
రోమ్: క్రైస్తవుల మత గురువు పోప్ ప్రాన్సిస్ ఆరోగ్యం విషమించింది. వైరస్, బ్యాక్టీరి యా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్ర శ్వాస సంబంధ వ్యాధిలో బాధపడుతున్న పోప్ గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
88 ఏళ్ల పోప్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. రక్తహీనత సమస్య మరింత ఎక్కువైంది. దీంతో తాజాగా ఆయనకు రక్తం ఎక్కించారు. ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోయింది. పూర్తిస్తాయిలో శ్వాస తీసుకోలేని కారణంగా అధిక పీడనంతో ఆయనకు ఆక్సీజన్ సరఫరాను కొనసాగిస్తున్నారు. బ్రాంకైటిస్, న్యుమోనియాలతో కూడా పోప్ బాధపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment