నటుడు కృష్ణంరాజుకు అస్వస్థత | actor krishnam raju hospitalized due to illness | Sakshi
Sakshi News home page

నటుడు కృష్ణంరాజుకు అస్వస్థత

Published Tue, May 17 2016 7:58 AM | Last Updated on Tue, Aug 14 2018 3:33 PM

నటుడు కృష్ణంరాజుకు అస్వస్థత - Sakshi

నటుడు కృష్ణంరాజుకు అస్వస్థత

హైదరాబాద్: రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం గురి కావడంతో ఆదివారం అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ లో ఆయనను చేర్చారు. డాక్టర్ సోమరాజు నేతృత్వంలో వైద్య బృందం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన గత కొంతకాలం నుంచి శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. సోమవారం ఉదయం హీరో ప్రభాస్ గంటపాటు ఆస్పత్రిలో కృష్ణంరాజు వద్ద ఉన్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు  ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కేర్ వైద్యులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement