హైదరాబాద్: వైఎస్సార్ సీపీ నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి హఠాన్మరణంపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతికి సంతాపం తెలిపారు. శోభానాగిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శోభానాగిరెడ్డి మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శోభానాగిరెడ్డి మరణవార్త విని వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, మాజీ సీఎం కిరణ్, బీజేపీ నేత కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి, నటుడు రాజా హూటాహుటిన కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు.
* శోభానాగిరెడ్డి మృతి పట్ల టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సంతాపం తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలి హోదాలో ఎమ్మెల్యేగా నిర్మాణాత్మకంగా వ్యవహరించారని అన్నారు.
* మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తణుకు ఎమ్మెల్యే అభ్యర్థి చీర్ల రాధయ్య, గన్నవరం అభ్యర్థి దుట్ట రాంచదర్‌రావు... శోభానాగిరెడ్డి మరణం పట్ల సంతాపం తెలిపారు.
* శోభానాగిరెడ్డి మృతికి సంతాపంగా హిందూపురం వైఎస్సార్ సీపీ అభ్యర్థి నవీన్‌నిశ్చల్ ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశారు.
* శోభానాగిరెడ్డి మరణ వార్త విని వైఎస్‌ఆర్‌సీపీ నేత కొణతాల రామకృష్ణ విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు.
* శోభానాగిరెడ్డి మృతికి నిజామాబాద్ వైఎస్సార్ సీపీ నేతలు అంతిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సిద్ధార్థరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సంతాపం ప్రకటించారు.
* శోభానాగిరెడ్డి మృతి పట్ల రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శోభానాగిరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని అన్నారు.
* శోభానాగిరెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ అధికార ప్రతినిధి పద్మజా రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు.
* శోభానాగిరెడ్డి మృతి పట్ల కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ నేతలు కోనేరు ప్రసాద్, పార్థసారధి, కార్యకర్తలు ప్రగాఢ సంతాపం తెలిపారు.
* శోభానాగిరెడ్డి మృతి పట్ల విశాఖ వైఎస్సార్ సీపీ శ్రేణులు సంతాపం ప్రకటించాయి. దక్షిణ అభ్యర్థి కోలా గురువులు ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు.