gurucharan
-
19 రోజులుగా తిండీనీరు మానేసిన నటుడు.. పరిస్థితి విషమం
బుల్లితెర నటుడు గురుచరణ్ సింగ్ (Gurucharan Singh) తీవ్ర ఉపవాసంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. 19 రోజులుగా ఏమీ తినకుండా, కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా ఉంటున్న అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల చికిత్స అనంతరం స్పృహలోకి వచ్చాడు కానీ పూర్తిగా కోలుకోలేదు. ఇటీవల ఆస్పత్రి బెడ్‌పై ఉన్న వీడియోను నటుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.కొద్దిరోజులు మిస్సింగ్.. తర్వాత!దీని గురించి గురుచరణ్ స్నేహితురాలు భక్తి సోని మాట్లాడుతూ.. గురుచరణ్ కొన్నిరోజులపాటు కనిపించకుండా పోయాడు. అయితే ఇంటికి తిరిగి వచ్చినప్పటినుంచి అతడి ప్రవర్తలో చాలా మార్పు వచ్చింది. అంతేకాకుండా చాలావరకు ఆహారాన్ని తీసుకోవడమే తగ్గించేశాడు. కేవలం ద్రవాహారమే సేవించాడు. కొంతకాలానికి అది కూడా మానేశాడు. ఆఖరికి నీళ్లు తాగడం కూడా ఆపేశాడు. 19 రోజులుగా పిడికెడంత అన్నం, గ్లాసు మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు.గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండిడాక్టర్ల మాట కూడా వినడం లేదుదీనివల్ల అతడి శరీరం బలహీనమైపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అలాగే ఇండస్ట్రీలో అతడి పనికి తగ్గ గుర్తింపు రాకపోవడంతో కలత చెందాడు. అందుకే మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. నీరు, తిండి త్యాగం చేశాడు. వైద్యుల చికిత్సతో స్పృహలోకి వచ్చాడు. కానీ తన పరిస్థితి ఆందోళనగానే ఉంది. డాక్టర్లు చెప్పే మాటలు వినిపించుకోవడం లేదు. ఇప్పటికీ ఏవీ తినను, తాగను అని మొండికేస్తున్నాడు. అందరూ తనను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆయన ఎవరి మాటా లెక్క చేయడం లేదు.సన్యాసం తీసుకోవాలనుకున్నాడునిజానికి ఆ మధ్య అతడు కనిపించకుండా పోయాడు కదా.. అప్పుడు గురుచరణ్ సన్యాసం తీసుకోవాలని హిమాలయాలకు వెళ్లాలనుకున్నాడు. కానీ ఎవరో గురువు నుంచి ఫోన్ కాల్ రావడంతో వెనక్కు వచ్చేశాడు. అప్పటినుంచి ఆ గురువు మార్గంలోనే వెళ్తున్నాడు. మునుపటిలా సాధారణ జీవనం గడిపేందుకు అస్సలు ఇష్టపడటం లేదు అని సోని చెప్పుకొచ్చింది.ఏం జరిగిందంటే?బుల్లితెర నటుడు గురుచరణ్ సింగ్ గతేడాది ఏప్రిల్‌లో ఉన్నట్లుండి కనిపించకుండా పోయాడు. ఏప్రిల్ 22న ముంబైకి వెళ్లాల్సిన అతడు అక్కడికీ వెళ్లలేదు, అటు ఇంటికీ తిరిగి రాలేదు. నాలుగురోజులపాటు అతడి కోసం ఎదురుచూసిన తల్లిదండ్రులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. నటుడి కోసం అటు కుటుంబ సభ్యులు, ఇటు పోలీసులు గాలింపు చేపడుతూ ఉండగా సడన్‌గా ఓ రోజు (మే 18న) రాత్రి గురుచరణ్ ఇంటికి వచ్చాడు. ఆధ్యాత్మిక బాటలో పయనించాలనే ఇల్లు వదిలి వెళ్లిపోయానని, కానీ సాధారణ జీవితం గడపమని దేవుడు సంకేతాలివ్వడంతో తిరిగి వచ్చానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ సాధారణ జీవితం గడిపేందుక అతడు ఏమాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇతడు తారక్ మెహతాకా ఉల్టా చష్మా (Taarak Mehta Ka Ooltah Chashmah) సీరియల్‌తో పేరు తెచ్చుకున్నాడు.చదవండి: గేమ్ ఛేంజర్‌పై ప్రేక్షకుల రివ్యూ.. సినిమా మధ్యలో వెళ్లిపోయామంటూ..! -
పాటల రచయిత గురుచరణ్ మృతి
ప్రముఖ పాటల రచయిత గురుచరణ్ (77) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. దివంగత దర్శకుడు మానాపురం అప్పారావు, దివంగత నటి ఎం.ఆర్. తిలకంల కుమారుడే గురుచరణ్. ఎంఏ చదివిన ఆయన ప్రముఖ పాటల రచయిత ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు.‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు’ (అల్లుడుగారు), ‘కుంతీకుమారి తన నోరుజారి, బోయవాని వేటుకు గాయపడిన కోయిల’ (రౌడీగారి పెళ్ళాం) వంటి దాదాపు 200లకుపైగా సూపర్ హిట్ పాటలను రచించారు గురుచరణ్. ముఖ్యంగా నటుడు మోహన్‌బాబుకు ఎంతో ఇష్టమైన పాటల రచయిత ఆయన. అందుకే తన చిత్రాల్లో కనీసం ఒక్క పాట అయినా తప్పకుండా గురుచరణ్‌తో రాయించేవారు మోహన్‌బాబు. చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్నో మెలోడీ, అర్థవంతమైన పాటలను గురుచరణ్ రచించారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
తెలుగు హిట్ పాటల రచయిత గురుచరణ్ కన్నుమూత
'ముద్దబంతి నవ్వులో మూగబాసలు', ‘కుంతీకుమారి తన కాలుజారి’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిలా’ లాంటి సూపర్ హిట్ పాటలను రచించిన ప్రముఖ గీత రచయిత గురుచరణ్ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుఝామున కన్నుమూశారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. అలనాటి ప్రముఖ నటి ఎం.ఆర్.తిలకం, అలనాటి ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల కుమారుడు. ఎం.ఎ. వరకు చదివిన ఆయన ప్రముఖ గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు. రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు. ముఖ్యంగా నటుడు మోహన్‌బాబుకు ఎంతో ఇష్టమైన పాటల రచయిత గురుచరణ్. మోహన్‌బాబు నటించిన చిత్రాలలో గురుచరణ్‌తో ఒక్క పాట అయినా తప్పకుండా రాయించేవారు. మోహన్ బాబు చిత్రాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్నో మెలోడీ, అర్థవంతమైన పాటలను గురుచరణ్ రచించారు. -
25 రోజులు మిస్సింగ్.. నటుడిని గుర్తుపట్టని తల్లి!
బుల్లితెర నటుడు గురుచరణ్ సింగ్ ఆ మధ్య ఉన్నట్లుండి కనిపించకుండా పోయాడు. ఏప్రిల్ 22న ముంబైకి వెళ్లాల్సిన ఆయన అక్కడికి చేరుకోలేదు. అలాగని ఇంటికీ తిరిగి రాలేదు. రోజులు గడుస్తున్నా కుమారుడి జాడ లేకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. అటు కుటుంబం, ఇటు పోలీసులు నటుడి కోసం గాలింపు చేపట్టగా 25 రోజుల తర్వాత (మే 18న) గురుచరణ్ నెమ్మదిగా ఇంటికి చేరుకున్నాడు.చూడగానే గుర్తుపట్టలేదుఇంటికి వెళ్లాక తన పేరెంట్స్ స్పందన గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. గురుచరణ్ మాట్లాడుతూ.. 25 రోజుల తర్వాత ఓ రోజు రాత్రి నేను ఇంటికి చేరుకున్నాను. అప్పుడు ఇంటి తలుపు తెరిచిన అమ్మ నన్నసలు గుర్తుపట్టలేదు. ఎవరో వచ్చారంటూ మా నాన్నను పిలిచింది. ఆయన నన్ను చూసి వీడు మన సోను అని చెప్పాడు. వెంటనే అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని భావోద్వేగానికి లోనైంది. సంతోషంతో ఏడ్చేశాంముగ్గురం ఇంట్లోకి వెళ్లాక చాలాసేపు ఏడ్చాం. అవి సంతోషంతో వచ్చిన కన్నీళ్లు అని చెప్పుకొచ్చాడు. ఆధ్యాత్మిక బాటలో పయనించాలన్న ఉద్దేశంతోనే నటుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కానీ దేవుడు సాధారణ జీవితం గడపమని సంకేతాలివ్వడంతోనే తిరిగి ఇంటికి వచ్చినట్లు పేర్కొన్నాడు. కాగా గురు చరణ్.. తారక్ మెహతాకా ఉల్టా చష్మా సీరియల్లో సోధి పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.చదవండి: ఫారెన్ ట్రిప్‌లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు -
4 రోజుల నుంచి ప్రముఖ నటుడు మిస్సింగ్
ప్రముఖ నటుడు గురు చరణ్ సింగ్ కనిపించకుండా పోయాడు. దాదాపు నాలుగు రోజుల నుంచి అతడి జాడ లేదు. దీంతో సదరు నటుడి తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలేం జరిగింది? ఎప్పటి నుంచి గురుచరణ్ మిస్ అయ్యాడు?హిందీలో 'తారక్ మెహతా కా ఉల్తా చష్మా' అనే టీవీ సీరియల్లో సోధి పాత్రలో నటించిన గురుచరణ్ సింగ్ బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇతడు గత నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో ఇతడి తండ్రి ఢిల్లీ పోలీసులని ఆశ్రయించాడు. ఫిర్యాదు ప్రకారం.. గురుచరణ్, సోమవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లాడు. అయితే ముంబై వెళ్లాల్సిన గురుచరణ్.. అక్కడికి చేరుకోలేదు. అలా అని ఇంటికి కూడా తిరిగి రాలేదు. అతడి ఫోన్ కూడా అందుబాటులోకి రావడం లేదు అని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం గురుచరణ్ మానసిక పరిస్థితి సరిగానే ఉందని, తాము కూడా అతడి కోసం వెతికామని తండ్రి.. తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇకపోతే సీరియల్లో నటిస్తున్న గురుచరణ్.. తన తండ్రికి ఉన్న అనారోగ్య సమస్యల కారణంగా టీవీ షో నుంచి తప్పుకొన్నాడు. కుటుంబానికే తన పూర్తి సమయాన్ని కేటాయించాడు. ఇప్పుడు అనుహ్యంగా కనిపించకుండా పోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థి పట్ల టీచర్ అమానుషం
9 ఏళ్ల విద్యార్థి పట్ల ఓ టీచర్ అమానుషంగా ప్రవర్తించాడు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదని నాలుగో తరగతి విద్యార్థి గురుచరణ్‌పై టీచర్ కర్రతో తన ప్రతాపాన్ని చూపించాడు. దీంతో ఆ విద్యార్థి ఒళ్లంత గాయాలయ్యాయి. ఆ ఘటన తిరుపతిలోని మున్సిపల్ పాఠశాలలో చోటు చేసుకుంది. దీంతో ఆ సంఘటనపై సమాచారం అందుకున్న గురుచరణ్ తల్లితండ్రులు పాఠశాల చేరుకున్నారు. టీచర్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పాఠశాల గేట్ వద్ద ఆందోళనకు దిగారు. బాలుడిపై టీచర్ దాడిని ప్రధాన ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. దీంతో తాను టీచర్‌పై చర్యలు చేపడతానని హామీ ఇవ్వడంతో గురుచరణ్ తల్లితండ్రులు ఆందోళన విరమించారు.