కేర్ హాస్పిటల్స్ నెట్వర్క్ విస్తరణ...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాణ్యమైన వైద్య సేవలందించే హైదరాబాద్‌కు చెందిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్ నెట్వర్క్ విస్తరణలో మరో ముందడుగు వేసింది. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో బిలాస్పూర్, రాయ్‌ఘడ్ ప్రాంతాల్లో తాజాగా రెండు హాస్పిటల్స్ తన నెట్‌వర్క్‌లో కలుపుకోవడంతో ఆ రాష్ర్టంలో అతిపెద్ద నెట్వర్క్ స్థాయిని సొంతం చేసుకుందని కేర్ హాస్పిటల్స్ గ్రూప్ సీఈవో దిలీప్ జోస్ తెలిపారు. ఈ విస్తరణతో కేర్ గ్రూప్ నెట్వర్క్ దక్షిణ, మధ్య భారత్‌లో 15 హాస్పిటళ్లతో 2000 పడకల స్థాయికి ఎదిగిందన్నారు.
బిలాస్పూర్ కేంద్రాన్ని ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ బుధవారం ప్రారంభించారు. కాగా హైదరాబాద్ బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్స్‌లో ఈ ఏడాది అదనంగా మరో 50 పడకల సామర్థ్యాన్ని అందుకోనున్నామని దిలీప్ జోస్ చెప్పారు. 2015లో మరో రెండు ప్రాజెక్టులు పూర్తి కానున్నాయని దీని ద్వారా 350 పడకల సామర్థ్యం జతకూడనుందని ఆయన అన్నారు.