Hemant
-
జార్ఖండ్ సీఎం నివాసాన్ని ముట్టడించిన BJYM నేతలు
-
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భావోద్వేగం
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 49వ పుట్టినరోజు ఈరోజు (ఆగస్టు 10). ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా హేమంత్ సోరెన్ తన ఎక్స్ హ్యాండిల్లో ఒక చిత్రాన్ని షేర్ చేశారు. దానిలో పాటు హేమంత్ సోరెన్ ఇలా రాశారు.. ‘నా పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది నాటి ఒక జ్ఞాపకం నా మదిలో మెదిలింది. అదే ఈ ఖైదీ గుర్తు.. ఇది జైలు నుండి విడుదలైనప్పుడు నాపై ముద్రించారు. ఈ గుర్తు నాది మాత్రమే కాదు.ప్రజలు ఎన్నుకొన్న ముఖ్యమంత్రిని ఎటువంటి ఆధారాలు లేకుండా 150 రోజులు జైలులో ఉంచారు. అందుకే ఈ గుర్తు సామాన్య గిరిజనులకు, అణగారిన వారికి చెందినది. దోపిడీకి గురవుతున్నవారి విషయంలో ఏమేమి జరుగుతుంటాయో ఎవరికీ చెప్పనవసరం లేదు. అందుకే ఈ రోజు నేను మరింత దృఢంగా నిశ్చయించుకున్నాను.. దోపిడీకి గురవుతున్న అణగారిన, దళిత, వెనుకబడిన, గిరిజన, ఆదివాసీలకు మద్దతుగా పోరాడాలనే నా సంకల్పాన్ని బలపరుచుకుంటున్నాను.హింసకు గురవుతూ, న్యాయం అందని ప్రతి వ్యక్తికి, సమాజానికి మద్దతుగా నేను నా గొంతును విప్పుతాను. చట్టం అందరికీ సమానమే. అధికార దుర్వినియోగం లేని సమాజాన్ని మనం నిర్మించాలి. అయితే ఈ మార్గం అంత సులభం కాదు. ఇందుకోసం మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే మనమంతా కలిస్తే ఈ సవాళ్లను అధిగమించగలమనే నమ్మకం నాకుంది. ఎందుకంటే మన దేశంలోని భిన్నత్వంలోని ఏకత్వమే మన బలం’ అని అన్నారు. आज अपने जन्मदिन के मौक़े पर बीते एक साल की स्मृति मेरे मन में अंकित है - वह है यह कैदी का निशान - जो जेल से रिहा होते वक्त मुझे लगाया गया। यह निशान केवल मेरा नहीं, बल्कि हमारे लोकतंत्र की वर्तमान चुनौतियों का प्रतीक है।जब एक चुने हुए मुख्यमंत्री को बिना किसी सबूत, बिना कोई… pic.twitter.com/TsKovjS1HY— Hemant Soren (@HemantSorenJMM) August 10, 2024 -
కట్టేసి, కారం చల్లి..
