సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలించిన కారణంగా ఔట్ పేషంట్ డిపార్ట్‌మెంట్స్(ఓపీడీ), ఎలిక్టివ్ కేర్ సేవలు సహా అన్ని రకాల వైద్య సేవలను పునః ప్రారంభిస్తున్నట్లు కేర్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. భౌతిక దూరం, రోగులు, ఉద్యోగుల భద్రత వంటి అంటు వ్యాధుల నియంత్రణ మార్గదర్శకాలను విధిగా అమలు చేయనున్నట్లు పేర్కొంది.
ఈ మార్గదర్శకాలను గురించి కేర్ హాస్పిటల్స్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ ఏకే దాస్ మాటాడుతూ.. ‘చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చే వారిపట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆస్పత్రిలో సీనియర్ వైద్య సిబ్బంది బృందం, ప్రతి రోజూ పరిస్థితులను సమీక్షించడంతో పాటుగా నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరిస్తారనే భరోసాను పేషెంట్లలో కలిగిస్తాం' అని ఆయన వివరించారు. చదవండి: వారికి క్వారంటైన్ అవసరం లేదు
కేర్ హాస్పిటల్స్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నిఖిల్ మాథుర్ మాట్లాడుతూ.. ‘ఆస్పత్రికి వచ్చే రోగుల ఆరోగ్యం, భద్రత అనేవి మాకు ముఖ్యమైనవి. అంటువ్యాధుల నియంత్రణ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం ద్వారా భద్రతకు, ఆరోగ్యానికి హామీనిస్తున్నామని' ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment