quarantine
-
భారత్ @ 158
న్యూఢిల్లీ/బెంగళూరు: భారత్‌లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య బుధవారానికి 158కి చేరింది. మంగళవారం నుంచి కొత్తగా 14 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. వారిలో ఒక సైనికుడు కూడా ఉన్నారు. లద్దాఖ్ స్కౌట్ రెజిమెంట్‌కు చెందిన 34 ఏళ్ల సైనికుడికి కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని భారత సైన్యం ప్రకటించింది. ఇరాన్ నుంచి ఫిబ్రవరి 20న ఎయిర్ ఇండియా విమానంలో భారత్ తిరిగొచ్చిన తన తండ్రి నుంచి ఆ సైనికుడికి ఆ వైరస్ సోకిందని, అతడి తండ్రికి కూడా కోవిడ్ నిర్ధారణ అయిందని వెల్లడించింది. వారు లేహ్‌లోని చౌహత్ గ్రామానికి చెందినవారని తెలిపింది. ఆ సైనికుడి సోదరుడికి కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా ఆర్మీ చర్యలు ప్రారంభించింది. సెలవుపై వెళ్లి వచ్చిన సైనికులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు జరపడం, ఫ్లూ లక్షణాలు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం, అనవసర ప్రయాణాలను, అన్ని శిక్షణ కార్యక్రమాలను, సదస్సులను రద్దు చేయడం.. తదితర చర్యలు చేపట్టింది. ఈ వైరస్ సోకిన 158 మందిలో ముగ్గురు మృతులు, 25 మంది విదేశీయులు ఉన్నారు. ఏకాంతవాస కేంద్రాల(క్వారంటైన్ సెంటర్స్)ను సందర్శించి, అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ బాధితులతో సన్నిహితంగా ఉన్న దాదాపు 5700 మందిని వివిధ క్వారంటైన్ సెంటర్లలో ఉంచి, వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బుధవారం వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 42, కేరళలో 27, ఉత్తరప్రదేశ్‌లో 16, కర్ణాటకలో 11, ఢిల్లీలో 10, లద్దాఖ్‌లో 8, తెలంగాణలో 13 కేసులు నమోదయ్యాయి. హరియాణాలో కోవిడ్ బారిన పడిన 17 మందిలో 14 మంది విదేశీయులే కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా చికిత్స అనంతరం కోలుకుని 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల సౌదీ అరేబియా వెళ్లి వచ్చిన బీజేపీ ఎంపీ సురేశ్ ప్రభు స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. విదేశాల్లోని భారతీయులకు.. విదేశాల్లోని భారతీయుల్లో 276 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్ బుధవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. వారిలో ఇరాన్‌లోని 255 మంది, యూఏఈలోని 12 మంది, ఇటలీలోని ఐదుగురు, శ్రీలంక, కువైట్, రువాండా, హాంకాంగ్‌ల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారన్నారు. యూఏఈలో 8 మంది భారతీయులను క్వారంటైన్ చేసినట్లు వెల్లడించారు. ఇరాన్లో సుమారు 6 వేల మంది భారతీయులున్నారన్నారు. వారిలో జమ్మూకశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట్రల నుంచి పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్లిన 1100 మంది, కేరళ, ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లిన 1000 మంది మత్స్యకారులు, జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాల నుంచి వెళ్లిన 300 మంది విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు. ఇప్పటివరకు ఇరాన్ నుంచి 389 మందిని వెనక్కు తీసుకువచ్చామన్నారు. రాజ్యసభలో మాస్కుల కలకలం రాజ్యసభకు తొలిసారి ఎంపీ డెరెక్ ఓ బ్రేన్ సహా నలుగురు టీఎంసీ సభ్యులు మాస్క్‌లతో వచ్చారు. సభా నిబంధనల ప్రకారం సభ్యులు మాస్క్‌లు ఉపయోగించరాదని సభ చైర్మన్ వెంకయ్యనాయుడు తొలుత అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, కరోనా ముప్పు నేపథ్యంలో మాస్క్‌ల వినియోగం తప్పనిసరి అని, దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా జారీ చేసిందని, అందువల్ల మాస్క్‌లను అనుమతించాలని కాంగ్రెస్ సభ్యుడు చిదంబరం కోరడంతో, వెంకయ్యనాయుడు అంగీకరించారు. కరోనా ముప్పు పొంచి ఉందని, అందువల్ల బడ్జెట్ సమావేశాలను కుదించాలని కాంగ్రెస్ సహా పలు పార్టీల సభ్యులు అభ్యర్థించారు. వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటూ ఉంటామని, అందువల్ల ఎంపీలకు వైరస్ ముప్పు అధికంగా ఉంటుందని, ఎంపీలమైనందువల్ల ఆ వైరస్ మన జోలికి రాదని అనుకోకూడదని కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ గౌడ వ్యాఖ్యానించారు. అయితే, ఈ అభ్యర్థనను ప్రభుత్వం తోసిపుచ్చింది. సబ్బుల ధరలపై కేంద్రం దృష్టి న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్న నిత్యావసరాలైన సబ్బులు, నేలలు తుడిచే క్లీనర్లు, థర్మల్ స్కానర్ల ధరలను కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. సాధారణంగా ఈ శాఖ దేశవ్యాప్తంగా 22 నిత్యావసరాల ధరలను పర్యవేక్షిస్తుంటుంది. తాజాగా ఫేస్ మాస్క్‌లు, చేతి శానిటైజర్లను ఆ జాబితాలో చేర్చింది. ‘కోవిడ్ కారణంగా డిమాండ్ పెరిగిన సబ్బులు, లైజాల్, డెటాల్ వంటి చేతులు, నేలలు శుభ్రపరిచే క్లీనర్ల ధరలను మేం పర్యవేక్షిస్తున్నాం’అని కేంద్ర మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 114 కేంద్రాల ద్వారా ఈ ఉత్పత్తుల ధరలను కేంద్రం పర్యవేక్షిస్తోంది. 22 నిత్యావసర వస్తువుల్లో బియ్యం, గోధుమలు, గోధుమ పిండి, పప్పు ధాన్యాలు, నూనెలు, కూరగాయలు, చక్కెర, పాలు, టీ, ఉప్పు తదితరాలు ఉన్నాయి. కోవిడ్‌పై ప్రజల్లో అవగాహన పెరగడంతో వేరే దేశాలతో పోలిస్తే భారత్‌లో తక్కువగా వ్యాపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఐఐటీ బాంబే బంద్ ► కరోనా ముప్పు నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ఎలాంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించకూడదని బీజేపీ నిర్ణయించింది. ► మా పరుపులు వాడితే కరోనా వైరస్ రాదని ప్రచారం చేస్తున్న ఒక వ్యాపారిపై మహారాష్ట్రలోని థానేలో కేసు నమోదైంది. ► కోవిడ్–19 లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయొద్దని, బాధ్యతాయుతంగా ప్రవర్తించి, వెంటనే వైద్యుల పర్యవేక్షణలోకి వెళ్లాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై నకిలీ వార్తలు ప్రచారం చేసేవారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ► కరోనా వైరస్ నుంచి రక్షిస్తుందని పేర్కొంటూ గో మూత్రాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని నారాయణ చటర్జీ అనే బీజేపీ కార్యకర్త కోల్‌కతాలో మంగళవారం నిర్వహించారు. ఆ గోమూత్రం సేవించి, అనారోగ్యం పాలయిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చటర్జీని అరెస్ట్ చేశారు. ► ఐఐటీ బాంబే క్యాంపస్‌ను మార్చి 31 వరకు మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ► లండన్‌లో వేలాదిగా ఉన్న భారతీయులు ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై అక్కడి హైకమిషన్‌ను అభ్యర్థిస్తున్నారు. అయితే, బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులపై మార్చి 31 వరకు భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. బ్రిటన్‌లో కోవిడ్ కారణంగా 104 మంది చనిపోగా, దాదాపు 2 వేల మందికి ఈ వైరస్ సోకింది. ► పారా మిలటరీ సిబ్బందికి సంబంధించిన అన్ని అత్యవసరం కాని సెలవులను రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పార్లమెంట్ వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్యకు థర్మల్ స్క్రీనింగ్ దృశ్యం -
ఇంట్లోనే ఉంటున్నా
కరోనా వైరస్ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోమంటూ సినిమా స్టార్స్ ఎప్పటికప్పుడు అభిమానులకు జాగ్రత్తలు చెబుతున్నారు. కొందరు వీడియో రూపంలో, కొందరు మెసేజ్ రూపంలో కరోనా గురించి హెచ్చరిస్తున్నారు. అమితాబ్ స్టాంప్ ద్వారా తెలిపారు. ఓటర్ ఇంక్‌తో ముంబైలో ‘ప్రౌడ్ టు ప్రొటెక్ట్ ముంబైకర్స్ హోమ్ క్వారంటైన్డ్’ అని చేతి మీద స్టాంప్ వేయించుకుంటున్నారు. దాన్ని ట్వీటర్ ద్వారా షేర్ చేసి, ఇంట్లోనే తనను తాను నిర్భందం చేసుకుని జాగ్రత్తగా ఉంటున్నాను అని తెలిపారు అమితాబ్. ‘‘అందరూ జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ కరోనా లక్షణాలు కనిపిస్తే బయట ఎక్కువగా తిరగకండి’’ అని రాసుకొచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటి నుంచి ట్వీటర్ ద్వారా అభిమానులను జాగ్రత్తగా ఉండమంటూ వారిస్తున్నారాయన. కరోనా మీద ఓ పద్యం కూడా రాశారు. గత ఆదివారం అభిమానులను కలిసే ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. -
కరోనా ఎఫెక్ట్ : స్వీయ నిర్బంధంలో హీరోయిన్
కోల్‌కతా : భారత్‌లో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా పాజిటివ్‌గా తేలినవారిలో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చినవారే ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణం ముగించుకుని ఇండియా చేరుకున్న పలువురు స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. తాజాగా బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తన తాజా చిత్రం బాజి షూటింగ్ కోసం లండన్‌కు వెళ్లిన మిమి చక్రవర్తి మంగళవారం ఇండియా చేరుకున్నారు. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవడంతోపాటు, కరోనా వైరస్‌కు సంబంధించి ఇతర ఫార్మాలిటీలను కూడా పూర్తి చేశారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా 7 రోజుల పాటు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్టు మిమి చక్రవర్తి ప్రకటించారు. ఈ 7 రోజులు పాటు ఎవరిని కలవకూడదని నిర్ణయం తీసుకున్నారు. ‘నేను యూకే నుంచి దుబాయ్ మీదుగా ఇండియాకు వచ్చాను. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇంట్లో నన్ను కలవద్దని నా తల్లిదండ్రులకు చెప్పాను. నా తండ్రికి ఇప్పుడు 65 ఏళ్లు. 7 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. మనం ప్రస్తుతం చాలా కష్ట కాలంలో ఉన్నాం. కానీ తొందరలోనే ఈ పరిస్థితి మారుతుంది. ప్రభుత్వం చెప్పిన విధంగా శుభ్రత, చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. భద్రత చర్యల్లో భాగంగా ఇతరులతో దూరంగా మెలగాలి’ అని తెలిపారు. చదవండి : సౌదీ పర్యటన; బీజేపీ ఎంపీ స్వీయ నిర్బంధం ఎయిర్‌పోర్టు అధికారులపై సోనం ప్రశంసలు! -
కరోనా: నటుడు ప్రియదర్శి హోమ్ క్వారంటైన్!
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక కరోనా (కోవిడ్) వ్యాప్తి నియంత్రణకు వ్యక్తిగత పరిశుభ్రత, ఇతరులకు దూరంగా ఉండటమే మేలైన మార్గాలని పలు పరిశోధనలు, వైద్యశాస్త్ర నిపుణులు చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హాస్యనటుడు ప్రియదర్శి స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయారు. ఇటీవల ప్రభాస్ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు జార్జియా వెళ్లిన ఆయన షూటింగ్ ముగించుకుని వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా వైరస్ స్క్రీనింగ్ అనంతరం ఆయన హోమ్ క్వారంటైన్లో ఉండిపోయారు. తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకునేందుకు బాధ్యతగా 14 రోజులు ప్రజలకు దూరంగా ఉండాలని ప్రియదర్శి నిర్ణయించుకున్నారు. (చదవండి: బర్త్‌డే వేడుకలు క్యాన్సిల్ చేసిన చెర్రీ) -
కరోనా ఎఫెక్ట్: గృహ నిర్భందంలో కేంద్రమంత్రి
ప్రపంచ దేశాలను భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా వైరస్ తన ప్రతాపాన్ని భారత్‌లోనూ చూపిస్తోంది. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు, అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసులు అధికం అవుతుండటం ఆందోళన కలిగిస్తుండగా తాజాగా కేంద్రమంత్రికి కూడా కోరాన సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. కేరళకు చెందిన కేంద్ర మంత్రి మురళీధరన్ మార్చి 14న తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలోని డైరక్టర్స్ ఆఫీస్‌లో జరిగిన ఓ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో వివిధ డిపార్ట్మెంట్ల అధిపతులు పాల్గొన్నారు. అయితే మార్చి 1న స్పెయిన్ నుంచి తిరిగొచ్చిన ఈ హాస్పిటల్‌లోని ఓ డాక్టర్(రేడియాలజిస్ట్)కు కరోనా సోకినట్లు ఆదివారం నిర్థారణ అయింది. దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి స్వీయ నిర్భంధంలో ఉండబోతున్నట్లు ప్రకటించారు. కాగా కరోనా సోకిన డాక్టర్‌ను నేరుగా కలిసిన 25మంది డాక్టర్లతో సహా 75మంది ఉద్యోగుల లిస్ట్‌ను తయారు చేసి వారిని కూడా ఐసొలేట్ చేసినట్లు సమాచారం. వాళ్ల కుటుంబసభ్యులను కూడా ఇళ్లల్లోనే ఉండమని అధికారులు సూచించినట్లు సమాచారం. చదవండి: కరోనాపై తప్పుడు ప్రచారం.. డాక్టర్‌కు నోటీసులు ఈ నేపథ్యంలో తనకు ఇప్పటివరకు వైరస్ సోకినట్లు తేలకపోయినప్పటికీ కూడా తాను ఆ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నందున ముందు జాగ్రత్త చర్యగా తనకు తానుగా కేంద్రమంత్రి మురళీధరన్ క్వారంటైన్ అయ్యారు. ఇళ్లు దాటి బయటకి రాకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే వైద్యులు కేంద్రమంత్రికి ఇంట్లోనే వైద్య సహాయం అందించనున్నారు. చదవండి: క్వారంటైన్లో నువ్వు.. బయట నేను! కాగా దేశంలో సోమవారానికి ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 114కు చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలపగా.. ఆ సంఖ్య మంగళవారం నాటికి 126కి చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరికొన్ని చర్యలు తీసుకుంది. యూరోపియన్ యూనియన్, బ్రిటన్, టర్కీ నుంచి వచ్చే ప్రయాణికులు భారత్‌లో ప్రవేశించడంపై మార్చి 31 వరకూ నిషేధం విధిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. -
కరోనా మరణం: ‘వారందరినీ క్వారంటైన్లో పెట్టాం’
సాక్షి, బెంగుళూరు: దేశంలో తొలి కరోనా మరణం సంభవించడంతో ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్ హుస్సేన్ సిద్ధఖీ (76) కోవిడ్ లక్షణాలతో బాధ పడుతూ బుధవారం మరణించిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వైరస్ ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సిద్దఖీ కుటుంబ సభ్యులు ఎనిమిది మందిని కలబుర్గిలోని ఓ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో క్వారంటైన్ (నిర్భంధం)లో ఉంచింది. సిద్ధఖీ కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, వారి నలుగురు పిల్లలు కలబుర్గిలోని ప్రభుత్వ ఈఎస్ఐ ఆస్పత్రిలో క్వారంటైన్లో ఉన్నారని కలబుర్గి డిప్యూటీ కమిషనర్ బి.శరత్ తెలిపారు. (చదవండి: భారత్‌లో తొలి మరణం) పిల్లల్ని మినహాయించి నలుగురు పెద్దవాళ్ల నమూనాలను బెంగుళూరు వైరాలజీ రిసెర్చ్ సెంటర్‌కు పంపించామని తెలిపారు. దగ్గు, జలుబుతో వారు బాధ పడుతున్నారని పేర్కొన్నారు. వారి ఇంటినీ ఇప్పటికే పూర్తిగా శుద్ధి చేశామని చెప్పారు. ఆ ఇంటి పక్కనే ఉన్న మరో కుటుంబానికి చెందిన ఏడుగురిని కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించామని శరత్ వెల్లడించారు. ఫిబ్రవరి 29న సిద్దఖీ సౌదీ నుంచి స్వదేశానికి రాగా.. వారి కుటుంబాన్ని కలిసిన 32 మందిని కూడా ఇంట్లోనే ఉండాలని సూచించినట్టు ఆయన తెలిపారు. ఇక కరోనా భయాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలోని షాపింగ్ మాళ్లు, సినిమా థియేటర్లు, నైట్ క్లబ్బులు, పబ్బులను వారంపాటు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. (ఐపీఎల్ 2020 వాయిదా) -
సోలార్ పరిశ్రమ దిగ్బంధం
ఓర్వకల్లు : భూములు కోల్పోయిన రైతులు పరిహారం కోసం శనివారం శకునాల గ్రామం వద్ద సోలార్ పరిశ్రమను దిగ్బంధించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేసేంత వరకు కదలబోమని భీష్మించుకు కూర్చున్నారు. ముందుగా గని, శకునాల, దేవనూరు గ్రామాలకు చెందిన వ్యవసాయ కూలీలు, బాధిత రైతులు పెద్ద ఎత్తున సోలార్ పరిశ్రమ వద్దకు తరలి వెళ్లారు. పరిహారం చెల్లింపులో నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని నినాదాలు చేశారు. విష యం తెలుసుకున్న పాణ్యం, కర్నూలు పోలీసులు అక్కడికి చేరుకొని.. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నచ్చజెప్పారు. అయితే అధికారులు వచ్చి హామీ ఇచ్చేదాక కదిలేదని రైతులు, కూలీలు భీష్మించి కూర్చున్నారు. అక్కడే టెంట్ వేసుకొని నాలుగు గంటల పాటు బైఠాయించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు వ్యవసాయ కూలీలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలని, స్థానిక యువతకు పరిశ్రమలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్నూలు ఆర్డీవో హుసేన్ సాహెబ్, ఓర్వకల్లు తహసీల్దార్ రజనీకుమారి అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. సోలార్ పరిశ్రమలో కోల్పోయిన భూములకు పరిహారం చెల్లింపులో నాలుగేళ్ల నుంచి జాప్యం జరుగుతున్న విషయం వాస్తవమేనని ఆర్డీఓ అంగీకరించారు. మొత్తం 980 ఎకరాలకు పరిహారం ఇవ్వడానికి రూ.81 కోట్లు అవసరమని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిపారు. ఇందులో మొదట జనరల్ అవార్డు కింద గుర్తించిన 210 ఎకరాలకు రూ.27 కోట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నప్పటికీ కోర్టు వ్యవహారం కారణంగా పెండింగ్‌లో ఉంచినట్లు వెల్లడించారు. రెక్టిఫికేషన్ అవార్డు కింద గుర్తించిన మరో 230 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో కాలయాపన జరుగుతోందన్నారు. పరిహార విషయంలో తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకున్న బోయ మద్దిలేటి కుటుంబానికి జాతీయ కుటుంబ యోజన పథకం(ఎన్‌ఎఫ్‌బి) కింద ఆర్థిక ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మృతుని కుటుంబంలో ఒకరికి సోలార్ పరిశ్రమలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు. స్థానిక యువతకు అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆ సంస్థ ఈఈ సుధాకర్‌ను ఆర్డీఓ ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌తో చర్చించిన తర్వాత 15 రోజుల్లో రూ. 81 కోట్ల్ల పరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో బాధిత రైతులు, వ్యవసాయ కూలీలు తమ ఆందోళనను విరమించుకున్నారు. సీపీఎం మండల కన్వీనర్ నాగన్న , రైతు సంఘం నాయకులు రామకృష్ణ , భూ నిర్వాసిత కమిటీ సభ్యులు చంద్రబాబు, చాంద్‌బాషా షంషీర్‌ఖాన్, జయరాముడు, మల్లమ్మ, రమాదేవి, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కూలీలు, బాధిత రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో హుసేన్ సాహెబ్ -
తెలుగు విద్యార్థుల నరకయాతన
ఇంకా తేరుకోని శ్రీనగర్ ► జమ్మూకాశ్మీర్‌లో జలదిగ్బంధం.. ► సురక్షితంగా 45 మంది విద్యార్థుల ఢిల్లీకి తరలింపు ►11 మంది హైదరాబాద్‌కు న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో జలదిగ్బంధంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వారిలో 47 మంది తెలుగువారిని గురువారం సురక్షితంగా ఢిల్లీలోని ఏపీభవన్‌కు తరలించారు. వీరిలో 45 మంది శ్రీనగర్‌లోని నిట్స్ విద్యార్థులతో పాటు అక్కడే ముత్యాల వ్యాపారం నిర్వహిస్తున్న నాయుడు దంపతులున్నారు. బాధితులకు ఏపీభవన్‌లో భోజన వసతి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 6, 8, 9 గంటలకు మూడు విమానాల్లో బాధితులను ఏపీ, తెలంగాణకు పంపారు. తొలుత లడఖ్ నుంచి ఢిల్లీకి ఉదయం 11.30 గంటలకు చేరుకున్న బాధిత విద్యార్థుల యోగక్షేమాలను ఏపీభవన్‌లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.రామ్మోహనరావు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగువారందరినీ సురక్షితంగా తరలిస్తామన్నారు. సురక్షితంగా సొంత రాష్ట్రాలకు.. తొలి బ్యాచ్‌లో ఏపీభవన్‌కు చేరుకున్న విద్యార్ధుల్లో.. కె.నరేశ్ (శ్రీకాకుళం), ఎ.శ్యామ్‌కుమార్ (వైజాగ్), నానావతి కుమార్ (నల్లగొండ), బోదల రాజశేఖర్ (విజయనగరం), ఎన్.సృజన్‌కుమార్ (వరంగల్), బి.రాజ్‌కుమార్ (ఆదిలాబాద్), కె.శివకుమార్ (వరంగల్), రాహుల్ (కర్నులు), గూడ రాహుల్ (కరీంనగర్), జె.సాయిచరణ్ (నిర్మల్), బూర్గుల శ్యామ్ (వరంగల్), బీవీఆర్ రోహిత్ (వైజాగ్), మనోజ్‌కుమార్ రెడ్డి (కడప), వనం ప్రేమ్ ప్రసన్న (సికింద్రాబాద్), కొండపల్లి గిరీశ్ (భీమవరం), యు.అఖిల్ సాగర్ (ఆదిలాబాద్), వొట్టి శ్యామ్ సాయి (వైజాగ్), టి.సాయివెంకట నాగ (విజయవాడ), ఎన్.హరికృష్ణ (పశ్చిమగోదావరి), పి.తేజ (రాజమండ్రి), జైకిషన్ శర్మ (విశాఖపట్నం), యైఅన్వేష్ సాయి (విశాఖపట్నం), వంగర వంశీకృష్ణ (వరంగల్), కె.వెంకటసాయి ప్రకాశ్ (పశ్చిమ గోదావరి), చౌహాన్ మానిక్‌రావు (ఆదిలాబాద్), కోరుకొండ కేశవరావు (విశాఖపట్నం), కె.మూర్తి శ్రీచరణ్ (పశ్చిమ గోదావరి), జి.విపిన్కర్ (హైదరాబాదు), బి.దేవంత్ (విజయవాడ), ఎస్.ఆనంద్జీ( పశ్చిమ గోదావరి), బి.శ్రవణ్‌కుమార్ (ఖమ్మం), ఎన్.అమర్నాథ్ రెడ్డి (విశాఖపట్నం), బి.వంశీ (నల్లగొండ), ఎ.మంజేశ్ కుమార్ (ఆదిలాబాద్), బి.విష్ణు వర్మ (వరంగల్)తో పాటు నాయుడు దంపతులు ఉన్నారు. రెండో బ్యాచ్‌లో లేహ్ నుంచి అనిల్‌రెడ్డి, కె.లిఖిత్ రెడ్డి, పి.ప్రశాంత్‌కుమార్, ఎం.నాగార్జున, పి.దినేశ్, కాళీబాబు, ఎస్.మురళీ మనోహర్, అఖిల్ ఉన్నారు. వీరిలో 11 మంది గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎవరూ పట్టించుకోలేదు.. జమ్ముకాశ్మీర్‌లో తెలుగు విద్యార్ధులు నరకయాతన అనుభవించారు. ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయం అందలేదని మండిపడ్డారు. ‘‘ శ్రీనగర్‌లోని నిట్స్‌లో 74 మంది తెలుగు విద్యార్ధులు ఉన్నారు. నిట్స్ హాస్టల్ల మొదటి అంతస్థులోకి ఆదివారం ఉదయం వరద నీరు చేరింది. మమ్మల్ని సోమవారం ఉదయం దగ్గర్లోని ఎత్తై ప్రదేశంలో ఉన్న కాశ్మీరు యూనివర్శిటీ క్యాంపస్‌కు తరలించారు. తినడానికి ఒక పూట బిస్కట్లు తప్ప మరేమీ దొరకలేదు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. బలవంతంగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం. మా హాస్టల్ నుంచి శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు 18 కిలోమీటర్లు. బోటు ద్వారా ప్రయాణం చేయాలంటే.. ఒక్కొక్కరి నుంచి రూ.5,000 డిమాండ్ చేశాడు. దీంతో బోటును వదిలి.. అత్యంత ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు మీదుగా లడఖ్‌కు క్యాబ్‌లో వెళ్లాం. లడఖ్ నుంచి ఢిల్లీకి విమానచార్జీలు అప్పటి వరకు ఐదారు వేలు ఉండగా.. రూ.20 నుంచి 22 వేలకు పెంచేశారు. సహచర విద్యార్ధి రోహిత్.. వాళ్ల నాన్న (లాయర్)కు ఫోను చేసి విషయాన్ని చెప్పాడు. ఆయన ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ఢిల్లీకి విమానం ఏర్పాటు చేశారు. రోహిత్ లేకుంటే మా పరిస్థితి ఏమయ్యేదో..’’అంటూ బాధిత విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, వరద బాధితులకు ప్రధాని కార్యాలయ సిబ్బంది, అధికారులు తమ ఒక రోజు వేతనాన్ని గురువారం విరాళంగా ప్రకటించారు. శ్రీనగర్: వరద బీభత్సం నుంచి జమ్మూకాశ్మీర్ ఇప్పట్లో తేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. వరద సహాయ కార్యక్రమాలు ప్రారంభమై 10 రోజులైనా.. గురువారం నాటికి శ్రీనగర్‌లోనే ఇంకా 4 లక్షలకు పైగా ప్రజలు జల దిగ్బంధంలోనే ఉన్నారు. అయితే, జీలం నది, దాని ఉపనదుల్లో నీటిమట్టం గణనీయంగా తగ్గడంతో సహాయ చర్యలకు మరింత అవకాశం లభిస్తోంది. మరోవైపు దాల్ సరస్సు నీటిమట్టం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. జమ్మూ, కాశ్మీర్లలోని వరద పీడిత ప్రాంతాల నుంచి ఇప్పటివరకు దాదాపు 1.1 లక్షల మందిని సహాయ దళాలు రక్షించగలిగాయి. త్రివిధదళాలు, ఎన్డీఆర్ఎఫ్, అధికారులు కలసికట్టుగా సహాయచర్యలు కొనసాగిస్తున్నారు. నా ప్రభుత్వాన్నీ ముంచేశాయి: ఒమర్ భీకర వరదల్లో తన ప్రభుత్వం కూడా మునిగిపోయిందని జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. వందేళ్లలో కనీవినీ ఎరగనటువంటి ఈ వరదలు తన రాజధానిని తీసుకెళ్లిపోయాయన్నారు. అసెంబ్లీ భవనం, హైకోర్టు, పోలీస్ ప్రధాన కార్యాలయం, ఆసుపత్రులు.. అన్నీ నీటమునిగాయని చెప్పారు. కాగా, గురువారం సైన్యం చేపట్టిన సహాయ కార్యక్రమాల్లో ఒమర్ సైతం పాలుపంచుకున్నారు. -
వదలని వరద
ముంపులోనే లంకలు, పంటలు జల దిగ్బంధంలోనే ఏజెన్సీ గ్రామాలుఅనుక్షణం పర్యవేక్షిస్తున్న కలెక్టర్, అధికారులు సాక్షి, ఏలూరు : లంకలను ముంచేస్తూ.. పంటల్ని మింగేస్తూ వరద గోదారి ఉరకలేస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. సహాయక చర్యల్లో అధికారులు నిమగ్నమయ్యారు. కొవ్వూరు, ఆచంట, నరసాపురం, నిడదవోలు, పోలవరం ప్రాం తాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. మంగళవారం సాయంత్రం ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 16.10 అడుగులకు చేరడంతో ప్రజలు భయాందోళనలతో గడుపుతున్నారు. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి మరింత పెరిగితే జాతీయ విపత్తు నివార (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను రంగంలోకి దించుతామని అధికారులు చెబుతున్నారు. 11.70 వేల హెక్లార్లలో అరటి, 4.80 వేల హెక్టార్లలో కూరగాయ పంటలు దెబ్బతిన్నాయని ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జల దిగ్బంధంలో లంక గ్రామాలు వశిష్టగోదావరిలో వరద ఉధృతి పెరుగుతుండడంతో ఆచంట మండలంలో లంక గ్రామాలైన అనగారలంక, అయోధ్యలంక, కోడేరులంక, మర్రిమూల, పుచ్చల్లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు కోడేరు, భీమలాపురం గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏటిగట్టు దిగువన ఉన్న కాపులపాలెంలోకి వరదనీరు చేరింది. దాదాపు 70 కుటుంబాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రెండు పడవలను అందుబాటులో ఉంచారు. లంక వాసులకు మంచినీటి ప్యాకెట్లు, చిన్నారులకు పాలు, రొట్టెలు పంపిణీ చేస్తున్నారు. ప్రజలు ఎత్తై ప్రదేశాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. వరదనీరు ప్రవేశించడంతో లంకగ్రామాల్లో కూరగాయ పంటలు వేసిన రైతులు భయపడుతున్నారు. పంటలు 24గంటలపాటు వరద నీటిలోనే ఉంటే కుళ్లిపోతాయి. ఆచంట మండలం పెదమల్లంలోని ప్రసిద్ధ మాచేనమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. లంకగ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా కాచి చల్లార్చిన నీటిని తాగాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం ముంపులోనే ఉంది. కొవ్వూరు మండలం మద్దూరులంక వాసులకు పునరావాసం కల్పించారు. పంటలు నీట మునగడంతో ఇక్కడి లంక రైతులకు అపార నష్టం వాటిల్లింది. పెరవలి మండలంలోని లంకలు పూర్తిగా వరద నీటిలోనే ఉన్నాయి. అరటి, బొప్పాయి, కంద పంటలను కాపాడుకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీలోని 26 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలి చిపోయాయి. గిరిజనులు జ్వరాల బారినపడుతున్నారు. వారిని అతికష్టంపై పడవల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. నరసాపురం ప్రాంతంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అవుట్‌ఫాల్ స్లూయిజ్‌ల ద్వారా వరద నీరు పట్టణంలోకి చొచ్చుకొస్తోంది. దీంతో ఏటిగట్టు ప్రాంతాలు ముంపు బారినపడ్డాయి. మునిసిపల్ సిబ్బంది ఎప్పటికప్పడు మోటా ర్లు సహాయంతో నీటిని తోడిస్తున్నారు. కొనసాగుతున్న వరద ఉధృతి కొవ్వూరు : వరదనీరు పెరగడంతో మంగళవారం మధ్యాహ్నానికి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం గరిష్టంగా 16.10 అడుగులకు చేరింది. సాయంత్రం 6 గంటల వరకు ఇదే మట్టం నిలకడగా కొనసాగింది. పౌర్ణమి రోజులు కావడంతో సముద్రంలో పోటు అధికంగా ఉంది. ఈ పరిస్థితి కొంత ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ధవళేశ్వరం ఆనకట్ట నుంచి డిశ్చార్జి చేసే మిగులు జలాల్లో క్రమేపీ పెరుగుదల కనిపించింది. సాయంత్రం 4 గంటలకు సముద్రంలోకి 16,44,339 క్యూసెక్కులు విడిచిపెట్టగా, సాయంత్రం 6 గంటలకు 16,51,433 క్యూసెక్కులకు పెరిగింది. భద్రాచలం వద్ద మధ్యాహ్నం 12 గంట లకు నీటిమట్టం 52.70 అడుగులకు తగ్గింది. దీంతో అక్కడ మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సాయంత్రం 6 గంటలకు అక్కడ నీటిమట్టం 50.80 అడుగులకు తగ్గింది. అయితే భద్రాచలం దిగువన ప్రాంతాల్లో నీటిమట్టాల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. కూనవరంలో 20.23 మీటర్లు, కుంటలో 11.36, పోలవరం 14.14, కొవ్వూరు రోడ్ కం రైలు వంతెన వద్ద 17.69 మీటర్ల చొప్పున నీటిమట్టాలు నమోదయ్యాయి. గత ఏడాది ఆగస్టు 4వ తేదీన గోదావరి నీటిమట్టం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 19 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సోమవారం సాయంత్రం 4.45 గంటలకు ప్రకటించిన రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మంగళవారం అర్థరాత్రికి నీటిమట్టం స్వల్పంగా పెరిగి, ఆ తరువాత నుంచి తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నామని నీటిపారుదల శాఖ హెడ్ వర్క్స్ ఈఈ పీవీ తిరుపతిరావు తెలిపారు. రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు కొవ్వూరు మండలంలోని మద్దూరులంకలో 18 కుటుంబాలకు చెందిన 45 మందిని మద్దూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. వాడపల్లి గ్రామంలో లోతట్టు ప్రాంతంలో ఉంటున్న ఐదు కుటుంబాలకు చెందిన 15 మందికి స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. ముంపులోనే గోష్పాద క్షేత్రం గోష్పాద క్షేత్రంలో ఉన్న ఆలయాలన్నీ ముంపు బారినపడ్డాయి. గీతా మందిరంలో మూడు అడుగుల మేర నీరు చేరింది. క్షేత్రంలో సుమారు ఆరు అడుగులు మేర వరద నీరు ప్రవహిస్తోంది. బుధవారం సాయంత్రానికి ఆలయాలు ముంపునుంచి తేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
డీసీఎల్ కార్యాలయం దిగ్బంధం
విజయనగరం టౌన్ : పూసపాటిరేగ మండలం కందివలస వద్ద ఉన్న ఎస్ఎంఎస్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు సోమవారం డీసీఎల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మిక యూనియన్‌కు, యాజమాన్యానికి మధ్య నెలకొన్న తగాదా చినికి చినికి గాలివాన లా మారింది. ఉన్నతాధికారుల జోక్యం తో గతనెల 24న జిల్లా కార్మికశాఖ కార్యాలయంలో చర్చలు జరిగాయి. సమస్య పరిష్కారమై 18 రోజులు గడుస్తున్నా నేటికీ పరిశ్రమ యాజమాన్యం కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడంతో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆధ్వర్యంలో కార్మికులు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విధులకొచ్చిన ఉద్యోగులను బయటకు పంపించేశారు. తలుపులకు తాళాలు వేసి గేటు వద్ద అధిక సంఖ్యలో బైఠాయించి తమ సమస్యలు తీర్చేవరకూ పోరాటం చేస్తామని భీష్మించారు. దీంతో చేసేది లేక ఉద్యోగులు వెనుదిరిగారు. అనంతరం కార్మికులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఉన్నతాధికారులు ముందు చర్చలు చేసి, ఆ చర్చల ప్రకారం కార్మికులను పనిలో పెట్టుకోకుండా తాత్సారం చేయడం వెనుక ఆంతర్యమేమిటని అనుమానం వెలిబుచ్చారు. అగ్రిమెంట్ ప్రకారం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాస్థాయి అధికారులు చెప్పినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కొంతమంది అధికారులు కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికుల పొట్ట కొట్టేందుకు చూస్తున్నార ని ఆరోపించారు. కంపెనీలో సీఐటీయూ యూనియన్ అనేది ఉండకుండా చేయాలనే ఉద్దేశంతోనే యాజమాన్యం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కార్మికులను విధుల్లోకి పంపించే విధంగా ఏర్పాట్లు చేయాలని, సమస్యను పరిష్కరించేవరకూ పోరాటం చేస్తామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ యూనియన్ నాయకులు, కార్మికులు డీసీఎల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసినప్పటికీ అధికారులు స్పందించలేదు. పైగా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం కూడా యథాతథంగా ధర్నా నిర్వహిస్తామని యూనియన్ ప్రతి నిధులు తెలిపారు. -
విద్యార్థుల నిర్బంధం
కరీంనగర్ ఆ విద్యార్థులకు రాజకీయాలు పట్టవు. నాయకులెవరో తెలియదు. వారికి తెలిసిందల్లా ఒకటే... ఉదయం, సాయంత్రం క్రీడా సాధన చేయడం. అలాంటి వారిని గదిలో వేసి పోలీసులు నిర్బంధించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం ఆవరణలో జిల్లా స్పోర్ట్స్ స్కూల్ ఉంది. విద్యార్థుల వసతిగృహాలు కూడా ఇందులోనే ఉన్నాయి. బుధవారం స్టేడియంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ బహిరంగ సభ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో జనం స్టేడియానికి వచ్చారు. వారందరినీ స్టేడియంలోకి అనుమతించిన పోలీసులు.. సభ జరుగుతున్నంత సేపు స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులను మాత్రం గదుల్లో బంధించారు. గదులకు బయటి నుంచి తాళం వేసి పోలీస్ సిబ్బందిని కాపలా పెట్టారు. ఇది చూసిన జనం విస్మయం చెందారు.