‘నన్ను నమ్ముకుని చాలామంది పార్టీలోకి వచ్చారు’ | devineni nehru comments on join to tdp | Sakshi
Sakshi News home page

‘నన్ను నమ్ముకుని చాలామంది పార్టీలోకి వచ్చారు’

Published Mon, Sep 19 2016 6:22 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

‘నన్ను నమ్ముకుని చాలామంది పార్టీలోకి వచ్చారు’ - Sakshi

‘నన్ను నమ్ముకుని చాలామంది పార్టీలోకి వచ్చారు’

విజయవాడ : తనను నమ్ముకుని చాలామంది పార్టీలోకి వచ్చారని, వారిని న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని నెహ్రూ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తనకు ఏ బాధ్యత అప్పగించినా సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. తనను ఎలా ఉపయోగించుకుంటారనేది అధినేత ఇష్టమన్నారు. తాను టీడీపీలో చేరినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై తనకేమీ సంబంధం లేదన్నారు.

తాను టీడీపీలో చేరడం వారికి మింగుడు పడకపోతే...వాళ్ల గొంతులో నీళ్లు పోసి చంద్రబాబే మింగుడు పడేలా చేస్తారని దేవినేని నెహ్రూ వ్యాఖ్యలు చేశారు. తన రాకను జీర్ణించుకోలేనివారి సంగతి చంద్రబాబే చూసుకుంటారన్నారు. కాగా దేవినేని నెహ్రూతో పాటు ఆయన కుమారుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement