తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగి అద్భుతమైన రీతిలో ఆరోగ్యవంతుడయ్యాడు. క్లిష్టమైన హృద్రోగ సమస్యతో పాటు శరీరంలోని పలు అవయవాల ఆరోగ్యం నశించి విషమ స్థితిలో బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చేరిన ప్రవాస భారతీయునికి ఆస్పత్రి వైద్యులు అవసరమైన శస్త్ర చికిత్సలు నిర్వహించి, మూడు నెలల పాటు శ్రమించి రోగిని ఆరోగ్యవంతుడిని చేశారు. కేర్ ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యులు వివరాలు వెల్లడించారు. భారత సంతతికి చెందిన భాస్కర్ పొనుగంటి (43) ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. ఇతను కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శ్వాస ఆడక పోవడంతో పాటు తీవ్రమైన హద్రోగ సమస్యతో దాదాపు మూడు నెలల క్రితం బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో భాస్కర్ చేరారు.
రోగికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆ రోగి ‘ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్‘ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల రోగికి మూత్రపిండాల వైఫల్యం, ఎడమవైపు పక్షవాతం కలిగించే మెదడు పోటు బ్రెయిన్ స్ట్రోక్ కలిగి రోగి ఆరోగ్యం క్షీణించింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న ఆ రోగి వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ అత్యవసర శస్త్ర చికిత్స చేయడమే సరైన మార్గమని ఆస్పత్రి క్లినికల్ డైరెక్టర్, కార్డియాలజీ విభాగాధిపతి డా. వి.సూర్యప్రకాశరావు నేతత్వంలోని వైద్య బందం నిర్ధారించింది. క్లిష్టమైన శస్త్ర చికిత్సను (హై రిస్క్ సర్జరీ) నిర్వహించి రోగిని సాధారణ స్థాయికి తీసుకొచ్చారు. సీనియర్ కార్డియోథొరాసిక్, హార్ట్ ట్రా ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డా. నగేష్ ఆధ్వర్యంలో వైద్య బందం ‘మెకానికల్ వాల్వ్‘ వైద్యవిధానం ద్వారా రోగి బహద్దమని కవాట మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు.
దీంతో రోగి ఆరోగ్యం కుదుటపడింది. తరువాత రోగి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ క్రమంలో రోగిని మెడికల్ ఐసీయూలో ఉంచి.. ఆస్పత్రి అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్, క్రిటికల్ కేర్ విభాగాధిపతి డా. జి.భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య సాయం అందించారు. న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఇంటెన్సివిటీ, కార్డియాక్ విభాగాలు.. సమన్వయంతో నిరంతర పర్యవేక్షణలో కఠినమైన ఫిజియోథెరపీతో కూడిన బహుళ వైద్య చికిత్స విధానాలను రోగికి అందించాయి. అధునాతన వైద్య సంరక్షణతో ఏం సాధించవచ్చో ఈ కేసు ద్వారా వైద్య బందం నిరూపించిందని ఈ సందర్భంగా వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment