kl university
-
గన్నవరం విమానాశ్రయంలో ఓ యువకుడి వద్ద బుల్లెట్లు స్వాధీనం
-
KLHలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్
-
Biel Chess Festival 2022: రన్నరప్ హరిసూర్య భరద్వాజ్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక బీల్ చెస్ ఫెస్టివల్ అంతర్జాతీయ టోర్నమెంట్లో అమెచ్యూర్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుండేపూడి హరిసూర్య భరద్వాజ్ రన్నరప్‌గా నిలిచాడు. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఈ టోర్నీలో గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల హరిసూర్య ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి భారత్‌కే చెందిన మన్మయ్ చోప్రాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా మన్మయ్కు టాప్ ర్యాంక్ ఖరారుకాగా, హరిసూర్యకు రెండో ర్యాంక్ దక్కింది. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో కేఎల్ యూనివర్సిటీ విద్యార్థి హరిసూర్య ఏడు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. ప్రణీత్‌కు రెండో జీఎం నార్మ్ బీల్ చెస్ టోర్నీ మాస్టర్స్ విభాగంలో తెలంగాణకు చెందిన వుప్పాల ప్రణీత్ ఆరు పాయింట్లతో మరో పదిమందితో కలిసి సంయక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా ప్రణీత్ కు 15వ స్థానం దక్కింది. ఈ టోర్నీలో ప్రణీత్ ఇద్దరు గ్రాండ్మాస్టర్లపై గెలిచి, మరో ఇద్దరు గ్రాండ్‌మాస్టర్ల తో ‘డ్రా’ చేసుకొని రెండో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) నార్మ్ సంపాదించాడు. మూడో జీఎం నార్మ్ సాధించి, 2500 రేటింగ్ పాయింట్ల మైలురాయి అందుకుంటే ప్రణీత్‌కు గ్రాండ్‌మాస్టర్ హోదా ఖరారవుతుంది. గుకేశ్‌కు కాంస్య పతకం బీల్ చెస్ ఫెస్టివల్ గ్రాండ్‌మాస్టర్ ట్రయాథ్లాన్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌కు కాంస్య పతకం లభించింది. తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల గుకేశ్ క్లాసికల్ విభాగంలో 15 పాయింట్లు, ర్యాపిడ్ విభాగంలో 7 పాయింట్లు, బ్లిట్జ్ విభాగంలో 7.5 పాయింట్లు సాధించి ఓవరాల్‌గా 29.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. క్వాంగ్ లియెమ్ లీ (వియత్నాం; 35.5 పాయింట్లు) విజేతగా నిలిచాడు. -
బుల్లి ఉపగ్రహం.. భళా!
తెనాలి: వాతావరణ సమాచారాన్ని సేకరించడానికి ‘లక్ష్య శాట్’ పేరుతో 400 గ్రాముల బుల్లి ఉపగ్రహాన్ని తయారుచేయడంతోపాటు దాన్ని విజయవంతంగా ప్రయోగించారు.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కూరపాటి సాయి దివ్య. ఉపగ్రహ కమ్యూనికేషన్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్న ఆమె తన సొంత పరిజ్ఞానంతో సాధించిన ఈ ఘనతకు అందరి అభినందనలు అందుకుంటున్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన సాయి దివ్య కేఎల్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ అండ్ రాడార్ సిస్టమ్స్‌లో ఎంటెక్ చేశారు. తన పీహెచ్డీ థీసిస్‌లో భాగంగా తెనాలిలోని తన నివాసంలోనే ఎన్–స్పేస్ టెక్ అనే సంస్థను ప్రారంభించి.. ఉపగ్రహ తయారీని ఆరంభించారు. ఈ క్రమంలో లక్ష్య శాట్ పేరుతో ఉపగ్రహాన్ని సిద్ధం చేశారు. ఉపగ్రహానికి సంబంధించిన పేలోడ్, ప్రోగ్రాం కోడింగ్, విద్యుత్ వినియోగం అంచనా, సమాచార సేకరణ వంటి అంశాలన్నింటిపైన పట్టు సాధించిన సాయి దివ్య వాటి ఆధారంగా 400 గ్రాముల బుల్లి ఉపగ్రహాన్ని తయారుచేశారు. యూకే నుంచి ప్రయోగం.. గత నెల 15న లక్ష్య శాట్ ఉపగ్రహాన్ని యునైటెడ్ కింగ్డమ్ నుంచి బీ2 స్పేస్ అనే కంపెనీ ద్వారా స్ట్రాటో ఆవరణంలోకి పంపారు. ఎక్కువ ఎత్తుకు వెళ్లగలిగిన బెలూన్ సాయంతో దీన్ని ప్రయోగించారు. ఇది భూతలం నుంచి 26 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి స్ట్రాటో ఆవరణంలో దాదాపు మూడు గంటలపాటు ఉందని సాయి దివ్య గురువారం తెనాలిలో మీడియాకు వివరించారు. లక్ష్య శాట్‌లోని అన్ని విభాగాలు ఎలాంటి లోపం లేకుండా పనిచేయటంతో ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. అక్కడ తొమ్మిది రకాల వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఉపగ్రహంతో సేకరించానని చెప్పారు. ఈ సమాచారాన్ని ప్రస్తుతం విశ్లేషిస్తున్నానని వివరించారు. తెనాలిలో తాను నెలకొల్పిన ఎన్–స్పేస్ టెక్ సంస్థ ద్వారా తక్కువ ఖర్చుతో చిన్న, సూక్ష్మ ఉపగ్రహాలను అందుబాటులోకి తెస్తానన్నారు. లక్ష్య శాట్‌కు రూ.2 లక్షల వరకు ఖర్చయిందన్నారు. తన విజయాలకు తల్లిదండ్రులు నగజశ్రీ,, ప్రసాద్, భర్త కొత్తమాసు రఘురామ్ ఎంతో ప్రోత్సాహమందిస్తున్నారని తెలిపారు. -
చాంప్స్ శాతవాహన, ఎస్ఎస్బీఎన్ కాలేజి జట్లు
విజయవాడ స్పోర్ట్స్: సాక్షి మీడియా గ్రూప్, కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో జూనియర్స్ విభాగంలో శాతవాహన జూనియర్ కాలేజీ (శ్రీకాకుళం)... సీనియర్స్ విభాగంలో శ్రీ సాయిబాబా నేషనల్ డిగ్రీ కాలేజి (అనంతపురం) జట్లు చాంపియన్స్‌గా నిలిచాయి. జూనియర్ విభాగం ఫైనల్లో శాతవాహన కాలేజి రెండు వికెట్ల తేడాతో ఎమరాల్డ్స్ జూనియర్ కాలేజి (తిరుపతి, చిత్తూరు) జట్టుపై నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎమరాల్డ్స్ కాలేజి నిర్ణీత 10 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 80 పరుగులు చేసింది. ప్రణయ్ (33 పరుగులు), గగన్ (15 పరుగులు) రాణించారు. శాతవాహన కాలేజి బౌలర్ ఉదయ్ మూడు వికెట్లు పడగొట్టాడు. 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శాతవాహన కాలేజి 9.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసి విజయం సాధించింది. వాసు (19), ఉదయ్ (18), సోమేశ్ (28 నాటౌట్) ఆకట్టుకున్నారు. ఉదయ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఎమరాల్డ్స్ కాలేజి 20 పరుగుల ఆధిక్యంతో చీరాల పాలిటెక్నిక్ కాలేజి (ప్రకాశం) జట్టును ఓడించి ఫైనల్ చేరింది. తొలుత ఎమరాల్డ్స్ జట్టు 10 ఓవర్లలో మూడు వికెట్లకు 90 పరుగులు చేసింది. సోహన్ (47), గగన్ (28) దూకుడగా ఆడారు. అనంతరం 91 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన చీరాల పాలిటెక్నిక్ కాలేజీ జట్టు 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసి ఓడిపోయింది. జూనియర్స్ విభాగంలో చీరాల పాలిటెక్నిక్ కాలేజి మూడో స్థానంలో నిలిచింది. ఖాదర్ వలీ విజృంభణ సీనియర్స్ విభాగంలో శ్రీ సాయిబాబా నేషనల్ డిగ్రీ కాలేజి (ఎస్ఎస్బీఎన్–అనంతపురం), కృష్ణ చైతన్య డిగ్రీ, పీజీ కాలేజి (నెల్లూరు) జట్ల మధ్య ‘బెస్ట్ ఆఫ్ త్రీ’ పద్ధతిలో ఫైనల్స్ నిర్వహించారు. గురువారం చెరో మ్యాచ్‌లో నెగ్గి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. శుక్రవారం జరిగిన చివరి ఫైనల్ మ్యాచ్‌లో ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కాలేజి ఎనిమిది వికెట్ల తేడాతో కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజిపై విజయం సాధించి ఓవరాల్‌గా 2–1తో టైటిల్‌ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కృష్ణ చైతన్య కాలేజి నిర్ణీత 10 ఓవర్లలో 72 పరుగులకు ఆలౌటైంది. ఫారూఖ్ 18 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎస్ఎస్బీఎన్ కాలేజి బౌలర్ ఖాదర్ వలీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. 73 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఎస్బీఎన్ కాలేజి 8.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అధిగమించి గెలిచింది. బౌలింగ్‌లో నాలుగు వికెట్లతో అదరగొట్టిన ఖాదర్ వలీ బ్యాటింగ్‌లోనూ రాణించి 23 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో బ్యాట్స్‌మన్ రోహిత్ రోషన్ 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన ఖాదర్ వలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. విజేత జట్లకు కేఎల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వైవీఎస్‌ఎస్‌ఎస్‌యూ ప్రసాద రావు, సాక్షి రెసిడెంట్ ఎడిటర్ ఎం.రమణమూర్తి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి జనరల్ మేనేజర్ బొమ్మారెడ్డి వెంకటరెడ్డి, సాక్షి విజయవాడ బ్రాంచ్ మేనేజర్ సింహాద్రి అప్పన్న, హెచ్ఆర్ సంతోష్, ఈవెంట్ ఆర్గనైజర్ శ్రీహరి పాల్గొన్నారు. జూనియర్స్ విభాగంలో ఉదయ్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’... గగన్ ‘బెస్ట్ ఆల్‌రౌండర్’... సోహన్ ‘బెస్ట్ బ్యాట్స్‌మన్’... ఉదయ్ ‘బెస్ట్ బౌలర్’ అవార్డులు గెల్చుకున్నారు. సీనియర్స్ విభాగంలో ఎస్ఎస్బీఎన్ కాలేజికి చెందిన ఖాదర్ వలీ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’... మహేంద్ర ‘బెస్ట్ ఆల్‌రౌండర్’... రోహిత్ రోషన్ ‘బెస్ట్ బ్యాట్స్‌మన్’... ఖాదర్ వలీ ‘బెస్ట్ బౌలర్’ పురస్కారాలు అందుకున్నారు. సీనియర్స్ విభాగంలో విజేతగా నిలిచిన ఎస్ఎస్బీఎన్ కాలేజి (అనంతపురం) జట్టు -
ఫైనల్లో శాతవాహన జూనియర్ కాలేజి
విజయవాడ స్పోర్ట్స్: సాక్షి మీడియా గ్రూప్, కేఎల్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. విజయవాడలో గురువారం సెంట్రల్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల జూనియర్, సీనియర్ జట్లు తలపడ్డాయి. ఉదయ్ 4 బంతుల్లో 4 వికెట్లు... జూనియర్ జట్లకు నిర్వహించిన రెండు లీగ్ మ్యాచ్‌లలో ఉత్తరాంధ్ర (శాతవాహన జూనియర్ కాలేజీ, శ్రీకాకుళం) జట్టు విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. సెంట్రల్ ఆంధ్ర (చీరాల పాలిటెక్నిక్ కాలేజి, ప్రకాశం) జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర జట్టు నాలుగు పరుగుల తేడాతో నెగ్గింది. ఉత్తరాంధ్ర జట్టు 10 ఓవర్లలో 41 పరుగులు చేసింది. రమణ (12), సుధమ్ (19) రాణించగా... 42 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన సెంట్రల్ ఆంధ్ర జట్టు 37 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. నాలుగు ఓవర్లు ముగిశాక 25/3 స్కోరుతో విజయం దిశగా సాగుతున్న సెంట్రల్ ఆంధ్ర జట్టును ఐదో ఓవర్లో ఉదయ్ దెబ్బ తీశాడు. ఉదయ్ వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. రాయలసీమ జట్టు (ఎమరాల్డ్ జూనియర్ కాలేజి)తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర (శాతవాహన జూనియర్ కాలేజి) జట్టు 19 పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్‌లో కెఎల్ యూనివర్సిటీ
-
యువకుడిపై నైజీరియా విద్యార్థుల దాడి
-
యువకుడిపై యూనివర్సిటీ విద్యార్థుల దాడి
తాడేపల్లి(గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామం వద్ద డి. సునీల్(24) అనే యువకుడిపై కేఎల్ వర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులు దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఒక బార్ వద్ద జరిగిన గొడవే ఈ దాడికి కారణమని పోలీసులు చెప్పారు. సునీల్‌పై దాడిచేసిన ఆరుగురు విద్యార్థులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. గాయపడిన సునీల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. -
కేఎల్ యూనివర్సిటీ లో విద్యార్థి మృతి
గుంటూరు: యూనివర్సిటీ భవనం పై నుంచి పడి బీటెక్ విద్యార్థి మృతిచెందాడు. గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీలో.. బీటెక్ చదువుతున్న సాయి చరణ్(19) సోమవారం విశ్వవిద్యాలయ భవనం పై నుంచి కిందపడ్డారు. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. సాయిచరణ్ స్వస్థలం ప్రకాశం జిల్లా పొదిలిగా తోటి విద్యార్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కేబినెట్ మార్పులపై అధినేతదే నిర్ణయం: లోకేశ్
సీల్డ్ కవర్లలో నేతల పనితీరు నివేదిక సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై అధినేత నిర్ణయం తీసుకుంటారని నారా లోకేశ్ అన్నారు. ఈ విషయంలో పార్టీ వారితో ఎలాంటి సంప్రదింపులు ఉండవని తెలిపారు. చంద్రబాబు అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని, తాము దాన్ని ఆచరిస్తామని చెప్పారు. ఇప్పటికే పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఇక నుంచి కార్యక్రమాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తనకు ఆరోగ్యం సరిగా ఉండకపోవటం వల్లే పార్టీ శిక్షణా తరగతులకు రెండు రోజులు హాజరు కాలేదన్నారు. మూడో రోజు సమావేశాల్లో పాల్గొని పార్టీ సభ్యత్వ నమోదుపై లోకేశ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం లోకేశ్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్టీ ఏర్పడినప్పటి నుంచి జెండా మోస్తున్న వారిని కొంతమందిని ఎంపిక చేసి వారి కుటుంబం పేరుతో రూ. రెండు లక్షలు డిపాజిట్ చేసి వచ్చే వడ్డీని ఫించను రూపంలో అందిస్తామన్నారు. కాగా, సమావేశంలో పాల్గొన్న నేతల పనితీరు నివేదికను చంద్రబాబు సీల్డ్ కవర్లలో అందించారు. తాను ఈ వివరాలను ఎవ్వరికి వెల్లడించనని, నేతలు కూడా బహిర్గతం చేయనన్నారు. ఎవరైనా అలా చేస్తే ఎవరి గుట్టును వారు బైట పెట్టుకున్నట్లేనని చెప్పారు. నాలుగు గ్రేడ్లుగా విభజించి నేతలకు సమాచారం అందించారు. -
శిక్షణా తరగతులకు చినబాబు గైర్హాజరు
-
చినబాబు అలక?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ అలిగినట్టు తెలుస్తోంది. తన తండ్రి మంత్రివర్గ విస్తరణ వాయిదా వేయడం పట్ల ఆయన గుర్రుగా ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ శిక్షణా తరగతులకు వరుసగా రెండో రోజు లోకేశ్ గైర్హాజరు కావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో టీడీపీ ముఖ్యనేతల మూడు రోజుల కార్యగోష్ఠి మంగళవారం ప్రారంభమైంది. మొదటి రోజు శిక్షణా తరగతులకు హాజరుకాని లోకేశ్ రెండో రోజైన బుధవారం కూడా గైర్హజరయ్యారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన కార్యగోష్ఠికి హాజరుకాకపోవడంతో లోకేశ్ ఎక్కడ? అనే ప్రశ్న టీడీపీ నాయకుల నుంచి వినిపించింది. ఆయన అలిగారని మెజారిటీ సభ్యుల నుంచి విన్పిస్తోంది. లోకేశ్ ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు కొద్దిరోజుల క్రితం గవర్నర్ నరసింహన్ కు చంద్రబాబు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఖాయమన్న ఊహాగానాలు వినిపించాయి. ఒకదశలో లోకేశ్ ను ఢిల్లీకి పంపించేందుకు చంద్రబాబు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే కేటీఆర్ లా కేబినెట్ లో చేరేందుకే లోకేశ్ మొగ్గుచూపినట్టు వార్తలు వచ్చాయి. దీంతో లోకేశ్ కు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది. ముహూర్తం కుదరక చంద్రబాబు కేబినెట్ విస్తరణ వాయిదా వేశారు. కేబినెట్ పై ఆశలు పెట్టుకున్న చినబాబు ఈ నిర్ణయంతో కాస్త నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు ఆయన హాజరుకాలేదన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇది నిజం కాదని నిరూపించాలంటే చివరి రోజైనా కార్యగోష్ఠికి లోకేశ్ హాజరయ్యేలా చూడాలని టీడీపీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రజల విశ్వాసం పొందలేకపోతే గెలవలేం
టీడీపీ శిక్షణా తరగతుల్లో చంద్రబాబు సాక్షి, అమరావతి: అతి విశ్వాసం వల్ల 2004 ఎన్నికల్లో ఓడిపోయామని, ఈసారి కూడా ప్రజల విశ్వాసం లేకపోతే గెలవలేమని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. ఆర్థిక అసమానతలు తగ్గకపోవడంవల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, ఈసారి కూడా అలాంటి సమస్యలున్నాయని, అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందిపడతామని చెప్పారు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో మంగళవారం ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతల మూడు రోజుల కార్యగోష్టి (శిక్షణా తరగతులు)కి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘రాష్ట్ర విభజన ప్రక్రియ-సవాళ్లు-పటిష్ట నాయకత్వంతో పరిష్కారాలు’ అనే అంశంపై ప్రసంగించారు. నాయకులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని, వారిని ప్రభావితం చేయాలని కోరారు. -
టీడీపీ శ్రేణులకు వర్క్‌షాప్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. స్థానిక కేఎల్ వర్సిటీ ప్రాంగణంలో మూడు రోజులపాటు ఈ తరగతులు జరగనున్నాయి. ప్రధానంగా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవటంపై శ్రేణులకు తర్ఫీదు ఇస్తారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలు, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించనున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ తరగతులను ప్రారంభించారు. ఈ వర్క్‌షాప్ లో జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఎంపీలు, ఎమ్మెల్యేలు , పార్టీ నేతలు పాల్గొన్నారు. -
కేఎల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ కోర్సు
సాక్షి, విజయవాడ: కేఎల్ యూనివర్సిటీలో 2015-16 విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ వైస్ చైర్మన్ కోనేరు రాజా హరేన్ తెలిపారు. ఐదేళ్ల బీఆర్క్, లా, ఫైన్ ఆర్ట్స్‌లో పలు కోర్సులను ప్రారంభిస్తున్నామని వివరించారు. బుధవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌ను అన్ని అనుమతులతో ప్రారంభిస్తున్నామన్నారు. మొదటి సంవత్సరం 40 సీట్లు ఉన్నాయన్నారు. బీబీఏ, ఎల్ఎల్బీ ఐదేళ్ల లా కోర్సును కూడా ప్రారంభిస్తున్నామని, వాటికి కొద్దిరోజుల్లోనే అనుమతి వస్తుందన్నారు. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎల్‌ఎల్‌ఎస్ రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రభుత్వ అనుమతులతో కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా 1,680 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయన్నారు. -
క్యాంపస్ నియామకాల్లో కేఎల్‌యూ రికార్డు
ప్రతిష్టాత్మక సంస్థలకు 900 మంది ఎంపిక విజయవాడ: క్యాంపస్ నియామకాల్లో ఈ విద్యాసంవత్సరం కేఎల్ యూనివర్సిటీ రికార్డు సృష్టించిందని యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు కోనేరు రాజాహరీన్ తెలిపారు. విజయవాడలో ని యూనివర్సిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలివిడత క్యాంపస్ నియామకాల్లోనే యూనివర్సిటీకి చెందిన 900 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని సంతోషం వ్యక్తంచేశారు. తాము అమలు చేస్తు న్న విద్యాప్రమాణాలకు ఇదే నిదర్శనమన్నారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలైన ఇన్ఫోసిస్‌లో 365 మంది, విప్రోలో 262 మంది, సీటీఎస్‌లో 250 మంది విద్యార్థులు ఎంపికయ్యారని చెప్పా రు. నలుగురు మెకానికల్ విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ఎఫ్ఎంసీ టెక్నాలజీస్ సంస్థకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. వీరు ఏడాదికి రూ.5.2 లక్షల జీతం అందుకుంటారని తెలి పారు. వైస్ చాన్సలర్ ఎల్.ఎస్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ త్వరలో జెన్సర్ టెక్నాలజీస్, బగేట్, టెక్ మహీంద్ర, సైంట్, ఎల్ అండ్ టీ తదితర సంస్థలు క్యాంపస్ నియామకాలు చేపట్టేందుకు యూనివర్సిటీకి రానున్నాయని చెప్పారు. కేఎల్సీయూ ప్రిన్సిపాల్ ఎ.ఆనందకుమార్, ప్లేస్‌మెంట్స్ డెరైక్టర్ ఎన్.బి.వి.ప్రసాద్ పాల్గొన్నారు.