Dilip Jose
-
తెల్లజుట్టుతోనే పెళ్లి కళ... భళా అంటున్న నెటిజన్లు
-
కూతురి పెళ్లి, ఎమోషనల్ అయిన బుల్లితెర నటుడు
Taarak Mehta Jethalal Aka Dilip Joshi Daughter Niyati Wedding: ప్రముఖ బుల్లితెర నటుడు దిలీప్ జోషి ఇంట పెళ్లి సంబరాలు అంబరాన్నంటాయి. దిలీప్ కూతురు నియాతి పెళ్లి డిసెంబర్ 11న ఘనంగా జరిగింది. కూతురిని పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపిస్తున్న క్రమంలో దిలీప్ భావోద్వేగానికి లోనయ్యాడు. 'సినిమాల్లో నుంచి, సినిమా పాటల నుంచి భావోద్వేగాలను అరువు తెచ్చుకోవచ్చు. కానీ అవన్నీ మనకు ప్రత్యక్షంగా ఎదురైనప్పుడు ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేం. కొత్త ప్రయాణం మొదలుపెట్టిన నా చిట్టితల్లి నియాతి, యశోవర్ధన్ మిశ్రాలకు శుభాకాంక్షలు. ఈ వివాహ వేడుకలో భాగస్వాములై కొత్త జంటను మనసారా ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. సోషల్ మీడియాలో నియాతి పెళ్లి ఫొటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. కాగా దిలీప్ జోషి హిందీ సీరియల్ 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా'లో జీతాలాల్గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. 2008లో ప్రారంభమైన ఈ ధారావాహిక ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది. దిలీప్ జోషి సీరియల్స్తో పాటు మేనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, ఫిర్బీ దిల్ హై హిందుస్తానీ, ఖిలాడీ 420, దిల్ హై తుమ్హారా, ఫిరాఖ్, వాట్స్ యువర్ రాశీ వంటి సినిమాల్లోనూ నటించాడు. View this post on Instagram A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi) -
కేర్ హాస్పిటల్స్ నెట్వర్క్ విస్తరణ...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాణ్యమైన వైద్య సేవలందించే హైదరాబాద్కు చెందిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్ నెట్వర్క్ విస్తరణలో మరో ముందడుగు వేసింది. ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో బిలాస్పూర్, రాయ్ఘడ్ ప్రాంతాల్లో తాజాగా రెండు హాస్పిటల్స్ తన నెట్వర్క్లో కలుపుకోవడంతో ఆ రాష్ర్టంలో అతిపెద్ద నెట్వర్క్ స్థాయిని సొంతం చేసుకుందని కేర్ హాస్పిటల్స్ గ్రూప్ సీఈవో దిలీప్ జోస్ తెలిపారు. ఈ విస్తరణతో కేర్ గ్రూప్ నెట్వర్క్ దక్షిణ, మధ్య భారత్లో 15 హాస్పిటళ్లతో 2000 పడకల స్థాయికి ఎదిగిందన్నారు. బిలాస్పూర్ కేంద్రాన్ని ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ బుధవారం ప్రారంభించారు. కాగా హైదరాబాద్ బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్స్లో ఈ ఏడాది అదనంగా మరో 50 పడకల సామర్థ్యాన్ని అందుకోనున్నామని దిలీప్ జోస్ చెప్పారు. 2015లో మరో రెండు ప్రాజెక్టులు పూర్తి కానున్నాయని దీని ద్వారా 350 పడకల సామర్థ్యం జతకూడనుందని ఆయన అన్నారు.