హైదరాబాద్ : ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ రోడ్‌నెం.10లోని కేర్ ఆస్పత్రి అవుట్‌పేషంట్ విభాగం గ్రౌండ్‌ఫ్లోర్‌లో రేపు ఉదయం 11 గంటల నుంచి ఆస్తమా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. డాక్టర్ కె. శుభాకర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం ఉంటుందని, హైదరాబాద్‌లో అమెరికన్ కాన్సులేట్ జనరల్ మైఖేల్ ములిన్స్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం కోసం 9866822286 నంబర్‌ను సంప్రదించవచ్చని వెల్లడించారు.