
Taarak Mehta Jethalal Aka Dilip Joshi Daughter Niyati Wedding: ప్రముఖ బుల్లితెర నటుడు దిలీప్ జోషి ఇంట పెళ్లి సంబరాలు అంబరాన్నంటాయి. దిలీప్ కూతురు నియాతి పెళ్లి డిసెంబర్ 11న ఘనంగా జరిగింది. కూతురిని పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపిస్తున్న క్రమంలో దిలీప్ భావోద్వేగానికి లోనయ్యాడు. 'సినిమాల్లో నుంచి, సినిమా పాటల నుంచి భావోద్వేగాలను అరువు తెచ్చుకోవచ్చు. కానీ అవన్నీ మనకు ప్రత్యక్షంగా ఎదురైనప్పుడు ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేం. కొత్త ప్రయాణం మొదలుపెట్టిన నా చిట్టితల్లి నియాతి, యశోవర్ధన్ మిశ్రాలకు శుభాకాంక్షలు. ఈ వివాహ వేడుకలో భాగస్వాములై కొత్త జంటను మనసారా ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. సోషల్ మీడియాలో నియాతి పెళ్లి ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
కాగా దిలీప్ జోషి హిందీ సీరియల్ 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా'లో జీతాలాల్‌గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. 2008లో ప్రారంభమైన ఈ ధారావాహిక ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది. దిలీప్ జోషి సీరియల్స్‌తో పాటు మేనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, ఫిర్‌బీ దిల్ హై హిందుస్తానీ, ఖిలాడీ 420, దిల్ హై తుమ్హారా, ఫిరాఖ్, వాట్స్ యువర్ రాశీ వంటి సినిమాల్లోనూ నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment