మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కన్నుమూత
నేడు గుణదలలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి, టీడీపీ సీని యర్ నేత దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)(62) సోమవారం ఉదయం 5.20 గంటలకు హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా అనా రోగ్యంతో ఉన్న ఆయన కేర్ ఆస్పత్రిలో చికిత్స పొంది, రెండు రోజుల క్రితం డిశ్చార్జయి హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం తెల్లవారుజామున తిరిగి అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. దేవినేనికి భార్య లక్ష్మి, కుమారుడు అవి నాష్, కుమార్తె ఉన్నారు. దేవినేని భౌతిక కాయాన్ని సోమవారం మధ్యాహ్నం విజయవాడ గుణదలలోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. ఆయన అంత్యక్రియలు గుణదలలోని వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం సాయంత్రం నిర్వహిస్తారు.
రాజకీయ ప్రస్థానం: విద్యార్థి నేతగా రాజ కీయ జీవితాన్ని ప్రారంభించిన దేవినేని ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కృష్ణా జిల్లాలో కీలక రాజకీయ నేతగా గుర్తింపుపొందారు. దేవినేని విజయవాడలో 1982లో యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (యూఎస్‌వో)ను స్థాపించారు. 1982లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. టీడీపీ తరçఫున 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో కృష్ణా జిల్లా కంకిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో ఎన్టీరామారావు మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. 1995లో ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి దింపేందుకు చంద్రబాబు చేసిన వైస్రాయ్ కుట్ర సమయంలో నెహ్రూ ఎన్టీరామారావు వెంట నిలిచారు.
ఎన్టీఆర్ మరణానంతరం 1996లో లక్ష్మీపార్వతి నేతృత్వంలోని ఎన్టీఆర్ టీడీపీ తరఫున విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆయన 1999లో కంకిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్ నుంచే కంకిపాడు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009, 2014లో విజ యవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కుమారుడు అవి నాష్ కూడా విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2016లో టీడీపీలో చేరారు.
నిబద్ధత గల వ్యక్తి: ఏపీ సీఎం బాబు
ఎన్టీఆర్‌కు నెహ్రూ అత్యంత సన్నిహితులని, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. త్వరలోనే జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో ఒక భారీ సమావేశం ఏర్పాటు చేయాలని దేవినేని భావించారని.. ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని చంద్రబాబు అన్నారు.
ఎన్టీఆర్, వైఎస్సార్ అంటే ఎనలేని అభిమానం
దేవినేనికి దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎనలేని అభిమానం. తన రాజకీయ జీవితానికి ఇద్దర్నీ రెండు కళ్లుగా భావించేవారు. తనకు రాజకీయ జీవితం ఎన్టీఆర్ ప్రసాదించారని, వైఎస్ వ్యక్తిత్వం చూసి ఆయనకు ఆకర్షితుడ్ని అయ్యానని పలుమార్లు బహిరంగంగానే చెప్పేవారు. కాంగ్రెస్ పార్టీ వీడి రెండవసారి టీడీపీలో చేరేవరకు వైఎస్సార్ జిల్లాకు చేసిన సేవల్ని కొనియాడేవారు. బాబును, తెలుగుదేశంపార్టీ నేతల్ని ఘాటుగా విమర్శించేందుకు వెనుకాడేవారు కాదు. ఆయన పట్టిసీమను వ్యతిరేకించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని స్వాగతించారు. కృష్ణాడెల్టా రైతు ఉద్యమాల్లో ముందుండేవారు. తాను నమ్ముకున్న పార్టీ కోసం పనిచేయడం నెహ్రూ స్వభావం. ఆయన టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా ఎక్కువ కాలం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 1982 నుంచి 1996వరకు 14ఏళ్లు టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీలో కొనసాగారు. 1996 నుంచి 2016 వరకు 20 ఏళ్లు ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు.