
‘సంజన పరిస్థితి విషమంగానే ఉంది’
హైదరాబాద్: ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి సంజన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వారు గురువారం మధ్యాహ్నం వివరాలు వెల్లడించారు. చిన్నారి కాలుకు అత్యవసర సర్జరీ చేయాల్సి ఉందని, అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆమె తల్లి శ్రీదేవి పరిస్థితి నిలకడగా ఉంది, ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. ఆమెకు వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయని వివరించారు.
హైదరాబాద్‌లోని పెద్దఅంబర్‌పేట వద్ద ఆదివారం రాత్రి ముగ్గురు యువకులు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి రోడ్డు దాటుతున్న తల్లి శ్రీదేవి, కూతురు సంజనను ఢీకొట్టిన విషయం తెలిసిందే.