
కరోనా వైరస్ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోమంటూ సినిమా స్టార్స్ ఎప్పటికప్పుడు అభిమానులకు జాగ్రత్తలు చెబుతున్నారు. కొందరు వీడియో రూపంలో, కొందరు మెసేజ్ రూపంలో కరోనా గురించి హెచ్చరిస్తున్నారు. అమితాబ్ స్టాంప్ ద్వారా తెలిపారు. ఓటర్ ఇంక్‌తో ముంబైలో ‘ప్రౌడ్ టు ప్రొటెక్ట్ ముంబైకర్స్ హోమ్ క్వారంటైన్డ్’ అని చేతి మీద స్టాంప్ వేయించుకుంటున్నారు. దాన్ని ట్వీటర్ ద్వారా షేర్ చేసి, ఇంట్లోనే తనను తాను నిర్భందం చేసుకుని జాగ్రత్తగా ఉంటున్నాను అని తెలిపారు అమితాబ్. ‘‘అందరూ జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ కరోనా లక్షణాలు కనిపిస్తే బయట ఎక్కువగా తిరగకండి’’ అని రాసుకొచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటి నుంచి ట్వీటర్ ద్వారా అభిమానులను జాగ్రత్తగా ఉండమంటూ వారిస్తున్నారాయన. కరోనా మీద ఓ పద్యం కూడా రాశారు. గత ఆదివారం అభిమానులను కలిసే ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment