9 ఏళ్ల విద్యార్థి పట్ల ఓ టీచర్ అమానుషంగా ప్రవర్తించాడు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదని నాలుగో తరగతి విద్యార్థి గురుచరణ్పై టీచర్ కర్రతో తన ప్రతాపాన్ని చూపించాడు. దీంతో ఆ విద్యార్థి ఒళ్లంత గాయాలయ్యాయి. ఆ ఘటన తిరుపతిలోని మున్సిపల్ పాఠశాలలో చోటు చేసుకుంది. దీంతో ఆ సంఘటనపై సమాచారం అందుకున్న గురుచరణ్ తల్లితండ్రులు పాఠశాల చేరుకున్నారు.
టీచర్ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పాఠశాల గేట్ వద్ద ఆందోళనకు దిగారు. బాలుడిపై టీచర్ దాడిని ప్రధాన ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. దీంతో తాను టీచర్పై చర్యలు చేపడతానని హామీ ఇవ్వడంతో గురుచరణ్ తల్లితండ్రులు ఆందోళన విరమించారు.