దేవినేని నెహ్రూకి లోకేష్ నివాళి | TDP leaders paid tributes to Former minister and TDP leader Devineni Nehru | Sakshi
Sakshi News home page

దేవినేని నెహ్రూకి లోకేష్ నివాళి

Published Mon, Apr 17 2017 5:05 PM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM

TDP leaders paid tributes to Former minister and TDP leader Devineni Nehru

విజయవాడ : గుణదలలో దేవినేని నెహ్రు పార్థీవ దేహానికి ఏపీ మంత్రులు నారా లోకేష్,  దేవినేని ఉమ నివాళులర్పించారు. అనంతరం నారా లోకేష్‌ విలేకరులతో మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా రాజకీయాల్లో తనకంటూ మార్క్ ఏర్పరచుకున్న వ్యక్తి నెహ్రు అని కొనియాడారు. మంత్రిగా, ఎమ్మెల్యే గా నిరంతరం ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఆయనని, 45 రోజులుగా నాకు రాజకీయాల గురించి అనేక సలహాలు ఇచ్చారని తెలిపారు. సిద్దాంతాలను నమ్ముకున్న వ్యక్తి నెహ్రూ అని, ఆయన కుటుంబాన్ని, కార్యకర్తలను టీడీపీ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
 
నెహ్రూ కుమారుడు అవినాష్‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం దేవినేని ఉమ మాట్లాడుతూ.. బెజవాడ రాజకీయాలలో నెహ్రూ మరపురానీ వ్యక్తి అని, ఈ రోజు మన నుంచి దూరం అవ్వడం నిజంగా శోచనీయమన్నారు. నిత్యం ప్రజలో ఉండే వ్యక్తి నెహ్రూ..తన అనుకున్న వారి కోసం దేనికీ వెనుకాడబోని నాయకుని కోల్పోయామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement