టీడీపీ శ్రేణులకు వర్క్షాప్
Published Tue, Oct 4 2016 12:08 PM | Last Updated on Sat, Aug 11 2018 4:24 PM
విజయవాడ: తెలుగుదేశం పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. స్థానిక కేఎల్ వర్సిటీ ప్రాంగణంలో మూడు రోజులపాటు ఈ తరగతులు జరగనున్నాయి. ప్రధానంగా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవటంపై శ్రేణులకు తర్ఫీదు ఇస్తారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలు, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించనున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ తరగతులను ప్రారంభించారు. ఈ వర్క్షాప్ లో జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఎంపీలు, ఎమ్మెల్యేలు , పార్టీ నేతలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement