిరెడ్డి అన్నారు. టీడీపీ నేతలు సభలో శిఖండి పాత్ర పోషిస్తూ పైగా తమను విమర్శించటం దారుణమని ఆమె ధ్వజమెత్తారు. కిరణ్, చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని శోభా నాగిరెడ్డి అన్నారు. -
శిఖండి పాత్ర పోషిస్తూ..పైగా మాపై విమర్శలా?
-
'బీఏసీలో ఎలాంటి స్పష్టత రాకపోవడం బాధాకరం'
-
బీఏసీలో మంత్రి ఆనం, శోభానాగిరెడ్డి మధ్య వాగ్వాదం
హైదరాబాద్: శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి , వైఎస్ఆర్ సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అసెంబ్లీలో చర్చ కీలకంగా మారిన నేపథ్యంలో బీఏసీ సమావేశానికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు రాలేదని శోభానాగిరెడ్డి ఆనంను ఘాటుగా ప్రశ్నించారు. అయితే మంత్రులుగా తాము హాజరయ్యామని ఆనం బదులిచ్చారు. ప్రాంతాలవారీగా మంత్రులు విడిపోయినప్పుడు బీఏసీలో మీ కాంగ్రెస్ వైఖరి స్పష్టంగా ఉండదని శోభానాగిరెడ్డి విమర్శించారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతానికే పరిమితమైందని ఆనం చెప్పారు. దాంతో శోభానాగిరెడ్డి తమకు పార్టీ ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. అందుకే తాము సమైక్యం అన్న ఒక్కవాణినే చెబుతున్నామని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. కాగా, తమకు పార్టీనే ముఖ్యమని అన్నిప్రాంతాల్లో తమ పార్టీని కాపాడుకోవడమే తమ ఉద్దేశమని ఆనం రాంనారాయణ రెడ్డి చెప్పారు. -
'బీఏసీలో ఎలాంటి స్పష్టత రాకపోవడం బాధాకరం'
హైదరాబాద్: శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో విభజన బిల్లుపై ఎలాంటి స్పష్టత రాకపోవడం బాధకరమని వైఎస్ఆర్ సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి తెలిపారు. ఇంత ముఖ్యమైన సమావేశానికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాకపోవడం చాలా బాధకరమని ఆమె అన్నారు. బీఏసీకి టీడీపీ రెండు ప్రాంతాల ప్రతినిధులను పంపి రెండు వాదనలు చెప్పిందని శోభానాగిరెడ్డి తెలిపారు. టీడీపీకి ఆ పార్టీ విధానంపైనే స్పష్టత లేదని ఆమె విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య తీర్మానంతో పాటు.. విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని కోరినట్టు శోభానాగిరెడ్డి స్పష్టం చేశారు. -
సమైక్యంపై ఆ పార్టీలు ఎందుకు పెదవి విప్పడం లేదు
సమైక్యంపై శాసనసభలో కాంగ్రెస్, టీడీపీలు ఎందుకు పెదవి విప్పడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి ఆ రెండు పార్టీలను ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శోభానాగిరెడ్డి మాట్లాడుతూ... తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించేందుకు ఆ రెండు పార్టీలు ఉన్న సమయాన్ని వృధా చేస్తున్నాయని ఆరోపించారు. కానీ సమైక్యంపై మాట్లాడేందుకు నోరు రావడం లేదంటూ అటు కాంగ్రెస్, ఇటు టీడీపీలకు సమయం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో తమ పార్టీ సభ్యులు చర్చలో పాల్గొంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఒకే మాటకు కట్టుబడి ఉంటుందని శోభానాగిరెడ్డి స్పష్టం చేశారు. -
సమైక్యంపై ఆ పార్టీలు ఎందుకు పెదవి విప్పడం లేదు
-
సీఎం పార్టీ పెడితే టీడీపీకే నష్టం: శోభా నాగిరెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ పెడితే టీడీపీకే నష్టం జరుగుతుందని, తమ పార్టీపై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళదామనుకుంటున్నవారు సీఎం పార్టీ పెడితే ఆగిపోతారని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ సీఎం వెంట వెళ్లరన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీకి ప్రజల్లో ఆదరణ తగ్గుతోందని ఓ పత్రిక, చానల్లో వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. వారు మాబలం ఎంత పడి పోతుందని చెబితే అంత ఎక్కువగా బలం ఉన్నట్లని అన్నారు. ఉప ఎన్నికలు జరిగినపుడు కూడా వైఎస్సార్సీపీ బలం తగ్గిపోయిందని అదే పత్రిక, చానల్ వార్తలు ప్రసారం చేశాయని.. కానీ ఫలితాలు ఎలా వచ్చాయన్నది అందరికీ తెలిసిందేనన్నారు. -
సవరణలు ఎందుకివ్వలేదు?
కిరణ్, చంద్రబాబులపై శోభానాగిరెడ్డి ధ్వజం అసెంబ్లీ వేదికగా కుమ్మక్కయ్యారని విమర్శ బిల్లును వ్యతిరేకిస్తూ తాము సవరణలిచ్చామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మరోసారి కుమ్మక్కై ఆరుకోట్ల మంది సీమాంధ్ర ప్రజలను, సమైక్యవాదులను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉపనేత భూమా శోభానాగిరెడ్డి దుయ్యబట్టారు. విభజన బిల్లును వ్యతిరేకిస్తూ వారిద్దరూ సవరణలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆమె శనివారంనాడిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బిల్లును వ్యతిరేకిస్తూ, 1 నుంచి 108 దాకా ఉన్న క్లాజ్‌లను తిరస్కరిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజయమ్మ నేతృత్వంలో తమ పార్టీ ఎమ్మెల్యేలంతా సవరణలు ప్రతిపాదించినట్టు తెలిపారు. కిరణ్, చంద్రబాబులిద్దరూ బీఏసీ సమావేశానికి రాకుండా ఇరుప్రాంత నేతలను పంపించి డ్రా మాలు చే స్తున్నారని దుయ్యబట్టారు. విభజన బిల్లుపై చర్చలోనూ ఆ రెండు పార్టీలూ కుమ్మక్కై దివంగత రాజశేఖరరెడ్డి, సభలో లేని జగన్మోహన్రెడ్డిపై బురద చల్లుతున్నారని విమర్శించారు. బిల్లు అసెంబ్లీకి ఏవిధంగా వస్తుందో చూస్తానంటూ ప్రగల్భాలు పలికిన కిరణ్ ఇప్పుడు ప్రజలను మోసగిస్తున్నారని తెలిపారు. సమైక్యతీర్మానం చేస్తే పార్లమెంటు, సుప్రీంకోర్టులో ఒక ఆయుధంలా పనిచేస్తుందని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ మాదిరిగానే సభా నిబంధనలైన 77, 78ల కింద సమైక్య తీర్మానం చేయాలని సంతకం చేసిన మంత్రి శైలజానాథ్ శాసనసభా వ్యవహారాలశాఖకు మారేసరికి స్వరం మార్చారని దుయ్యబట్టారు. సీఎం ఉద్దేశమేమిటో చెప్పాలి: బిల్లుపై ఓటింగ్ ఉంటుందని సభా నాయకుడైన సీఎం హామీ ఇస్తే, చర్చకు అంగీకరిస్తామని విజయమ్మ డిమాండ్ చేస్తే దానికి స్పష్టమైన సమాధానమేలేదని శోభానాగిరెడ్డి చెప్పారు. తనకు సొంత ఆలోచనలున్నాయని చెప్పడానికి ఇదేమీ కిరణ్ సొంతింటి వ్యవహారంకాదన్నారు. ఆయన ఉద్దేశమేంటో తక్షణం సభకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. బిల్లును వెనక్కి తిప్పి పంపాలని ఈనెల 8 వ తేదీదాకా డిమాండ్ చేసిన టీడీపీలో రాత్రికి రాత్రి ఏం మార్పొచ్చి చర్చకు అంగీకరించారని ప్రశ్నించారు. బీఏసీ సమావేశానికి డుమ్మా కొడుతున్న చంద్రబాబు అసెంబ్లీలో బొమ్మలా కూర్చుంటూ విభజనకు సహకరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇవ్వని కాంగ్రెస్, టీడీపీ నేతలను ప్రజాసంఘాలు, ఉద్యోగసంఘాలు ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. ఒక్క వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే రాష్ట్రపతికి అఫిడవిట్లు అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్, టీడీపీ నేతలను ఉద్యోగసంఘాల నాయకులు చొక్కా పట్టుకొని నిలదీసుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదా? అని ప్రశ్నించారు. బిల్లును తిరస్కరిస్తూ వారిద్దరూ సవరణలు ఎందుకివ్వలేదో నిలదీయాలని డిమాండ్ చేశారు. ఏపీఎన్జీవోలు ఇచ్చిన బంద్‌కు మద్దతిస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా... సమైక్యం కోసం పోరాటం చేసే ఎవరికైనా మద్దతిస్తామని ఆమె తెలిపారు. -
'చంద్రబాబు... అసెంబ్లీలో బొమ్మలా కూర్చుంటారు'
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులు మరోసారి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత శోభానాగిరెడ్డి మండిపడ్డారు. శనివారం శోభానాగిరెడ్డి హైదరాబాద్‌లో మాట్లాడుతూ... విభజన బిల్లుపై వారిరువురు ఎలాంటి సవరణ ప్రతిపాదనలు ఇవ్వలేదని, కానీ వారివారి పార్టీ ఎమ్మెల్యేలతో ఇప్పించారని ఆమె ఆరోపించారు. ఈ విధంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు దశలవారిగా ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర విభజనపై ఇంత గొడవ జరుగుతున్న చంద్రబాబు మాత్రం అసెంబ్లీలో బొమ్మలాగా కూర్చుంటున్నారని శోభానాగిరెడ్డి ఎద్దేవా చేశారు. రెండు కళ్ల సిద్దాంతాన్ని వదలిపెట్టాలని బాబుకు శోభానాగిరెడ్డి హితవు పలికారు. విభజన బిల్లుపై ఓటింగ్ జరుపుతామని సీఎం కిరణ్ స్పష్టమైన ప్రకటన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనపై కిరణ్, చంద్రబాబులు అనుసరిస్తున్న వైఖరిపై వారి చొక్కాలు పట్టుకుని నిలదీయాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుకు శోభానాగిరెడ్డి సూచించారు. -
విభజన నిర్ణయం నుంచి మోసం చేస్తూనే ఉన్నారు: శోభానాగిరెడ్డి
-
'ఆ ముగ్గురు ముసుగు తొడిగిన సమైక్యవాదులు'
విభజన బిల్లు అంకాన్ని త్వరగా పూర్తి చేసి సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు, స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆరాటపడుతున్నారని శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి ఆరోపించారు. సీమాంధ్ర నేతలైయుండి ఆ ముగ్గురి నేతలకు ఎందుకింత ఆత్రుత అని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం పెట్టే విషయంలో మాత్రం ఆ ముగ్గురు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. వారంతా సమైక్య ముసుగు తొడిగిన సమైక్యవాదని శోభానాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఫ్లోర్ లీడర్లు మాత్రమే బీఏసీకి రావాలనేది తమ డిమాండ్ అని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఏసీలో పార్టీ విధానం చెప్పాలి, కానీ.. వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకుండా స్పీకర్ రూలింగ్ ఇవ్వాలని శోభానాగిరెడ్డి అన్నారు. -
'ఆ ముగ్గురు సమైక్య ముసుగు తొడిగిన సమైక్యవాదులు'
-
ఆయకట్టు రైతులకు అండగా నిలబడతాం: శోభా నాగిరెడ్డి
కర్నూలు: కేసీ కెనాల్, తెలుగుగంగ కాలువ సాగునీటి విడుదలపై అధికారులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శోభా నాగిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సాగునీటి వాటాను సాధించేందుకు ఆయకట్టు రైతులకు తాము అండగా నిలబడతామని ఆమె అన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రితో చర్చించి రైతులకు రబీ సీజన్‌కు సాగునీరు అందేలా చూస్తామని శోభానాగిరెడ్డి హామీ ఇచ్చారు. -
సంక్షేమ పథకాలు ప్రజల దరిచేరాలి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ అందాలని ఆళ్లగడ్డ, పాణ్యం ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఆర్డీఏ-ఐకేపీ, డ్వామా ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం, డీఆర్డీఏ పాలకవర్గం సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ఎంపీ అధ్యక్షత వహించాల్సి ఉంది. ఆయన అందుబాటులో లేకపోతే నంద్యాల ఎంపీ అధ్యక్షతన కార్యక్రమం సాగాలి. అనివార్య కారణాల వల్ల ఇద్దరు ఎంపీలు రాకపోవడంతో సీనియర్ అయిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని కానిచ్చారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి వివిధ అంశాలపై గళం విప్పారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రూపనగుడి, మరివేముల నీటి పథకాలకు ఉయ్యాలవాడ మండలంలోని వివిధ గ్రామాలకు ఉప్పునీరు(రా వాటర్) వస్తున్నాయని, దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్‌తో సమీక్షించినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. ఆ నీటిని తాగడం వల్ల రానున్న రోజుల్లో ప్రజలకు ఏదైనా జరిగితే ఆర్డబ్ల్యూఎస్ అధికారులపైనే కేసులు పెడతానని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి హెచ్చరించారు. తొలుత ఇందిరా ఆవాజ్ యోజన ఇళ్ల నిర్మాణంపై చర్చించారు. జిల్లాకు ఐఏవై కింద 2012-13లో 10,783 ఇళ్లు మంజూరు అయితే అన్ని పూర్తి చేశామని, 2013-14లో 8,611 ఇళ్లు మంజూరైతే 3,724 ఇళ్లు నిర్మించామని హౌసింగ్ పీడీ వివరించారు. డ్వామా పీడీ హరినాథరెడ్డి మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్, ఇందిర జలప్రభ, ఐడబ్ల్యూఎంపీ వాటర్షెడ్లు తదితర వాటిని వివరించారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరిన ఫీల్డ్ అసిస్టెంట్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడానికి ఏడాదిన్నర సమయం అవసరమా అని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ కింద ఏయే నియోజకవర్గంలో ఎన్ని నిధులు ఖర్చు చేశారు, ఏయే పంటలు చేసుకోవచ్చు అనే వివరాలు ఇవ్వాలని కోరారు. గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అన్నారు. పింఛన్లను సర్పంచుతో సంబంధం లేకుండా పంపిణీ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ కన్నబాబు మాట్లాడుతూ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ప్రతి ఆరు నెలలకోసారి జరగాల్సి ఉందని తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఎంపీలు హాజరు కాకపోవడం వల్ల సీనియర్ ఎమ్మెల్యే ాటసాని రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నాయకులు చెప్పిన సమస్యలపై స్పందిస్తామని అన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ నజీర్ సాహెబ్, డ్వామా పీడీ హరినాథరెడ్డి, జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్, హౌసింగ్ పీడీ రామసుబ్బు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కిరణ్ ఎందుకిలా చేస్తున్నారు?
హైదరాబాద్: శాసనమండలిలో సీఎం కిరణ్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష ఉపనేత శోభానాగిరెడ్డి మండిపడ్డారు. విభజన విషయంలో బీహార్, యూపీ సంప్రదాయాలను పాటించాలని చెబుతున్న సీఎం- ఇక్కడెందుకు వాటిని అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అక్కడ విభజన తీర్మానంపై చర్చ జరిగాకే బిల్లు పెట్టారని గుర్తు చేశారు. మరిక్కడ ఎందుకిలా చేస్తున్నారని నిలదీశారు. సీఎంగా మీ బాధ్యతలేంటో మీరు నిర్వహించాలని సూచించారు. సమైక్య ముసుగులో సోనియా గాంధీ ఆదేశాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిద్దామని గతంలో చెప్పిన సీఎం - శాసనసభా వ్యవహారాల కమిటీ(బిఏసి) సమావేశంలో ఎందుకు మౌనంగా ఉన్నారని అంతకుముందు ఆమె ప్రశ్నించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. -
'విభజనకు కిరణ్, బాబు సహకరిస్తున్నారు'
హైదరాబాద్ : సమైక్య తీర్మానానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. బుధవారం ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ సమైక్య ముసుగులో సీఎం, చంద్రబాబు విభజనకు పాల్పడుతున్నారని విమర్శించారు. సమగ్ర సమాచారం లేకుండా బిల్లుపై చర్చ సాధ్యం కాదని శోభా నాగిరెడ్డి స్పష్టం చేశారు. సమైక్య తీర్మానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని ఆమె అన్నారు. ఆదాయం, ఆస్తులు, అప్పుల వివరాలను బిల్లులో తెలియచేయలేదన్నారు. సోనియాగాంధీ ఆదేశాలతో సీఎం కిరణ్ సభను నడిపిస్తున్నారని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. అందుకు ప్రతిపక్షనేత బాబు సహకరిస్తున్నారని అన్నారు. -
'విభజనకు కిరణ్, బాబు సహకరిస్తున్నారు'
-
మొహం చాటేసిన కిరణ్, బాబు: శోభా నాగిరెడ్డి
హైదరాబాద్: విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు చూసుకుందామన్న సీఎం కిరణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని వైఎస్ఆర్ సీఎల్పీ ఉపనేత శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వస్తే కిరణ్, చంద్రబాబు మొహం చాటేశారని విమర్శించారు. వారం రోజులుగా ప్రెస్మీట్లు పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడెక్కడ అని అడిగారు. కిరణ్, చంద్రబాబు కలిసి డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. సోనియా అజెండాను బాబు, కిరణ్ కలిసి అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని పార్టీల నేతలు ఐక్యంగా రావాలని వైఎస్ జగన్ చెప్పారని తెలిపారు. విభజనపై టీడీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. టి.టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌పై అవిశ్వాస నాటకమాడుతున్నారని శోభా నాగిరెడ్డి అన్నారు. -
మొహం చాటేసిన కిరణ్, బాబు: శోభా నాగిరెడ్డి
-
అన్ని పార్టీలూ సహకరించాలి: శోభ
ఉద్యమాన్ని కిరణ్ నీరుగారుస్తున్నారంటూ ధ్వజం సమైక్య తీర్మానం కోసం స్పీకర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ నోటీసిచ్చిందని పార్టీ శాసనసభా పక్ష ఉప నేత భూమా శోభానాగిరెడ్డి తెలిపారు. ప్రైవేట్ బిల్లు కింద ఇచ్చిన ఈ తీర్మానానికి విభజనతో నష్టపోయే ప్రాంతాలకు చెందిన అన్ని పార్టీల సభ్యులూ మద్దతివ్వాలని కోరారు. గురువారం అసెంబ్లీ వాయిదా పడ్డాక పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్య ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారంటూ దుయ్యబట్టారు. వారానికోసారి పత్రికల్లో ప్రకటనలు తప్పితే సమైక్యం కోసం ఆయన ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. సభలో విభజన బిల్లును ఓడిస్తామంటూ ప్రజలను మభ్యపెట్టేలా కిరణ్ ప్రకటనలు చేస్తున్నారంటూ శోభ దుమ్మెత్తిపోశారు. ‘‘బిల్లు వచ్చినప్పుడు కేవలం అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటారు. ఓటింగ్ ఉండదు. అదే తీర్మానం విషయంలో అయితే ఓటింగ్ ఉంటుంది. కాబట్టి సభ సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పార్లమెంటులో అదొక ఆయుధంలా పని చేస్తుంది’’ అని శోభ వివరించారు. కానీ కిరణ్ మాత్రం కాంగ్రెస్ అధిష్టానం డెరైక్షన్‌లో విభజన దిశగా ముందుకెళ్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబుకు తానేం మాట్లాడుతున్నదీ తనకైనా అర్థమవుతోందా అని ప్రశ్నించారు. సమైక్యానికి మద్దతివ్వకపోతే బాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. -
సమైక్యానికి కిరణ్ ఏం చేశారు?
సాక్షి, హైదరాబాద్: తన కుర్చీని కాపాడుకోవడానికి సమైక్య ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తమ పార్టీపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దుయ్యబట్టారు. విజయవాడ సభలో సీఎం కిరణ్ మాట్లాడిన అంశాలపై వైఎస్సార్ సీపీ నేతలు భూమా శోభానాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో స్పందించారు. వారంతా శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఉద్యోగులు చేపట్టిన సమ్మెను కిరణ్ మోసపూరితంగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. విభజన చేయాలని కాంగ్రెస్ అధిష్టానం గడిచిన నాలుగు నెలలుగా కుట్రలు చేస్తుంటే ఈ నాలుగు నెలలుగా కిరణ్ సీఎం కుర్చీని పట్టుకుని వేలాడుతూ, ఇప్పుడేమో మరెవరినో కూర్చోబెట్టమంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలకడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. అసలు సమైక్యాంధ్ర అన్న మాటే వినపడకూడదనే దుర్మార్గమైన ఆలోచనతో కాంగ్రెస్, టీడీపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని వారు దుయ్యబట్టారు. అసలు సమైక్యం కోసం కిరణ్ చేసిందేమిటని వారు సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టిద్దామంటే ముందురాలేదు సరికదా... కనీసం అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని తామెంతగా విజ్ఞప్తి చేసినా కిరణ్ పట్టించుకోలేదన్నారు. అందుకే మాపై బురదజల్లుతున్నారు..: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఏకైక లక్ష్యంతో తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి దేశవ్యాప్తంగా అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నారని, రేపటి రోజున పార్లమెంట్లో వారంతా ప్రశ్నిస్తారనే ఆలోచనతోనే సోనియాగాంధీ ఆదేశాల మేరకు కిరణ్, చంద్రబాబు ఇద్దరూ కలిసి తమపై బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారని వైఎస్సార్ సీపీ నేతలు విమర్శించారు. సమైక్యం కోసం ఆయా జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతూ జగన్ చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలే కాకుండా బయటి రాష్ట్రాల నేతలు కూడా ప్రశంసిస్తుంటే ఓర్వలేక రహస్యమిత్రులైన కిరణ్, చంద్రబాబులు ఒకేమాటగా తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. నిజంగా సమైక్యం కోరుకునేవారే అయితే రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ ప్రకటన రావడానికి ముందు ఏం చేశారు? నిర్ణయం వెల్లడించిన తర్వాత ఏంచేశారు? జూలై 30 సీడబ్ల్యూసీ విభజనపై నిర్ణయం తీసుకున్న నాలుగు నెలలకు ఇప్పుడు జగన్‌పై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. తాజాగా ప్రసారమవుతున్న నీల్సన్ సర్వే ఫలితాల్లో సీమాంధ్రలో కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యే అవకాశముందని తేలడంతో ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు రావడంకోసం కిరణ్ తమపై విమర్శలు చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. -
సిఎం కిరణ్ గారూ సర్వేలు చూసి భయపడుతున్నారా?: గట్టు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారూ సర్వేలు చూసి భయపడుతున్నారా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన రెడ్డిని ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలను గట్టుతోపాటు వైఎస్ఆర్ సిపి నాయకురాళ్లు శోభానాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ ఖండించారు. ఇప్పుడొచ్చిన ఈ ఆవేశం నాలుగు నెలల క్రితం ఏమైందని అడిగారు. సమైక్యం కోసం మీరు చేసిందేమిటి? అని సీఎంను ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ సమైక్య చీడపురుగులని వారు విమర్శించారు. -
'రాష్ట్ర విభజనకు ఉపయోగపడిన బాబు అనుభవం'
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుభవం దేనికి ఉపయోగపడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు తమ నాయకుడు అది చేశాడు, ఇది చేశాడు, ఎంతో అనుభవం ఉంది అని చెబుతుంటారని, చంద్రబాబు అనుభవం రాష్ట్రం విభజనకు ఉపయోగపడిందన్నారు. విభజనపై చంద్రబాబు వైఖరి ఏమిటి? అని అడిగారు.చంద్రబాబు నాయుడు లేఖే సోనియా గాంధీ ధైర్యానికి కారణం అని చెప్పారు. చిన్న వయసులో రాజకీయాలలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన రెడ్డి అనుభవంలేకపోయినా సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ముక్కలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలు తలా ఒక మాటతో ఉద్యం నీరుగారుతోందని పేర్కొన్నారు. కొంతమంది రాయల తెలంగాణ అని, మరికొంత మంది విశాఖపట్నం రాజధాని చేమని, ఇంకొందరు ఒంగోలు వద్ద రాజధాని చేయమని ....ఇలా ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడుతున్నారని తెలిపారు. సమైక్య ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి వైఎస్ఆర్ సిపి పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆమె చెప్పారు. ఈ నెల 10 నుంచి విద్యార్థులు, యువకులు ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు. 11న రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల రోజు ఈ నెల12న రహదారుల దిగ్బంధనం చేపడతామన్నారు. 13న అన్ని వర్గాల వారితో సమావేశమవుతామని చెప్పారు. -
సీమను విభజించే హక్కెవరిచ్చారు?
సాక్షి, హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసమే రాయల తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తాజాగా తెరమీదకు తెచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి విమర్శించారు. ప్రజలకిది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. సోమవారం ఇక్కడ ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘రాయల తెలంగాణ కావాలని ఎవరడిగారు? ఎంతో చరిత్ర , ఒక ప్రత్యేకత ఉన్న రాయలసీమను విభజించే హక్కు కేంద్రానికి ఎవరిచ్చారు? రాజకీయ లబ్ధి కోసం రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను విభజించాల్సిందిగా ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్ వంటి వారు కోరితే చీల్చేస్తారా? రాయలసీమ అంటే లెక్కలేకుండా పోయిందా!’’ అని ధ్వజమెత్తారు. జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ మాదిరిగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని, తమ పార్టీ ఈ చర్యను ఖండిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లేసి గె లిపించిన పాపానికి వారితో చెలగాటం ఆడుతోందని, అన్నీ చూస్తూ ఏమీ చేయలేక జనం నిస్సహాయులుగా మిగిలిపోయారని అన్నారు. కుట్రలో భాగమే.. సమైక్యవాద ఉద్యమానికి ద్రోహం చేసే కుట్రలో భాగంగానే తాజా ప్రతిపాదన చేస్తున్నారని శోభ దుయ్యబట్టారు. అసలు రాయలసీమను తమతో కలపవద్దని తెలంగాణలోని అన్ని రాజకీయపక్షాలు, టీజేఏసీలు చెబుతుంటే ఈ ప్రాంత నేతలు మాత్రం తమను కలుపుకోమని ఎందుకు దేబిరిస్తున్నట్లు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో కోరుతుంటే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతంలోని నేతలు మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క నినాదం చేస్తున్నారని ఆమె తప్పు పట్టారు. చిరంజీవి హైదరాబాద్‌ను యూటీ చేయాలంటారు, పురందేశ్వరి విశాఖపట్టణాన్ని రాజధాని చేయమంటారు, కొందరు కేంద్ర మంత్రులేమో ప్యాకేజీలు ఇస్తే చాలంటారు, ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రాన్ని విభజించుకోండి అంటూ బ్లాంక్ చెక్‌లాగా లేఖను ఇచ్చేస్తారు.. అంటూ శోభ మండిపడ్డారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలంటూ వీరంతా ఒకేమాట చెబితే నేడు ఈ పరిస్థితి వచ్చేదా? అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రులు.. తాము సమైక్యవాదులమని బయటికి చెబుతూ లోపలికి పోయి అధిష్టానంతో ఏమి చెప్పి వస్తున్నారో కానీ కేంద్రం విభజనకు సిద్ధం అవుతోందన్నారు. సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు తమ పార్టీ నేత గట్టు రామచంద్రరావు చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీనియర్ సన్నాసివి నువ్వే తుమ్మలా: గట్టు టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు సాగునీటి ప్రాజెక్టుల మీద చూపిన నిర్లక్ష్యంపై తాను చేసిన విమర్శలకు సమాధానం చెప్పే ధైర్యంలేకే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనపై అసంబద్ధమైన విమర్శలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బాబు హయాంలో సాగునీటిశాఖ మంత్రిగా పనిచేసిన తుమ్మల తాను లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పే యత్నం చేయకుండా ‘సన్నాసి’ అంటూ విమర్శించారన్నారు. రాజకీయాల్లో సీనియర్ అయిన తుమ్మల తనను సన్నాసి అన్నారంటే ఆయన సీనియర్ సన్నాసి అవుతారని పేర్కొన్నారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో మొత్తం సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిం ది9వేల కోట్ల రూపాయలు మాత్రమేనని, అసలు బడ్జెటే కేటాయించకుండా ప్రాజెక్టులు కట్టామని చెప్పడం విడ్డూరమని విమర్శించారు. ఒకప్పుడు సామాన్య రైతుగా ఉన్నతుమ్మల ఈరోజు వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యారో చెప్పాలని, తన ఆస్తులు, ఆయన ఆస్తులపై ఖమ్మంలో చర్చిం చడానికి సిద్ధమేనా అని ఆయన సవాల్ విసిరారు.