4 రోజుల నుంచి ప్రముఖ నటుడు మిస్సింగ్ | Actor Gurucharan Singh Missing From Four Days | Sakshi
Sakshi News home page

Guru Charan Singh: కనిపించకుండా పోయిన నటుడు.. ఇంతకీ ఏమైంది?

Published Sat, Apr 27 2024 7:51 AM | Last Updated on Sat, Apr 27 2024 7:51 AM

Actor Gurucharan Singh Missing From Four Days

ప్రముఖ నటుడు గురు చరణ్ సింగ్ కనిపించకుండా పోయాడు. దాదాపు నాలుగు రోజుల నుంచి అతడి జాడ లేదు. దీంతో సదరు నటుడి తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలేం జరిగింది? ఎప్పటి నుంచి గురుచరణ్ మిస్ అయ్యాడు?

హిందీలో 'తారక్ మెహతా కా ఉల్తా చష్మా' అనే టీవీ సీరియల్‪‌లో సోధి పాత్రలో నటించిన గురుచరణ్ సింగ్ బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇతడు గత నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో ఇతడి తండ్రి ఢిల్లీ పోలీసులని ఆశ్రయించాడు. ఫిర్యాదు ప్రకారం.. గురుచరణ్, సోమవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లాడు. అయితే ముంబై వెళ్లాల్సిన గురుచరణ్.. అక్కడికి చేరుకోలేదు. అలా అని ఇంటికి కూడా తిరిగి రాలేదు. అతడి ఫోన్ కూడా అందుబాటులోకి రావడం లేదు అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం గురుచరణ్ మానసిక పరిస్థితి సరిగానే ఉందని, తాము కూడా అతడి కోసం వెతికామని తండ్రి.. తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇకపోతే సీరియల్‌లో నటిస్తున్న గురుచరణ్.. తన తండ్రికి ఉన్న అనారోగ్య సమస్యల కారణంగా టీవీ షో నుంచి తప్పుకొన్నాడు. కుటుంబానికే తన పూర్తి సమయాన్ని కేటాయించాడు. ఇప్పుడు అనుహ్యంగా కనిపించకుండా పోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement