
బుల్లితెర నటుడు గురుచరణ్ సింగ్ ఆ మధ్య ఉన్నట్లుండి కనిపించకుండా పోయాడు. ఏప్రిల్ 22న ముంబైకి వెళ్లాల్సిన ఆయన అక్కడికి చేరుకోలేదు. అలాగని ఇంటికీ తిరిగి రాలేదు. రోజులు గడుస్తున్నా కుమారుడి జాడ లేకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. అటు కుటుంబం, ఇటు పోలీసులు నటుడి కోసం గాలింపు చేపట్టగా 25 రోజుల తర్వాత (మే 18న) గురుచరణ్ నెమ్మదిగా ఇంటికి చేరుకున్నాడు.
చూడగానే గుర్తుపట్టలేదు
ఇంటికి వెళ్లాక తన పేరెంట్స్ స్పందన గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. గురుచరణ్ మాట్లాడుతూ.. 25 రోజుల తర్వాత ఓ రోజు రాత్రి నేను ఇంటికి చేరుకున్నాను. అప్పుడు ఇంటి తలుపు తెరిచిన అమ్మ నన్నసలు గుర్తుపట్టలేదు. ఎవరో వచ్చారంటూ మా నాన్నను పిలిచింది. ఆయన నన్ను చూసి వీడు మన సోను అని చెప్పాడు. వెంటనే అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని భావోద్వేగానికి లోనైంది.
సంతోషంతో ఏడ్చేశాం
ముగ్గురం ఇంట్లోకి వెళ్లాక చాలాసేపు ఏడ్చాం. అవి సంతోషంతో వచ్చిన కన్నీళ్లు అని చెప్పుకొచ్చాడు. ఆధ్యాత్మిక బాటలో పయనించాలన్న ఉద్దేశంతోనే నటుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కానీ దేవుడు సాధారణ జీవితం గడపమని సంకేతాలివ్వడంతోనే తిరిగి ఇంటికి వచ్చినట్లు పేర్కొన్నాడు. కాగా గురు చరణ్.. తారక్ మెహతాకా ఉల్టా చష్మా సీరియల్‌లో సోధి పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.
చదవండి: ఫారెన్ ట్రిప్‌లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు
Comments
Please login to add a commentAdd a comment