ప్రపంచ దేశాలను భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా వైరస్ తన ప్రతాపాన్ని భారత్‌లోనూ చూపిస్తోంది. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు, అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసులు అధికం అవుతుండటం ఆందోళన కలిగిస్తుండగా తాజాగా కేంద్రమంత్రికి కూడా కోరాన సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. కేరళకు చెందిన కేంద్ర మంత్రి మురళీధరన్ మార్చి 14న తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలోని డైరక్టర్స్ ఆఫీస్‌లో జరిగిన ఓ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో వివిధ డిపార్ట్మెంట్‌ల అధిపతులు పాల్గొన్నారు.
అయితే మార్చి 1న స్పెయిన్ నుంచి తిరిగొచ్చిన ఈ హాస్పిటల్‌లోని ఓ డాక్టర్(రేడియాలజిస్ట్)కు కరోనా సోకినట్లు ఆదివారం నిర్థారణ అయింది. దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి స్వీయ నిర్భంధంలో ఉండబోతున్నట్లు ప్రకటించారు. కాగా కరోనా సోకిన డాక్టర్‌ను నేరుగా కలిసిన 25మంది డాక్టర్లతో సహా 75మంది ఉద్యోగుల లిస్ట్‌ను తయారు చేసి వారిని కూడా ఐసొలేట్ చేసినట్లు సమాచారం. వాళ్ల కుటుంబసభ్యులను కూడా ఇళ్లల్లోనే ఉండమని అధికారులు సూచించినట్లు సమాచారం. చదవండి: కరోనాపై తప్పుడు ప్రచారం.. డాక్టర్‌కు నోటీసులు
ఈ నేపథ్యంలో తనకు ఇప్పటివరకు వైరస్ సోకినట్లు తేలకపోయినప్పటికీ కూడా తాను ఆ హాస్పిటల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నందున ముందు జాగ్రత్త చర్యగా తనకు తానుగా కేంద్రమంత్రి మురళీధరన్ క్వారంటైన్ అయ్యారు. ఇళ్లు దాటి బయటకి రాకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే వైద్యులు కేంద్రమంత్రికి ఇంట్లోనే వైద్య సహాయం అందించనున్నారు. చదవండి: క్వారంటైన్‌లో నువ్వు.. బయట నేను!
కాగా దేశంలో సోమవారానికి ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 114కు చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలపగా.. ఆ సంఖ్య మంగళవారం నాటికి 126కి చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరికొన్ని చర్యలు తీసుకుంది. యూరోపియన్ యూనియన్, బ్రిటన్, టర్కీ నుంచి వచ్చే ప్రయాణికులు భారత్‌లో ప్రవేశించడంపై మార్చి 31 వరకూ నిషేధం విధిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment