కేర్ హాస్పిటల్స్ నెట్‌వర్క్ విస్తరణ... | Care Hospitals Network Expansion ... | Sakshi
Sakshi News home page

కేర్ హాస్పిటల్స్ నెట్‌వర్క్ విస్తరణ...

Published Thu, Jun 26 2014 2:08 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

కేర్ హాస్పిటల్స్ నెట్‌వర్క్ విస్తరణ... - Sakshi

కేర్ హాస్పిటల్స్ నెట్‌వర్క్ విస్తరణ...

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాణ్యమైన వైద్య సేవలందించే హైదరాబాద్‌కు చెందిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్ నెట్‌వర్క్ విస్తరణలో మరో ముందడుగు వేసింది. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో  బిలాస్‌పూర్, రాయ్‌ఘడ్ ప్రాంతాల్లో తాజాగా రెండు హాస్పిటల్స్ తన నెట్‌వర్క్‌లో కలుపుకోవడంతో  ఆ రాష్ర్టంలో అతిపెద్ద నెట్‌వర్క్ స్థాయిని సొంతం చేసుకుందని కేర్ హాస్పిటల్స్ గ్రూప్ సీఈవో దిలీప్ జోస్ తెలిపారు. ఈ విస్తరణతో కేర్ గ్రూప్ నెట్‌వర్క్ దక్షిణ, మధ్య భారత్‌లో 15 హాస్పిటళ్లతో 2000 పడకల స్థాయికి ఎదిగిందన్నారు.  

బిలాస్‌పూర్ కేంద్రాన్ని ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ బుధవారం ప్రారంభించారు. కాగా హైదరాబాద్ బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్స్‌లో ఈ ఏడాది అదనంగా మరో 50 పడకల సామర్థ్యాన్ని అందుకోనున్నామని దిలీప్ జోస్ చెప్పారు. 2015లో మరో రెండు ప్రాజెక్టులు పూర్తి కానున్నాయని దీని ద్వారా 350 పడకల సామర్థ్యం జతకూడనుందని ఆయన అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement