బుల్లితెర నటుడు గురుచరణ్ సింగ్ (Gurucharan Singh) తీవ్ర ఉపవాసంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. 19 రోజులుగా ఏమీ తినకుండా, కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా ఉంటున్న అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల చికిత్స అనంతరం స్పృహలోకి వచ్చాడు కానీ పూర్తిగా కోలుకోలేదు. ఇటీవల ఆస్పత్రి బెడ్‌పై ఉన్న వీడియోను నటుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
కొద్దిరోజులు మిస్సింగ్.. తర్వాత!
దీని గురించి గురుచరణ్ స్నేహితురాలు భక్తి సోని మాట్లాడుతూ.. గురుచరణ్ కొన్నిరోజులపాటు కనిపించకుండా పోయాడు. అయితే ఇంటికి తిరిగి వచ్చినప్పటినుంచి అతడి ప్రవర్తలో చాలా మార్పు వచ్చింది. అంతేకాకుండా చాలావరకు ఆహారాన్ని తీసుకోవడమే తగ్గించేశాడు. కేవలం ద్రవాహారమే సేవించాడు. కొంతకాలానికి అది కూడా మానేశాడు. ఆఖరికి నీళ్లు తాగడం కూడా ఆపేశాడు. 19 రోజులుగా పిడికెడంత అన్నం, గ్లాసు మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు.
గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డాక్టర్ల మాట కూడా వినడం లేదు
దీనివల్ల అతడి శరీరం బలహీనమైపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అలాగే ఇండస్ట్రీలో అతడి పనికి తగ్గ గుర్తింపు రాకపోవడంతో కలత చెందాడు. అందుకే మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. నీరు, తిండి త్యాగం చేశాడు. వైద్యుల చికిత్సతో స్పృహలోకి వచ్చాడు. కానీ తన పరిస్థితి ఆందోళనగానే ఉంది. డాక్టర్లు చెప్పే మాటలు వినిపించుకోవడం లేదు. ఇప్పటికీ ఏవీ తినను, తాగను అని మొండికేస్తున్నాడు. అందరూ తనను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆయన ఎవరి మాటా లెక్క చేయడం లేదు.
సన్యాసం తీసుకోవాలనుకున్నాడు
నిజానికి ఆ మధ్య అతడు కనిపించకుండా పోయాడు కదా.. అప్పుడు గురుచరణ్ సన్యాసం తీసుకోవాలని హిమాలయాలకు వెళ్లాలనుకున్నాడు. కానీ ఎవరో గురువు నుంచి ఫోన్ కాల్ రావడంతో వెనక్కు వచ్చేశాడు. అప్పటినుంచి ఆ గురువు మార్గంలోనే వెళ్తున్నాడు. మునుపటిలా సాధారణ జీవనం గడిపేందుకు అస్సలు ఇష్టపడటం లేదు అని సోని చెప్పుకొచ్చింది.
ఏం జరిగిందంటే?
బుల్లితెర నటుడు గురుచరణ్ సింగ్ గతేడాది ఏప్రిల్‌లో ఉన్నట్లుండి కనిపించకుండా పోయాడు. ఏప్రిల్ 22న ముంబైకి వెళ్లాల్సిన అతడు అక్కడికీ వెళ్లలేదు, అటు ఇంటికీ తిరిగి రాలేదు. నాలుగురోజులపాటు అతడి కోసం ఎదురుచూసిన తల్లిదండ్రులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. నటుడి కోసం అటు కుటుంబ సభ్యులు, ఇటు పోలీసులు గాలింపు చేపడుతూ ఉండగా సడన్‌గా ఓ రోజు (మే 18న) రాత్రి గురుచరణ్ ఇంటికి వచ్చాడు.
ఆధ్యాత్మిక బాటలో పయనించాలనే ఇల్లు వదిలి వెళ్లిపోయానని, కానీ సాధారణ జీవితం గడపమని దేవుడు సంకేతాలివ్వడంతో తిరిగి వచ్చానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ సాధారణ జీవితం గడిపేందుక అతడు ఏమాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇతడు తారక్ మెహతాకా ఉల్టా చష్మా (Taarak Mehta Ka Ooltah Chashmah) సీరియల్‌తో పేరు తెచ్చుకున్నాడు.
చదవండి: గేమ్ ఛేంజర్‌పై ప్రేక్షకుల రివ్యూ.. సినిమా మధ్యలో వెళ్లిపోయామంటూ..!
Comments
Please login to add a commentAdd a comment