serious condition
-
లోకోపైలెట్ చంద్రశేఖర్ కుడికాలు తొలగింపు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన లోకో పైలెట్ చంద్రశేఖర్ (35) కుడికాలును గురువారం తొలగించారు. ఎంఎం టీఎస్, ఇంటర్సిటీ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్న ఈ ఘటనలో 17 మంది గాయపడటం, వీరిలో ఆరుగురు బాధితులు కేర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడటంతో ఆయన కుడి కాలు చిద్రమైంది. రక్తనాళాలతో పాటు కండరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ భాగానికి రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, కిడ్నీ, గుండెకు ఇన్ఫెక్షన్ చేరే ప్రమాదం ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన కుడి మోకాలి పైభాగం వరకు కాలును పూర్తిగా తొలగించాల్సి వచ్చిందని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. -
అతివేగం తెచ్చిన అనర్థం
సాక్షి, మదనపల్లె టౌన్ : అతివేగం కారణంగా ముగ్గురు మున్సిపల్ ఉద్యోగులు, డ్రైవర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ములకలచెరువు మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి ఇన్చార్జి ఏఎస్ఐ శ్రీహరి కథనం మేరకు.. మదనపల్లె మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏ–1 క్లర్క్ బి.పాండురంగయ్య(56), లైటింగ్ సెక్షన్ సూపర్వైజర్గా పనిచేస్తున్న జి.నాగరాజ(58), ఆయన భార్య జి.రెడ్డీశ్వరి(ఏ–1 క్లర్క్)లు అనంతపురంలో సోమవారం మున్సిపల్ ఆర్డీ నిర్వహిస్తున్న బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు మదనపల్లె నుంచి బొలెరో వాహనంలో బయలుదేరారు. వాహనం ములకలచెరువు మండలం వేపూరికోట వద్ద వెళుతున్న సమయంలో ముందు వెళుతున్న స్కూటర్‌ను అధిగమించబోయి అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో బి.పాండురంగయ్య, నాగరాజ, రెడ్డీశ్వరితో పాటు బొలెరో వాహన డ్రైవర్ సురేంద్ర(29) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న బి.కొత్తకోట 108 సిబ్బంది రాజు, లోకేష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రెడ్డీశ్వరి గాయపడిన వారిలో పాండురంగయ్య, రెడ్డీశ్వరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యంకోసం తిరుపతికి వెళ్లాలని డాక్టర్లు సూచించారు. క్షతగాత్రులను మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, డీఈ మహేష్‌తో పాటు సహచర ఉద్యోగులు పరామర్శించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ములకలచెరువు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత
కొమురవెల్లి(సిద్దిపేట) : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ కస్తూరిబా బాలికల పాఠశాలలో 9 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. దీంతో వారిని సోమవారం హైదరాబాద్ నగరంలోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. వివరాలు... మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో మొత్తం 86 మంది విద్యార్థులున్నారు. కాగా మూడు రోజుల క్రితం పూజిత అనే విద్యార్థిని దగ్గుతూ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఇంటికి పంపించారు. పూజిత ఆదివారం తిరిగి కస్తూరిబా పాఠశాలకు వచ్చింది. పాఠశాలలో పూజితతో కలిసి ఉన్న రూమ్‌లోని హారిక, శ్రీవాణిలకు తీవ్రమైన దగ్గు సోకింది. దీంతో పూజితతో పాటు హారిక, శ్రీవాణిలను చికిత్స కోసం స్థానిక ఆర్ఎంపీల వద్దకు తీసుకెళ్లారు. ముగ్గురి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వెంటనే వారిని పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓ రాములు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషయమించడంతో వారిని వెంటనే నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. 6వ తరగతికి చెందిన కె. పూజిత, సీహెచ్.అంజలి, 7వ తరగతి చదివే ఈ.అంజలి, ఏ.రేఖ, జి.అశ్విత, 8వ తరగతి చదువుతున్న పి. భాను, ఎస్.అంబికలతో పాటు హైదరాబాద్‌కు తరలించిన 7వ తరగతి విద్యార్థిని టి.హరిక, 8వ తరగతికి చెందిన శ్రీవాణిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కస్తూరిబా పాఠశాలలో ఆదివారం ఉదయం విద్యార్థులకు చపాతీ, మధ్యాహ్నం చికెన్, రాత్రి క్యాబేజీ వండి పెట్టారు. ఉదయం అల్పాహారం కోసం పులిహోర చేసి పెట్టారు. ఈ విషయమై కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ నీరజను వివరణ కోరగా కేజీబీవీ పాఠశాల చుట్టూ వరి పొలాలకు వాడిన రసాయన ఎరువుల ప్రభావగంతోనే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ భిక్షపతి పాఠశాలకు చేరుకుని మిగతా విద్యార్థులకు వ్యాధి సోకకుండా స్థానిక పీహెచ్సీ వైద్యులతో మాట్లాడి మందులను పంపిణీ చేశారు. అందరికీ మాస్క్‌లు అందించారు. -
యువకుడిపై నైజీరియా విద్యార్థుల దాడి
-
యువకుడిపై యూనివర్సిటీ విద్యార్థుల దాడి
తాడేపల్లి(గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామం వద్ద డి. సునీల్(24) అనే యువకుడిపై కేఎల్ వర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులు దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఒక బార్ వద్ద జరిగిన గొడవే ఈ దాడికి కారణమని పోలీసులు చెప్పారు. సునీల్‌పై దాడిచేసిన ఆరుగురు విద్యార్థులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. గాయపడిన సునీల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. -
‘సంజన పరిస్థితి విషమంగానే ఉంది’
హైదరాబాద్: ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి సంజన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వారు గురువారం మధ్యాహ్నం వివరాలు వెల్లడించారు. చిన్నారి కాలుకు అత్యవసర సర్జరీ చేయాల్సి ఉందని, అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆమె తల్లి శ్రీదేవి పరిస్థితి నిలకడగా ఉంది, ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. ఆమెకు వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయని వివరించారు. హైదరాబాద్‌లోని పెద్దఅంబర్‌పేట వద్ద ఆదివారం రాత్రి ముగ్గురు యువకులు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి రోడ్డు దాటుతున్న తల్లి శ్రీదేవి, కూతురు సంజనను ఢీకొట్టిన విషయం తెలిసిందే. -
ఆడపిల్ల వద్దని.. భార్య ప్రాణం మీదకు తెచ్చాడు
* ఆడ బిడ్డ అని ఘాతుకం * తల్లి పరిస్థితి విషమం * కృష్ణా జిల్లాలో దారుణం విజయవాడ(లబ్బీపేట): మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుడుతుందని రహస్యంగా స్కానింగ్‌లో తెలుసుకున్న ఓ తల్లి అబార్షన్ (భ్రూణహత్య) చేయించగా అది వికటించి ఆమె ప్రాణం మీదకే తెచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన సోమవారం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వెలుగు చూసింది. కృష్ణా జిల్లా గూడూరు మండలం మల్లవోలు గ్రామానికి చెందిన పేరం నాగబాబు, దుర్గాదేవి దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నారు. దుర్గాదేవి మళ్లీ గర్భం దాల్చడంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించేందుకు మచిలీపట్నంలో ఒక వైద్యుడిని సంప్రదించారు. ఆయన రూ.10 వేలు తీసుకుని గర్భంలో ఆడపిల్ల ఉన్నట్లు చెప్పడంతో మచిలీపట్నంలో అబార్షన్ చేయించారు. తర్వాత వైద్య పరీక్షలు చేసినప్పుడు గర్భసంచికి రంధ్రం పడటంతో పాటు, ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలిసింది. రెండు రోజులకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా, అక్కడి వైద్యులు పరీక్షించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ ఆర్.నాగమల్లేశ్వరి అబార్షన్ చేసిన ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. వారు స్కానింగ్ చేసిన సెంటర్ పేరు చెప్పడం లేదని ఆమె ‘సాక్షి’కి తెలిపారు. విచారణలో లింగనిర్ధారణ చేసినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
సినీనటి బిందుమాధవి పరిస్థితి విషమం
సినీ నటి బిందుమాధవి తీవ్ర ఆనారోగ్యంతో నిమ్స్‌లో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. తీవ్రమైన కాలేయ సమస్యతో బాధపడుతున్నట్టు జూనియర్ వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. -
మందుగుండు పేలి ఐదుగురి పరిస్థితి విషమం
-
మందుగుండు పేలి ఐదుగురి పరిస్థితి విషమం
శ్రీకాకుళం: ఓ ఇంట్లో మందుగుండు సామగ్రి అమ్ముతుండగా ఆదివారం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడగా, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మరువాడలో చోటు చేసుకుంది. క్షతగాత్రుల్లో మందుగుండు వ్యాపారి కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఆరేళ్ల బాలికతో పాటు బాణసంచా కొనుగోలు చేసేందుకు వచ్చిన ఇద్దరు గాయపడినట్లుగా సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. (వంగర) -
యశోదాలో చికిత్స పొందుతున్న చిన్నారులు