
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా తీవ్రమైన నిమోనియాతో బాధపడుతున్న కేంద్ర మాజీ మంత్రి, నటుడు కృష్ణంరాజు (79) చికిత్స కోసం బుధవారం రాత్రి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరారు. ఆయన్ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. కృష్ణంరాజు ఆరోగ్యంపై వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆయన తరపు ప్రతినిధి వెల్లడించారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు.