ప్రతిష్టాత్మక సంస్థలకు 900 మంది ఎంపిక
విజయవాడ: క్యాంపస్ నియామకాల్లో ఈ విద్యాసంవత్సరం కేఎల్ యూనివర్సిటీ రికార్డు సృష్టించిందని యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు కోనేరు రాజాహరీన్ తెలిపారు. విజయవాడలో ని యూనివర్సిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలివిడత క్యాంపస్ నియామకాల్లోనే యూనివర్సిటీకి చెందిన 900 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని సంతోషం వ్యక్తంచేశారు. తాము అమలు చేస్తు న్న విద్యాప్రమాణాలకు ఇదే నిదర్శనమన్నారు.
ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలైన ఇన్‌ఫోసిస్‌లో 365 మంది, విప్రోలో 262 మంది, సీటీఎస్‌లో 250 మంది విద్యార్థులు ఎంపికయ్యారని చెప్పా రు. నలుగురు మెకానికల్ విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ఎఫ్‌ఎంసీ టెక్నాలజీస్ సంస్థకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. వీరు ఏడాదికి రూ.5.2 లక్షల జీతం అందుకుంటారని తెలి పారు. వైస్ చాన్సలర్ ఎల్.ఎస్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ త్వరలో జెన్‌సర్ టెక్నాలజీస్, బగేట్, టెక్ మహీంద్ర, సైంట్, ఎల్ అండ్ టీ తదితర సంస్థలు క్యాంపస్ నియామకాలు చేపట్టేందుకు యూనివర్సిటీకి రానున్నాయని చెప్పారు. కేఎల్‌సీయూ ప్రిన్సిపాల్ ఎ.ఆనందకుమార్, ప్లేస్‌మెంట్స్ డెరైక్టర్ ఎన్.బి.వి.ప్రసాద్ పాల్గొన్నారు.
క్యాంపస్ నియామకాల్లో కేఎల్‌యూ రికార్డు
Published Fri, Sep 26 2014 12:36 AM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM
Advertisement
Advertisement