
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెదక్ నర్సాపూర్‌కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఇప్పటివరకు వైద్య ఖర్చులు కోసం పేషెంట్ బంధువులు రూ.5 లక్షలు చెల్లించారు.
నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న వెంకటేష్ తెల్లారేసరికే మృతిచెందారు. విషయం చెప్పకుండా మరో రూ.4 లక్షలు చెల్లించాలని వైద్యులు తెలిపారు. అనుమానంతో ఐసీయూలోకి దూసుకెళ్లిన బంధువులు.. వెంకటేష్ మృతిచెంది ఉండటంతో కోపోద్రిక్తులయ్యారు. మృతి చెందిన వ్యక్తికి ట్రీట్‌మెంట్ చేశారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద బాధిత బంధువులు ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment