సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో హుదూద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకోసం కేర్ ఆస్పత్రి యాజమాన్యం రూ.50 లక్షల విరాళం ప్రకటించింది. కేర్ ఆస్పత్రి అధినేత సోమరాజు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రూ.50 లక్షల చెక్కును అందజేశారు. రాష్ట్రంలో హుదూద్ తుఫాను సృష్టించిన విలయం అంతాఇంతా కాదని, తుపాను బాధితులను ఆదుకోవడానికి తమ వంతు సాయంగా రూ.50 లక్షలు ఇచ్చినట్టు సోమరాజు పేర్కొన్నారు. ప్రకృతి విలయాలు సంభవించిన సందర్భాల్లో తమ వంతు బాధ్యతగా సాయమందించేందుకు ఎప్పుడూ ముందుంటామని కేర్ ఆస్పత్రి అధినేత తెలిపారు.