సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి స్వైన్ ఫ్లూ సోకినట్లు, చికిత్స కోసం హైదరాబాద్‌లోని గత నెలలో కేర్ ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారని కూడా తెలిసింది. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానని ఆయన సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం. అయితే వైద్యశాఖ అధికారులు ఈ విషయం ధ్రువీకరించడం లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఎస్పీవై రెడ్డి దగ్గు, జలుబు చికిత్స కోసం గత నెల 10వ తేదీన కేర్‌లో చేరారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు స్వైన్ ఫ్లూ సోకిందని జనవరి 17వ తేదీన నిర్ధారించారు.