చిరు గుండెకు రెండు గంటల్లో చికిత్స | care hospital doctors rescue operation to baby heart malformation | Sakshi
Sakshi News home page

చిరు గుండెకు రెండు గంటల్లో చికిత్స

Published Sat, Apr 1 2017 5:14 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

ఆపరేషన్‌ జరిగిన చిన్నారితో తల్లి పుష్పలత

ఆపరేషన్‌ జరిగిన చిన్నారితో తల్లి పుష్పలత

గుండె నిర్మాణంలో లోపం.. పునర్జన్మ ప్రసాదించిన కేర్‌ వైద్యులు
సాక్షి, హైదరాబాద్‌: గుండె నిర్మాణ లోపంతో బాధపడుతూ మృత్యువు తో పోరాడుతున్న ఓ శిశువుకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్ప త్రి వైద్యులు చికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు. చీఫ్‌ పీడియాట్రిక్‌ కార్డియాక్‌ సర్జన్‌ తపన్‌ దాస్, చీఫ్‌ పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌ నాగే శ్వర్‌రావు, ఆనంద్,  రామకృష్ణ, రజేన్‌లతో కూడిన వైద్యబృందం చిన్నారి కి విజయవంతంగా చికిత్స చేసింది. ఈ వివరాలను శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించింది.

నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ కు చెందిన పుష్పలత, నవీన్‌ దంపతులకు ఇటీవల తక్కువ బరువు(1400 గ్రాముల)తో శిశువు జన్మించింది. చిన్నారి పుట్టుకతోనే గుండె నిర్మాణ లోపం ఉంది. దీంతో స్థానిక వైద్యు ల సూచన మేరకు ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డను మార్చి 7న కేర్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి బిడ్డ గుండెలో ఎడమవైపు ఉండాల్సిన భాగం కుడివైపు, కుడివైపు భాగం ఎడమవైపు ఉన్నట్లు గుర్తించారు. 12 మందితో కూడిన వైద్య బృందం రెండు గంటలపాటు శ్రమించి చికిత్స చేసింది. పాప పూర్తిగా కోలుకున్నట్లు డాక్టర్‌ తపన్‌దాస్‌ తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో శిశువుకు ఉచితంగా చికిత్స చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement