యువకుడిపై యూనివర్సిటీ విద్యార్ధులు ఆరుగురు దాడిచేసి తీవ్రంగా కొట్టారు.
తాడేపల్లి(గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామం వద్ద డి. సునీల్(24) అనే యువకుడిపై కేఎల్ వర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులు దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఒక బార్ వద్ద జరిగిన గొడవే ఈ దాడికి కారణమని పోలీసులు చెప్పారు.
సునీల్‌పై దాడిచేసిన ఆరుగురు విద్యార్థులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. గాయపడిన సునీల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.