నాంపల్లి (హైదరాబాద్): ఎంఎంటీఎస్ రైలు నుంచి ఓ గుర్తు తెలియని యువకుడు(30) ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నాంపల్లి జీఆర్పీ రైల్వే స్టేషన్ పరిధిలోని ప్రకృతి చికిత్సాలయం రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడు నీలం, తెలుపు రంగు నిలువు గీతల చొక్కా, గోధుమ రంగు ప్యాంటు ధరించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాల కోసం 040-23202238 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చని సూచించారు.