అనపర్తి, న్యూస్‌లైన్:
ప్రముఖ వైద్య నిఫుణుడు, శ్రీనివాసా నర్సింగ్‌హోమ్ అధినేత డాక్టర్ పోతంశెట్టి రామారెడ్డి (రాము డాక్టర్) అంత్యక్రియలు శుక్రవారం ఉదయం స్థానిక హిందూ శ్మశానవాటికలో నిర్వహించారు. ఆయన కుమారుడు డాక్టర్ జానకి రామారెడ్డి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. రామారెడ్డి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. రాము డాక్టర్ మృతదేహం గురువారం అర్ధరాత్రి దాటాక ఇక్కడి ఆయన స్వగృహానికి చేరుకుంది. అప్పటికే ఆయన అభిమానులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆయన మృతదేహాన్ని చూసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆప్రాతం శోకసంద్రమైంది. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు రాము డాక్టర్ భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.
అంతిమ యాత్ర ఉదయం ఆరు గంటలకు ఆయన స్వగృహం వద్ద ప్రారంభమై శ్రీనివాసా నర్సింగ్‌హోమ్‌కు చేరింది. అక్కడ అభిమానుల దర్శనార్థం కొద్దిసేపు డాక్టర్‌గారి భౌతిక కాయాన్ని ఉంచారు. అక్కడ నుంచి అంతిమ యాత్ర హిందూ శ్మశానవాటికకు 11 గంటలకు చేరుకుంది. అంతిమ యాత్రలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే పీ విష్ణువర్థన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గనేత డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, డాక్టర్ టీ సత్యనారాయణరెడ్డి, డాక్టర్ ఏఎస్‌ఎన్ మూర్తి, డాక్టర్ టీరామగుర్రెడ్డి, డాక్టర్ జీఎస్‌ఎన్‌రెడ్డి, డాక్టర్ టీ నవీన్, డాక్టర్ జగన్మోహనరెడ్డి, డాక్టర్ కర్రి సాయి వెంకట కృష్ణారెడ్డి, రాయవరం ఏరియా రైసుమిల్లర్సు అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. సత్యనారాయణరెడ్డి, నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ప్రతినిధి టి. సుధాకరరెడ్డి, వర్తక సంఘం అధ్యక్షులు కర్రి ధర్మారెడ్డి, గ్రామ సర్పంచ్ జి. బాపిరాజు, జీబీఆర్ విద్యా సంస్థల అధిపతి తేతలి ఆదిరెడ్డి, నల్లమిల్లి వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎన్. వీర్రాఘవరెడ్డి, చిర్ల వీర్రాఘవరెడ్డి, వర్తక సంఘం మాజీ అధ్యక్షుడు సత్తి విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పలువురి సంతాపం
డాక్టర్ రామారెడ్డి మృతి పట్ల సనాతన ధర్మపరిరక్షణ సమితి అధ్యక్షుడు రెడ్డి సురేష్ శర్మ, ఘంటసాల ఆరాధన కమిటీ అధ్యక్షుడు దుర్భ శ్రీరామ్మూర్తి, పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మిరియాల వీర్రాజు, పీవీఎన్ సూర్యనారాయణ, వాకర్స్ క్లబ్ ప్రతినిధులు తమలంపూడి రామారెడ్డి(ఇంజనీర్), తేతలి త్రిమూర్తులు రెడ్డి, నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి, ఎన్‌సీఆర్ మురళి తదితరులు సంతాపం తెలిపారు.
ఆస్పత్రులు, వ్యాపార, విద్యా సంస్థల మూసివేత
రామారెడ్డి ఆకస్మిక మృతికి సంతాప సూచకంగా అనపర్తిలో శుక్రవారం ఆస్పత్రులు, వ్యాపార, విద్యా సంస్థలు, హోటళ్లు మూసివేశారు.
డాక్టర్ రామారెడ్డికి క న్నీటి వీడ్కోలు
Published Sat, Dec 7 2013 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM
Advertisement
Advertisement