కొందరికి కొన్నిరకాల పాత్రలు పెద్దగా నప్పవు. అందులోనూ పౌరాణిక పాత్రలు అందరికీ అంతగా సెట్టవవు. కొద్దిమందికి మాత్రమే పర్ఫెక్ట్‌గా సూటవుతాయి. అందులో ఒకరే బుల్లితెర నటుడు నికితిన్ ధీర్. శ్రీమద్ రామాయణ్ సీరియల్‌లో ఇతడు రావణుడిగా ఆకట్టుకుంటున్నాడు. కేవలం పేపర్‌పై ఉన్న డైలాగులు బట్టీపట్టి చెప్పడం లేదు. ఆ పాత్రను అర్థం చేసుకున్నాడు. రావణుడిని లోతుగా చదివి అందులోకి పరకాయ ప్రవేశం చేశాడు.
కుడికాలిపై టాటూ
శివభక్తుడిగా, రావణుడిగా అలరిస్తున్న నికితిన్ తాజాగా తన కుడికాలిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఎన్నో అనుభవాలకు నిలువుటద్దమే జీవితం. మనకు నిజమైన సంపద శరీరమే! పురాతన కాలం నుంచి సనాతన ప్రజలు పచ్చబొట్లను నమ్మేవారు. మనం చనిపోయాక కూడా అవి మనతోనే ఉన్నాయంటారు. టాటూ అనేది చెరగని ముద్రవంటిది.
9 నెలలుగా..
రావణుడి పాత్ర పోషించే అవకాశం ఇచ్చిన మహాదేవుడికి కృతజ్ఞతలు. 9 నెలలుగా ఈ పాత్రలో జీవిస్తూ తనను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. తనలాంటి(రావణుడి వంటి) రాజు మరొకరు ఉండరని తనకూ తెలుసు. తనలాంటి రాక్షసుడు ఇంకెవరూ లేరని కూడా తెలుసు. తనలాంటి నిష్ట బ్రాహ్మణుడు కూడా ఎవరూ ఉండరని ఎరుక.
నా లైఫ్‌లోకి వచ్చినందుకు..
తను వీణ వాయిస్తే ఆ సంగీతం వినేందుకు దేవతలు దిగి వస్తారు. ఆయన చంద్రహాస ఖడ్గాన్ని పట్టుకున్నప్పుడు అదే దేవతలు భయంతో దాక్కుంటారు. అలాంటి నువ్వు నా జీవితంలోకి చ్చినందుకు థ్యాంక్స్ అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. వీణ, చంద్రహాస ఖడ్గాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment