తండ్రిగా ప్రమోషన్‌ పొందిన బిగ్‌బాస్‌ విన్నర్‌ | Prince Narula And Yuvika Chaudhary Become Parents To A Baby Girl, Photos Goes Viral | Sakshi
Sakshi News home page

పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందిన బిగ్‌బాస్‌ జంట.. ఐవీఎఫ్‌ ద్వారానే..

Published Sun, Oct 20 2024 5:08 PM | Last Updated on Sun, Oct 20 2024 5:27 PM

Prince Narula, Yuvika Chaudhary Become Parents to a Baby Girl

బుల్లితెర జంట, బిగ్‌బాస్‌ ఫేమ్‌ ప్రిన్స్‌ నరుల- యువికా చౌదరి పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందారు. యువికా శనివారం నాడు(అక్టోబర్‌ 19న) పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ప్రిన్స్‌ తండ్రి జోగిందర్‌ ధృవీకరించాడు.

బిగ్‌బాస్‌ షోలో మొదలైన లవ్‌స్టోరీ
కాగా యువిక, ప్రిన్స్‌ల లవ్‌ స్టోరీ.. బిగ్‌బాస్‌ హౌస్‌లోనే మొదలైంది. 2015లో హిందీ బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌లో వీరిద్దరూ పాల్గొన్నారు. మొదట స్నేహితులుగా ఉన్నారు. తర్వాత ప్రేమికులుగా మారారు. ప్రిన్స్‌ ఈ సీజన్‌ టైటిల్‌ కూడా ఎగరేసుకుపోయాడు. 2016లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. రెండేళ్లు గ్యాప్‌ తీసుకున్నాక పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఆరేళ్లకు వీరు తల్లిదండ్రులు కాబోతున్నారు.

ఐవీఎఫ్‌..
తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి ఇటీవలే యువికా మాట్లాడుతూ.. ప్రిన్స్‌ కెరీర్‌ దృష్టిలో పెట్టుకుని పిల్లల గురించి ఆలోచించలేదు. కానీ ఒకానొక సమయంలో ఒక విషయం అర్థమైంది. వయసు పెరిగేకొద్దీ శరీరం అన్నింటికీ సహకరించదని తెలిసొచ్చింది. అప్పుడు ఇద్దరం చర్చించుకుని ఐవీఎఫ్‌కు వెళ్లాం అని చెప్పుకొచ్చింది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement