ఆరిపోతూ వెలుగిచ్చిన జీవన దీపం
పాతపోస్టాఫీసు: కొన్ని జీవితాలను చూస్తే విధికి ఎందుకంత కంటగింపో ఎవరు చెప్పగలరు? విధి వైచిత్రిని, వైపరీత్యాన్ని ఎవరు ఊహించగలరు? మృత్యు కెరటంలా విరుచుకుపడే విధి ఎన్నో కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచెత్తుతుంది. అనూహ్య పరిణామాలతో జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంది. ఎంవీపీ కాలనీకి చెందిన పిళ్లా ధనలక్ష్మి కుటుంబం పరిస్థితీ అదే విధంగా మారింది. ఏడాది వ్యవధిలో మృత్యువు ఆమె భర్తను, తర్వాత ఆమెను దిగమింగడంతో ఇద్దరు పిల్లల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇంత విషాదంలోనూ ఆమె బం ధువులు, పిల్లలు అవయవదానానికి సమ్మతించడంతో ధనలక్ష్మి జీవితం కడతేరినా, మరికొందరికి ప్రాణదానం చేసి నట్టురుుంది. ఎంవీపీ కాలనీకి చెందిన పిల్లా ధనలక్ష్మి (35) శుక్రవారం అనకాపల్లిలోని బంధువుల గహ ప్రవేశానికి వెళ్లి బావ గోవింద్ ద్విచక్రవాహనంపై నగరానికి వస్తుండగా సబ్బవరం దేవీపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలయ్యారు. తలకు దెబ్బ తగలడంతో ఆమెను రాంనగర్ కేర్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.
శనివారం ఉదయం ధనలక్ష్మి బ్రెరుున్‌డెడ్ అరుునట్టుగా వైద్యులు నిర్ధారించారు. తర్వాత వారి సూచన ప్రకారం ఆమె బంధువులు, పిల్లలు అవయవదానానికి సమ్మతించారు. నగరంలోని మొహిసిన్ ఐ బ్యాంక్‌కు కళ్లను, లివర్‌ను అపోలో ఆస్పత్రికి, ఒక కిడ్నీని కేర్‌కు, ఒక కిడ్నీని సెవన్ హిల్స్ ఆస్పత్రికి అందజేయడానికి అంగీకరించారు. గత ఏడాది ధనలక్ష్మి భర్త గుండె పోటుతో మరణించారు. ఇప్పుడు తల్లికూడా మరణించడంతో వుడాపార్క్ చేరువలోని గాయత్రి విద్యాపరిషత్ పాఠశాలలో టెన్‌త చదువుతున్న హేమంత్ (15), ఎంవీపీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న రమ్యశ్రీ (11) రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది.