
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన లోకో పైలెట్ చంద్రశేఖర్ (35) కుడికాలును గురువారం తొలగించారు. ఎంఎం టీఎస్, ఇంటర్‌సిటీ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్న ఈ ఘటనలో 17 మంది గాయపడటం, వీరిలో ఆరుగురు బాధితులు కేర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడటంతో ఆయన కుడి కాలు చిద్రమైంది. రక్తనాళాలతో పాటు కండరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ భాగానికి రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, కిడ్నీ, గుండెకు ఇన్‌ఫెక్షన్ చేరే ప్రమాదం ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన కుడి మోకాలి పైభాగం వరకు కాలును పూర్తిగా తొలగించాల్సి వచ్చిందని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment