Care Hospital
-
మృతి చెందిన వ్యక్తికి ట్రీట్మెంట్?.. కేర్ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెదక్ నర్సాపూర్‌కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఇప్పటివరకు వైద్య ఖర్చులు కోసం పేషెంట్ బంధువులు రూ.5 లక్షలు చెల్లించారు.నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న వెంకటేష్ తెల్లారేసరికే మృతిచెందారు. విషయం చెప్పకుండా మరో రూ.4 లక్షలు చెల్లించాలని వైద్యులు తెలిపారు. అనుమానంతో ఐసీయూలోకి దూసుకెళ్లిన బంధువులు.. వెంకటేష్ మృతిచెంది ఉండటంతో కోపోద్రిక్తులయ్యారు. మృతి చెందిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేశారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద బాధిత బంధువులు ఆందోళనకు దిగారు. -
Cardiovascular Disease: కోలుకున్న క్లిష్టమైన సమస్యల రోగి
తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగి అద్భుతమైన రీతిలో ఆరోగ్యవంతుడయ్యాడు. క్లిష్టమైన హృద్రోగ సమస్యతో పాటు శరీరంలోని పలు అవయవాల ఆరోగ్యం నశించి విషమ స్థితిలో బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చేరిన ప్రవాస భారతీయునికి ఆస్పత్రి వైద్యులు అవసరమైన శస్త్ర చికిత్సలు నిర్వహించి, మూడు నెలల పాటు శ్రమించి రోగిని ఆరోగ్యవంతుడిని చేశారు. కేర్ ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యులు వివరాలు వెల్లడించారు. భారత సంతతికి చెందిన భాస్కర్ పొనుగంటి (43) ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. ఇతను కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శ్వాస ఆడక పోవడంతో పాటు తీవ్రమైన హద్రోగ సమస్యతో దాదాపు మూడు నెలల క్రితం బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో భాస్కర్ చేరారు. రోగికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆ రోగి ‘ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్‘ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల రోగికి మూత్రపిండాల వైఫల్యం, ఎడమవైపు పక్షవాతం కలిగించే మెదడు పోటు బ్రెయిన్ స్ట్రోక్ కలిగి రోగి ఆరోగ్యం క్షీణించింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న ఆ రోగి వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ అత్యవసర శస్త్ర చికిత్స చేయడమే సరైన మార్గమని ఆస్పత్రి క్లినికల్ డైరెక్టర్, కార్డియాలజీ విభాగాధిపతి డా. వి.సూర్యప్రకాశరావు నేతత్వంలోని వైద్య బందం నిర్ధారించింది. క్లిష్టమైన శస్త్ర చికిత్సను (హై రిస్క్ సర్జరీ) నిర్వహించి రోగిని సాధారణ స్థాయికి తీసుకొచ్చారు. సీనియర్ కార్డియోథొరాసిక్, హార్ట్ ట్రా ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డా. నగేష్ ఆధ్వర్యంలో వైద్య బందం ‘మెకానికల్ వాల్వ్‘ వైద్యవిధానం ద్వారా రోగి బహద్దమని కవాట మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. దీంతో రోగి ఆరోగ్యం కుదుటపడింది. తరువాత రోగి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ క్రమంలో రోగిని మెడికల్ ఐసీయూలో ఉంచి.. ఆస్పత్రి అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్, క్రిటికల్ కేర్ విభాగాధిపతి డా. జి.భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య సాయం అందించారు. న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఇంటెన్సివిటీ, కార్డియాక్ విభాగాలు.. సమన్వయంతో నిరంతర పర్యవేక్షణలో కఠినమైన ఫిజియోథెరపీతో కూడిన బహుళ వైద్య చికిత్స విధానాలను రోగికి అందించాయి. అధునాతన వైద్య సంరక్షణతో ఏం సాధించవచ్చో ఈ కేసు ద్వారా వైద్య బందం నిరూపించిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. -
బ్లాక్‌స్టోన్ చేతికి కేర్ హాస్పిటల్స్ - వివరాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ తాజాగా హైదరాబాద్‌కు చెందిన కేర్ హాస్పిటల్స్‌లో మెజారిటీ వాటాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. టీపీజీ రైజ్ఫండ్స్లో భాగమైన ఎవర్‌కేర్ హెల్త్ ఫండ్ నుంచి 72.5 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు మొత్తం మీద 700 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 5,827 కోట్లు) వెచ్చిస్తున్నట్లు వివరించింది. ఈ లావాదేవీ కోసం కేర్ హాస్పిటల్స్ సంస్థ విలువను రూ. 6,600 కోట్లుగా లెక్కగట్టారు. మరోవైపు, కేరళకు చెందిన కిమ్స్‌హెల్త్ సంస్థలో కేర్ హాస్పిటల్స్, టీపీజీ 80 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ కింద బ్లాక్‌స్టోన్ 300 మిలియన్ డాలర్లు, టీపీజీ 100 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు వివరించాయి. దీంతో బ్లాక్‌స్టోన్ దేశీయంగా ఆరోగ్య సేవల విభాగంలోకి ప్రవేశించినట్లవుతుంది. ఈ రెండు డీల్స్ ద్వారా మొత్తం 1 బిలియన్ డాలర్ల పైచిలుకు ఇన్వెస్ట్ చేసినట్లవుతుంది. సంయుక్త నెట్‌వర్క్‌లో టీపీజీ చెప్పుకోతగ్గ స్థాయిలో వాటాలున్న మైనారిటీ షేర్‌హోల్డరుగా ఉంటుంది. భారత హెల్త్‌కేర్ సర్వీసుల రంగంలో తొలిసారిగా పెట్టుబడులు పెట్టడం, దేశీయంగా అతి పెద్ద హెల్త్‌కేర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు టీపీజీతో జట్టు కట్టడం తమకు సంతోషకరమైన అంశాలని బ్లాక్‌స్టోన్ ఎండీ గణేష్ మణి తెలిపారు. భారీ హాస్పిటల్స్ నెట్‌వర్క్‌లో ఒకటిగా.. కేర్ హాస్పిటల్స్‌కు హైదరాబాద్, వైజాగ్‌తో పాటు ఔరంగాబాద్, నాగ్‌పూర్ తదితర నగరాల్లో ఆస్పత్రులు ఉన్నాయి. కిమ్స్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ సంస్థ .. కేరళలోనే అతి పెద్ద ప్రైవేట్ హెల్త్‌కేర్ ప్రొవైడర్‌గా ఉంది. కిమ్స్‌హెల్త్ చేరికతో దేశీయంగా భారీ హాస్పిటల్స్ చెయిన్‌లో ఒకటిగా కేర్ హాస్పిటల్స్ నెట్వర్క్ ఆవిర్భవించనుంది. ఈ సంయుక్త నెట్‌వర్క్‌కు 11 నగరాల్లో 23 ఆస్పత్రులు, 4,000 పైచిలుకు పడకలు ఉంటాయి. ప్రస్తుతం కిమ్స్హెల్త్కు నేతృత్వం వహిస్తున్న ఎంఐ సహాదుల్లా ఇకపైనా దాని సారథ్య బాధ్యతల్లో కొనసాగుతారు. -
‘అరుణ తార’కు అంతిమ వీడ్కోలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/హైదరాబాద్/చిక్కడపల్లి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యానికి పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు అంతిమ వీడ్కోలు పలికారు. శనివారం రాత్రి ఆమె హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన విషయం విదితమే. స్వరాజ్యం పార్థివ దేహాన్ని ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు నల్లగొండలోని సీపీఎం కార్యాలయా నికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచారు. సీపీఎం కేంద్ర, రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు స్థానిక మర్రిగూడ బైపాస్ రోడ్డు నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీగా నిర్వహిం చారు. సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యులు సుభాషిణి అలీ, బీవీ రాఘవులు, రాష్ట్ర నేతలు తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, జి నాగయ్య, మాజీ ఎంపీ మధు, నంద్యాల నర్సింహ్మారెడ్డి, సారంపల్లి మల్లారెడ్డి నివాళులర్పించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, సీపీఎం జిల్లా నాయకులు, కాంగ్రెస్ నేతలు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితరులు మల్లు స్వరాజ్యం పార్థివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. సాయంత్రం 4 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి నల్లగొండ మెడికల్ కళాశాల వరకు అంతిమయాత్ర నిర్వహించారు. ‘స్వరాజ్యం అమర్‌రహే’, ‘జోహార్ మల్లు స్వరాజ్యం’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదాలు హోరెత్తాయి. అనంతరం మల్లు స్వరాజ్యం పార్థివదేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించారు. మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న మల్లు లక్ష్మి, జ్యోతి, సీతారాములు, వెంకట్, జూలకంటి, నారాయణ, చాడ, సుభాషిణి అలీ, రాఘవులు, తమ్మినేని, మధు తదితరులు ఎంబీ భవన్లో నేతల నివాళి... అంతకుముందు... ఆదివారం ఉదయం ఆరుగంటలకు హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రి నుంచి సీపీఎం రాష్ట్ర కార్యాలయం మాకినేని బసవపున్నయ్య భవన్‌కు స్వరాజ్యం భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. భౌతికకాయంపై పార్టీ నేతలు, కుమారుడు మల్లు నాగార్జునరెడ్డి, కోడలు మల్లు లక్ష్మి ఎర్రజెండాను కప్పారు. కొడుకు మల్లు గౌతంరెడ్డి, కూతురు పాదూరి కరుణ, మనవళ్లు, మనవరాళు, ఆమె సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెను కడసారి చూసేందుకు సీపీఎం కార్యకర్తలతోపాటు వివిధ వామపక్ష, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, బంధువులు, అభిమానులు భారీగా ఎంబీ భవన్‌కు తరలివచ్చి, నివాళుర్పించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే ముఠాగోపాల్, సీపీఎం నేతలు డి.జి. నరసింహారావు, టి.జ్యోతి, ఏపీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ నేతలు కె నారాయణ, చాడ, పల్లా వెంకట్ రెడ్డి, పశ్యపద్మ. వీఎస్ బోస్, కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, వివిధ వామపక్ష పార్టీల నేతలు, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్యనాయక్, బీజేపీ నాయకుడు స్వామిగౌడ్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని మోస్తున్న మహిళా నాయకులు ఆమె పోరాటం అందరికీ ఆదర్శం తెలంగాణ సాయుధ పోరాటంలో వెన్ను చూపని వీరవనిత మల్లు స్వరాజ్యం. ఆమె జీవితం, పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం. పీడిత ప్రజలు, మహిళల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. పార్టీకీ, ప్రజలకు ఆమె లేని లోటు తీరనిది. –సుభాషిణి అలీ, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు పోరాటం స్వరాజ్యం ఊపిరి పోరాటమే స్వరాజ్యం ఊపిరి. తుదిశ్వాస వరకు పోరుబాట వదల్లేదు. ఆమె పోరాట పటిమ ఎంతో ధైర్యాన్నిచ్చింది. ఆ స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి. – బీవీ రాఘవులు, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు మహిళలను చైతన్యం చేసిన వ్యక్తి 80 ఏళ్ల పాటు వెన్ను చూపకుండా పోరాటం చేసిన ధీర మల్లు స్వరాజ్యం. ఆమె చూపిన బాటలో నడిచి, ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక శకం ముగిసింది ‘మల్లు స్వరాజ్యం మరణంతో ఒక శకం ముగిసినట్టుగా ఉన్నది. తెలంగాణ సమాజానికే ఆమె స్పూర్తి. నిజాం ప్రభుత్వం ఆమెపై రివార్డు ప్రకటించడమంటే ఎంత గొప్ప పోరాటం చేశారో అర్థమవుతున్నది. రెండోదశ తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో ఆమె కలిసి సలహాలు, సూచనలు తీసుకున్నాం.’ – కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ -
మల్లు స్వరాజ్యంను పరామర్శించిన కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కమ్యూనిస్టు నేత మల్లు స్వరాజ్యంను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన వైద్యులను వాకబు చేశారు. కిషన్‌రెడ్డితో పాటు నగరానికి చెందిన పలువురు బీజేపీ నేతలున్నారు. -
రజకాభివృద్ధి సంస్థ వ్యవస్థాపకుడు అంజయ్య కన్నుమూత
కవాడిగూడ: టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, రజకాభివృద్ధి సంస్థ జాతీయ వ్యవస్థాపకులు డాక్టర్ ఎం.అంజయ్య (78) గుండెపోటుతో కన్నుముశారు. తీవ్ర అస్వస్థతకు గురైన డాక్టర్ ఎం. అంజయ్య బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఒంగోలు జిల్లాకు చెందిన డాక్టర్ ఎం.అంజయ్య రజకాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి ఉమ్మడి ఏపీలో అనేక కార్యక్రమాలను చేపట్టారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌తో దేశవ్యాప్త ఉద్యమం చేసి అసెంబ్లీలో తీర్మానానికి ఒత్తిడి తెచ్చారు. రజకాభివృద్ధి సంస్థ ఏర్పాటుతో పాటు, నిరుపేద రజకులకు ఇళ్లనిర్మాణం, దోబిఘాట్ల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. దివంగత వైఎస్ఆర్ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్‌గా నియమితులయ్యారు. ఆలిండియా సాయిసే వా సమాజ్ అధ్యక్షులుగా కొనసాగుతూ లోయర్ ట్యాంక్‌బండ్ ద్వారకా నగర్లో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. అంజ య్య మృతిపట్ల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలు బీసీ, రజక సంఘాల నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. అనంతరం బన్సీలాల్‌పేట హిందూ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. -
హీరో బాలకృష్ణకు సర్జరీ
నందమూరి హీరో బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారు. ఆయన కుడి భుజం నొప్పి తీవ్రం కావడంతో బాలయ్య కేర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ క్రమంలో వైద్యులు ఆయన కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. ఈ మేరకు కేర్ ఆసుపత్రి వైద్యులు ఆయన హెల్త్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని కూడా వైద్యులు స్పష్టం చేశారు. చదవండి: ఎవడు బ్రో నీకు చెప్పింది.. ఓ వెబ్‌సైట్‌పై రానా అసహనం పునీత్‌ను అలా చూసి బాలయ్య కంటతడి..వీడియో వైరల్ -
‘దిశ’ పోలీసు క్షతగాత్రుల రిపోర్టుల్లేవు!
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ఎన్కౌంటర్లో క్షతగాత్రులైన పోలీస్ కానిస్టేబుల్ ఏ అరవింద్‌గౌడ్‌కు గచ్చబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స చేసిన కన్సల్టెంట్ ఆర్థోపెడిషన్ సర్జన్ డాక్టర్ రాజేశ్ రచ్చను వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ శుక్రవారం విచారించింది. కమిషన్ తరఫున న్యాయవాది విరూపాక్ష దత్తాత్రేయగౌడ్ పలు ప్రశ్నలను సంధించారు. అరవింద్ చికిత్స ఫైనల్ రిపోర్ట్లన్నీ విచారణ అధికారికి ఒరిజినల్స్‌తో సహా సమర్పించామని, తమ వద్ద ఎలాంటి పత్రాలు, డిజిటల్ డాక్యుమెంట్లు లేవని రాజేశ్ వాంగ్మూలం ఇచ్చారు. చదవండి: ఐసీయూలో 3 రోజులు.. ఇచ్చింది పారాసెటమాల్ మెడికో లీగల్ కేస్(ఎంఎల్సీ)లో కూడా సీటీ స్కాన్ కాపీలు ఆసుపత్రి వద్ద ఉండవని స్పష్టం చేశారు. కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ గచ్చిబౌలి ఆసుపత్రిలో 2019, డిసెంబర్ 6న ఉదయం 10:18 గంటలకు బెడ్ నంబర్ 11 కేటాయిస్తూ అడ్మిట్ చేసుకున్నట్లు ఓపీ రికార్డ్‌లో ఉంది. కానీ, షాద్‌నగర్ ఇన్స్పెక్టర్ నుంచి ‘వైద్యం సమాచార లేఖ’ మాత్రం 2019, డిసెంబర్ 7న మధ్యాహ్నం 12 గంటలకు చేరింది. ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించగా.. తెలియదని సమాధానమిచ్చారు. అతనికి ఐసీయూలో చికిత్స చేయాల్సినంత గాయాలేవీ కాలేదని చెప్పారు. చదవండి: ఊరికి వెళ్తుండగా విషాదం.. కారు పల్టీలు కొట్టి.. డిశ్చార్జి సమ్మరీలో ఎక్స్‌రే గురించి ఎందుకు రాయలేదని ప్రశ్నిచగా.. అందులో పేషెంట్ చికిత్స తాలూకు అన్ని వివరాలను నమోదు చేయమని పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో మరణించిన చెన్నకేశవులు ఎడమ చేతిలో లభ్యమైన కాటన్ స్వాబ్‌ను పరీక్షిస్తే నెగెటివ్ వచ్చిందని హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బాలిస్టిక్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వీ వెంకటేశ్వర్లు.. కమిషన్ ముందు వాం గ్మూలం ఇచ్చారు. న్యూఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సీబీఐ) బాలిస్టిక్ రిటైర్డ్ డైరెక్టర్ అండ్ హెచ్ఓడీ ఎన్బీ బర్ధన్‌ను కూడా కమిషన్ విచారించింది. కాగా, సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. -
ఐసీయూలో 3 రోజులు.. ఇచ్చింది పారాసెటమాల్
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ఎన్కౌంటర్ ఘటనలో గాయపడిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, అరవింద్‌గౌడ్‌లకు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స చేసిన కన్సల్టెంట్ న్యూరోసర్జన్ పి.విశ్వక్‌సేన్‌రెడ్డిని సిర్పుర్కర్ కమిషన్ గురువారం విచారించింది. కమిషన్ తరఫున న్యాయవాది విరూపాక్ష దత్తాత్రేయగౌడ్ ఆయనను ప్రశ్నించారు. 2019 డిసెంబర్ 6న ఉదయం 8 గంటలకు కేర్ ఆస్పత్రికి వచ్చినప్పుడు ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు స్పృహలోనే ఉన్నారని విశ్వక్‌సేన్‌రెడ్డి వివరించారు. కుడి కను బొమ్మపై 2 సెంటీమీటర్ల పొడవు గాయమైన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు.. ఆస్పత్రి అత్యవసర సేవల విభాగంలో పారాసెటమాల్ ఇచ్చామని, కడుపులోని మంటను తగ్గించే పాంటోప్, ఐవీ ఫ్లూయిడ్స్‌తో చికిత్స చేశామని కమిషన్‌కు తెలిపారు. ఇవి తప్ప వేరే ఏ రకమైన చికిత్స చేయలేదని, దీనిని రికార్డ్‌లోనూ నమోదు చేశామని వివరించారు. నొప్పి, వాపును తగ్గించే వోవెరాన్, టీటీ ఇంజెక్షన్లను కానిస్టేబుల్ బయటే ఇప్పించుకున్నారని, కేర్ ఆస్పత్రిలో ఇవ్వలేదని తెలిపారు. గాయం 2 సెంటీమీటర్లు ఉన్నట్టుగా ఎలా లెక్కించారని కమిషన్ ప్రశ్నించగా.. గాయాన్ని కొలిచే ఉపకరణం (క్యాలిబర్) తన వద్ద లేదని, కేవలం ఓ అంచనాతోనే చెప్పానని, దాన్నే రికార్డ్‌లో నమోదు చేశానని సమాధానమిచ్చారు. ‘సంచలనం సృష్టించిన లేదా మెడికో లీగల్ (ఎంఎల్సీ) కేసుల్లో డిశ్చార్జి సమ్మరీలో క్షతగాత్రుల గాయాల గురించి స్పష్టంగా రాయాల్సి ఉంటుందని.. మరి మీరెందుకు నమోదు చేయలేద’ని జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ ప్రశ్నించగా.. ప్రస్తుతం సమాధానం చెప్పలేనంటూ డాక్టర్ విశ్వక్‌సేన్‌రెడ్డి దాటవేశారు. అంతర్గతంగా రక్తస్రావమైతేనే వ్యక్తి మరణిస్తారని, వేరే ఇతర సందర్భాల్లో అలా జరగదని చెప్పిన విశ్వక్సేన్.. కేర్ ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లకు అలాంటి తీవ్ర గాయాలేవీ లేవని, సాధారణ గాయాలే ఉన్నాయని వివరించారు. షాద్‌నగర్ సీహెచ్‌సీ రికార్డ్‌లో కానిస్టేబుల్ స్పృహ కోల్పోయారని ఉందని, అందువల్లే ఐసీయూలో అడ్మిట్ చేశామని, అంతే తప్ప చికిత్సలో ఆ రికార్డులను అనుసరించలేదని చెప్పారు. ఆస్పత్రికి వచ్చిన రోజే ఉదయం 8:30 గంటలకు ఐసీయూలో చేర్చుకున్నామని.. మూడు రోజుల పాటు చికిత్స అందించామని తెలిపారు. ఫోన్లో చెప్తే రికార్డ్‌లో నమోదు మంగళవారం షాద్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ (సీహెచ్‌సీ) సర్జన్ గోనె నవీన్ కుమార్ విచారణ అసంపూర్తిగా ముగియగా.. గురువారం ఉదయం తిరిగి కొనసాగించారు. కేర్ ఆస్పత్రి నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లకు సంబంధించిన డిశ్చార్జి సమ్మరీని ఎవరూ తన వద్దకు తీసుకురాలేదని.. ఎవరో ఫోన్లో చెబితే ఎంఎల్సీ రికార్డ్‌లో నమోదు చేశానని నవీన్‌కుమార్ తెలిపారు. డిశ్చార్జి సమ్మరీలో క్షతగాత్రులకు ఎక్స్‌రే తీసినట్టు లేదని.. కానీ డాక్టర్స్ నోట్లో మాత్రం ఉందేమిటని ప్రశ్నించగా.. ‘డాక్టర్స్ నోట్‌ను ఇప్పుడే తొలిసారి చూస్తున్నా’నని నవీన్ సమాధానమిచ్చారు. కేర్ ఆస్పత్రి రికార్డుల్లో అరవింద్‌గౌడ్‌కు ఎడమ భుజం మీద సన్నని వెంట్రుకలాంటి చీలిక ఏర్పడి ఉందని, దాన్ని మీరెందుకు షాద్‌నగర్ ఎంఎల్సీ రికార్డ్‌లో నమోదు చేయలేదని ప్రశ్నించగా.. డాక్టర్ నవీన్ సమాధానం ఇవ్వకుండా 15 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయారు. ఎన్కౌంటర్లో గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు నడుచుకుంటూ షాద్‌నగర్ సీహెచ్‌సీకి వచ్చారని నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ముందు వాంగ్మూలం ఇచ్చిన నవీన్ కుమార్.. త్రిసభ్య కమిటీ ముందు మాత్రం స్పృహ కోల్పోయి వచ్చారని తెలిపారు. పైగా ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను కేర్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొనలేదు. దీనిపై కమిషన్ ప్రశ్నించగా.. అన్నింటికీ ‘ఏమీ లేదు’అంటూ సమాధానం ఇచ్చారు. నేడు సజ్జనార్ విచారణ సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను సిర్పుర్కర్ కమిషన్ శుక్రవారం విచారించనుంది. ఈ మేరకు ఆయనకు తాజాగా సమన్లు జారీ చేసింది. వాస్తవానికి ఈనెల 4వ తేదీనే సజ్జనార్ విచారణ జరగాల్సి ఉంది. కానీ ఆ రోజు ఇతర సాక్షుల విచారణ సుదీర్ఘంగా కొనసాగడంతో సజ్జనార్ విచారణ వాయిదా పడింది. కమిషన్ మూడు రోజుల పాటు సజ్జనార్‌ను విచారించనున్నట్టు సమాచారం. -
ఆలస్యం చేయకండి..!
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరంపై ఒకవైపు కరోనా వైరస్.. మరోవైపు సీజనల్ వ్యాధులు విశ్వరూపం చూపుతున్నాయి. జ్వరాలపట్ల అలసత్వంగా ఉన్నా, చికిత్సకు ఆలస్యం చేసినా పంజా విసిరి జనాలను ఆగం చేస్తున్నాయి. కరోనాలోనూ, మలేరియా, డెంగీ, టైఫాయిడ్లోనూ జ్వరమే సాధా రణంగా కనిపించే లక్షణం. కరోనా కాలంలో ఎవరిలో? ఏ జ్వరం ఉందో? గుర్తించడం బాధితులకే కాదు.. వైద్యులకూ ఇబ్బందిగా మారింది. చాలామంది కరోనా జ్వరాలను కూడా సాధారణ జ్వరంగా భావించి చికిత్సను నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం టెస్టు కూడా చేయించుకోవడం లేదు. ముఖ్యంగా యాభై ఐదేళ్లు పై బడిన బీపీ, షుగర్, ఆస్తమా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు చికిత్సను నిర్లక్ష్యం చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుం టున్నారు. తీరా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. అప్పటికే పరిస్థితి చేయిదాటి పోతుండటంతో వైద్యులు కూడా ఏమీ చేయలేక నిస్సహా యతను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మృతి చెందిన బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావుసహా ప్రముఖ గాయకుడు నిస్సార్, బహుజన మేధావి ఉ.సా, ప్రముఖ జర్నలిస్టు పీవీరావుతోపాటు పలువురిలో అక స్మాత్తుగా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఊపిరి తీసుకోవడం కష్టమవడంతో.. ఇప్పటివరకు కోవిడ్ బారిన పడిన బాధితుల్లో 40 ఏళ్లలోపువారు 57.1 శాతం మంది ఉండగా, ఆపై వయసు వారు 48.8 శాతం మంది ఉన్నారు. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరిలోనూ హైపర్ టెన్షన్, మధుమేహం, ఆస్తమా ఇలా ఏదో ఒక ఇతర అనారోగ్య సమస్య ఉంటుంది. సాధారణ యువకులతో పోలిస్తే వీరిలో రోగనిరోధకశక్తి తక్కువ. వీరిలో చాలామంది తమ పని ప్రదేశాల్లో 35 ఏళ్లలోపు సాధారణ యువకులతో కలిపి పని చేస్తుంటారు. యువకులు అసింప్టమేటిక్‌గా ఉంటున్నారు. వీరిలో చాలామందికి తమకు వైరస్ సోకిన విషయమే తెలియడం లేదు. వీరంతా తాము ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తున్నారు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా, శానిటైజర్ ఉపయోగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు. అసింప్టమేటిక్ బాధితుల నుంచి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే 55 ఏళ్లు పైబడినవారికి వైరస్ సోకుతోంది. వీరిలో చాలామంది సాధారణ జ్వరం, జలుబు, దగ్గుగా భావించి టెస్టులు, చికిత్సలను లైట్‌గా తీసుకుంటున్నారు. తీరా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుండటంతో ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ శాతం పడి పోయి ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రికి వచ్చిన వీరిని కాపాడేందుకు వైద్యులు ఎంతో శ్రమిం చాల్సి వస్తోంది. పరిస్థితి విషమించి చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. అంతేకాదు, పడకలు, వైద్య సిబ్బంది నిష్పత్తికి మించి బాధితులు వస్తుండటంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేయాల్సి వస్తోంది. అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే... సాధారణ ప్రజలతో పోలిస్తే.. వైరస్‌పై అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే చికిత్స లను ఎక్కువ నిర్లక్ష్యం చేస్తున్నారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఒంట్లో ఏ చిన్న లక్షణం కన్పించినా చాలామంది వెంటనే అప్రమత్తమైపోతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా వివిధ కషాయాలు తాగుతూ పౌష్టికాహారం తీసుకుంటూ ప్రాణాయామం వంటి యోగాసనాలు చేస్తూ వైరస్‌ను జయిస్తు న్నారు. కానీ, వైద్యంపై కనీస అవగాహన లేని ఇలాంటివారితో పోలిస్తే.. ఉన్నత చదువులు చదివి, వైరస్‌పై అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఇటీవల వెలుగు చూసిన పలు ఘటనలు పరిశీలిస్తే అవగతమవుతుంది. వీరు అతి తెలివిగా ఆలోచించి, చివరకు చిక్కుల్లో పడుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు మొదలు.. చికిత్స వరకు... ఇలా ప్రతి విషయంలోనూ దాటవేత ధోరణినే అవలం బిస్తూ చివరకు తమ ప్రాణాల మీదకు తెచ్చు కుంటున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వైరస్‌ను ముందే గుర్తించి అప్రమత్తమైతే... ప్రమాదం నుంచి బయట పడేవారని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్వాసనాళాలపైనే ఎక్కువ ప్రభావం.. ప్రస్తుతం కంటికి కన్పించని ప్రమాదకరమైన కరోనా వైరస్‌తో పోరాడుతున్నాం. ఇది ఒకరి నుంచి మరొకరికి ముక్కు, కన్ను, చెవి, నోరు వంటి భాగాల ద్వారా ప్రవేశిస్తుంది. ముందు గొంతు, శ్వాసనాళాలు, ఆ తర్వాత గుండె, మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. వృద్ధులు, మధుమేహులు, ఆస్తమా బాధితులపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా వైరస్ బారి నుంచి బయటపడొచ్చు. నిర్లక్ష్యం చేయడం ద్వారా వైరస్ శ్వాసనాళాల పనితీరును దెబ్బతీస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. శరీరంలో ఆక్సిజన్ శాతం పడిపోతుంది. ఆకస్మిక గుండెపోటుకు కారణమవుతుంది. ముందుగానే టెస్టు చేయించుకుని, చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. కానీ, చాలామంది ఈ వైరస్‌ను నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. – డాక్టర్ రఫీ, పల్మనాలజిస్ట్, కేర్ ఆస్పత్రి -
మంత్రి సబితకు స్వల్ప అస్వస్థత
సాక్షి, రంగారెడ్డి : విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పిరావడంతో కుమారుడు కార్తిక్‌రెడ్డి ఆమెను హుటాహుటిన బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆమెను డిశ్చార్జి చేశారు. నగరంలోని శ్రీనగర్‌కాలనీలో నివాసం ఉంటున్న సబిత గురువారం రాత్రి 10.58 గంటలకు ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ఈసీజీ, 2డీ ఎకో తదితర గుండె సంబంధమైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అన్ని రిపోర్టులు కూడా నార్మల్ ఉన్నాయని, ఆందోళన అక్కర్లేదని వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రిలో సబితను పలువురు మంత్రులు పరామర్శించారు. -
అన్ని సేవలను ప్రారంభిస్తున్నాం: కేర్ హాస్పిటల్స్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలించిన కారణంగా ఔట్ పేషంట్ డిపార్ట్మెంట్స్(ఓపీడీ), ఎలిక్టివ్ కేర్ సేవలు సహా అన్ని రకాల వైద్య సేవలను పునః ప్రారంభిస్తున్నట్లు కేర్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. భౌతిక దూరం, రోగులు, ఉద్యోగుల భద్రత వంటి అంటు వ్యాధుల నియంత్రణ మార్గదర్శకాలను విధిగా అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మార్గదర్శకాలను గురించి కేర్ హాస్పిటల్స్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ ఏకే దాస్ మాటాడుతూ.. ‘చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చే వారిపట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆస్పత్రిలో సీనియర్ వైద్య సిబ్బంది బృందం, ప్రతి రోజూ పరిస్థితులను సమీక్షించడంతో పాటుగా నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరిస్తారనే భరోసాను పేషెంట్లలో కలిగిస్తాం' అని ఆయన వివరించారు. చదవండి: వారికి క్వారంటైన్ అవసరం లేదు కేర్ హాస్పిటల్స్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నిఖిల్ మాథుర్ మాట్లాడుతూ.. ‘ఆస్పత్రికి వచ్చే రోగుల ఆరోగ్యం, భద్రత అనేవి మాకు ముఖ్యమైనవి. అంటువ్యాధుల నియంత్రణ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం ద్వారా భద్రతకు, ఆరోగ్యానికి హామీనిస్తున్నామని' ఆయన పేర్కొన్నారు. -
పోయిన ప్రాణాన్ని దాచారు!
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన మహిళ చనిపోయినా.. తమకు సకాలంలో తెలియజేయలేదని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలోనే ఆందోళనకు దిగారు. ఈ ఘటన రాంనగర్ కేర్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మృతురాలి కుమార్తె లీలాకుమారి, సోదరుడు ఎన్.మోహనరావు తెలిపిన వివరాల ప్రకారం.. తాటిశెట్టి కుసుమ (65) ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలో నివసిస్తున్నారు. ఇటీవల షుగర్, బీపీ హఠాత్తుగా పెరగడంతో కుసుమను కుటుంబ సభ్యులు రాంనగర్ కేర్ ఆస్పత్రిలో ఈనెల 15న సాయంత్రం 6.30 గంటలకు జాయిన్ చేశారు. అప్పటి నుంచి ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రోగి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా సకాలంలో వైద్యం అందుతున్న కారణంగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. మంగళవారం సాయంత్రం వరకూ అందరితో మాట్లాడింది. బుధవారం ఉదయం సమీప బంధువు కుసుమను చూసేందుకు ఉదయం 10 గంటలకు ఆస్పత్రికి రాగా రోగి నిద్రపోతోందని, ఆమెను కదిలించవద్దంటూ సెక్యూరిటీ సిబ్బంది ఐసీయూలోకి అనుమతించలేదు. అదేవిధంగా రోగి సోదరుడు మోహనరావు హైదరాబాద్ నుంచి వచ్చి ఐసీయూలోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని సెక్యూరిటీ అడ్డుకున్నారు. సాయంత్రం 6 గంటలకు బలవంతంగా లోనికి వెళ్లి చూసేసరికి అప్పటికీ కుసుమ అపస్మారక స్థితిలో ఉంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. కుసుమ ఉదయమే చనిపోయి ఉంటుందని, ఈ విషయాన్ని రాత్రి 9.30 గంటల వరకూ దాచిపెట్టారని బంధువులు వాపోయారు. డబ్బులు కట్టించుకోవడంలో ఉన్న శ్రద్ధ రోగుల మీద చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను సెక్యూరిటీ అడ్డుకున్నారు. మృతురాలి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు మూడో పట్టణ పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. -
కేర్ ఆస్పత్రికి ఎన్హెచ్ఆర్సీ బృందం
సాక్షి, హైదరాబాద్ : దిశ నిందితుల ఎన్కౌంటర్లో గాయపడ్డ ఎస్ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ స్టేట్మెంట్ను ఎన్హెచ్ఆర్సీ బృందం రికార్డు చేసింది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను ఆ బృందం అడిగి తెలుసుకుంది. కాగా దాడిలో ఎస్ఐ వెంకటేశ్వర్లుకు కుడి నుదుటి భాగంలో గాయం కాగా, కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్ కుడి భుజా నికి గాయమైంది. ఇరువురికీ స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనలతో హైటెక్‌సిటీలోని కేర్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ బృందం తొలిరోజు ఎన్కౌంటర్లో చనిపోయిన వారి మృతదేహాలను పరిశీలించింది. పోస్టుమార్టం నివేదికను అధ్యయనం చేసింది. అనంతరం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఎన్కౌంటర్ జరిగిన చటాన్‌పల్లి సంఘటనా స్థలాన్ని కూడా పరిశీలించింది. చదవండి: అసలు ఇదంతా ఎలా జరిగింది? మరోవైపు దిశ నిందితుల కుటుంబసభ్యులను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ కేసులో A-1,ఆరిఫ్ తండ్రి హుస్సేన్, A-2, జొల్లు శివ తండ్రి జొల్లు రాజప్ప, A-3 జొల్లు నవీన్ తల్లి లక్ష్మీ, A-4 చెన్నకేశవులు తండ్రి కూర్మప్పను నిన్న రాత్రి 10 గంటలకు ఇంటికి పంపించి ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు పోలీసులు తీసుకువెళ్లారు. అయితే వారిని ఎక్కడకు తరలించారనే దానిపై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ఇక హైకోర్టు ఆదేశాలతో ఎన్కౌంటర్లో మృతి చెందిన నిందితుల మృతదేహాలను మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రి పోస్టుమార్టం విభాగంలోనే ఉంచారు. భారీ భద్రత మధ్య పోస్ట్‌మార్టం విభాగంలోని ఫ్రీజర్‌లో వాటిని భద్రపరిచారు. సోమవారం రాత్రి 8గంటల వరకూ వాటిని అక్కడే ఉంచనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ -
లోకోపైలెట్ చంద్రశేఖర్ కుడికాలు తొలగింపు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన లోకో పైలెట్ చంద్రశేఖర్ (35) కుడికాలును గురువారం తొలగించారు. ఎంఎం టీఎస్, ఇంటర్సిటీ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్న ఈ ఘటనలో 17 మంది గాయపడటం, వీరిలో ఆరుగురు బాధితులు కేర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడటంతో ఆయన కుడి కాలు చిద్రమైంది. రక్తనాళాలతో పాటు కండరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ భాగానికి రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, కిడ్నీ, గుండెకు ఇన్ఫెక్షన్ చేరే ప్రమాదం ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన కుడి మోకాలి పైభాగం వరకు కాలును పూర్తిగా తొలగించాల్సి వచ్చిందని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. -
కృష్ణంరాజుకు అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా తీవ్రమైన నిమోనియాతో బాధపడుతున్న కేంద్ర మాజీ మంత్రి, నటుడు కృష్ణంరాజు (79) చికిత్స కోసం బుధవారం రాత్రి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరారు. ఆయన్ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. కృష్ణంరాజు ఆరోగ్యంపై వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆయన తరపు ప్రతినిధి వెల్లడించారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. -
లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉంది
-
ఆమె త్యాగం.. ‘సజీవం’
ముస్తాబాద్ (సిరిసిల్ల): తాను మరణించినా మరో నలుగురికి ప్రాణదానం చేశారా మానవతామూర్తి. కలకాలం తోడూనీడగా ఉంటుందనుకున్న భార్య.. అనూహ్య రీతిలో బ్రెయిన్‌డెడ్ కాగా.. ఆమె అవయవాలు దానం చేసి త్యాగనిరతిని ప్రదర్శించారు భర్త. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన ఎరవెల్లి వినిల్ – సరిత దంపతులు. వినిల్ హైదరాబాద్‌లో దంత వైద్యుడిగా వైద్యసేవలు అందిస్తున్నారు. రెండురోజుల క్రితం సరిత అధిక రక్తపోటుకు గురై ఇంట్లో కింద పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. తలలో రక్తనాళాలు చిట్లిపోయి తీవ్ర రక్తస్రావం జరిగినట్లు డాక్టర్లు గుర్తించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు సరిత బ్రెయిన్‌డెడ్ అయినట్లు డాక్టర్లు తేల్చారు. తన భార్యను రక్షించుకోలేక పోయా మని భర్త వినిల్ కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఒక వైద్యుడిగా అంతకు మించి మానవతావాదిగా ఆలోచించిన భర్త వినిల్.. బ్రెయిన్‌డెడ్ అయిన భార్య సరిత అవయవాల దానానికి అంగీకరించారు. శుక్రవారం సరిత గుండె, కాలేయం, కార్నియా, మూత్ర పిండాలను వైద్యులు సేకరించారు. హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో గుండె అవసరమున్న ఓ యువతికి ఆ గుండెను అమర్చేందుకు గ్రీన్‌చానల్ ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి నుంచి 5 కి.మీ. దూరంలోని నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి సరిత గుండెను పది నిమిషాల్లో తరలించారు. 18 ఏళ్ల యువతికి గుండెను అమర్చారు. అలాగే సరిత మూత్ర పిండాలు, కార్నియా, కాలేయం మరో ముగ్గురికి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సరిత మరణించినా ఆమె నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. సరిత స్వగ్రామం పోత్గల్‌లో ఆమె త్యాగాన్ని గ్రామస్తులు స్మరించుకుంటున్నారు. భర్త వినిల్ మానవతావాదిగా.. నాలుగు కుటుంబాలకు జీవితాన్ని ఇచి్చన వ్యక్తిగా అభినందిస్తున్నారు. -
గొంతులో ఇరికిన ఎముక..
సాక్షి, సిటీబ్యూరో: భోజనం చేస్తుండగా గొంతులో ఇరికిన ఎముకను కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. లేజర్ సహాయంతో ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా మటన్బోన్ను తొలగించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకోవడంతో బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. హైదరాబాద్‌కు చెందిన యువకుడు (30) ఇటీవల ఓ విందుకు హాజరయ్యాడు. విందులో మాంసాహారం భోజనం చేస్తుండగా మాంసం ఎముక గొంతు మధ్యలో ఇరుక్కుని అన్న వాహికకు అడ్డుపడింది. ఎముక ముక్క గొంతు లోపలి భాగంలో రెండు వైపులా గుచ్చుకోవడంతో గాయమైంది. అన్నవాహిక వాపుతో పాటు తీవ్రమైన నొప్పితో బాధ పడటమే కాకుండా ఇటు మింగలేక.. అటు కక్కలేని పరిస్థితుల్లో ఉన్న అతడిని బంధువులు చికిత్స కోసం ఈ నెల 12న బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈఎన్టీ నిపుణుడు డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ భవానీరాజు, యూరాలజిస్ట్ వంశీకృష్ణల నేతృత్వంలోని వైద్య బృందం బాధితుడికి చికిత్స చేసింది. తొలుత ఎండోస్కోపీ సహాయంతో తొలగించాలని వైద్యులు భావించారు. అది కుదరక పోవడంతో లేజర్ సాంకేతిక పరిజ్ఞానంతో.. గొంతుకు అడ్డుగా ఉన్న ఎముకను రెండు ముక్కలుగా కట్ చేసి, ఆ తర్వాత వాటిని తొలగించారు. సాధారణంగా ఈ లేజర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడంలో ఉపయోగిస్తారు. గొంతులో ఇరికిన ఎముకను తొలగించడంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కేర్ వైద్యులు ఉపయోగించడం విశేషం. -
కేర్‌లో అరుదైన గుండె చికిత్స
సాక్షి, హైదరాబాద్: నైజీరియాకు చెందిన 13 ఏళ్ల అగతకు అరుదైన శస్త్రచికిత్స చేసి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి వైద్యులు కొత్త జీవితం ప్రసాదించారు. ఆ పాప పుట్టుకతోనే అరుదైన గుండె సంబంధ సమస్యలతో బాధపడుతుండేదని, వాటిని సరిదిద్దామని కేర్ ఆస్పత్రి పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. గుండె కుడివైపు ఉన్న గదులకు (కుడి కర్ణిక, కుడి జఠరిక) మధ్య ఉన్న కవాటం (ట్రైకస్పిడ్ వాల్వ్) ఆమెకు పుట్టినప్పటి నుంచి సరిగా పనిచేయట్లేదని, ఇలా ఉండటాన్ని ‘ఎబెస్టిన్స్ అనోమలీ’అంటారని పేర్కొన్నారు. సాధారణంగా ఉండాల్సిన స్థానం కన్నా ఈ కవాటం కిందకు ఉందని, ఆ కవాటం కూడా చాలా అసాధారణ స్థితిలో ఉందని చెప్పారు. ఈ సమస్య ప్రతి 2 లక్షల మందిలో ఒకరికి మాత్రమే వస్తుందని తెలిపారు. దీంతో కుడి కర్ణిక ఎక్కువ విశాలంగా ఉండి అందులోకి ఎక్కువ రక్తం చేరేదని వివరించారు. ఈ కారణంగా కుడి, ఎడమ కర్ణికల మధ్య ఉన్న గోడకు రంధ్రం ఏర్పడి ఈ రెండింటి మధ్య చెడు, మంచి రక్తం మార్పిడి జరుగుతుండేదని డాక్టర్లు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా గుండె పనితీరు సరిగా ఉండదని, ఒక్కోసారి గుండె వైఫల్యం చెందే ప్రమాదం ఉందని చెప్పారు. కేర్ హాస్పిటల్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ జీనా మఖీజా నేతృత్వంలో శస్త్రచికిత్స జరిపి ఆమె కవాటాన్ని సరిచేశారు. రెండు కర్ణికల మధ్య గోడకు ఉన్న రంధ్రాన్ని మూసేశారు. శస్త్రచికిత్స జరిగిన రెండో రోజే ఆమెను డిశ్చార్జి చేశారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత 11 రోజుల వ్యవధిలోనే ఆమె పూర్తిగా కోలుకునేలా చేయగలిగామని డాక్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కత్తిగాటు లేకుండా..రక్తపు చుక్క కారకుండా
సాక్షి, హైదరాబాద్: పొట్టపై కత్తిగాటు లేకుండా... రక్తం చిందించకుండా.. కనీసం నొప్పి కూడా తెలియకుండా బరువు తగ్గించే ప్రక్రియను కేర్ ఆస్పత్రి అందుబాటులోకి తెచ్చింది. కొవ్వు కరిగింపు చర్యలో భాగంగా బెరియాట్రిక్ సర్జరీల్లో ఇప్పటి వరకు అనుసరించిన కీహోల్‌కు బదులు.. తాజాగా రోబోటిక్ ఎండోస్కోపిక్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, స్లీప్ ఆప్నీయా వంటి సమస్యలతో బాధపడుతున్న స్థూలకాయులకు ఈ పద్ధతి ఓ వరం లాంటిది.బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా తొలిరోజే ముగ్గురు బాధితులకు విజయవంతంగా చికిత్స చేయడం విశేషం. ఈ మేరకు శుక్రవారం హోటల్ గోల్కొండలో ఈ అంశంపై ప్రముఖ రోబోటిక్ బెరియాట్రిక్ సర్జన్ డాక్టర్ మోహిత్ బండారి, కేర్ ఫెసిలిటీ చీఫ్ ఆపరేటివ్ ఆఫీసర్ డాక్టర్ రియాజ్ ఖాన్లు విలేకరులకు ఆ వివరాలు వెల్లడించారు. ఆ రెండు చికిత్సలకు భిన్నంగా.. బరువు తగ్గించే చికిత్సలు రెండు రకాలు. ఒకటి లైఫోసక్షన్. దీనిలో సూదుల ద్వారా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును బయటికి లాగేస్తుంటారు. ఇది అత్యంత ప్రమాదంతో కూడినది. రెండోది బెరియాట్రిక్ శస్త్రచికిత్స. ఈ ప్రక్రియలో పొట్టపై మూడు నుంచి నాలుగు చిన్నపాటి రంధ్రాలు చేసి(కీ– హోల్)బెలూన్ తో పెద్దపేగు సైజును తగ్గించే పద్ధతి. ఈ రెండు చికిత్సలూ ప్రమాదకరమైనవే. వీటికి ప్రత్యామ్నాయంగా శస్త్రచికిత్స అవసరం లేని ‘ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రో ప్లా స్టీ’అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్‌ల్లో మాత్రమే ఈ తరహా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. బెరియాట్రిక్, లైఫో సక్షన్కు భిన్నంగా ఈ ఎండోస్కోపిక్ పద్ధతి లో చేస్తారు. అత్యాధునిక కెమెరాతో తయారు చేసిన రోబోటిక్ ఎండోస్కోపిని నోటి ద్వారా పొట్టలోకి పంపించి, పెద్ద పేగు సైజు ను తగ్గించి కుట్లు వేసే ప్రక్రియే ఈ చికిత్స. పొట్ట సైజును 1/4 శాతం తగ్గిస్తారు. తక్కువ ఆహారానికే కడుపు నిండిపోవడం, ఎక్కువ ఆహారం తీసుకోలేక పోవడం వల్ల క్రమంగా బరువు తగ్గుతుంది. ఇలా 25 నుంచి 30 కేజీల వరకు తగ్గుతారు. ఈ తరహా చికిత్సలో కత్తిగాటు లేకపోవడమే కా దు..కనీసం నొప్పి కూడా తెలియదు. ఇన్ఫెక్షన్ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. బరువు తగ్గింపునకిది శాశ్వత పరిష్కారంగా వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. తొలి రోబోటిక్ బెరియాట్రిక్ సర్జన్ ఆయనే దేశంలో రోబోటిక్ బెరియాట్రిక్ సర్జరీలు నిర్వహించిన తొలి వైద్యుడు డాక్టర్ మోహిత్ బండారే. ఆయన ఇప్పటి వరకు 11 వేలకు పైగా కొవ్వు కరిగింపు చికిత్సలు చేశారు. కేవలం 11 గంటల్లో 25 చికిత్సలు చేసి, లిమ్కాబుక్‌లో చోటు సంపాదించారు. 2012లో 350 కేజీల బరువు ఉన్న ఆసియా మహిళకు ఆయన చికిత్స చేశారు. 2013లో ఆరేళ్ల బాలునికి బెరియాట్రిక్ నిర్వహించి ఖ్యాతి గాంచారు. -
పదిలంగా.. ఆ గుండె ప్రయాణం!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి, నాంపల్లిలోని కేర్ ఆస్పత్రి మధ్య మార్గం అది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనాల సరాసరి వేగం 25 కిలోమీటర్లకు మించదు. గురువారం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం డోనర్ గుండె(లైవ్ హార్ట్)ను ఆ మార్గంలో తీసుకెళ్లేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు ‘గ్రీన్ చానల్’ఇచ్చారు. ఫలితంగా ఈ 8 కి.మీల మార్గాన్ని అంబులెన్స్ కేవలం 7 నిమిషాల్లో అధిగమించింది. మధ్యాహ్నం 12.46కు యశోద ఆస్పత్రి నుంచి అంబులెన్స్ బయలుదేరగా.. కేర్ ఆస్పత్రికి 12.53కు చేరుకుంది. అనంతరం ప్రారంభమైన ఆపరేషన్ సాయంత్రం వరకు సాగింది. ఆపరేషన్ విజయవంతమైనట్లు వైద్యులు 6 గంటలకు ప్రకటించారు. మధ్యాహ్నం మొదలైన ‘ఆపరేషన్’.. నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య, పశ్చిమ మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్స్ అన్నీ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మోగాయి. ‘నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మేక ఆదిలక్ష్మీ అనే మహిళకు గుండె మార్పిడి చేయాల్సి ఉంది. ఆమెకు శస్త్రచికిత్స మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. డోనర్ ఇస్తున్న గుండె మధ్యాహ్నం 12.45 గంటలకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరుతుంది’అన్నది వాటిలో వినిపించిన సందేశం సారాంశం. దీంతో అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. 12.10 గంటల నుంచే ఈ రూట్లో ట్రాఫిక్ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు మొదలుపెట్టారు. నిరంతర పర్యవేక్షణ.. డోనర్ ఇచ్చిన గుండె ఉన్న బాక్స్‌ను తీసుకెళ్తున్న అంబులెన్స్ ఈ రెండు ఆస్పత్రులకు మధ్య ఉన్న 8 కి.మీల దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. మహంకాళి ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం ఓ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా వెళ్లడానికి సిద్ధమైంది. అలాగే ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో అధికారులు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ప్రయాణం ఆద్యంతం పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసుల సహకారం మరువలేం మా అమ్మకి మధ్యాహ్నం 12 గంటలకు ఆపరేషన్ మొదలైంది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో డోనర్ ఇచ్చిన లైవ్ హార్ట్ ఆపరేషన్ థియేటర్లోకి చేరినట్లు సమాచారం వచ్చింది. సాయంత్రం 5.20 వరకు సర్జరీ సాగగా.. సక్సెస్ అయినట్లు వైద్యులు 6 గంటలకు ప్రకటించారు. ఇందులో భాగస్వామ్యులైన పోలీసులు, ఆస్పత్రి వైద్యులకూ ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంతటి సహాయం చేసిన వారి సహకారం మరువలేనిది. –సునంద, ఆదిలక్ష్మీ కుమార్తె ఇదీ గుండె ప్రయాణం.. మధ్యాహ్నం 12.46 గంటలకు ‘లైవ్ హార్ట్ బాక్స్’తో ఉన్న అంబులెన్స్ సికింద్రాబాద్ యశోద నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి ప్యాట్నీ, బైబిల్ హౌస్, కార్బలా మైదాన్, ట్యాంక్‌బండ్, అంబేడ్కర్ విగ్రహం, లిబర్టీ, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్, ఖాన్ లతీఫ్ ఖాన్ ఎస్టేట్, ఉదయ్ ఆస్పత్రి, నాంపల్లి స్టేషన్ రోడ్, తాజ్ ఐలాండ్, గాంధీభవన్ మీదుగా ప్రయాణించి సరిగ్గా మధ్యాహ్నం 12.53కు నాంపల్లి కేర్‌కు చేరింది. ఈ మార్గంలోని అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు గ్రీన్ చానల్ ఇవ్వడంతో 7 నిమిషాల్లో గమ్యం చేరుకున్నాయి. -
పుట్టకముందే పునర్జన్మ!
సాక్షి, హైదరాబాద్: తల్లి గర్భంలో ఉండగానే ఓ శిశువు గుండెకు కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. మూసుకుపోయిన గుండె రక్తనాళాలను తెరిచి జన్మించకముందే పునర్జన్మ ప్ర సాదించారు. ఇలాంటి చికిత్స దేశంలోనే తొలిదని వైద్యులు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో డాక్టర్ కె.నాగేశ్వరరావు, డాక్టర్ టీవీఎస్ గోపాల్, డాక్టర్ శ్వేతబాబు, డాక్టర్ జగదీశ్, డాక్టర్ రియాజ్‌ఖాన్, డాక్టర్ రాఘవరాజు వివరాలను మీడియాకు వెల్లడించారు. 25వ వారంలో బయటపడ్డ లోపం కడప జిల్లా చిన్నమడెంకు చెందిన కీర్తి క్రిస్టఫర్(31)కు ఏడాది కింద వివాహమైంది. ఆమె గర్భం దాల్చింది. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా 25వ వారంలో ఆమెకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయగా, కడు పులో ఉన్న బిడ్డ గుండె (పల్మనరీ వాల్వ్)రక్తనాళం మూసుకుపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. పరిష్కారం కోసం రాయచూర్, కడపలోని వైద్య నిపుణులను సంప్రదించారు. వారి సూచన మేరకు మే చివరిలో కేర్ వైద్యులను సంప్రదించారు. పీడియాట్రిక్ హృద్రోగ నిపుణుడు డాక్టర్ నాగేశ్వర్రావు వైద్య పరీక్షలు చేశారు. గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే పల్మ నరీ వాల్వ్ మూసుకుపోవడంతో బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలలో లోపమున్నట్లు గుర్తించారు. చికిత్స అందించకుంటే కుడివైపు ఉన్న జఠరికం చిన్నగా మారుతుందని అన్నారు. శిశువు జన్మించాక ఊపిరితిత్తులకు రక్తం సరఫరా కాక, బిడ్డ శరీరం నీలం రంగులోకి మారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని, చికిత్స చేస్తే బతికించొచ్చని తెలి పారు. కీర్తి క్రిస్టఫర్ అంగీకరించడంతో జూన్ తొలివారంలో చికిత్స చేశారు. చికిత్స ఎలా చేశారంటే? చికిత్స సమయంలో బిడ్డ కదలికలతో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉండటంతో కడుపులోని బిడ్డ కదలికలను నియంత్రించేందుకు ముందు 18జీ సూదితో తల్లి ఉదరభాగం నుంచి బిడ్డ తొడభాగానికి ఇంజెక్షన్ ద్వారా అనస్థీషియా ఇచ్చారు. ఆ తర్వాత తల్లికి మత్తుమందు ఇచ్చారు. అల్ట్రాసౌండ్ సాయంతో తల్లి గర్భం నుంచి బిడ్డ గుండె వరకు సూదిని పంపారు. అదే సూది ద్వారా ఓ బెలూన్ను రక్త నాళంలోకి పంపి, మూసుకుపోయిన రక్తనాళాన్ని తెరిపించారు. ఈ ప్రక్రియ కు 48 నిమిషాల సమయం పట్టింది. ఇదే సమయంలో మరో బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు. అప్పుడు కడుపులోని బిడ్డ వయసు ఇరవై ఆరున్నర వారాలు మాత్రమే. ఇటీవల కీర్తి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం బిడ్డ 3.2 కేజీల బరువు ఉంది. బిడ్డ పుట్టిన రెండోరోజే రెండో బ్లాక్‌నూ బెలూన్ సాయంతో తెరిపించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ నాగేశ్వరరావు చెప్పారు. ఇప్పటి వరకు ఇలాంటి చికిత్సలు ఐదు చేయగా, మూసుకుపోయిన గుండె రక్తనాళం తెరిపించడం ఇదే మొదటి సారని వివరించారు. -
బొమ్మలపై వైద్యం!
చూసేందుకు అది బొమ్మే కానీ.. ఛాతిపై స్టెతస్కోప్ పెడితే లబ్డబ్మంటుంది. మణికట్టు వద్ద నాడీపట్టి చూస్తే పల్స్‌రేటు తెలిసిపోతుంది. శరీరంపై కత్తిగాటు పడితే రక్తం బయటికిచిమ్ముతుంది. ఇంజక్షన్ నీడిల్ గుచ్చితే కలిగే ఆ నొప్పికి ఏకంగా భోరున ఏడ్వటమే కాదు.. కన్నీరూ కారుస్తుంది. ఐసీయూలో చికిత్స చేసే సమయంలో రోగి నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో అచ్చం అలాంటి అనుభూతులే మిగుల్చుతున్నాయి సిమ్యులేషన్ బొమ్మలు.తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలకు.. ప్రాక్టీసు తోడైనప్పుడే మంచి ఫలితాలు లభిస్తాయి.ఆ ఉద్దేశంతోనే నగరంలోనే తొలిసారిగా కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ దీనిని ప్రారంభించింది. మృతదేహాల కొరతతో శిక్షణకు నోచుకోలేక పోతున్న వైద్యులకే కాదు నర్సులు, పారామెడికల్ స్టాఫ్‌కు సైతం ఈ సిమ్యులేషన్ బొమ్మలపై శిక్షణనిస్తోంది. సాక్షి, సిటీబ్యూరో :కారు మెకానిక్ నేర్చుకోవాలంటే ఓ పాతకారుపై శిక్షణ పొందితే సరిపోతుంది. ఈ సమయంలో ఏదైనా పొరపాటు జరిగిన మరోసారి నేర్చుకునే అవకాశం ఉంది. కానీ అదే వైద్య చికిత్సల్లో ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితి. సర్జరీల సమయంలో చేసే ఒంటిపై చేసే కోతలు, స్టంట్ల అమరికలు, కట్లు, కుట్ల విషయంలో సరైన అనుభవం లేకపోయినా.. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా రోగి ప్రాణాలకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వైద్య విద్యను బోధించేందుకు నగరంలో పలు ప్రైవేటు వైద్య కళాశాలలు, నర్సింగ్, పారామెడికల్ ఇనిస్టిట్యూట్లు ఉన్నప్పటికీ.. ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలు మినహా ప్రైవేటు ఇనిస్టిట్యూట్లలో శిక్షణకు అవసరమైన మృతదేహాలు లేకపోవడం, ప్రభుత్వపరంగా వాటికి అనుమతులు లేకపోవడంతో కనీస శిక్షణను కూడా పొందలేకపోతున్నారు. నిజానికి తరగతి గదిలో గురువు బోధించే పాఠాలు వైద్యంపై అవగాహన కల్పిస్తున్నాయే కానీ.. చికిత్సల్లో మెలకువలను, అనుభవాన్ని ఇవ్వలేక పోతున్నాయి. ఈ లోపాన్ని గుర్తించి కేర్ ఇనిస్టిట్యూట్ రెండు వేలకుపైగా సిమ్యులేషన్బొమ్మలను సమకూర్చుకుని వీటిపై శిక్షణ ఇస్తున్నాయి. సర్జరీలు ఎలా చేయాలి.. విరిగిన ఎముకలకు కట్లు ఎలా కట్టాలి... గాయాలకు కుట్లు ఎలా వేయాలి.. ఇంజక్షన్ ఎలా వేయాలి..? వంటి అంశాలపై సిమ్యులేషన్ పద్ధతిలో శిక్షణనిస్తున్నారు. ప్రాక్టీస్ సమయంలో అచ్చం రోగిలాగే ఈ బొమ్మలు కూడా స్పందనలు తెలియజేస్తుండటం వైద్య విద్యార్థులకు మంచి అనుభూతిని మిగుల్చుతున్నాయి. సిమ్యులేషన్ పద్ధతిలో శిక్షణ పొందిన వారు తమ పనితీరును మెరుగుపర్చుకోవడంతో పాటు మంచి ఉపాధి అవకాశాలను పొందుతుండటంతో ఈ కోర్సులకు ఇటీవల డిమాండ్ పెరిగిందంటున్నారు కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌సైన్స్ ప్రెసిడెంట్ మహేంద్రపాల. అనస్థీషియా ఇవ్వడం మొదలు ప్రసవాల వరకు ఇక్కడ శిక్షణఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. -
పోలీసుస్టేషన్ ముందే నిప్పంటించుకున్నాడు
హైదరాబాద్: తల్లిదండ్రులు, సోదరుడిపై తన మామ కేసు పెట్టినందుకు కోపంతో ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే పోలీసులు మంటలు ఆర్పి, అతడిని ఆస్పత్రికి తరలించారు. బీహెచ్ఈఎల్ సమీపంలోని బీరంగూడకు చెందిన సతీశ్(24) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గతేడాది ఏప్రిల్ 7న బంజారాహిల్స్ రోడ్ నెం.5లోని దేవరకొండ బస్తీకి చెందిన శివానితో అతడికి వివాహం జరిగింది. ఇటీవల అత్తమామలకు, శివానికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఈనెల 12న సతీశ్ తల్లి సీతాదేవి, తండ్రి మనోజ్‌కుమార్, సోదరుడు సాయికుమార్ దేవరకొండ బస్తీలోని శివాని ఇంటికి వచ్చారు. చెప్పకుండా పుట్టింటికి ఎందుకు వచ్చావంటూ గొడవ పడ్డారు. అక్కడే ఉన్న శివాని తల్లిదండ్రులు షగుప్తా, మనోజ్‌కుమార్‌లపై దుర్భాషలాడారు. దీంతో శివాని తండ్రి ఈ నెల 13న బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేశారు.ఈ విషయం తెలుసుకున్న సతీ‹శ్.. తీవ్ర ఆగ్రహంతో మామకు ఫోన్ చేసి వెంటనే కేసు వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. అల్లుడు తనను బెదిరిస్తున్న విషయాన్ని ఆయన పోలీసులకు చెప్పడంతో వారు సతీశ్‌కు ఫోన్ చేశారు. కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పి స్టేషన్‌కు రమ్మన్నారు. మట్టి పోసి మంటలు ఆర్పిన పోలీసులు... బుధవారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వచ్చిన సతీశ్.. మరోసారి మామకు ఫోన్ చేశాడు. కేసు వెనక్కి తీసుకోకుంటే చచ్చిపోతానని బెదిరించాడు. ఆయన సరిగా స్పందించకపోవడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకున్నాడు. మామను దుర్భాషలాడుతూ అగ్గిపుల్ల గీసి అంటించుకున్నాడు. ఒక్కసారిగా ఎగసిపడిన మంటల్లో చిక్కుకుని అటూ ఇటూ పరుగులు పెడుతున్న సతీశ్‌ను.. అక్కడే ఉన్న పోలీసులు కాపాడారు. అతడి మీద మట్టి పోసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వెంటనే కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి డీఆర్డీఏ అపోలోకు తరలించారు. ప్రస్తుతం సతీశ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని..భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. -
పెళ్లి ఇష్టంలేక యువతి ఆత్మహత్య
సాక్షి, విశాఖ క్రైం : పెళ్లి ఇష్టం లేని యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. గురుద్వార కూడలి శాంతిపురం అరుణ అపార్టుమెంట్లో సత్తరు అప్పన్న, నారాయణమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె సత్తరు రేవతి (20), కుమారుడు చైతన్య ఉన్నారు. అప్పన్న నెల్లూరులో మెకానిక్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె రేవతి డిగ్రీ పరీక్షలు రాసింది. రేవతికి బావతో పెళ్లి కుదిర్చారు. ఈనెల 22న వివాహం నిర్ణయించారు. ఈ క్రమంలో పెళ్లి పనుల్లో భాగంగా సోమవారం పెళ్లి కార్డుల పంపిణీకి రేవతి కుటుంబ సభ్యులు వెళ్లారు. ఈ నేపథ్యంలో రేవతి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ హుక్కు చున్నితో ఉరి వేసుకొని అత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రేవతి తల్లి, కుటుంబ సభ్యులు తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో గట్టిగా తోసి లోపలకు ప్రవేశించారు. ఇంటిలో సిలింగ్ హుక్కుకు వేలాడుతున్న రేవతిని చూశారు. వెంటనే ఆమెను కిందకు దించి కేర్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రేవతి తల్లి నారాయణమ్మ ద్వారకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన హెడ్ కానిస్టేబుల్ తులసీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం రేవతి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. చదువుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న రేవతి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసు విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బ్లడ్ గ్రూప్ వేరైనా కిడ్నీ మార్పిడి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో అరుదైన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించారు. బ్లడ్ గ్రూప్ వేరైనా కిడ్నీ మార్పిడిని విజయవంతంగా చేశారు. ‘బి’పాజిటివ్ బ్లడ్‌గ్రూప్ స్వీకర్తకు ‘ఎ’పాజిటివ్ దాత కిడ్నీని ‘ఏబీవో ఇన్‌కాంపిటెబుల్’పద్ధతిలో వైద్యులు విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం దాత, స్వీకర్తలిద్దరూ కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్జరీకి సంబంధించిన వివరాలను నెఫ్రాలజీ వైద్యనిపుణుడు డాక్టర్ విక్రాంత్‌రెడ్డి వెల్లడించారు. అస్సాంకు చెందిన నిలాధన్ సింఘా(42) కిడ్నీ సంబంధిత సమస్యతో కేర్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించాడు. వైద్యులు పరీక్షించి కిడ్నీ పనితీరు దెబ్బతిన్నట్లు గుర్తించారు. క్రియాటిన్ 16.0 గా నమోదైంది. యాంటీబాడీస్ బాగా తగ్గిపోవడంతో కిడ్నీ మార్పిడి అనివార్యమైంది. స్వీకర్త బ్లడ్ గ్రూప్‌నకు సంబంధించిన దాతలెవరూ కిడ్నీ దానానికి ముందుకు రాలేదు. చివరకు ఆయన భార్య లువాంగ్ సింఘా(37) కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే, స్వీకర్త బ్లడ్‌గ్రూప్ ‘బి’పాజిటివ్ కాగా, దాతది ‘ఎ’పాజిటివ్. సాధారణంగా రెండు వేర్వేరు బ్లడ్‌గ్రూప్‌ల మధ్య అవయవదాన మార్పిడి శస్త్ర చికిత్సలు చేయరు. ఒకవేళ చేసినా స్వీకర్త శరీరం దాత అవయవాన్ని తిరస్కరిస్తుంది. చికిత్సకు మరోదారి లేకపోవడంతో వైద్యులు ఏప్రిల్ మొదటివారంలో ‘ఏబీవో ఇన్‌కాంపిటెబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్’పద్థతిలో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. -
కేర్ సెంటర్
గర్భిణి అయ్యాక కేర్ తీసుకోవాలి. ప్రసవం అయ్యాక కేర్ తీసుకోవాలి.కనీసం ఐదేళ్ల వరకైనా..కంట్లో ఒత్తులు వేసుకుని బిడ్డను పొత్తిళ్లలో పెట్టుకుని కేర్ తీసుకోవాలి.బిడ్డ కేర్ ఒక్కటే కాదు.. తల్లి కేర్ కూడా... ఇంత కేర్ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని కాల్ సెంటర్ తీసుకుంటోంది.అందుకే అది..కాల్ సెంటర్ మాత్రమే కాదు. కేర్ సెంటర్ కూడా! ‘‘హలో.. లక్ష్మమ్మా.. ఆరోగ్యం ఎలా ఉంది.. ఈ నెల డాక్టర్ దగ్గరకు పోయినవా.. స్కానింగ్ చేసిండ్రా.. మందులు వేసుకుంటున్నవా.. ఏం ప్రాబ్లం లేదు కదా.. పండంటి బిడ్డను కనాలే’’ – ఫోన్లో ఓ ఆత్మీయ పలకరింపు.‘‘నా ఆరోగ్యం అదీ మంచిగనే ఉంది. డాక్టర్ దగ్గరకు పోయిన.. స్కానింగ్ చేసి కడుపుల బిడ్డ మంచిగనే ఉందని చెప్పిండ్రు.. నా బరువు ఇంకా పెరగాలే అని చెప్పిండ్రు.. అది సరే.. ఇంతకీ మీరెవరమ్మా.. నేను కడుపుతో ఉన్న అని మీకెట్ల తెలుసు. నా నంబరు మీకెవరు ఇచ్చిండ్రు’’ అవతలి నుంచి సమాధానం.‘‘అమ్మా.. మేము సంగారెడ్డి సర్కారు దవాఖానా కాల్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నం. మీరు ప్రెగ్నెంట్‌గా ఉన్నట్లు మీ ఏరియా ఎఎన్ఎం ద్వారా మాకు తెలిసింది. మీ ప్రసవం జరిగి, పుట్టే పిల్లలకు ఐదేళ్ల టీకాలు వేసే దాకా మేం అప్పుడప్పుడు ఫోన్ చేస్తం. మీ ఆరోగ్యం ఎట్ల ఉందో ఎప్పటికప్పుడు చెప్తూ ఉండండి’’.సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ.. గర్భిణులు, బాలింతల కోసం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ద్వారా ప్రతీ రోజూ వెళ్లే సుమారు వంద ఫో¯Œ కాల్స్ సంభాషణ.. ఇంచు మించు ఈ రీతిలోనే సాగుతూ ఉంటుంది. మాతృత్వం ఓ వరం గర్భం దాల్చింది మొదలు.. ప్రసవం.. శిశు సంరక్షణ వరకు తల్లీ బిడ్డల ఆరోగ్య రక్షణ ఓ సవాలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ అంశాలపై చాలా మందికి అవగాహన ఉండదు. ఇలాంటి వారి కోసం గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన మాణిక్కరాజ్ కణ్ణన్ ఓ వినూత్న ఆలోచన చేశారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరించే జిల్లా కలెక్టర్.. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య పరమైన సూచనలు అందించేందుకు ప్రత్యేకంగా ఓ ‘కాల్ సెంటర్’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గత ఏడాది ఫిబ్రవరి 10న జిల్లా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రారంభమైన ఈ కాల్ సెంటర్ ఏడాదిలో దాదాపు 32వేల మంది గర్భిణులు, బాలింతలకు వైద్య పరమైన సూచనలు, సలహాలు అందించింది. గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, సబ్ సెంటర్ ఎఎన్ఎంలు అక్కడి గర్భిణుల సమాచారం సేకరించి, వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ వెబ్సైట్లో నమోదు చేస్తారు. ఈ సమాచారం నేరుగా ‘కాల్ సెంటర్’ డాష్ బోర్డు మీదకు చేరుతుంది. ఇలా ప్రతీ రోజూ సుమారు వంద మంది గర్భిణులు, బాలింతలకు వైద్య పరమైన సూచనలు, సమాచారాన్ని కాల్ సెంటర్ ఉద్యోగులు చేరవేస్తూ ఉంటారు. రెడ్‌క్రాస్ సొసైటీ నేతృత్వ నిర్వహణలో ఉన్న ఈ కాల్ సెంటర్ ద్వారా గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 6812 మంది చిన్నారులకు వేక్సినేషన్ లభించింది. ప్రయోగాత్మకం.. ఫలితం అద్భుతం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి పనిచేసే ఈ కాల్ సెంటర్ ఆదివారం, ప్రభుత్వ సెలవు రోజులను మినహాయించి.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తుంది. పల్లెలు, పట్టణం అనే తేడా లేకుండా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది క్షేత్ర స్థాయి నుంచి సేకరించి, ఆన్లైన్లో నమోదు చేస్తారు. గర్భిణులకు సంబంధించి మూడో నెల నుంచి తొమ్మిదో నెల వరకు నాలుగు పర్యాయాలు కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేస్తారు. స్కానింగ్ చేయించుకున్నారా, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారా, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారా, డాక్టర్‌ను కలిశారా, బరువు పెరుగుతోందా, మందులు వాడుతున్నారా, స్కానింగ్‌లో కానీ రిపోర్టుల్లో ఏమైనా సమస్య ఉన్నట్లు డాక్టర్లు చెప్పారా.. వంటి ప్రశ్నలు అడుగుతారు. వారు చెప్పే విషయాల్లో.. ఏదైనా సమస్య ఉంటే కాల్ సెంటర్ ఉద్యోగులు నమోదు చేసుకుని డీఎంహెచ్ఓ ద్వారా సంబంధిత వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్తారు. పనిలో పనిగా వారికి సమీపంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రులు, అందుబాటులో ఉండే సేవలు తదితరాల గురించి వివరిస్తారు. రక్తహీనతతో ఎదురయ్యే సమస్యలు, ఐరన్, ఫోలిక్ మాత్రల వినియోగం వంటి అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. డెలివరీ తేదీ దగ్గరపడే సమయంలో వారు ఏ ఆసుపత్రిలో చేరాలనుకుంటున్నారో ముందే తెలుసుకుని.. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలనుకుంటే వైద్యులకు కాల్ సెంటర్ ద్వారా ముందే సమాచారం ఇస్తారు. రిటర్న్ కాల్స్‌తో.. కొత్త ఉత్సాహం కాల్ సెంటర్ ప్రారంభమైన నాటి నుంచి ఒక్కో గర్భిణి లేదా బాలింతతో కనీసం డజను సార్లు మాట్లాడి ఉంటాం. మా నుంచి ఫోన్ వెళ్లిన వెంటనే.. వాళ్లే మమ్మలను ఎలా ఉన్నారని పలకరిస్తారు. ప్రసవం తర్వాత చాలా సార్లు రిటర్న్ కాల్ చేసి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు. వారి నుంచి వచ్చే ఫోన్ కాల్స్ మాలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి. చాలా సార్లు కాల్‌సెంటర్ పనివేళలతో సంబంధం లేకుండా ఫోన్లు వచ్చినా.. వివరాలు చెప్తూ ఉంటాం. ఇక్కడ జిల్లా ఆసుపత్రిలో ప్రసవించే వారు.. తమ శిశువును చూసి వెళ్లాల్సిందిగా ఆత్మీయంగా ఆహ్వానిస్తూ ఉంటారు. అప్పుడప్పుడూ విచిత్ర అనుభవాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. డెలివరీ డేట్ దగ్గర పడినందున ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా ఓ నిండు గర్భిణికి సూచించాం. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత ఆ మహిళ భర్త ఫోన్ చేసి.. తన భార్యకు నొప్పులు రావడం లేదంటూ ఆందోళన పడుతూ ఫోన్ చేశాడు. అక్కడున్న డాక్టర్లు చూసుకుంటారు, ఆందోళన పడొద్దని చెప్పాం.. మరుసటి రోజు ఫోన్ చేసి తాను టెన్షన్ పడి ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు కోరాడు. ఏదేమైనా.. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగినట్లు మాకు వచ్చే రిటర్న్ కాల్స్ చెప్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న అపోహలను తొలగించడమే మా విధి.. బాధ్యత. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు గత ఏడాది జూన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే వారికి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్లను అందిస్తోంది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించే లక్ష్యంతో గత ఏడాది ఫిబ్రవరిలో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. రెడ్ క్రాస్ ద్వారా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి.. నిర్వహణకు సంబంధించి శాలిని, గౌతమి అనే ఇద్దరు యువతులకు శిక్షణ ఇప్పించాం. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాలి, డాక్టర్లు ఏ సమయంలో అందుబాటులో ఉంటారు, ప్రసవానికి ఎప్పుడు ఆసుపత్రికి రావాలి అనే ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడు సిబ్బంది తేదీల వారీగా తెలియ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి కాల్ చేయడమే కాదు.. అవతలి నుంచి వచ్చే అనుమానాలు, ఫిర్యాదులు, ఇబ్బందులు.. ఏవైనా దృష్టికి తెస్తే కాల్ సెంటర్ ఉద్యోగులు ఓపికగా వారికి సూచనలు ఇస్తారు. నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ కాల్‌సెంటర్ పనితీరును ఇటీవలే పరిశీలించి వెళ్లారు. – డాక్టర్ శశాంక్ దేశ్‌పాండే, కాల్ సెంటర్ ఇన్చార్జి – దండు దయానందం, సాక్షి, సంగారెడ్డి -
ఫ్యామిలీ డాక్టర్
గుండె సమస్య కాదంటున్నారు... మరెందుకీ నొప్పి? నా వయసు 39 ఏళ్లు. నాకు తరచూ ఛాతీ ఎడమభాగంలో నొప్పి వస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ నొప్పితో బాధపడుతున్నాను. కార్డియాలజిస్టును కలిసి గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలూ చేయించుకున్నాను. సమస్య ఏమీ లేదని అంటున్నారు. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. రాత్రివేళల్లో నొప్పి మరీ ఎక్కువ అవుతోంది. సమస్య ఏమై ఉంటుంది? ఈ నొప్పి తగ్గే మార్గం లేదా? – ఆంజనేయరెడ్డి, కర్నూలు మీరు తెలిపిన వివరాలు, పేర్కొన్న లక్షణాలను బట్టి మీకు ఆహార వాహికకు సంబంధించిన ‘రిఫ్లక్స్ డిసీజ్’తో బాధపడుతున్నట్లు అర్థమవుతోంది. ఇది సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఒకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. అందులో మీ రిఫ్లక్స్ డిసీజ్ తీవ్రత తెలుస్తుంది. రాత్రివేళల్లో నొప్పి ఎక్కువ అంటున్నారు కాబట్టి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును కలసి, ఆ నొప్పిని తగ్గించుకునే మందులు వాడండి. మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారపదార్థాలు మీ సమస్యను తీవ్రతరం చేస్తాయి. వాటిని వాడటం వల్ల లక్షణాలు పెరుగుతాయి. వాటిని గుర్తించి, వాటినుంచి దూరంగా ఉండాలి. ఇటువంటి మార్పులతో మీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఛాతీలో మంట.. తగ్గేదెలా? నా వయసు 42 ఏళ్లు. నేను చాలా రోజుల నుంచి ఛాతీలో మంటతో బాధపడుతున్నాను. యాంటాసిడ్ సిరప్ తాగినప్పుడు మంట తగ్గుతోంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ పరిస్థితి మామూలే. దీన్ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి ఏం చేయాలి? నాకు తగిన సలహా ఇవ్వగలరు. – అనిల్‌కుమార్, మిర్యాలగూడ మీరు తెలిపిన వివరాలు, లక్షణాలను బట్టి చూస్తే మీరు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్యమిది. మీ రోజువారీ జీవనశైలినీ, ఆహారపు అలవాట్లనూ సరిచేసుకుంటే ఈ వ్యాధి చాలావరకు తగ్గుముఖం పడుతుంది. ఈ సమస్య తగ్గడానికి కొన్ని సూచనలివి... మీరు తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించడం కాఫీ, టీలను పూర్తిగా మానేయడం ∙పొగతాగే అలవాటు ఉంటే పూర్తిగా మానేయడం, మద్యం అలవాటుకు దూరంగా ఉండటం ∙బరువు ఎక్కువగా ఉంటే దాన్ని సరైన స్థాయికి తగ్గించడం ∙భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కాస్త సమయం తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి తలవైపున పడక కొంచెం ఎత్తుగా ఉండేలా అమర్చుకోవాలి. పై సూచనలతో పాటు మీ డాక్టర్ సలహా మీద పీపీఐ డ్రగ్స్ అనే మందులు వాడాలి. అప్పటికీ తగ్గకపోతే ఎండోస్కోపీ చేయించుకొని తగిన చికిత్స తీసుకోండి. హెచ్‌బీఎస్‌ఏజీ పాజిటివ్... పరిష్కారం చెప్పండి నా వయసు 32 ఏళ్లు. నేను ఒక సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాను. ఇటీవల మా సంస్థ నిర్వహించిన మెడికల్ క్యాంప్‌లో నాకు హెచ్‌బీఎస్‌ఏజీ పాజిటివ్ వచ్చిందని తెలిసింది. దీనివల్ల కాలేయం చెడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. నిజమేనా? నా వ్యాధి మందులతో తగ్గిపోతుందా? తగిన సలహా చెప్పి, పరిష్కారం చూపండి. – ఎమ్.ఎస్.ఎస్. హైదరాబాద్ మీరు హెపటైటిస్–బి అనే ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఈ వైరస్ రక్తంలో ఉన్నంత మాత్రాన కాలేయం చెడిపోయే అవకాశం లేదు. రక్తంలో ఈ వైరస్ ఉండే దశను బట్టి లివర్ చెడిపోయే అవకాశం ఉంటుంది. వైరస్ ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. లివర్ ఫంక్షన్ పరీక్షలో తేడా వస్తే ఒకసారి మీకు దగ్గర్లో ఉండే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి చికిత్స తీసుకోవచ్చు. కడుపులో అల్సర్, పిత్తాశయంలో రాయి...! నా వయసు 40 ఏళ్లు. గత నెలరోజులుగా కడుపులో మంట, నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాను. పరీక్షల్లో కడుపులో అల్సర్ (చిన్న పుండు) ఉంది అని తేలింది. అల్ట్రాసౌండ్‌లో పిత్తాశయంలో రాయి ఉన్నట్లుగా వచ్చింది. ఈ సమస్య మందులతో తగ్గుతుందా, ఆపరేషన్ అవసరమా? – మల్లయ్య, వరంగల్ సాధారణంగా వయసు పెరిగేకొద్దీ పిత్తాశయంలో (గాల్‌బ్లాడర్‌లో) రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. పిత్తాశయంలో రాళ్లు ఉన్నంతమాత్రాన ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ రాళ్ల వల్ల తరచూ నొప్పి వస్తుంటే అప్పుడు గాల్‌బ్లాడర్‌ను తొలగించాల్సి ఉంటుంది. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీకు యాసిడ్ పెప్టిక్ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మీకు వచ్చే నొప్పి పిత్తాశయానికి సంబంధించినది కాదు. కాబట్టి మీరు భయపడాల్సిందేమీ లేదు. ఒకసారి వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నవజాత శిశువుకు అరుదైన చికిత్స
సాక్షి, హైదరాబాద్ : గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఓ నవజాత శిశువుకు కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. చికిత్స అనంతరం శిశువు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. హృద్రోగ నిపుణుడు డాక్టర్ తపన్ కె.దాస్, డాక్టర్ నాగేశ్వర్ గురువారం ఇక్కడ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చికిత్స వివరాలు వెల్లడించారు. నగరంలోని పాతబస్తీకి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖదీర్ దంపతులకు ఇటీవల మగశిశువు జన్మించాడు. శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, ఆయాసం వంటి సమస్యలతో బాధపడుతున్న శిశువును స్థానిక వైద్యుల సూచన మేరకు తల్లిదండ్రులు కేర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల్లో శిశువు పుట్టుకతోనే హృద్రోగ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం మూసుకుపోయినట్లు గుర్తించారు. రక్తనాళ మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. మైట్రల్‌వాల్వ్ పునరుద్ధరణ ద్వారా... సాధారణంగా ప్రతి వందమంది పిల్లల్లో ఎవరో ఒకరికి మాత్రమే ఇలాంటి సమస్యతో జన్మిస్తుంటారు. తల్లిదండ్రుల అంగీకారంతో 11 రోజుల క్రితం శిశువుకు ఓపెన్‌హార్ట్ సర్జరీ చేసి, మైట్రల్‌వాల్వ్‌ను పునరుద్ధరించారు. సాధారణం గా ఇలాంటి కేసుల్లో ఆవు ద్వారా సేకరించిన రక్తనాళం కానీ మెటల్వాల్వ్ కానీ రీప్లేస్ చేస్తారు. గుండె కండరాలకు అతుక్కుపోయిన రక్తనాళాన్ని కట్ చేసి సరి చేశారు. 2.6 కేజీల బరువుతో జన్మించిన శిశువుకు ఇలాంటి సర్జరీ చేయడం ప్రపంచంలోనే చాలా అరుదని వైద్యులు ప్రకటించారు. ఇలాంటి చికిత్సలకు రూ.ఆరు లక్షల వరకు ఖర్చు అవుతుండగా, శిశువు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వైద్య ఖర్చులో 50శాతం రాయితీ ఇచ్చినట్లు ఆస్పత్రి సీఈవో రియాజ్ తెలిపారు. శిశువుకు భవిష్యత్‌లో ఎలాంటి సమస్య ఉండదని, మరోసారి సర్జరీ చేయాల్సిన అవసరం కూడా రాబోదని డాక్టర్ తపన్ కె.దాస్ స్పష్టం చేశారు. -
రిటైర్డ్ ఐఏఎస్ పీవీఆర్కే ప్రసాద్ ఇకలేరు
-
రిటైర్డ్ ఐఏఎస్ పీవీఆర్కే ప్రసాద్ ఇకలేరు
పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ (77) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత శుక్రవారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు కేర్ ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. ఆయన భౌతికకాయాన్ని బంజారాహిల్స్ రోడ్ నంబర్7లోని స్వగృహానికి తరలించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ ముఖ్య సలహాదారు పరకాల ప్రభాకర్, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయన కుమారుడు సంజీవి ప్రసాద్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఐవైఆర్ కృష్ణారావు, ఎంవీఎస్ ప్రసాద్, చెంగప్ప, రాంబాబు, ఎన్వీ భాస్కర్‌రావు, బీవీ రామారావు, కృష్ణారావు, సత్యనారాయణ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు సమాచార సలహాదారుగా ప్రసాద్ పనిచేశారు. టీటీడీ ఈవోగా తిరుమల విశిష్టతపై పలు రచనలు చేశారు. కేసీఆర్, చంద్రబాబు సంతాపం..: ప్రసాద్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు సమాచార సలహాదారుగా ప్రసాద్ పనిచేశారని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. పీవీఆర్కే ప్రసాద్ సమర్థవం తమైన అధికారిగా వ్యవహరించారని, ప్రభుత్వానికి విశేషమైన సేవలు అందిం చారని చంద్రబాబు కొనియాడారు. టీటీడీ ఈవోగా పనిచేసిన కాలంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించారన్నారు. పీవీఆర్కే ప్రసాద్ మృతిపై జగన్ సంతాపం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో పీవీఆర్కే ప్రసాద్ (77) మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. ప్రసాద్ కుటుంబసభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలు కీలక పదవుల్లో పనిచేసిన ఆయన విధి నిర్వహణలో చిత్తశుద్ధిగా వ్యవహరించారన్నారు. -
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కన్నుమూత
నేడు గుణదలలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి, టీడీపీ సీని యర్ నేత దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)(62) సోమవారం ఉదయం 5.20 గంటలకు హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా అనా రోగ్యంతో ఉన్న ఆయన కేర్ ఆస్పత్రిలో చికిత్స పొంది, రెండు రోజుల క్రితం డిశ్చార్జయి హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం తెల్లవారుజామున తిరిగి అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. దేవినేనికి భార్య లక్ష్మి, కుమారుడు అవి నాష్, కుమార్తె ఉన్నారు. దేవినేని భౌతిక కాయాన్ని సోమవారం మధ్యాహ్నం విజయవాడ గుణదలలోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. ఆయన అంత్యక్రియలు గుణదలలోని వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం సాయంత్రం నిర్వహిస్తారు. రాజకీయ ప్రస్థానం: విద్యార్థి నేతగా రాజ కీయ జీవితాన్ని ప్రారంభించిన దేవినేని ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కృష్ణా జిల్లాలో కీలక రాజకీయ నేతగా గుర్తింపుపొందారు. దేవినేని విజయవాడలో 1982లో యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (యూఎస్‌వో)ను స్థాపించారు. 1982లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. టీడీపీ తరçఫున 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో కృష్ణా జిల్లా కంకిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో ఎన్టీరామారావు మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. 1995లో ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి దింపేందుకు చంద్రబాబు చేసిన వైస్రాయ్ కుట్ర సమయంలో నెహ్రూ ఎన్టీరామారావు వెంట నిలిచారు. ఎన్టీఆర్ మరణానంతరం 1996లో లక్ష్మీపార్వతి నేతృత్వంలోని ఎన్టీఆర్ టీడీపీ తరఫున విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆయన 1999లో కంకిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్ నుంచే కంకిపాడు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009, 2014లో విజ యవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కుమారుడు అవి నాష్ కూడా విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2016లో టీడీపీలో చేరారు. నిబద్ధత గల వ్యక్తి: ఏపీ సీఎం బాబు ఎన్టీఆర్‌కు నెహ్రూ అత్యంత సన్నిహితులని, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. త్వరలోనే జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో ఒక భారీ సమావేశం ఏర్పాటు చేయాలని దేవినేని భావించారని.. ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్ అంటే ఎనలేని అభిమానం దేవినేనికి దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎనలేని అభిమానం. తన రాజకీయ జీవితానికి ఇద్దర్నీ రెండు కళ్లుగా భావించేవారు. తనకు రాజకీయ జీవితం ఎన్టీఆర్ ప్రసాదించారని, వైఎస్ వ్యక్తిత్వం చూసి ఆయనకు ఆకర్షితుడ్ని అయ్యానని పలుమార్లు బహిరంగంగానే చెప్పేవారు. కాంగ్రెస్ పార్టీ వీడి రెండవసారి టీడీపీలో చేరేవరకు వైఎస్సార్ జిల్లాకు చేసిన సేవల్ని కొనియాడేవారు. బాబును, తెలుగుదేశంపార్టీ నేతల్ని ఘాటుగా విమర్శించేందుకు వెనుకాడేవారు కాదు. ఆయన పట్టిసీమను వ్యతిరేకించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని స్వాగతించారు. కృష్ణాడెల్టా రైతు ఉద్యమాల్లో ముందుండేవారు. తాను నమ్ముకున్న పార్టీ కోసం పనిచేయడం నెహ్రూ స్వభావం. ఆయన టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా ఎక్కువ కాలం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 1982 నుంచి 1996వరకు 14ఏళ్లు టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీలో కొనసాగారు. 1996 నుంచి 2016 వరకు 20 ఏళ్లు ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. దేవినేనికి దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎనలేని అభిమానం. తన రాజకీయ జీవితానికి ఇద్దర్నీ రెండు కళ్లుగా భావించేవారు. తనకు రాజకీయ జీవితం ఎన్టీఆర్ ప్రసాదించారని, వైఎస్ వ్యక్తిత్వం చూసి ఆయనకు ఆకర్షితుడ్ని అయ్యానని పలుమార్లు బహిరంగంగానే చెప్పేవారు. కాంగ్రెస్ పార్టీ వీడి రెండవసారి టీడీపీలో చేరేవరకు వైఎస్సార్ జిల్లాకు చేసిన సేవల్ని కొనియాడేవారు. బాబును, తెలుగుదేశంపార్టీ నేతల్ని ఘాటుగా విమర్శించేందుకు వెనుకాడేవారు కాదు. ఆయన పట్టిసీమను వ్యతిరేకించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని స్వాగతించారు. కృష్ణాడెల్టా రైతు ఉద్యమాల్లో ముందుండేవారు. తాను నమ్ముకున్న పార్టీ కోసం పనిచేయడం నెహ్రూ స్వభావం. ఆయన టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా ఎక్కువ కాలం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 1982 నుంచి 1996వరకు 14ఏళ్లు టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీలో కొనసాగారు. 1996 నుంచి 2016 వరకు 20 ఏళ్లు ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. -
దేవినేని నెహ్రూకి లోకేష్ నివాళి
విజయవాడ : గుణదలలో దేవినేని నెహ్రు పార్థీవ దేహానికి ఏపీ మంత్రులు నారా లోకేష్, దేవినేని ఉమ నివాళులర్పించారు. అనంతరం నారా లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా రాజకీయాల్లో తనకంటూ మార్క్ ఏర్పరచుకున్న వ్యక్తి నెహ్రు అని కొనియాడారు. మంత్రిగా, ఎమ్మెల్యే గా నిరంతరం ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఆయనని, 45 రోజులుగా నాకు రాజకీయాల గురించి అనేక సలహాలు ఇచ్చారని తెలిపారు. సిద్దాంతాలను నమ్ముకున్న వ్యక్తి నెహ్రూ అని, ఆయన కుటుంబాన్ని, కార్యకర్తలను టీడీపీ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. నెహ్రూ కుమారుడు అవినాష్‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం దేవినేని ఉమ మాట్లాడుతూ.. బెజవాడ రాజకీయాలలో నెహ్రూ మరపురానీ వ్యక్తి అని, ఈ రోజు మన నుంచి దూరం అవ్వడం నిజంగా శోచనీయమన్నారు. నిత్యం ప్రజలో ఉండే వ్యక్తి నెహ్రూ..తన అనుకున్న వారి కోసం దేనికీ వెనుకాడబోని నాయకుని కోల్పోయామని చెప్పారు. -
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కన్నుమూత
-
దేవినేని నెహ్రూ కన్నుమూత
-
చిరు గుండెకు రెండు గంటల్లో చికిత్స
గుండె నిర్మాణంలో లోపం.. పునర్జన్మ ప్రసాదించిన కేర్ వైద్యులు సాక్షి, హైదరాబాద్: గుండె నిర్మాణ లోపంతో బాధపడుతూ మృత్యువు తో పోరాడుతున్న ఓ శిశువుకు హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ ఆస్ప త్రి వైద్యులు చికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు. చీఫ్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ తపన్ దాస్, చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ నాగే శ్వర్రావు, ఆనంద్, రామకృష్ణ, రజేన్లతో కూడిన వైద్యబృందం చిన్నారి కి విజయవంతంగా చికిత్స చేసింది. ఈ వివరాలను శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించింది. నిర్మల్ జిల్లా నర్సాపూర్ కు చెందిన పుష్పలత, నవీన్ దంపతులకు ఇటీవల తక్కువ బరువు(1400 గ్రాముల)తో శిశువు జన్మించింది. చిన్నారి పుట్టుకతోనే గుండె నిర్మాణ లోపం ఉంది. దీంతో స్థానిక వైద్యు ల సూచన మేరకు ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డను మార్చి 7న కేర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి బిడ్డ గుండెలో ఎడమవైపు ఉండాల్సిన భాగం కుడివైపు, కుడివైపు భాగం ఎడమవైపు ఉన్నట్లు గుర్తించారు. 12 మందితో కూడిన వైద్య బృందం రెండు గంటలపాటు శ్రమించి చికిత్స చేసింది. పాప పూర్తిగా కోలుకున్నట్లు డాక్టర్ తపన్‌దాస్ తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో శిశువుకు ఉచితంగా చికిత్స చేసినట్లు తెలిపారు. -
మూడ్రోజుల బిడ్డకు అరుదైన శస్త్రచికిత్స
-
మానవతకు పాతరేసిన వారిపై కేసులు
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): నెలలు నిండకుండానే పుట్టిన పాపానికి మూడురోజుల పసికందుకు మరణ శిక్ష వేయాలనుకున్న వారిపై కేసులు నమోదయ్యాయి. ప్రాణాలతోనే శిశువును పాతిపెట్టేందుకు ప్రయత్నించిన ఉదంతం సంచలనం సృష్టించింది. సాక్షిలో ‘మానవతకు పాతర’ శీర్షికతో కథనం ప్రచురితమైన నేపథ్యంలో పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎంవీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్ మళ్ల మహేశ్ బుధవారం తెలిపారు. శిశువును పూడ్చి పెట్టడానికి ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డు లక్ష్మణ్, శిశువు తండ్రి రాంబాబులతోపాటు కృష్ణా క్రిటికల్ కేర్ ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఒడిశాలో కేర్ ఆసుపత్రి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న కేర్ హాస్పిటల్స్, ఒడిశా ప్రభుత్వం చేతులు కలి పాయి. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలోని జార్సుగూడలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆసుపత్రిని 15 ఏళ్లపాటు కేర్ నిర్వహించనుంది. 100 పడకల సామర్థ్యంతో రానున్న ఈ సూపర్ స్పెషాలిటీ కార్డియాక్ కేర్ హాస్పిటల్‌కు ప్రభుత్వం రూ.75 కోట్ల వ్యయం చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటవుతున్న ఈ హాస్పిటల్ నిర్మాణం రెండేళ్లలో పూర్తి అవుతుంది. పశ్చిమ ఒడిశాలో ఇటువంటి ఆసుపత్రి ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. హాస్పిటల్ సామర్థ్యంలో 50 శాతం పేదలకు కేటాయిస్తారు. వీరికి ఉచితంగా సేవలు అందిస్తారు. ఒడిశా రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమక్షంలో మంగళవారం ఒప్పందం జరిగింది. కార్యక్రమానికి కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ బి.సోమరాజు, సీవోవో కసి రాజు పాల్గొన్నారు. కేర్ ఖాతాలో ప్రస్తుతం 14 ఆసుపత్రులు ఉన్నాయి. -
ఆరిపోతూ వెలుగిచ్చిన జీవన దీపం
పాతపోస్టాఫీసు: కొన్ని జీవితాలను చూస్తే విధికి ఎందుకంత కంటగింపో ఎవరు చెప్పగలరు? విధి వైచిత్రిని, వైపరీత్యాన్ని ఎవరు ఊహించగలరు? మృత్యు కెరటంలా విరుచుకుపడే విధి ఎన్నో కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచెత్తుతుంది. అనూహ్య పరిణామాలతో జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంది. ఎంవీపీ కాలనీకి చెందిన పిళ్లా ధనలక్ష్మి కుటుంబం పరిస్థితీ అదే విధంగా మారింది. ఏడాది వ్యవధిలో మృత్యువు ఆమె భర్తను, తర్వాత ఆమెను దిగమింగడంతో ఇద్దరు పిల్లల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇంత విషాదంలోనూ ఆమె బం ధువులు, పిల్లలు అవయవదానానికి సమ్మతించడంతో ధనలక్ష్మి జీవితం కడతేరినా, మరికొందరికి ప్రాణదానం చేసి నట్టురుుంది. ఎంవీపీ కాలనీకి చెందిన పిల్లా ధనలక్ష్మి (35) శుక్రవారం అనకాపల్లిలోని బంధువుల గహ ప్రవేశానికి వెళ్లి బావ గోవింద్ ద్విచక్రవాహనంపై నగరానికి వస్తుండగా సబ్బవరం దేవీపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలయ్యారు. తలకు దెబ్బ తగలడంతో ఆమెను రాంనగర్ కేర్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. శనివారం ఉదయం ధనలక్ష్మి బ్రెరుున్‌డెడ్ అరుునట్టుగా వైద్యులు నిర్ధారించారు. తర్వాత వారి సూచన ప్రకారం ఆమె బంధువులు, పిల్లలు అవయవదానానికి సమ్మతించారు. నగరంలోని మొహిసిన్ ఐ బ్యాంక్‌కు కళ్లను, లివర్‌ను అపోలో ఆస్పత్రికి, ఒక కిడ్నీని కేర్‌కు, ఒక కిడ్నీని సెవన్ హిల్స్ ఆస్పత్రికి అందజేయడానికి అంగీకరించారు. గత ఏడాది ధనలక్ష్మి భర్త గుండె పోటుతో మరణించారు. ఇప్పుడు తల్లికూడా మరణించడంతో వుడాపార్క్ చేరువలోని గాయత్రి విద్యాపరిషత్ పాఠశాలలో టెన్త చదువుతున్న హేమంత్ (15), ఎంవీపీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న రమ్యశ్రీ (11) రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. -
విధి ముందు తలవంచింది
మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి హర్షిత - కారుణ్యమరణం కోసం గతంలో హెచ్ఆర్సీని ఆశ్రయించిన తల్లిదండ్రులు - వైద్య, ఆరోగ్య మంత్రి ఆదేశాలతో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స - కాలేయం కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు.. ముందుకు రాని దాతలు - చివరకు రక్తపు వాంతులు చేసుకుని..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత సాక్షి, హైదరాబాద్: మృత్యువుతో కడవరకూ పోరాడిన చిన్నారి హర్షిత చివరికి విధి ముందు తలవంచక తప్పలేదు. కుమార్తె ప్రాణాలతో దక్కుతుందని ఆశించిన ఆ తల్లిదండ్రులకు చివరికి కడుపుకోతే మిగిలింది. మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునూతల(జగద్గిరిగుట్టలో తాత్కాలిక నివాసం)కు చెందిన రాంచంద్రారెడ్డి, శ్యామల దంపతుల కుమార్తె హర్షిత(11) కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చికిత్స కోసం బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిని ఆశ్రయించగా.. వైద్యులు బాలికను పరీక్షించి కాలేయ మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. కారుణ్య మరణానికి అనుమతించాలని.. బిడ్డ ఆరోగ్య పరిస్థితి చూడలేక, ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేక హర్షిత కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని రాంచంద్రారెడ్డి దంపతులు జూలై 14న ఎస్హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ‘మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించండి’ శీర్షికతో ‘సాక్షి’లోనూ కథనం ప్రచురితమైంది. దీంతో చిన్నారికి వైద్యం చేయించాలని హెచ్ఆర్సీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. దీనికి వైద్య మంత్రి లక్ష్మారెడ్డి స్పందించి హర్షిత చికిత్సకయ్యే ఖర్చంతా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. కాలేయ మార్పిడికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సదరు ఆస్పత్రికి లేఖ కూడా రాశారు. ఆస్పత్రి ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసింది. రక్తపు వాంతులు: బిడ్డకు కాలేయాన్ని దాన ం చేసేందుకు తండ్రి రాంచంద్రారెడ్డి ముందుకు రావడంతో ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. అయితే తండ్రి కాలేయంలో ఆల్కహాల్ శాతం అధికంగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేశారు. మూడు నెలలు కాలేయ దాత కోసం ఎదురు చూసినా ఫలితం లేక పోయింది. చిన్నారి హర్షిత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత రక్తపు వాంతులు చేసుకోవడంతో చికిత్స కోసం మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం హర్షిత మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన హర్షిత మృతికి ఆస్పత్రి వైద్యులే కారణమని బాధితురాలి బంధువులు, కాంగ్రెస్ నేత మల్లు రవి ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. కుమార్తెకు కాలేయాన్ని దానం చేసేందుకు తండ్రి ముందుకొచ్చినా వైద్యులు చికిత్సలో జాప్యం చేశారని ఆరోపించారు. హర్షిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, చికిత్సలో జాప్యం చేసిన వైద్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే హర్షితకు చికిత్స అందించడంలో వైద్య పరమైన నిర్లక్ష్యం ఏమీ లేదని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేయించినా.. దాతలు దొరక్కపోవడం వల్లే కాలేయ మార్పిడి చికిత్స చేయలేకపోయామని వివరించింది. -
అవసరమైతేనే అక్కడికి వెళ్లాలంటా!
రాయదుర్గం: వైద్య రంగంలో సాంకేతికంగా వస్తున్న మార్పులను ప్రజలు అందిపుచ్చుకోవాలని కేర్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ సోమరాజు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ‘చేంజింగ్ రోల్ ఆఫ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్, ఇండస్ట్రీ ప్రస్పెక్టివ్’ అంశంపై ఒక రోజు జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఎవరికివారు షుగర్ లెవల్స్, బ్లడ్‌ప్రెషర్ తెలుసుకునే పరికరాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సామాజిక, ఆధ్యాత్మిక రంగాల్లోనూ మార్పులు వస్తున్నాయన్నారు, ఆస్పత్రులను పరిశుభ్ర వాతావరణంలో నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్పత్రుల నిర్వహణా లోపం, వైద్యుల తప్పిదాల కారణంగా ఏటా 98 వేల మంది రోగులు మృత్యువాత పడుతున్నారన్నారు. పరిస్థితులకు అనుగుణంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, ప్రతి చిన్న రోగానికి ఆస్పత్రికి వెళ్లడం మంచిది కాదన్నారు. డీఎంఈ డాక్టర్ ఎం రమణి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సేవలను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించిందన్నారు. మెరుగైన వైద్య సేవలు, అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు. కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ రాజశేఖర్, డాక్టర్ సీత, డాక్టర్ జీవిఆర్‌కె ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మారథాన్ అదిరింది!
- ఉత్సాహంగా సాగిన ఎయిర్టెల్ హైదరాబాద్ రన్ - నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు సాగిన పరుగు - 10కే మహిళా విభాగంలో నల్లగొండ బిడ్డ దూకుడు సాక్షి, హైదరాబాద్: టీనేజీ కుర్రాళ్లు.. పాతికేళ్ల యువకులు.. ఉద్యోగులు.. మహిళలు.. రిటైరైన పెద్దలు.. ఒకరి అడుగులో ఒకరు అడుగులేస్తూ సాగిపోయారు.. వెనకబడ్డ వారికి ముందున్న వారు స్ఫూర్తి రగిల్చారు.. పోటీ పడుతూనే తోటివాళ్లు కూడా లక్ష్యాన్ని అందుకోవాలని ఆశపడ్డారు.. అన్ని వయసుల వారు ఎంతో ఉత్సాహంగా పరుగులు పెట్టారు. దాదాపు 11 వేల మంది ఔత్సాహికులు పాల్గొన్న ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ ఉల్లాసంగా సాగింది. ఆదివారం నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు సాగిన ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్‌లో హైదరాబాదీలతో పాటు ఇతర రాష్ట్రా లు, విదేశాలకు చెందిన రన్నర్లు పాల్గొన్నారు. మహిళల విభాగంలో విజేతలు.. ఫుల్ మారథాన్ (42.195 కిలోమీటర్లు)లో మహారాష్ట్రకు చెందిన జ్యోతి గవాటే 2 గంటల 59 నిమిషాల 9 సెకన్లతో (2:59:09)తొలిస్థానంలో నిలిచింది. ఇథియోపియాకు చెందిన రుత్ ఎంజరి 2:17:39 గంటలు, హివోటా టీ 2:33:5 గంటలతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. హాఫ్ మారథాన్ (21.1 కి.మీ.)లో పంజాబ్‌కు చెందిన అమన్‌దీప్ (1:31:52 గంటలు), సీమ (1:32:15 గంటలు), సిమ్టా (1:44:26 గంటలు) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. 10కే రన్ విభాగంలో 40 నిమిషాల 27 సెకన్ల (40:27)తో నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వై.నవ్య తొలి స్థానంలో నిలిచింది. 40:52 నిమిషాలతో యామిని, 43:46 నిమిషాలతో శిల్ప ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. పురుషుల విభాగంలో విజేతలు.. ఫుల్ మారథాన్‌లో ఇథియోపియాకు చెందిన మెస్ఫిన్ మెల్సె బల్లక్ 2:32:16 గంటలతో తొలిస్థానం ఆక్రమించాడు. 2:32:21 గంట లతో ఫిలిప్ రెండో స్థానంలో, 2:33:5 గంటల తో టిటస్ మూడో స్థానంలో నిలిచారు. హాఫ్ మారథాన్‌లో పంకజ్ కుమార్ 1:10 :25 గంటలు, శంకర్ క్షేత్రి 1:11:44 గంటలు, దీపక్ కుమార్ 1:12:56 గంటలతో వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. 10కే రన్‌ను కుల్దీప్ 32:33 నిమిషాలు, సతేందర్ 32:35 నిమిషాలు, విపిన్ కుమార్ 32:51 నిమిషాల్లో పూర్తిచేశారు. వీరందరికీ భారతి ఎయిర్టెల్ తెలంగాణ, ఏపీ సీఈవో వెంకటేశ్ విజయ రాఘవన్, ఈవెంట్ అంబాసిడర్ ఫిల్ మాఫిటోన్, నగర రేస్ డెరైక్టర్ మురళి, కేర్ ఆస్పత్రి తరఫున మహేందర్ పాల్ నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు. -
విశాఖ కేర్ ఆస్పత్రి ముందు ఉద్రిక్తత
-
మాజీ ఎమ్మెల్యే విఠల్ రావు దేశ్‌పాండే కన్నుమూత
హైదరాబాద్‌సిటీ: ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రావు దేశ్‌పాండే(84) కన్నుమూశారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన నాంపల్లిలోని కేర్ ఆసుపత్రిలో చేరారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం విఠల్‌రావు తుదిశ్వాస విడిచారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి 1962లో శాసనసభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చిన్నారికి కన్నీటి వీడ్కోలు
-
చిట్టితల్లీ... కళ్లు తెరువమ్మా..!
- రమ్య మృతదేహం చూసి తల్లడిల్లిన తల్లి రాధిక - అంబర్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు హైదరాబాద్ : ‘అమ్మా రమ్యా.. చిట్టి తల్లీ.. ఒక్కసారి కళ్లు తెరువమ్మా... ఒక్కసారి లేచి మాట్లాడమ్మా... నువ్వు లేకుండా ఇక నేనెందుకు బతకాలి’... బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, తొమ్మిది రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి రమ్య మృతదేహాన్ని చూసి తల్లడిల్లిన కన్న తల్లి రాధిక రోదన ఇది. రాధిక ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న కుటుంబీకులు ఆఖరి నిమిషం వరకు రమ్య మృతిచెందిన వార్త తెలియనీయలేదు. ఉస్మానియా ఆస్పత్రిలో రమ్య మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షలకు తరలించే ముందు మాత్రమే చూపించారు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులు బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీలోని తాతయ్య సురేంద్రనాథ్ నివాసానికి చిన్నారి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. రమ్యను చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘అక్కకు ఏమైంది నాన్నా’ అంటూ రమ్య చెల్లెలు రష్మీ అమాయకంగా అడుగుతుంటే... అంతా బోరున విలపించారు. అంబర్‌పేట శ్మశానవాటికలో సాయంత్రం రమ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. చికిత్స పొందుతోందని చెప్తూ... పంజగుట్ట ఠాణా పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని పంజగుట్ట హిందూ శ్మశానవాటిక వద్ద ఈ నెల 1న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రమ్య చిన్నాన్న రాజేష్ అక్కడిక్కడే మరణించారు. చిన్నారితో పాటు తల్లి రాధిక తీవ్రంగా గాయపడగా.. మరో చిన్నాన్న రమేష్, తాత మధుసూదనాచారి క్షతగాత్రులయ్యారు. రాధిక యశోద ఆస్పత్రిలో, రమ్య కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తొమ్మిది రోజుల పాటు కోమాలో ఉండి, మృత్యువుతో పోరాడిన రమ్య శనివారం తుదిశ్వాస విడిచింది. అయితే రాధిక ఆరోగ్య పరిస్థితి రీత్యా కుటుంబీకులు ఈ విషయం ఆమెకు తెలియనీయలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతోందనే చెప్పుకుంటూ వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి ముందు... యశోద ఆస్పత్రితో ఉన్న రాధికను అంబులెన్స్‌లో కేర్ ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చి, అసలు విషయం చెప్పారు. స్ట్రెచర్‌పై చిన్నారి మృతదేహాన్ని రాధిక ఉన్న అంబులెన్స్ వద్దకు తీసుకువచ్చి చూపించారు. తీవ్ర గాయాలతో ఉన్న రాధిక... కుమార్తె మృతదేహాన్ని చూసి ‘చిట్టితల్లీ.. చిట్టితల్లీ’ అంటూ గుండెలవిసేలా రోదించడం అక్కడున్నవారందరినీ కదిలించింది. వాళ్లకు తగిన శిక్ష పడాలి ‘ఆ రోజు మేము మా కారులో నెమ్మదిగా వెళ్తున్నాం. తాగిన మైకంలో ఉన్న ఆరుగురు యువకులతో కూడిన మరో కారు అదుపు తప్పిన వేగంగా వచ్చి డివైడర్ పైనుంచి ఎగిరి మా కారుపై పడింది. నా మరిది రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు నా కూతుర్నీ కోల్పోయాను. ఈ ప్రమాదానికి కారకులైన వారికి తగిన శిక్ష పడాలి. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దు.’ - రమ్య తల్లి రాధిక -
చిన్నారికి కన్నీటి వీడ్కోలు
చిట్టితల్లి రమ్య మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచింది. ఈనెల 1వ తేదీన బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని పంజగుట్ట హిందూ శ్మశానవాటిక ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రమ్య చిన్నాన్న రాజేష్ అక్కడిక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ రమ్యను కేర్ ఆస్పత్రికి, తల్లి రాధికను యశోద ఆస్పత్రికి తరలించారు. ఆదివారం కన్నబిడ్డను కడసారి చూసి తల్లి తల్లడిల్లిన తీరు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. అంబర్‌పేట: బంజారాహిల్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారి రమ్య మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం కన్నుమూసింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ గారాలపట్టి ఇక తిరిగి రాని లోకాలు వెళ్లిపోయిందని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. బంధు, మిత్రులు, కాలనీవాసుల రోదనలతో అంబర్‌పేట డీడీ కాలనీ శోకసంద్రంగా మారింది. బంజారా హిల్స్‌లో జరిగిన ప్రమాదంలో జూబ్లీహిల్స్‌లో నివసించే వెంకటరమణ, రాధికల పెద్ద కుమార్తె రమ్య గాయపడ్డ విషయం తెలిసిందే. చికిత్సపొందుతూ రమ్య తుది శ్వాశ విడవడంతో పోస్టుమార్టం అనంతరం ఉస్మానియా ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని ఆదివారం బాగ్ అంబర్‌పేట డీడీ కాలనీలో అమ్మమ్మ విజయలక్మి, తాతయ్య సురేంద్రనాథ్ల నివాసానికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగానే తండ్రి, అమ్మమ్మ, తాతయ్యలకు ఒక్కసారిగా దుఃఖ కట్టలు తెంచుకుంది. నిర్జీవంగా పడివున్న రమ్యను చూసి బోరుమన్నారు. ఇదే ప్రమాదంలో గాయపడ్డ తల్లీ రాధిక మంచంపై కదలలేని స్థితిలో ఉంది. పక్కనే ఉన్న కూతురి మృతదేహాన్ని చూస్తూ కన్నీరుపెట్టుకున్న ఆమె ను ఓదార్చడం ఎవరితరం కాలేదు. కూతురి మృతదేహం ఒక పక్క, గాయపడి కదలేని స్థితిలో భార్య మరోపక్క ఉండటంతో వెంకటరమణ పరిస్థితి వర్ణనాతీతం. అంతేకాకుండా ఆయన సోదరుడు రాజేష్ ఘటనా స్థలంలోనే మృతితో శోకసంద్రంలో ఉన్న ఆ కుటుంబాన్ని చిన్నారి రమ్య మృతి మరింత కృంగదీసింది. బంధు, మిత్రుల సందర్శన అనంతరం చిన్నారి రమ్య మృతదేహాన్ని అంబర్‌పేట శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి రమ్య కుటుంబసభ్యులను పరామర్శించి, సంతాపం తెలియజేశారు. దురదృష్టకరం : మంత్రి తలసాని గన్‌ఫౌండ్రీ: బంజారాహిల్స్ జరిగిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నారి రమ్య మృతదేహానికి ఆదివారం ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని ఉస్మానియాకు వచ్చి రమ్య బంధువులను పరామర్శించారు. -
నటుడు కృష్ణంరాజుకు అస్వస్థత
హైదరాబాద్: రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం గురి కావడంతో ఆదివారం అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ లో ఆయనను చేర్చారు. డాక్టర్ సోమరాజు నేతృత్వంలో వైద్య బృందం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన గత కొంతకాలం నుంచి శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. సోమవారం ఉదయం హీరో ప్రభాస్ గంటపాటు ఆస్పత్రిలో కృష్ణంరాజు వద్ద ఉన్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కేర్ వైద్యులు వెల్లడించారు. -
ఈ చిన్నారి.. చిరంజీవి
♦ ఐదుగురికి జీవితాన్నిచ్చిన18 నెలల బాలుడు ♦ కన్నపేగు కోత దిగమింగి..తల్లిదండ్రుల స్ఫూర్తి ♦ చిన్నారి అవయవదానం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రథమం సాక్షి, విశాఖపట్నం : అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు హఠాత్తుగా ప్రమాదానికి గురయ్యాడు. పద్దెనిమిది నెలల ప్రాయంలోనే బ్రెయిన్‌డెడ్ అయ్యాడు.నిన్నటి దాకా గోరుముద్దలు తినిపించిన తమ చిన్నారి ఇక లేడని తెలియడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేదు. అయినా దానిని దిగమింగుకొని ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే నిర్ణయం తీసుకున్నారు. తమ చిన్నారి అవయవదానానికి అంగీకరించి ఆదర్శప్రాయంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే... విశాఖలోని ఆరిలోవలో ఉంటున్న మద్ది వెంకటనారాయణరాజు చిన్న కుమారుడు రోహిత్ (18 నెలలు) మర్రిపాలెంలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి ఈనెల 11న తల్లితో వెళ్లాడు. ఆ రాత్రి ఆడుకుంటూ బయటకు వచ్చిన రోహిత్‌పై అక్కడే పార్క్ చేసి ఉన్న బైక్ పడింది. తలకు తీవ్రగాయాలైన బాలుడిని నగరంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం చిన్నారి బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయాన్ని తండ్రికి తెలియజేశారు. అవయవదానంపై అవగాహన కల్పించడంతో ఆ తండ్రి తన కుమారుడి అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. దీంతో రోహిత్‌ను నగరంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. జీవన్‌దాన్ సంస్థ ద్వారా అవయవదానం ప్రక్రియను రాత్రి 10.30 గంటలకు పూర్తి చేశారు. రోహిత్ రెండు కళ్లు మోహిసిన్ ఐ బ్యాంకుకు, రెండు కిడ్నీలు, కాలేయాన్ని విశాఖ కేర్ ఆస్పత్రిలోని రోగులకు దానం చేశారు. దీంతో ఆ చిన్నారి తాను మరణించి మరో ముగ్గురికి ప్రాణదానం, ఇద్దరికి చూపును ప్రసాదించి ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. పద్దెనిమిది నెలల వయసులో ఓ చిన్నారి అవయవాలను దానం చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రథమమని జీవన్‌దాన్ ప్రతినిధులు ‘సాక్షి’కి చెప్పారు. -
ఛత్తీస్‌లో ఎన్కౌంటర్
ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా అటవీప్రాంతంలో శనివారం నక్సల్స్, బీఎస్ఎఫ్ జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని పఖంజూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఛోటేబేటియా అటవీప్రాంతంలో నక్సల్స్ సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో బీఎస్ఎఫ్ 117వ, 122వ బెటాలియన్, జిల్లా పోలీసు బృందం సంయుక్తంగా గాలింపు చేపట్టింది. రాత్రి దాదాపు 2.30గంటలకు ఈ బృందం అడవిలో బేచా గ్రామ సమీపంలోని చిన్న నది దగ్గరకు చేరుకోగానే పోలీసులను చూసి నక్సల్స్ ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దాదాపు గంటపాటు ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రగాయాలైన బీఎస్ఎఫ్ జవాన్లు విజయ్ కుమార్, రాకేశ్ నెహ్రాలను చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌కు హెలికాప్టర్లో తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. రాయ్‌పూర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో జవాను మృతిచెందారు. కొందరికి రాయ్‌పూర్‌లోని రామకృష్ణ కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు కాంకేర్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ జయంత్ వైష్ణవ్ పీటీఐతో చెప్పారు. మరోవైపు బీజాపూర్ జిల్లాలో శనివారం ఓ యాత్రికుల బస్సును దగ్ధం చేసిన మావోయిస్టులు సుక్మా జిల్లా భెర్జీ వద్ద ఓ ఆటోను తగలబెట్టారు. -
విధి చిదిమేసింది..
ఆ యువకుడికి భవిష్యత్‌పై ఎన్నో ఆశలు.. మరెన్నో బరువు బాధ్యతలు.. వాటన్నిటినీ మోయడానికి సిద్ధపడుతున్నాడు. అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని గట్టెక్కించాలనుకున్నాడు. అందుకు ప్రభుత్వ ఉద్యోగమే సరైనదని భావించేవాడు. అందుకోసం కష్టపడి చదివేవాడు. ప్రతిభావంతుగా పేరు తెచ్చుకున్నాడు. వారం రోజుల్లో స్టీల్‌ప్లాంట్‌లో జరిగే జూనియర్ ఇంజినీర్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే విధికి క న్నుకుట్టింది. అతని కలలనూ, కొడుకుపై పెట్టుకున్న ఆశలనూ రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చి చిదిమేసింది. ఈ విషాదగాథ రోడ్డు ప్రమాదంలో గాయపడి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్ అయి, అవయవదానం చేసిన అల్లాడ సాయికుమార్‌ది. విశాఖపట్నం/అల్లిపురం: సాయికుమార్ నగర శివారులోని రఘు ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. కాలేజీలో 80 శాతం మార్కులు సాధిస్తూ ప్రతిభావంతుడిగానే గాక బుద్ధిమంతుడిగానూ పేరు సంపాదించాడు. తల్లిదండ్రులు చంద్రశేఖర్, కోటలక్ష్మిల పేదరికాన్ని చూసిన సాయికుమార్ అమ్మానాన్నలు పంపే డబ్బును అతి పొదుపుగా ఖర్చు పెట్టేవాడు. తాను తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుని స్నేహితులతో బయటకు కూడా వెళ్లేవాడు కాదు. తొందరగా ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వోద్యోగం సంపాదించాలని తరచూ స్నేహితులతో చెప్పేవాడు. తన ఉద్యోగంతో అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని గట్టెక్కించాలని చెబుతుండేవాడు. ఇటీవల జరిగిన ‘గేట్ 2016’ పరీక్ష కూడా బాగానే రాశాడు. ఈ నెల 28న జరిగే స్టీల్‌ప్లాంట్ జూనియర్ ఇంజనీర్ పరీక్షకు హాజరవుతున్నాడు. హాల్‌టిక్కెట్టు కూడా తీసుకున్నాడు. ఈ పరీక్ష కోసం రేయింబవళ్లు కష్టపడి చదువుతున్నాడు కూడా. తల్లిదండ్రులకు సాయికుమార్ ఒక్కడే కొడుకు. మరొక కుమార్తె ప్రియాంక. ఈమె బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ‘నిన్ను ఎమ్మెస్సీ చదివిస్తాను బాగా చదువు చెల్లెమ్మా!’ అంటుండేవాడు. ఎదిగివచ్చిన కొడుకు కొన్నాళ్లలోనే ఉద్యోగంలో చేరతాడని, తమ కష్టాలు తీరతాయని ఎన్నో కలలు కంటున్నారు. ఇంతలోనే పిడుగులాంటి వార్త! సాయికుమార్ బైకు ప్రమాదంలో గాయపడ్డాడని. కొడుకు తొందరగా కోలుకోవాలని తల్లిదండ్రులతో పాటు బంధువులు, స్నేహితులు కోటి దేవుళ్లకు మొక్కుకున్నారు. కానీ ఏ దేవుడూ కనికరించలేదు. సాయికుమార్ బ్రెయిన్‌డెడ్ అయి బతకడని వైద్యులు గుండెలు పిండేసే చేదు నిజాన్ని వెల్లడించారు. ఒకపక్క పుట్టెడు విషాదంలో ఉన్న వారంతా గుండె నిబ్బరం చేసుకుని సాయికుమార్ అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. ఫలితంగా సాయికుమార్ మరణించాక కూడా ముగ్గురికి ప్రాణదానం, మరో ఇద్దరికి వెలుగు ప్రసాదించగలిగాడు. విషణ్ణవదనంతో బంధుమిత్రులు, స్నేహితులు సాయికుమార్ మృతదేహాన్ని స్వగ్రామం కేడీపేటకు తరలించారు. జీర్ణించుకోలేకపోతున్నాం.. సాయికుమార్ స్నేహితులతో చాలా స్నేహపూర్వకంగా ఉండేవాడు. ఒకసారి స్నేహం చేస్తే ఎవరూ ఆయనను వదులుకోవడానికి ఇష్టపడరు. ఎప్పుడూ చదువుపైనే ధ్యాస. ఎక్కడికైనా వెళ్దామన్నా వచ్చేవాడు కాదు. మా ఫ్రెండ్ ఇక లేడన్న నిజాన్ని మేమంతా జీర్ణించుకోలేకపోతున్నాం. - జిలానీ బాషా, సాయికుమార్ స్నేహితుడు -
కేర్ హాస్పిటల్స్ భారీ విస్తరణ
♦ కొత్తగా మరిన్ని ఆసుపత్రులు ♦ అడ్వెంట్ వాటా అబ్రాజ్ గ్రూప్ చేతికి ♦ సాక్షితో కేర్ ఫౌండర్ డాక్టర్ బి.సోమరాజు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న కేర్ హాస్పిటల్స్ భారీగా విస్తరిస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రతిపాదిత హెల్త్ సిటీలో ఔట్ పేషెంట్ సెంటర్‌ను ఏడాదిలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. బంజారాహిల్స్ ఔట్ పేషెంట్ కేంద్రం మాదిరిగా దీనిని నిర్మించనున్నారు. వైజాగ్ హెల్త్ సిటీలో రూ.100 కోట్లతో 250 పడకల హాస్పిటల్ ఏడాదిలో సాకారం కానుంది. ఈ నగరంలో సంస్థ ఇప్పటికే మూడు కేంద్రాలను నిర్వహిస్తోంది. విజయవాడలో కేర్‌కు 4 ఎకరాల స్థలం ఉంది. 250 పడకలతో కొత్తగా ఆసుపత్రి నిర్మించే అవకాశం ఉంది. లేదా ఇప్పటికే విజయవాడలో ఉన్న ఏదైనా ఆసుపత్రిని కొనుగోలు చేసే అంశాన్నీ పరిశీలిస్తున్నట్టు కేర్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ బి.సోమరాజు బుధవారమిక్కడ వెల్లడించారు. కేర్‌లో ప్రధాన వాటాదారుగా ఉన్న అడ్వెంట్ వాటాను దుబాయికి చెందిన అబ్రాజ్ గ్రూప్ కొనుగోలు చేస్తోంది. ఈ విశేషాలను ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో పంచుకున్నారు. అందుబాటు ధరలో వైద్య సేవలు అందించడంపై ఇరు సంస్థలు ఫోకస్ చేస్తాయని చెప్పారు. ప్రారంభానికి సిద్ధంగా.. భాగ్యనగరిలో రాయదుర్గం వద్ద ఏర్పాటు చేస్తున్న ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. సామర్థ్యం 250 బెడ్స్ కాగా, రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఈ కేంద్రాన్ని మార్చిలో ప్రారంభించేందుకు కేర్ సమాయత్తమవుతోంది. అలాగే రూ.100 కోట్లతో నిర్మిస్తున్న భువనేశ్వర్ కేంద్రాన్ని ఈ ఏడాదే తెరుస్తామని సోమరాజు పేర్కొన్నారు. హైదరాబాద్‌సహా 9 నగరాల్లో సంస్థ 16 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. పడకల సంఖ్య 2,600 పైమాటే. కేర్ చరిత్రలో ఇప్పటి వరకు 60 లక్షల మంది ఔట్పేషెంట్లు, 10 లక్షలకుపైగా ఇన్‌పేషెంట్లకు వైద్య సేవలను అందించింది. భారత్‌లో 5వ అతిపెద్ద వైద్య సంస్థగా ఎదిగింది. వైద్యం ఇప్పుడు ఖరీదైందని.. వైద్య పరికరాలు, ఔషధ తయారీ సంస్థలు కొన్ని సందర్భాల్లో వైద్య రం గాన్ని శాసిస్తున్నాయని సోమరాజు చెప్పారు. ప్రభుత్వం తన పాత్ర మర్చిపోయిందన్నారు. పరిశ్రమలో నియంత్రణ వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. కేర్‌లోకి అబ్రాజ్ గ్రూప్.. కేర్‌లో ప్రధాన వాటాను అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ 2012 ఏప్రిల్‌లో రూ.523 కోట్లకు కొనుగోలు చేసింది. కేర్‌లో మొత్తంగా అడ్వెంట్ రూ.650 కోట్లదాకా పెట్టుబడి చేసింది. అడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు సంస్థలో 72 శాతం, సోమరాజుతోసహా ఇతర వాటాదారులకు 28 శాతం వాటా ఉంది. సంస్థలో అడ్వెంట్‌కు ఉన్న వాటాను అబ్రాజ్ గ్రూప్ కొనుగోలు చేస్తోంది. మార్చికల్లా ఈ డీల్ పూర్తి కానుంది. ఇందుకోసం అబ్రాజ్ గ్రూప్ సుమారు రూ.1,800 కోట్లు వెచ్చిస్తోందని సమాచారం. వాటాలు మారినప్పటికీ మేనేజ్మెంట్లో ఎటువంటి మార్పు లేదని సోమరాజు వెల్లడించారు. ఈ సంస్థ కేర్‌లో ప్రస్తుతం రూ.200 కోట్లు పెట్టుబడి పెడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని కొత్త ఆసుపత్రులకు వెచ్చిస్తామని చెప్పారు. -
33 వారాల పాపకు పునర్జన్మ
- పుట్టుకతోనే మూసుకుపోయిన రెండు నాసికా రంధ్రాలు - ‘నాసల్ ఎండోస్కోపి’తో పునరుద్ధరించిన ‘కేర్’ వైద్యులు సాక్షి, హైదరాబాద్: పుట్టుకతోనే రెండు నాసికా రంధ్రాలు మూసుకుపోయిన 33 వారాల శిశువుకు కేర్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మ ఇచ్చారు. ముక్కు రంధ్రాలు లేకపోవడంతో నోటి ద్వారా అతికష్టం మీద శ్వాస తీసుకుంటున్న పాపకు ‘నోసల్ ఎండోస్కోపి’ ద్వారా కొత్త ఊపిరి పోశారు. గురువారం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి శస్త్రచికిత్స వివరాలను తెలిపారు. చాంద్రాయణగుట్ట బార్కస్‌కు చెందిన గర్భిణి నెల రోజుల క్రితం నైస్ ఆస్పత్రిలో 1.10 కేజీల బరువున్న ఆడ శిశువు(షరీపా ఫాతిమా)కు జన్మనిచ్చింది. అయితే పాపకు పుట్టుకతోనే రెండు నాసికా రంధ్రాలు మూసుకుపోయి ఉండటంతో స్థానిక వైద్యులు వెంటిలేటర్ సహాయంతో నోటి ద్వారా కృత్రిమ శ్వాసను అందించారు. మెరుగైన చికిత్స కోసం కేర్ ఆస్పత్రికి తరలించారు. ఈఎన్టీ వైద్యనిపుణుడు డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి పాపకు పలు వైద్యపరీక్షలు చేసి ఊపిరితిత్తులకు శ్వాసను అందించే రెండు నాసికా రంధ్రాలు లోపలి భాగంలో నాళాలకు ఎముక అడ్డుగా రావడంతో మూసుకుపోయినట్లు గుర్తించారు. ప్రతి ఏడు వేల మందిలో ఒక్కరికి మాత్రమే ఇలాంటి సమస్య తలెత్తుతుంది. అది కూడా ఒక రంధ్రం మూసుకుపోయి మరో రంధ్రం తెరచి ఉంటుంది. కానీ ఈ పాపకు రెండు రంధ్రాలు మూసుకుపోయాయి. నాసికారంధ్రాలకు అడ్డుగా ఉన్న ఎముకకు శ్వాస తీసుకునేందుకు వీలుగా రంధ్రం చేసేందుకు ప్రత్యేకంగా ఓ డ్రిల్లర్‌ను వైద్యులు రూపొందించారు. 4 వారాల క్రితం పాపకు ‘నాసల్ ఎండో స్కోపి’ పద్ధతిలో నాళానికి అడ్డుగా ఉన్న ఎముకకు రంధ్రం చేసి మూసుకుపోయిన నాసిక రెండు నాళాలను తెరిచారు. తాత్కాలికంగా ఓరల్ ఎయిర్వేస్ లైఫ్ సేవింగ్ పైప్స్‌ను అమర్చామని, 6 వారాల తర్వాత పైపులను తొలగించనున్నట్లు విష్ణుస్వరూప్‌రెడ్డి తెలిపారు. ఆ తర్వాత పాప ముక్కు ద్వారా స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటుందన్నారు. ఈ తరహా శస్త్రచికిత్స దేశంలోనే మొదటిదని పేర్కొన్నారు. -
కేజీహెచ్ పై దిగివచ్చిన ప్రభుత్వం
విశాఖ మెడికల్: కేజీహెచ్‌లో గుండె శస్త్రచికిత్సల విభాగాన్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిన కేర్ ఆస్పత్రికి అప్పగించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఎట్టకేలకూ వెనక్కుతీసుకొంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే కార్డియోథొరాసిక్ సర్జన్లు అందుబాటులో లేకపోవడంతో పీపీపీ విధానంలో ప్రైవేటు ఆస్పత్రుల నుంచి సర్జన్లను రప్పించి శస్త్రచికిత్సలు చేయించాలని ప్రభుత్వం భావించింది. ఈ విషయమై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్యా సంచాలకుల సూచనల మేరకు కేజీహెచ్‌లో గుండె శస్త్రచికిత్సలను కేర్ ఆస్పత్రి కార్డియోథొరాసిక్ సర్జన్ల పర్యవేక్షణలో నిర్వహించాలని తొలుత నిర్ణయించి ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై ఈ నెల 16న సాక్షిలో ‘కేజీహెచ్ గుండె ప్రైవేటు పరం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఇతర పలు ప్రజాసంఘాలు, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టాయి. దీంతో ప్రభుత్వం కేర్ ఆస్పత్రితో ఒప్పందాన్ని రద్దుచేసుకుంది.ఖాళీగా ఉన్న ఓపెన్ హార్ట్ సర్జన్ పోస్టును భర్తీచేసింది. దాదాపు ఏడాదిన్నర తరువాత ఓపెన్ హార్ట్ సర్జరీలకు మళ్లీ మంచిరోజులు వచ్చాయి. -
వెజిటేరియన్లలో విటమిన్ బి12 లోపిస్తే..!
మనం ఏ పని చేయాలన్నా అవసరమైనది మన మెదడు, నాడీ వ్యవస్థ చక్కగా ఉండటం. ఆ మెదడు నుంచి అన్ని అవయవాలకూ ఆదేశాలు సక్రమంగా అందడం. అందుకు ఉపయోగపడే అత్యంత కీలకమైన పోషకమే... ‘విటమిన్-బి12’. ఇది కేవలం మెదడు నుంచి అన్ని అవయవాలకూ ఆదేశాలు అందేలా చేయడమే కాదు... రక్తం పుట్టుకలోనూ పాలుపంచుకుంటుంది. ప్రతి కణంలో జరిగే జీవక్రియల్లో భాగస్వామ్యం తీసుకుని డీఎన్ఏ పుట్టుకలో, అమైనో యాసిడ్స్ కార్యకాలాపాల్లో (మెటబాలిజమ్‌లో) పాలుపంచుకుంటుంది. మాంసాహారంలోనే పుష్కలంగా లభించే విటమిన్ బి12... శాకాహార నియమాన్ని చాలా కఠినంగా పాటించేవారిలో చాలా తక్కువగా ఉంటుంది. దాంతో వారికి కొన్ని సమస్యలు రావడం సాధారణం. వాటిని అధిగమించి, మన నాడీవ్యవస్థనూ, కణాల్లోని జీవక్రియలనూ సక్రమంగా పనిచేయించడం ఎలాగో చెప్పుకుందాం. శాకాహారుల్లో విటమిన్ బి12 ఎందుకు తక్కువ... విటమిన్ బి12ను మొక్కలుగానీ, ఫంగస్గానీ... ఆ మాటకొస్తే జంతువులుగానీ సృష్టించలేవు. కేవలం బ్యాక్టీరియా దాంతో పాటూ ఆర్చియా అనే ఏకకణ జీవులు మాత్రమే ఈ విటమిన్‌ను సృష్టించగలవు. ఆర్చియా అనేది ఎంత చిన్న జీవి అంటే ఏకకణజీవికంటే కూడా తక్కువ స్థాయి జీవి. ఈ ఏకకణానికి న్యూక్లియస్ (కేంద్రకం) ఉండదు. ఇదొక కణమనీ, కణంలోని భాగాలని అని నిర్దిష్టంగా చెప్పేందుకు వాటి విభాగాలూ, పైపొరలూ కూడా ఉండవు. కానీ బ్యాక్టీరియా, ఆర్కియా వెలువరించే ఎంజైముల సంయోగంతో ఈ ప్రపంచంలో విటమిన్-బి12 స్వాభావికంగా తయారవుతుంది. పైగా దీని నిర్మాణం చాలా సంక్లిష్టమైనది. ఇది జంతువులకు మేలు చేసే బ్యాక్టీరియా మనుగడ సాగించే చోట... అంటే... జంతువుపై ఆధారపడి బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా వెలువరించే పదార్థాలతో జంతువులూ ఇలా పరస్పరం సహాయం (సింబయాసిస్) చేసుకుంటూ ఉండే ప్రదేశాలలో మాత్రమే ఈ విటమిన్ పుడుతుంది. అందుకే ఇది జంతుమాంసం, జంతు ఉత్పాదనల వనరులనుంచే ప్రధానంగా ఉత్పన్నమవుతుంది. అందుకే శాకాహార నియమాన్ని చాలా కఠినంగా పాటించేవారిలో ఇది చాలా తక్కువ. విటమిన్ బి12 లోపం ఉంటే... ⇒ విటమిన్ బి12 లోపం ఉన్నవారు ఎప్పుడూ చాలా అలసటగా, నీరసంగా ఉంటారు. నిస్సత్తువ ఆవరించి ఉన్నట్లుగా ఫీలవుతుంటారు. ⇒ విటమిన్ బి12 లోపం వల్ల ఆక్సిజన్‌ను అన్ని అవయవాలకూ తీసుకెళ్లే ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ కండిషన్‌ను ‘విటమిన్-బి12 అనీమియా’ అంటారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మన శరీరం చాలా పెద్దసైజు ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తుంటుంది. వీటినే మెగాలోబ్లాస్టిక్, మ్యాక్రోసైటిక్ ఎర్రరక్తకణాలంటారు. ఇవి తమ విధిని సక్రమంగా నిర్వహించలేవు. ⇒ విటమిన్-బి12 అనీమియా వల్ల అలసట, నిస్సత్తువలతో పాటు ఒక్కోసారి ఊపిరి సరిగా అందకపోవడం జరగవచ్చు. ⇒ తలనొప్పి, చెవుల్లో ఏదో హోరు వినిపించడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. మరింత నిర్దిష్టమైన లక్షణాలు : చర్మం పసుపుపచ్చరంగులోకి మారడం నాలుకపూయడం నోట్లో పుండ్లు కొన్ని ప్రదేశాల్లో స్పర్శజ్ఞానం కోల్పోవడం నొప్పి ఎక్కువగా తెలియకపోవడం నడుస్తున్నప్పుడు పడిపోవడానికి అవకాశం చూపు సరిగా లేక స్పష్టంగా కనిపించకపోవడం క్షణక్షణానికీ మూడ్స్ మారిపోవడం డిప్రెషన్‌కు లోనుకావడం మతిమరపు రావడం. శాకాహారులతో పాటు... ఇంకా ఎవరెవరిలో తక్కువ... సాధారణంగా 75 ఏళ్లకు పైగా వయసు పైబడిన వారిలో ఇది తక్కువ పుట్టుకతో వచ్చే జబ్బు అయిన పెర్నీషియస్ అనీమియా అనే కండిషన్ ఉన్నవారిలో ఇది తక్కువ. ఈ కండిషన్ ఉన్నవారిలో ఒక ప్రోటీన్ లోపం వల్ల జీర్ణమైన ఆహారం నుంచి విటమిన్ బి12 ను సంగ్రహించే సామర్థ్యం లోపిస్తుంది. అందుకే ఇలాంటి కుటుంబ చరిత్ర ఉన్న వారిలో 60 ఏళ్లు దాటిన మహిళల్లో ఇది ఎక్కువ ఇక పొట్ట లోపలిపొర పలచబారిన వారిలోనూ ఇది తక్కువ పొట్టలో పుండ్లు (అల్సర్స్) ఉన్నవారిలో పొట్టలోని కొంతభాగాన్ని సర్జరీ ద్వారా తొలగించిన వారిలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారిలో చాలాకాలంగా అజీర్తి మందులు (ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ -పీపీఐ) వాడుతున్నవారిలోనూ విటమిన్ బి12 పాళ్లు తక్కువ. నిర్ధారణ : సాధారణంగా రక్తపరీక్ష ద్వారా విటమిన్ బి12 లోపం తెలుసుకుంటారు. ఇక ఎర్రరక్తకణాల సైజ్‌ను బట్టి కూడా విటమిన్ బి12 లోపాన్ని అంచనావేస్తారు. విటమిన్ బి12కు చికిత్స విటమిన్ బి12 తక్కువగా ఉందని రక్తపరీక్షలో నిర్ధారణ అయితే... అలాంటి రోగులకు సాధారణంగా ఆరు బి12 ఇంజెక్షన్లతో ఈ లోపాన్ని భర్తీ చేస్తారు. ఇది రోజుకు ఒకటిగానీ లేదా రెండు నుంచి నాలుగు రోజులకు ఒకటి చొప్పున ఇస్తారు. ఈ విటమిన్ బి12 అంతా కాలేయంలో నిల్వ అయి ఉంటుంది. కొన్ని నెలలపాటు శరీరానికి అవసరమైన జీవక్రియలకోసం శరీరం తన విటమిన్-బి12 అవసరాల కోసం దాన్ని కాలేయం నుంచి తీసుకొని వాడుకుంటుంది. ఒకవేళ పెర్నీషియస్ అనీమియా కారణంగా విటమిన్ బి12 లోపం ఉన్నవారైతే... జీవితకాలం పాటు డాక్టర్లు చెప్పిన మోతాదుల్లో విటమిన్ బి12ను తీసుకుంటూ ఉండాలి. ఇలా విటమిన్ బి12 తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ర్పభావాలు ఉండవు. ఇక కొందరిలో ఇది పెర్నీషియస్ అనీమియా వల్ల కాకుండా పోషకాహారలోపం వల్ల విటమిన్ బి12 లోపం ఏర్పడితే అప్పుడు ఇంజెక్షన్ రూపంలో కాకుండా సైనకోబాలమైన్ టాబ్లెట్ల రూపంలోనూ దీన్ని శరీరానికి అందిస్తారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఎవరికి వారుగా విటమిన్-బి12 టాబ్లెట్లను, ఇంజెక్షన్లను తీసుకోకూడదు. డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వీటిని తీసుకోవాలి. ఎందుకంటే... ఈ ఇంజెక్షన్లనూ, మాత్రలనూ తీసుకునే వారు ఒకవేళ ఇతర మాత్రలనూ వాడుతుంటే... విటమిన్ బి12 ఇంజెక్షన్లూ, మాత్రలూ వాటి కార్యకలాపాలకు అడ్డుపడకుండా చూసేలా డాక్టర్లు మోతాదులను నిర్ణయిస్తారు. నివారణ మాంసాహారంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది గుడ్లు, సముద్రపు చేపలు, పాలలో ఇది ఎక్కువ. మాంసాహారం తీసుకోడానికి ఇష్టపడని వారు ఈ కింది ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విటమిన్ బి12ను పొందవచ్చు. శాకాహారులు పుష్కలంగా విటమిన్ బి 12 పొందాలంటే... విటమిన్ బి12తో సమృద్ధం చేసిన (విటమిన్ బి12 ఫోర్టిఫైడ్) బాదం పాలలో ఇది ఎక్కువ విటమిన్ బి12తో సమృద్ధం చేసిన కొబ్బరిపాలలోనూ ఇది చాలా ఎక్కువ పులిసిపోయే స్వభావం ఉన్న ఆహారంలోని ఈస్ట్ (న్యూట్రిషనల్ ఈస్ట్)తోనూ ఈ లోపాన్ని తొలగించుకోవచ్చు విటమిన్ బి12తో సమృద్ధం చేసిన సోయాపాలతో తక్షణం తినగలిగే తృణధాన్యాలు (సి రేల్స్)లో తక్కువ కొవ్వు ఉన్న పాలు తోడుబెట్టి చేసిన పెరుగులోనూ పాలలోనూ, చీజ్‌లోనూ, వెనిలా ఐస్‌క్రీమ్‌లోనూ విటమిన్ బి12 ఎక్కువ. అందుకే శాకాహారులు పైన పేర్కొన్న ఆహారంపై ఆధారపడవచ్చు. - డాక్టర్ ఎమ్. గోవర్థన్ సీనియర్ ఫిజీషియన్,కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
రేపు ఆస్తమా అవగాహనా సదస్సు
హైదరాబాద్ : ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ రోడ్‌నెం.10లోని కేర్ ఆస్పత్రి అవుట్పేషంట్ విభాగం గ్రౌండ్‌ఫ్లోర్‌లో రేపు ఉదయం 11 గంటల నుంచి ఆస్తమా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. డాక్టర్ కె. శుభాకర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం ఉంటుందని, హైదరాబాద్‌లో అమెరికన్ కాన్సులేట్ జనరల్ మైఖేల్ ములిన్స్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం కోసం 9866822286 నంబర్‌ను సంప్రదించవచ్చని వెల్లడించారు. -
‘కేర్’లోకి మరో హాస్పిటల్
* రూ. 200 కోట్లతో అలగ్జాండ్రియా మెడిసిటీ కొనుగోలు * 250 పడకల హాస్పిటల్‌కు కేర్ హైటెక్ సిటీగా పేరు మార్పు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హాస్పిటల్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా కేర్ హాస్పిటల్స్ వేగంగా విస్తరిస్తోంది. ఈ మధ్యనే వైజాగ్‌లో 100 పడకల హాస్పిటల్‌ను కొనుగోలు చేసిన కేర్ తాజాగా హైదరాబాద్‌లో మరో హాస్పిటల్‌ను కొనుగోలు చేసింది. హైటెక్ సిటీ సమీపంలోని 250 పడకల అలగ్జాండ్రియా మెడిసిటీని రూ. 200 కోట్లకు కోనుగోలు చేసినట్లు ప్రకటించింది. కేర్ హైటెక్ సిటీగా ఈ హాస్పిటల్ పేరు మార్చామని, ఇందులో గుండె, నాడీ మండలం, మూత్ర పిండాల వ్యాధుల చికిత్సలకు తోడు ఆంకాలజీ, అవయవాల మార్పిడి చికిత్సలపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు కేర్ హాస్పిటల్ ప్రతినిధి తెలిపారు. ఈ హాస్పిటల్ టేకోవర్‌కు కావల్సిన నిధులను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ సమకూర్చింది. ఈ హాస్పిటల్ చేరికతో అధునాతనమైన అన్ని రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చినట్లు కేర్ హాస్పిటల్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్. బి. సోమరాజు తెలిపారు. త్వరలోనే గచ్చిబౌలి సమీపంలో వివిధ హాస్పిటల్స్‌కు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో కొత్త హాస్పిటల్ నిర్మాణం చేపట్టే యోచనలో కేర్ ఉంది. కేర్ హైటెక్ సిటీ రాకతో కేర్ గ్రూప్ హాస్పిటళ్ల మొత్తం పడకల సంఖ్య 2,400కు చేరింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 3,000కు చేరనుంది. -
వైద్యుల పర్యవేక్షణలో మంత్రి పోచారం
తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం సాధారణ వైద్య పరీక్షల కోసం కేర్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని వైద్యులు చెప్పారు. దీంతో డాక్టర్ సోమరాజు నేతృత్వంలో వైద్యబృందం మంత్రిని ఆస్పత్రిలోనే ఉంచి పర్యవేక్షిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తె లిపారు. -
మరో బ్రెయిన్ డెడ్ కేసులో అవయవాలు దానం
విశాఖపట్నం:ఇచ్ఛాపురానికి చెందిన కృష్ణారావు అనే వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయ్యింది. అతని మెదడు పనిచేయకపోవటంతో వారి కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. కృష్ణారావు ఊపిరితిత్తులు, కిడ్నీలను సావిత్రిబాయి పూలే ట్రస్టుకు దానం చేశారు. ఆయన రెండు కిడ్నీలను కేర్, అపోలో ఆస్పత్రులకు అందించారు. అలాగే ఊపిరితిత్తులను కేర్ ఆస్పత్రికి అందించారు. ఈ నెల ఆరంభంలో ఇదే తరహా ఘటన ఒకటి చోటు చోసుకున్న సంగతి తెలిసిందే. విజయవాడలో3వ తేదీన సెంటినీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద తోట మణికంఠ(21) మోటారు సైకిల్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో మణికంఠ బ్రెయిన్‌డెడ్ కావడంతో అతని అవయవాలను నలుగురికి దానం చేశారు. -
విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ
హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ మరింత బలపడుతోంది. ఎలాంటి వాతావరణంలోనైనా విస్తరించేలా తన పరిధిని పెంచుకుంటోంది. కేవలం చలి తీవ్రతలోనే వైరస్ వ్యాప్తి ఉంటుం దన్న వాదనకు కాలం చెల్లుతోంది. వేడి వాతావరణాన్ని కూడా తట్టుకునే శక్తిని హెచ్1ఎన్1 వైరస్ సాధించింది. సాధారణ జ్వరం, ఒళ్లునొప్పులు ఇతరత్రా కొద్దిపాటి లక్షణాలున్న వారికి కూడా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2009లో ఎంతో తీవ్రమైన వైరస్‌గా ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు స్వైన్‌ఫ్లూ తన విస్త్రృతి పెంచుకుంది. వైరస్ వ్యాప్తి చెందే సమయంలో యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం.. తర్వాత అది వాతావరణంలోకి మరింత విస్తరించడంతో అనేకమందికి సోకుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రెండు నెలల్లోనే 61 మంది మృతి స్వైన్‌ఫ్లూ థర్డ్ క్లాస్ ైవె రస్ అని... కాస్తంత ఎండలు కాస్తే అది పోతుందని స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నెలల క్రితం పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆయనన్నట్లు స్వైన్‌ఫ్లూ మాత్రం ఇప్పుడలా లేదు. ఇప్పటికీ తన ఉధృతిని చాటుకుంటోంది. 2009లో జనవరి నుంచి డిసెంబర్ వరకు తెలంగాణ ప్రాంతంలో 638 పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఆ ఏడాది 43 మంది చనిపోయారు. అది అప్పట్లో అత్యంత సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి మార్చి 6వ తేదీ నాటికి రెండు నెలల కాలంలో 5,419 శాంపిల్స్‌ను పరీక్షించగా... 1,731 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో ఏకంగా 61 మంది చనిపోవడం భయాందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది రెండు నెలల కాలంలోనే అంతమంది చనిపోవడంపై వైద్య నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. వైరస్ వాతావరణంలోకి విస్తరించిందంటున్నారు. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. దీనికితోడు పరీక్షల్లో స్వైన్‌ఫ్లూతో పాటు రెండు మూడు పరీక్షలు సాధారణంగా చేస్తార ని.. అదనంగా ఇంకేమైనా కొత్త వైరస్ ఉందా అన్న విషయం ప్రస్తుతం చేస్తున్న పరీక్షల్లో వెల్లడి కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పుణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్‌లోనే ఆ వివరాలు బయటపడతాయని అంటున్నారు. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. పాలమూరులో మూడుస్వైన్ఫ్లూ కేసులు మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో తాజాగా మూడు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. రెండురోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన శ్రీశైలం, తెల్కపల్లికి చెందిన బాలరాజు అనారోగ్యం బారినపడటంతో జిల్లా ప్రధాన ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు. వీరికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉండటంతో నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపించారు. వ్యాధి నిర్ధారణ కావడంతో వారిని ప్రత్యేకవార్డులో ఉంచి చికిత్సలు చేస్తున్నారు. అలాగే జడ్చర్ల పట్టణానికి చెందిన కిరణ్మయికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నాయని వైద్యులు చెప్పారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ పరీక్షలు చేయించకుండా నేరుగా హైదరాబాద్‌లోని హోమియోపతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిసింది. నిర్లక్ష్యం ఫలితమే.. 2009లో తీవ్ర వైరస్‌గా ఉన్న హెచ్1ఎన్1 వైరస్... ఇప్పుడు సర్వసాధారణంగా మారినా... దాని సాంద్రత పెరిగిందని కనీస లక్షణాలున్న వారికి కూడా సోకుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొద్దిపాటి జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉన్నా కూడా చాలామందికి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఇదిలావుంటే ప్రభుత్వ యంత్రాంగంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. మొదట్లో తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. సీఎం కేసీఆర్ అప్పట్లో ప్రత్యేకంగా పర్యవేక్షించడంతో ఉరుకులు పరుగులతో కదిలిన యంత్రాంగం.. ఇప్పుడు కాస్తంత విశ్రాంతి స్థితిలోకి వెళ్లారు. ప్రత్యేక సెల్ కూడా సీరియస్‌గా ఫోన్‌కాల్స్‌ను స్వీకరించడం లేదన్న ఆరోపణలున్నాయి. వైరాలజీ ల్యాబ్ ఏర్పాటు చేయాలి స్వైన్‌ఫ్లూ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం హెచ్1ఎన్1, హెచ్2ఎన్3, ఇన్‌ఫ్లూయెంజా-ఎ పరీక్షలు మూడూ ఒకేసారి చేస్తున్నారు... అందులో ఒకట్రెండు పాజిటివ్ వస్తున్నాయి. హెచ్1ఎన్1 కాకుండా అదనంగా మరో వైరస్ ఏదైనా ఉందేమోనన్న అనుమానాలు కూడా ఉంటున్నాయి. అందువల్ల ప్రత్యేక పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పరీక్షించే ల్యాబ్‌లో అది సాధ్యం కాదు. పుణేలో ఉన్న జాతీయ వైరాలజీ ల్యాబ్‌లో శాంపిల్స్‌ను పరీక్షిస్తే స్వైన్‌ఫ్లూతోపాటు ఇంకేమైనా వైరస్ వృద్ధి చెందుతుందా అన్న విషయం బయటపడుతుంది. అందువల్ల హైదరాబాద్‌లోనూ వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. -డాక్టర్ ఎస్.ఎ.రఫీ, శ్వాసకోశ, వైద్య నిపుణులు, కేర్ ఆసుపత్రి. -
ఎస్పీవై రెడ్డికి స్వైన్ ఫ్లూ!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి స్వైన్ ఫ్లూ సోకినట్లు, చికిత్స కోసం హైదరాబాద్‌లోని గత నెలలో కేర్ ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారని కూడా తెలిసింది. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానని ఆయన సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం. అయితే వైద్యశాఖ అధికారులు ఈ విషయం ధ్రువీకరించడం లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఎస్పీవై రెడ్డి దగ్గు, జలుబు చికిత్స కోసం గత నెల 10వ తేదీన కేర్‌లో చేరారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు స్వైన్ ఫ్లూ సోకిందని జనవరి 17వ తేదీన నిర్ధారించారు. -
అమ్మ కడుపే ఆపరేషన్ టేబుల్!
మెడికల్ వండర్ కాబోయే ఆ తల్లి గుండె గతుక్కుమంది. కడుపులో ఉన్న చిన్నారి గుండె బాగాలేదని తెలిసింది. శిరీష కడుపులోని నలుసు వయసు 23 వారాలే! అయితే, శిరీషకు అప్పటికే ఓ గైనిక్ సమస్య వచ్చింది. అబార్షన్ జరగకుండా గర్భాన్ని నిలపడానికి శస్త్రచికిత్స జరిగింది. గండం గడిచిందనుకుంటే మళ్లీ పిండానికి గుండెజబ్బు! పాతికేళ్ల శిరీష రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ గ్రామంలో సైన్స్ టీచర్. గర్భవతి కాబట్టి రొటీన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంది. ‘ఆయోర్టిక్’ కవాటంలో లోపం వల్ల పిండం గుండె ఎడమవైపు కింది గదిలోని రక్తం పంప్ కావడం లేదని తేలింది. సమస్య అక్కడితో ఆగిపోలేదు. మైట్రల్ వాల్వ్ కూడా లీకవుతోంది. వీటివల్ల గుండె ఎడమవైపున ఉండే గదులు కుంచించుకుపోతున్నాయి. బిడ్డ హృదయం విశాలం చేయమంటున్న తల్లి వేదన డాక్టర్ల హృదయాలను కదిలించింది. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రి హృద్రోగ నిపుణులు సోమరాజు, చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సల స్పెషలిస్ట్ కె.నాగేశ్వరరావు ప్రత్యేక ఆపరేషన్‌కు సంకల్పించారు. చిన్న కత్తెర్లు కావాలి కడుపులో ఉండగానే చిన్నారికి చికిత్స చేద్దామన్నది డాక్టర్ల ఆలోచన. శస్త్రచికిత్సకు మామూలుగా వాడే ఉపకరణాలు సరిపోవు. చిన్నారి పిండానికి గాటు పెట్టేంత చిన్ని చిన్ని కత్తెర్లు కావాలి. అంత చిన్న గుండెలోకి ప్రవేశపెట్టేంత అతి సన్నటి నాళాలు తేవాలి. అక్కడికి వెళ్లాక అడ్డంకులను వెడల్పు చేసే ప్రత్యేక బెలూన్లు సమకూర్చుకోవాలి. ఇవి ప్రత్యేకంగా రూపొందించుకోవడం ఒక ఎత్తై, ఆర్థిక వనరులను సమీకరించుకోవడం మరో సవాలు. వాటన్నింటినీ కలగలుపుకొని తమ నైపుణ్యాలను అత్యంత శిఖరాగ్ర స్థాయిలో ప్రదర్శించడం మరో ఎత్తు! డాక్టర్లకు ఆపరేషన్ థియేటర్లో సహాయం చేయడానికి అవసరమైన సిబ్బందికి అదనపు శిక్షణ అవసరం. తొలి ప్రయత్నం విఫలం ఆపరేషన్ చేస్తున్న నాగేశ్వరరావుకు బాసటగా డాక్టర్లు మాల్జినీ, కామశ్రీ, సాయిలీల, జగదీశ్, టీవీఎస్ గోపాలు, విద్యాసాగర్, కమల, ఇతర సాంకేతిక సిబ్బందితో పాటు మరో పన్నెండు మంది డాక్టర్ల బృందమూ ముందుకొచ్చింది. పిండం 26 వారాల వయసున్నప్పుడు ఒక ప్రయత్నం చేశారు. పిండం అనుకూల దిశలో తిరిగి లేనందువల్ల ఆ ప్రయత్నం విఫలమైంది. కాబోయే తల్లిదండ్రులు నిరాశపడ్డా, డాక్టర్ల సంకల్పం సడలలేదు. వారం తర్వాత శిరీషను మళ్లీ ఆసుపత్రికి పిలిపించారు. ఈ సారి వ్యూహం మార్చారు. తొలుత తల్లికి మత్తు ఇచ్చారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టుగా... అమ్మ కడుపుకోతను ఆపడానికి అవసరమైన కోతను మొదట పెట్టారు. తర్వాత పిండాన్ని చేరారు. బిడ్డ కదులుతూ ఉంటుంది కాబట్టి అనుకూల దిశకు రాగానే ఆగేందుకు దాని తొడకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ‘ఫీటల్ అనస్థీషియా’తో కదలికలు ఆగగానే డాక్టర్ల చేతుల కదలికలు మొదలయ్యాయి. ఒక సూది ద్వారా ఒక నాళం తల్లి కడుపు నుంచి బిడ్డ ఛాతీకీ, ఆ ఛాతీలోని గుండె ఎడమవైపు కింది గదికీ చేరింది. నాళం చివరి బెలూన్ ఉబ్బింది. గది తలుపును తెరిచినట్లుగా బెలూన్ ఆయోర్టిక్ వాల్వ్‌ను తెరిచింది. అడ్డంకిని తొలగించింది. ఆపరేషన్ సక్సెస్! రెండ్రోజుల తర్వాత, పిండం గుండె స్పందనల తీరును ఫీటల్ హార్ట్ స్కాన్‌తో తెలుసుకున్నారు. అంతా సవ్యం. తల్లీ బిడ్డా క్షేమం. దేశంలోనే ఈ తరహా శస్త్రచికిత్సల్లో ఇది మొదటిది. అమ్మ కడుపులోనే ఆపరేషన్ చేయించుకున్న ఆ బిడ్డ తన తొమ్మిది నెలల గడువు ముగించుకుని, భూమ్మీదకు వచ్చి, డాక్టర్ అంకుల్స్‌కు థాంక్స్ చెప్పడానికి ఎదురుచూస్తూ ఉంది! - యాసీన్ -
పెరుగుతున్న స్వైన్ ప్లూ కేసులు
-
నేడు వెంకటస్వామి అంత్యక్రియలు
-
వెంకటస్వామి కన్నుమూత
-
వెంకటస్వామి కన్నుమూత
* ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన కాకా * తీవ్ర అస్వస్థతతో ఐదు నెలలుగా కేర్‌లో చికిత్స * అవయవాలు విఫలమవడంతో మృతిచెందిన కాకా * పంజాగుట్ట శ్మశాన వాటికలో నేడు అంత్యక్రియలు * అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం ప్రకటన * కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిగా, ఎంపీగా వెంకటస్వామి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో కాకలు తీరిన నేతగా.. కాంగ్రెస్‌వాదుల్లో ‘కాకా’గా చెరగని ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(85) ఇకలేరు. కార్మిక నేతగా ప్రస్థానం ప్రారంభించి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. సోమవారం రాత్రి 8.40 గంటలకు హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురై దాదాపు ఐదు నెలలుగా ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారం క్రితం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూలోకి మార్చారు. క్రమంగా శ్వాస సరిగా తీసుకోలేకపోవడంతోపాటు మూత్రపిండాల పనితీరు మందగించింది. దీంతో ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్ చేస్తూ వచ్చారు. వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆయన కన్నుమూసే సమయంలో కుమారులు మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్‌తో పాటు కూతురు, మనుమళ్లు, మనుమరాళ్లు అక్కడే ఉన్నారు. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ప్రజా గాయకుడు గద్దర్, మాజీ ఎంపీలు రాజయ్య, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి తదితరులు కేర్ ఆసుపత్రికి చేరుకుని వెంకటస్వామి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వెంకట స్వామి మృతదేహాన్ని సోమాజిగూడలోని వివేక్ ఇంటికి తరలించారు. ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల సందర్శనార్థం మంగళవారం ఉదయం నుంచి ఆయన భౌతిక కాయాన్ని గాంధీభవన్‌లో ఉంచుతారు. అనంతరం ఊరేగింపుగా పంజగుట్ట శ్మశా న వాటికకు తీసుకువెళ్లి మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరోవైపు కాకా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వెంకటస్వామి మృతికి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆరాటపడిన వ్యక్తి వెంకటస్వామి అని సీఎం గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు కాకా భౌతికకాయాన్ని సందర్శించి సీఎం నివాళులు అర్పించనున్నారు. -
కన్ను మూసిన కాకా
హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి 1969 తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం ముల్కీ ఉద్యమంలోనూ కీలక పాత్ర జిల్లా అభివృద్ధిలో విశేష కృషి సాక్షి, మంచిర్యాల : కాంగ్రెస్ కురువృద్ధుడు.. ఏఐసీసీ శాశ్వత సభ్యుడు.. ‘కాకా’గా సుపరిచితుడైన గడ్డం వెంకటస్వామి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఎస్సీ సామాజిక వ ర్గానికి చెందిన కాకా కాంగ్రెస్ పార్టీలో కే ంద్ర, రాష్ట్ర స్థాయిల్లో కీలక రాజకీయ పదవులతోపాటు మంత్రి పదవులు చేపట్టారు. జిల్లా కీర్తిని దేశవ్యాప్తంగా చాటారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తొలిసారిగా వాదించింది వెంకటస్వామియే. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వాదాన్నీ వినిపించిన ఘనత కూడా కాకాకే దక్కింది. ముక్కు సూటిగా మాట్లాడే కాకా.. సమస్యల పరిష్కారం విషయంలో ప్రతిపక్షాలనే కాదూ స్వపక్షంలోనూ నాయకులపైనా విమర్శలు గుప్పించారు. పలుసార్లు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర మంత్రులు, ముఖ్యమంత్రులను కూడా వదలిపెట్టలేదు. పార్టీ విధానాలకు కట్టుబడి పని చేసిన కాకా పార్టీ నిర్ణయాలు.. సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను తిప్పికొట్టడంలో దిట్టగా పేరొందారు. ‘తెలంగాణ వచ్చిన తర్వాతే చస్తా..’ వెంకటస్వామి 1929 అక్టోబర్ 5న హైదరాబాద్‌లో జన్మించారు. 1969లో తొలిసారిగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సమయం వచ్చినప్పుడల్లా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తన గళం వినిపించారు. పదేళ్ల క్రితం జరిగిన మలి ఉద్యమంలోనూ ఆయన పాల్గొనడంతోపాటు తెలంగాణ వాదాన్ని చాటారు. ఆ సమయంలో ఆరోగ్య క్షీణించగా..‘నేను ఇప్పుడే చనిపోను.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే చనిపోతా..’ అని చెప్పిన మాటల్ని జిల్లా ప్రజలు నెమరువేసుకుంటున్నారు. జిల్లా అభివృద్ధిలో తనవంతు.. 1957 నుంచే వెంకటస్వామికి జిల్లాతో అనుబంధం ఉంది. సిర్పూర్ ద్విసభ్య నియోజకవర్గం ఉన్నప్పుడు 1957లో తొలిసారిగా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి పీఎస్పీ పార్టీకి చెందిన రామన్నపై 8821 ఓట్లతో గెలుపొందారు. అప్పటి నుంచి తూర్పు ప్రాంతాభివృద్ధిలో తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. మంచిర్యాలలో ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం.. రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం వెంకటస్వామి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగాయి. రూ.24 కోట్ల వ్యయంతో మంచిర్యాల పట్టణ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా పథకాన్ని కూడా కాకా హయాంలోనే ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇప్పించేందుకు విశేష కృషి చేసిన కాకా చివరకు అనుకున్నది సాధించారు. 1998 నుంచి కార్మికులు పెన్షన్ పొందుతున్నారు. కార్మిక సంఘాలను స్థాపించిన ఘనత కూడా కాకాకే దక్కింది. రాజకీయ ప్రస్ధానం..! వెంటకస్వామి.. మూడు సార్లు సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా, పెద్దపల్లి ఎంపీగా నాలుగుసార్లు గెలిచారు. సిర్పూర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, పీవీ న రసింహారావు కేబినెట్లో కార్మిక, గ్రామీణాబివృద్ధి, జౌళిశాఖ మంత్రిగా పని చేశారు. 2002-04లో ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ అధ్యక్షుడిగా, 1982-84 వరకు ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. రాష్ట్రంలో అంజయ్య, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారి కేబినెట్లో సేవలందించారు. గడ్డం వినోద్‌కుమార్, గడ్డం వివేకానంద కాకా తనయులు. కాగా వారు రాజకీయంగా ఎదిగేందుకు తండ్రి ఆశీస్సులు ఎంతగానో ఉన్నాయి. -
'కాకా పరిస్థితి విషమంగానే ఉంది'
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి (కాకా) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కేర్ డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన కేర్ ఆస్పత్రి డాక్టర్లు.. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు సీనియర్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. గత కొంతకాలంగా కాకా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ నేత వెంకటస్వామికి తీవ్ర అస్వస్థత
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి (కాకా) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కాగా వెంకటస్వామికి వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నట్లు సమాచారం. కాగా మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ...కాకాను పరామర్శించారు. -
ఎస్కార్ట్ ప్రమాద బాధితులకు అందిన సాయం
* మెరుగైన వైద్యసేవలు డిప్యూటీ సీఎంకు, ‘సాక్షి’కి బాధితుల కృతజ్ఞతలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఎస్కార్ట్ వాహనం ఢీకొని తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించింది. ఇందుకు అవసరమైన బిల్లును మంజూరు చేయడంతో వారిని మంగళవారం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నవంబర్ 30వ తేదీన వరంగల్ జిల్లా రఘునాధపల్లి సమీపంలోని యశ్వంత్‌పూర్ వద్ద రాజయ్య ఎస్కార్ట్ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన నయీముల్లాఖాన్, బంధువులు గులాంగౌస్, ఆయన భార్య సాదిక్ ఉన్నీసా బేగం తీవ్రంగా గాయపడ్డారు. వీరికి జనగాం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్య కోసం బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. వీరికి చేసిన వైద్యానికి సంబంధించి పెద్ద మొత్తంలో బిల్లు చెల్లించాల్సి ఉంది. తమను ఎవరూ పట్టించుకోవడం లేదనే బాధితుల గోడును ఈ నెల 6న ‘సాక్షి’ ప్రచురించింది. దీనికి ఉపముఖ్యమంత్రి రాజయ్య స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు బాధితుల వైద్య చికిత్స బిల్లులను చెల్లించారు. పరిస్థితి మెరుగుపడటంతో బాధితులు గులాంగౌస్, సాదిక్ ఉన్నీ సాబేగం మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఉపముఖ్యమంత్రి రాజయ్యకు, ‘సాక్షి’కి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. -
రాజమౌళి ప్రాయం 4..బరువు 3
సారధి (రాజాం): ఈ ఫొటోలో కనిపిస్తున్న బాబు పేరు రాజమౌళి. తుళ్లింతలు, కేరింతలతో గడవాల్సిన ఈ బాలుడి బాల్యాన్ని విధి చిదిమేసింది. గాజుబొమ్మలా మిగిల్చింది. రాజాం నగర పంచాయతీ పరిధిలోని సారధి గ్రామానికి చెందిన మజ్జి గణేష్, నాగమణి దంపతుల కుమారుడైన రాజమౌళి పుట్టి నాలుగేళ్లయినా మూడు కిలోలకు మించి బరువు పెరగలేదు. పుట్టినప్పుడు బాగానే ఉన్నా కొద్దికాలానికే అతనిలో ఎదుగుదల నిలిచిపోయింది. బొమ్మలా తయారయ్యాడు. శరీరం ఇష్టమొచ్చిన రీతిలో ఒంగిపోతుంటుంది. ఆకలి. నిద్ర అన్నవే తెలియవు. అసలు ఈ లోకంతోనే సంబంధం లేనట్లు దిక్కులు చూస్తుంటాడు. నోరు తెరిచినప్పుడు మాత్రమే ఆహారం అందివ్వాలి. 24 గంటలూ ఎవరో ఒకరు సంరక్షిస్తూ ఉండాల్సిందే. తాపీమేస్త్రీ పని చేసుకునే గణేష్ తన తాహ తుకు మించి ఎన్నో చోట్ల.. ఎంతో మంది వైద్యులకు కొడుకును చూపించి, ఆరోగ్యవంతుడిని చేయడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం గణేష్ దంపతులకు ఏడాది వయసున్న కుమార్తె పూజిత కూడా ఉంది. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. కొడుకు పరిస్థితే వారిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. అచేతన స్థితిలో ఉన్న రాజ మౌళిని గణేష్ తల్లిదండ్రులు రాము, భాగ్యం ప్రస్తుతం కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పుట్టిన వెంటనే చిన్న సమస్యే అనుకున్నామని, ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేకపోయామంటూ వారంతా కన్నీటిపర్యంతమవుతున్నారు. అంతుచిక్కని లోపం ఇంగ్లీష్, ఆయుర్వేదం, హోమియోపతి.. ఇలా అన్ని రకాల వైద్యాలు చేయించినా రాజమౌళి పరిస్థితి ఏ డాక్టర్‌కూ అంతు చిక్కలేదు. తొలుత 2010లో విజయవాడలోని ఓ కార్పొరే ట్ ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యనిపుణులు అన్ని రకాల పరీక్షలు జరిపాబాలుడి మెదడు అభివృద్ధి చెందడం లేదని, తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. కనీసం పరీక్షల నివేదికలు కూడా వీరికి ఇవ్వలేదు.దీంతో ఏడాది క్రితం రాజాంలోని జీఎంఆర్ కేర్ ఆస్పత్రిలో చూపిస్తే హైదరాబాద్‌లో అత్యాధునికమైన చికిత్స అందే అవకాశముందని, అది చాలా ఖరీదైన ప్రక్రియ అని చెప్పారు. శస్త్రచికిత్స చేస్తే రూ.15 లక్షలు ఖర్చవుతుందని, అయినా సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు చాలా స్వల్పమని తేల్చి చెప్పారు. బతికున్నంత కాలం బాబును కంటికి రెప్పలా కాపాడుకోవాలని సూచించారు. దీంతో ఏం చేయాలో తోచక ఆ పేద తల్లిదండ్రులు దిక్కులు చూస్తున్నారు. తమ కుమారుడు సాధారణ స్థితికి వచ్చి, తమను అమ్మానాన్నలుగా గుర్తించి అందరు పిల్లల మాదిరిగా తమ కళ్లెదుట తిరుగాడాలన్న ఆకాంక్ష నెరవేర్చే దయార్ధ్ర హృదయుల కోసం ఎదురు చూస్తున్నారు. మానవతావాదులు ముందుకురావాలని, చేయూతనివ్వాలని గణేష్, నాగమణి(ఫోన్ నెం: 9010765420) వేడుకుంటున్నారు. -
గర్భంలో శిశువుకు గుండె ఆఫరేషన్
-
బాధితులకు కేర్ ఆస్పత్రి రూ.50 లక్షల విరాళం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో హుదూద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకోసం కేర్ ఆస్పత్రి యాజమాన్యం రూ.50 లక్షల విరాళం ప్రకటించింది. కేర్ ఆస్పత్రి అధినేత సోమరాజు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రూ.50 లక్షల చెక్కును అందజేశారు. రాష్ట్రంలో హుదూద్ తుఫాను సృష్టించిన విలయం అంతాఇంతా కాదని, తుపాను బాధితులను ఆదుకోవడానికి తమ వంతు సాయంగా రూ.50 లక్షలు ఇచ్చినట్టు సోమరాజు పేర్కొన్నారు. ప్రకృతి విలయాలు సంభవించిన సందర్భాల్లో తమ వంతు బాధ్యతగా సాయమందించేందుకు ఎప్పుడూ ముందుంటామని కేర్ ఆస్పత్రి అధినేత తెలిపారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన శిశువు
ఛాతీ వెలుపల గుండెతో పుట్టిన వైనం ఫలించని వైద్యుల ప్రయత్నం హైదరాబాద్: ఇటీవల ఛాతీ వెలుపల గుండెతో పుట్టిన అరుదైన శిశువు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందింది. 36 రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయింది. పసికందును బతికించేందుకు కేర్ ఆస్పత్రి వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. చంపాపేట్ డివిజన్ సామ నర్సింహారెడ్డి కాలనీకి చెందిన ఓ మహిళ గతనెల 6న కర్మన్‌ఘాట్ కృష్ణసాయి ఆస్పత్రిలో కవలలకు జన్మనిచ్చింది. వీరిలో రెండో శిశువుకు ఛాతీ లోపల ఉండాల్సిన గుండె.. ఛాతీ వెలుపల గుండె వేలాడుతోంది. దీంతో శిశువును నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కార్డియాలజిస్టులు లేకపోవడంతో నిమ్స్‌కు తరలించారు. ఈ అరుదైన శిశువుకు చికిత్స చేసేందుకు కేర్ వైద్యుల బృందం ముందుకొచ్చింది. పుట్టిన నాలుగు రోజుల తర్వాత శిశువును కేర్ ఆస్పత్రికి తరలించారు. సర్జన్ డాక్టర్ తపన్ ద్యాస్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలోని వైద్యబృందం గతనెల 9న శస్త్రచికిత్స చేసి ఛాతీ వెలుపల ఉన్న గుండెను లోపల అమర్చింది. అప్పటికే ఇన్ఫెక్షన్ సోకడంతో శిశువు ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. గుండె పనితీరు మెరుగు పడినా, ఇన్ఫెక్షన్ వల్ల మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీల పనితీరు దెబ్బతింది. దీంతో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ శిశువు కేర్ ఆస్పత్రిలోనే కన్నుమూసింది. -
విసు సంస్థల అధినేత సీసీ రెడ్డి కన్నుమూత
హైదరాబాద్: ప్రభుత్వ మాజీ సలహాదారు, ప్రముఖ సినీ నిర్మాత, విసు సంస్థల అధినేత సీసీరెడ్డి (చవ్వా చంద్రశేఖర్‌రెడ్డి, 76) సోమవారం రాత్రి 7.10 గంటలకు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో మృతి చెందారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ కోసం ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయనకు డయాలసిస్ చేస్తున్న సమయంలోనే తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కక్కడికక్కడే మృతి చెందినట్లు కేర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సీసీ రెడ్డి కడప జిల్లా పులివెందుల సమీపంలోని చినకుంట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 24న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చవ్వా రామలక్ష్మమ్మ, చవ్వా వెంగళరెడ్డి ఇద్దరూ ఉపాధ్యాయులు. తొమ్మిదిమంది సంతానమున్న పెద్ద కుటుంబం. దీంతో పేదరికంలోనే ఆయన తన విద్యాభ్యాసం పూర్తిచేశారు. తల్లిదండ్రుల పట్టుదలతో నే ఆయన న్యాయశాస్త్రం చదివారు. సినిమా, పారిశ్రామిక, విద్యా, రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజ శేఖరరెడ్డికి ఆయన అత్యంత ఆప్తుడు. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆయనకు నలుగురు కుమార్తెలు. సీసీరెడ్డి మరణవార్త తెలియగానే వైఎస్సార్సీపీ నాయకులు, రాజకీయ, సినీ ప్రముఖులు ఆసుపత్రికి చేరుకుని నివాళులు అర్పించారు. సమీప బంధువులైన సినీనటుడు మంచు విష్ణు, నటి మంచు లక్ష్మి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అంత్యక్రియలు గురువారం.. సీసీరెడ్డి అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నట్లు ఆయన సోదరుని అల్లుడు వై.సురేష్‌కుమార్‌రెడ్డి చెప్పారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం అభిమానుల దర్శనార్థం సీసీరెడ్డి ఇంటివద్ద ఆయన భౌతికకాయాన్ని ఉంచుతామని స్పష్టం చేశారు. కుమార్తెలు, కుమారులు, ముఖ్య బంధువులు అమెరికా నుంచి రావాల్సి ఉందని తెలిపారు. బుధవారం చంద్రగ్రహణం ఉండటంతో అంత్యక్రియలను గురువారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత సదా శివపేటలోని సీసీరెడ్డి తోటలో నిర్వహించనున్నట్లు చెప్పారు. విసు సంస్థలతో విఖ్యాతి ‘విసు’ సంస్థల అధిపతిగా విద్యార్థి లోకానికి సుపరిచితులైన సీసీ రెడ్డి న్యాయవాదిగా కడపలో వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా, కార్మిక సంఘాల నాయకునిగా అనేక ఉద్యమాల్ని, ప్రజాహిత కార్యక్రమాల్ని నిర్వహించారు. వీకే కృష్ణమీనన్ తదితరులతో కలిసి వివిధ దేశాల్లో జరిగిన అం తర్జాతీయ న్యాయ సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. 1973లో అమెరికాలో వ్యాపారం అనంతరం 1983లో తిరిగి స్వదేశానికి వచ్చి ‘విసు’ సంస్థను నెలకొల్పారు. వేలమంది విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభకు వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభు త్వ హయాంలో 2004లో రాష్ట్ర ప్రభుత్వానికి విదేశీ పెట్టుబడుల సలహాదారుగా నియమితులై ఏడేళ్లపాటు కొనసాగారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విసు ఫిలిమ్స్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై ‘మీ శ్రేయోభిలాషి’, ‘గౌతమ్ ఎస్ఎస్సీ’, ‘రూమ్మేట్స్’ చిత్రాలు నిర్మించారు. రాజేంద్రప్రసాద్ హీరోగా నిర్మించిన ‘మీ శ్రేయాభిలాషి’ చిత్రం మూడు బంగారు నందుల్ని, అనేక అంతర్జాతీయ బహుమతుల్ని పొందింది. అమెరికా వాసులు సీసీ రెడ్డిని లైఫ్ టైమ్ ఎచీవ్మెంటు అవార్డుతో సత్కరించారు. రారా, కొడవటికంటి, శ్రీశ్రీ లాంటి సాహితీవేత్తలతో సాన్నిహిత్యం ఉంది. సవ్యసాచి, తెలుగు స్వతంత్య్ర మొదలైన పత్రికల్లో వ్యాసాలు, కథలు, కవితలు రాశారు. ‘ఈభూమి’ పేరుతో వారపత్రికను నడిపారు. సీసీ రెడ్డి మృతికి జగన్ సంతాపం రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సీసీరెడ్డి మృతిపట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసింద న్నారు. సీసీరెడ్డి మృతికి నివాళులర్పిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. సీసీ రెడ్డి జీవితం కమ్యూనిస్టు పార్టీతో, కార్మికోద్యమంతో పెనవేసుకుందని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కె.నారాయణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీలో లేకున్నా ప్రతి సందర్భంలోనూ వామపక్ష ఉద్యమానికి శ్రేయోభిలాషిగా వ్యవహరించారని, ఆయన మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఇతర నేతలు జి.ఓబులేసు, జి.ఈశ్వరయ్య తదితరులు కూడా సీసీ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు. -
నిమజ్జనానికి వెళ్తూ బోల్తా పడిన ఆటో
-
నిమజ్జనానికి వెళ్తూ బోల్తా పడిన ఆటో
హైదరాబాద్: వినాయకుడ్ని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి తీసుకువెళ్తున్న ఆటో ట్రాలీ సోమవారం ఎంజే మార్కెట్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు సృహా కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయాపడ్డారు. దాంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనలో వినాయకుడి విగ్రహాం ధ్వంసమైంది. డ్రైవర్ ఆటోను మలుపు తిప్ప బోయారు. ఆ క్రమంలో ఒక్కసారిగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. -
కడుపులోనే పరీక్షలూ...పుట్టగానే చికిత్సలు...!
నేడు డాక్టర్స్ డే డాక్టర్ తపన్ దాష్, డాక్టర్ కె. నాగేశ్వరరావు పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్స్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ ఆమె మార్కెట్ యార్డులో పనిచేసే ఒక సాధారణ వ్యక్తి భార్య. గర్భవతి. మెదక్ జిల్లా కొండాపూర్‌కు చెందిన అనూరాధ అనే ఆ మహిళ ఎప్పటిలాగే రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్లు ఆమెను పరీక్షిస్తూ ఒక అసాధారణ అంశాన్ని గమనించారు. ఆమె కడుపులో ఉన్న పాప ‘హార్ట్ ఫెయిల్యూర్’తో చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. ఎలాగైనా పెద్ద ప్రాణాన్నీ, కడుపులోని పసిపాపనూ... ఇద్దర్నీ రక్షించాలని నిర్ణయించుకున్నా డాక్టర్లు. పాప అనూరాధ గర్భంలో ఉండగానే ‘ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ’ అనే పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్ష ఫలితం వచ్చింది. పాప ‘అబ్స్ట్రక్టివ్ ఇన్ఫ్రాడయాఫ్రమాటిక్ టోటల్ అనామలస్ పల్మనరీ వీనస్ డ్రయినేజ్’ (టీఏపీవీఆర్) అనే అత్యంత అరుదైన వ్యాధితో తీవ్రంగా బాధపడుతోంది. సాధారణంగా శుద్ధమైన రక్తం ఊపిరితిత్తుల్లో శుభ్రపడి అక్కడ్నుంచి గుండె తాలూకు ఎడమ ఏట్రియమ్‌కు చేరాలి. ఈ కండిషన్లో అది గుండె ఎడమ ఏట్రియమ్‌కు బదులు కాలేయానికి తన దిశ మార్చుకుంటుంది. దాంతో పాపకు ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. పాప కడుపులో ఉన్నంతసేపు ఎలాగూ బతికేస్తుంది. కానీ పుట్టీ పుట్టగానే పాపలో తనదైన రక్తప్రసరణ వ్యవస్థ మొదలవుతుంది. అయితే ఈ ప్రక్రియలో శుద్ధమైన రక్తం గుండె ఎడమ ఏట్రియమ్‌కు చేరకుండా కాలేయానికి చేరితే శుద్ధమైన రక్తం అందని కారణంగా పాప పుట్టిన కొద్దిసేపట్లోనే చనిపోవచ్చు. అనూరాధకు 2014 జనవరి 4న సిజేరియన్ చేసి కడుపులోంచి పాపను బయటకు తీశారు డాక్టర్లు. ఉదయం గం. 6.45 నిమిషాలకు పుట్టిన పాపను వెంటనే వెంటిలేటర్‌పై ఉంచారు. పుట్టీపుట్టగానే చిన్నారిని అత్యవసరంగా ఆపరేషన్ థియేటరకు తరలించారు. ఉదయం 8.30కి మొదలైన సర్జరీ 11.30 కల్లా విజయవంతంగా ముగిసింది. గంటల పాపపై డాక్టర్ల శస్త్రచికిత్స సత్ఫలితాలిచ్చింది. రక్తనాళాల్లోని రక్తంతో పాటు... మృత్యువూ తన దారి మార్చుకుని, పాప నుంచి దూరంగా వెళ్లింది. ఈ సందర్భంగా తమకు తోడ్పడ్డ డాక్టర్ శ్రీనివాసమూర్తి, డాక్టర్ మాల్జిని, డాక్టర్ పల్లవి, డాక్టర్ విజయ... ఇతర సహాయక సిబ్బంది సేవలను స్మరించారు డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ తపన్దాష్.