శ్రీనగర్: అంతుచిక్కని వ్యాధి కారణంగా జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఇప్పటివరకు 17 మంది మృతిచెందారు. ఈ నేపధ్యంలో తాజాగా చండీగఢ్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) బృందం రాజౌరి జిల్లాలోని
బుధల్ గ్రామాన్ని సందర్శించింది.
ఈ సందర్భంగా డాక్టర్ అమర్‌జిత్ సింగ్ భాటియా మాట్లాడుతూ ఈ అంతుచిక్కని వ్యాధికిగల కారణం వెల్లడయ్యిందని, బాధితులకు మెరుగైన చకిత్స అందిస్తామని, వారంతా త్వరలోనే కోలుకుంటారని అన్నారు. మరోవైపు స్థానిక వైద్యాధికారులు గ్రామాన్ని క్వారంటైన్ చేశారు. రాజౌరి పరిపాలన అధికారులు 150 పడకల తాత్కాలిక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో బాధితులకు 24 గంటలూ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు.
డాక్టర్ అమర్‌జీత్ సింగ్ భాటియా తెలిపిన వివరాల ప్రకారం ఈ మరణాలకు బాధితుల మెదడుకు హాని జరగడమే ప్రధాన కారణం. ఫలితంగా వారి నాడీ వ్యవస్థ దెబ్బతింది. తాజగా ఈ వ్యాధితో ఆస్పత్రిలో చేరిన తొమ్మదిమందిలో ఐదుగురు కోలుకున్నారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్థానిక వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడి జనం ఆహార పదార్థాలను పరస్పరం పంచుకోవద్దని సూచిస్తున్నారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో తక్షణ వైద్య సహాయం అందిస్తున్నారు. బాధిత కుటుంబాలకు పోషకాహారం అందిస్తున్నారు. దుస్తులు, మందులు, పరిశుభ్రతా పరికరాలను అందిస్తున్నారు. ఈ కేంద్రంలో వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉంటున్నారు. మరోవైపు పోలీసుశాఖ గ్రామంలో చోటుచేసుకున్న మరణాలకు నేరపూరత చర్యలేవైనా కారణమై ఉండవచ్చనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Los Angeles Fire: మళ్లీ కార్చిచ్చు.. రెండు గంటల్లో 5,000 ఎకరాలు ఆహుతి
Comments
Please login to add a commentAdd a comment