ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ అలిగినట్టు తెలుస్తోంది. తన తండ్రి మంత్రివర్గ విస్తరణ వాయిదా వేయడం పట్ల ఆయన గుర్రుగా ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ శిక్షణా తరగతులకు వరుసగా రెండో రోజు లోకేశ్ గైర్హాజరు కావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.