కరీంనగర్ క్రైం: కుటుంబ కలహాలతో భర్తను అతికిరాతకంగా కడతేర్చిందో భార్య. తాళ్లతో కట్టేసి, కారంపొడి చల్లి, వేడినీళ్లు పోస్తూ.. రోకలిబండతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆదర్శనగర్‌కు చెందిన తోట హేమంత్(39)కు 2012లో రోహితితో వివాహమైంది. వారికి ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. హేమంత్ పెట్రోల్‌బంక్‌లో పనిచేసి మానేశాడు. రోహితి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పేషెంట్ కేర్‌గా పనిచేస్తోంది. దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం గొడవ తీవ్రమైంది. దీంతో రోహితి హేమంత్‌ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆస్పత్రిలో పనిచేసే నవీన్, సాయికుమార్ సాయం కోరింది. బుధవారం రాత్రి వారిని ఇంటికి పిలిచింది. వారు ఇంటికి వచ్చి గేటు, ఇంటి తలుపులు మూసేశారు. ముగ్గురూ కలిసి హేమంత్‌ను తాళ్లతో కట్టేశారు. కళ్లలో కారం కొట్టారు. అనంతరం నవీన్, సాయికుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత రోహితి హేమంత్ శరీరంపై వేడినీళ్లు పోస్తూ.. రోకలిబండతో విచక్షణరహితంగా దాడి చేసింది. తల, మర్మాంగాలపై దాడి చేయడంతో రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయాడు. దీంతో రోహితి అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. అర్ధరాత్రి దాటిన తరువాత ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. హేమంత్ తల్లి విమల ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులనూ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కన్నతల్లి కళ్లెదుటే..: తన కళ్లెదుటే హేమంత్‌ను కొట్టారని, కొట్టొద్దని బ్రతిమిలాడినా వినలేదని విమల రోదించింది. వేడినీళ్లు, కారంపొడి పోస్తూ దాడి చేశారని, ముగ్గురు పిల్లలున్నారు వద్దన్నా వినకుండా చంపేశారని భోరుమంది. పథకం ప్రకారమే హేమంత్‌ను నిందితులు చంపారని బంధువులు ఆరోపించారు. బుధవారం ఉదయం నుంచి నవీన్, సాయికుమార్ పలుమార్లు ఫోన్ చేశారని హేమంత్ తమకు చెప్పాడన్నారు. ఈ క్రమంలోనే రాత్రి ఇంటికి వచ్చి పథకం ప్రకారం దాడిచేసి చంపారని ఆరోపించారు. -
వైఎస్సార్సీపీ ఎంపీటీసీపై హత్యాయత్నం
తిరుపతి రూరల్: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ. రంగంపేట వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు బోస్‌చంద్రారెడ్డిపై శనివారం రాత్రి కొందరు దుండగులు హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఎంపీటీసీ సభ్యుడిని కత్తితో పొడిచేందుకు యత్నించడంతోపాటు అతని కారును కాల్చివేసేందుకు వేసిన పథకం విఫలమైంది. ఈ ఘటనలో కత్తితో సహా ఓ సినీహీరో వద్ద బౌన్సర్‌గా పనిచేసిన వ్యక్తి పట్టుబడ్డాడు. ఓ ప్రైవేటు యూనివర్సిటీ మాజీ పీఆర్వో సతీష్, ఓ సినీ హీరో అభిమాన సంఘం అధ్యక్షుడు సునీల్‌చక్రవర్తి సూచనల మేరకే ఈ ఘటనకు పాల్పడినట్లు పట్టుబడిన వ్యక్తి మీడియాతో చెప్పడం విశేషం. బాధితుడు బోస్‌చంద్రారెడ్డి తెలిపిన వివరాలు.. సతీష్, సునీల్‌చక్రవర్తి గతంలో బోస్‌చంద్రారెడ్డి, రంగంపేట ఉప సర్పంచ్ మౌనిష్రెడ్డితో గొడవపడ్డారు. ఓ భూమి, షాపు విషయంలోనూ ఎంపీటీసీ, ఉప సర్పంచ్‌తో సతీష్, సునీల్‌చక్రవర్తిలు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో బోస్‌చంద్రారెడ్డిపై కక్ష పెంచుకున్న సతీష్, సునీల్‌చక్రవర్తిలు ఓ సినీహీరో వద్ద బౌన్సర్‌గా పనిచేసిన హేమంత్‌తో ఒప్పందం చేసుకున్నారు. దీంతో శనివారం రాత్రి హేమంత్ మరో ఐదుగురు కలిసి రాడ్లు, కత్తులు, పెట్రోల్ బాటిల్స్‌తో మారుతీనగర్‌లోని బోస్‌చంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించి.. జన సంచారం ఉండటంతో ఆఖరి నిమిషంలో పరారయ్యారు. అనంతరం మళ్లీ రాత్రి 11 గంటలకు ఇలానే దాడి చేసేందుకు విఫలయత్నం చేశారు. ఆదివారం వేకువజామున 3 గంటలకు మళ్లీ కత్తులు, రాడ్లు, పెట్రోల్‌తో దాడికి రావడంతో వారిపై బోస్‌చంద్రారెడ్డి అనుచరులు తిరగబడ్డారు. హేమంత్ కత్తితో సహా పట్టుబడగా.. మిగిలినవారు పారిపోయారు. అతన్ని పట్టుకుని విచారించిన బోస్‌చంద్రారెడ్డి వర్గీయులు, రంగంపేటలోనూ మరో బ్యాచ్ ఉన్నారని చెప్పడంతో కారులో అతన్ని ఎక్కించుకుని రంగంపేటకు వచ్చారు. అప్పటికే వారు కూడా పారిపోయారు. ఈ హత్యాయత్నానికి సతీష్ కీలకసూత్రధారి అని, అతనే బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డిలపై దాడి చేయమన్నారని, దీనిలో సునీల్‌చక్రవర్తి పాత్ర కూడా ఉందని హేమంత్ మీడియాకు తెలిపాడు. హత్యచేయడం లక్ష్యం కాదని, కారును కాలి్చవేసి భయపెట్టాలని యత్నించినట్టు చెప్పాడు. నిందితులకు సతీష్ ఫోన్‌పే ద్వారా నగదు పంపించడం, అర్ధరాత్రిళ్లు కూడా సునీల్‌చక్రవర్తి ఫోన్లో మాట్లాడుతుండటంతో బాధితులు నిజనిర్ధారణకు వచ్చారు. హేమంత్‌ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఘటన జరిగిన ప్రదేశం తిరుపతి యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండటంతో బోస్‌చంద్రారెడ్డి అక్కడే ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా, కొన్ని మీడియాల్లో సినీనటులు మోహన్‌బాబు, విష్ణువర్ధన్బాబుపై అసత్య ప్రచారం చేయడాన్ని బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డిలు ఖండించారు. చంద్రగిరిలో విలేకరుల సమావేశం పెట్టి జరిగిన ఘటనలతో వారికి ఎలాంటి సంబంధం లేదని, అసత్యప్రచారాలు మానుకోవాలని స్పష్టం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డితోపాటు గ్రామస్తులు ధర్నా చేశారు. -
హిందుస్తాన్ షిప్‌యార్డ్ రికార్డ్
విశాఖపట్టణం: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ షిప్‌యార్డ్ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 755 కోట్ల విలువైన ఉత్పత్తిని సాధించింది. కోవిడ్–19 రెండు, మూడు దశలు, పాక్షిక లాక్డౌన్లు, ఆంక్షలు తదితర వివిధ సవాళ్లలోనూ ప్రోత్సాహక పనితీరును చూపగలిగినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ హేమంత్ ఖత్రి పేర్కొన్నారు. కంపెనీకి గల మూడు విభాగాలూ ఇందుకు సహకరించినట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మరింత అధికంగా రూ. 1,000 కోట్ల విలువైన ఉత్పాదకతను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. నౌకా నిర్మాణ విభాగం నుంచి రూ. 613 కోట్ల విలువైన ప్రొడక్షన్ సాధించడం ద్వారా కొత్త రికార్డ్‌కు తెరతీసినట్లు పేర్కొన్నారు. గతేడాది రూ. 50.78 కోట్ల నికర లాభం ఆర్జించగా.. రూ. 10.69 కోట్ల నిర్వహణ లాభాన్ని సాధించినట్లు తెలియజేశారు. అయితే అంతక్రితం ఏడాది(2020–21) రూ. 14 కోట్ల నికర నష్టంతోపాటు.. రూ. 73 కోట్లమేర నిర్వహణ నష్టాలు నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
రూ. 620 కోట్ల ప్రాజెక్టు: ఐపీఎస్‌ల మధ్య వార్!
బెంగళూరు: నిర్భయ పథకం కింద చేపట్టిన బెంగళూరు సేఫ్ సిటి ప్రాజెక్టు టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఐపీఎస్ అధికారిణి రూపా ఆరోపణలను నగర అదనపు పోలీస్ కమిషనర్ హేమంత్ నింబాళ్కర్ కొట్టిపారేశారు. తాము అత్యంత పారదర్శకంగా వ్యవహరించామని, ఎవరికీ అనుకూలంగా నిర్ణయాలు తీసుకోలేదన్నారు. టెండరింగ్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు. కాగా మహిళలు, చిన్నారుల భద్రత పర్యవేక్షణకై 7 వేలకు పైగా సీసీటీవీల ఏర్పాటు సహా ఇతర సురక్షిత చర్యలకై సుమారు రూ. 620 కోట్ల భారీ వ్యయంతో బెంగళూరు సేఫ్ సిటి ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా టెండర్లు ఆహ్వానించే, స్క్రూటినీ చేసే కమిటీకి హేమంత్ నింబాళ్కర్‌ను చైర్మన్‌గా నియమించారు. ఈ నేపథ్యంలో ఒక కంపెనీకి హేమంత్ అనుకూలంగా పనిచేస్తున్నారంటూ రూపా సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై స్పందించిన హేమంత్ నింబాళ్కర్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘జనవరి 8 నాటికి టెండర్ల దాఖలు ప్రక్రియ పూర్తవుతుంది. అప్పుడే ఎవరు టెండర్ వేశారన్న విషయంపై ఒక స్పష్టత వస్తుంది. ఇదొక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. టెండరింగ్‌కు సంబంధించి కొందరికి లబ్ది చేకూరేలా వ్యవహరిస్తున్నామంటూ సోషల్ మీడియాలో ప్రచురితమవుతున్న కథనాలు నా దృష్టికి వచ్చాయి. టెండర్ల విషయంలో మేం పూర్తి పాదర్శకంగా వ్యవహరిస్తున్నాం. ప్రతీ అంశాన్ని రికార్డు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. అదే విధంగా.. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అక్రమ పద్ధతుల్లో రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి నుంచి కీలక విషయాలు సేకరిస్తున్నారంటూ రూపాను ఉద్దేశించి ఆరోపణలు గుప్పించారు. సాంకేతిక అర్హత పొంది తక్కువ ధరకు నమోదు చేసిన వారికే బిడ్ దక్కుతుందని స్పష్టం చేశారు. ఇక ఇందుకు రూపా సైతం దీటుగా బదులిచ్చారు. ఈ మేరకు.. ‘‘హేమంత్ నింబాళ్కర్, ఐపీఎస్, నిర్భయ టెండర్ ఇన్వైటింగ్ కమిటీ, టెండర్ స్క్రూటిని కమిటి చైర్మన్ ఈరోజు అంటే 27.12.20న విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని, ప్రసార మాధ్యమాలు, ప్రజలను తప్పుదోవపట్టించేలా మరోసారి అసత్యాలు చెప్పారు’’ అని ప్రకటన విడుదల చేశారు. కాగా టెండర్ల విషయంలో ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.(చదవండి: రూ.250 భోజనం ఆర్డర్.. రూ.50 వేలు మాయం) -
టైటిలే సగం సక్సెస్
క్రాంతి, కె.సీమర్ జంటగా నటించిన చిత్రం ‘పిచ్చోడు’. హేమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై హేమంత్ శ్రీనివాస్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నటుడు సుధీర్‌బాబు మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ– ‘‘సినిమా టైటిల్ క్యాచీగా ఉండటంతో పాటు ట్రైలర్ చాలా బావుంది. టైటిలే సినిమాకు సగం సక్సెస్. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో నటించిన నూతన నటీనటులు, పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ శుభాకాంక్షలు’’ అన్నారు. హేమంత్ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ను విడుదల చేసిన సుధీర్‌బాబు గారికి ధన్యవాదాలు. యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన మా చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. -
త్వరలో చెబుతా!
‘‘నేను జర్నలిస్ట్‌గా పని చేశా. నాన్నగారు (యలమంచిలి సాయిబాబు) ‘శ్రీరామరాజ్యం’ సినిమా నిర్మించారు. నేను హీరోగా నటించిన ‘ఇంటింటా అన్నమయ్య’ విడుదల ఆలస్యం కావడంతో కాస్త నిరాశ పడ్డా’’ అన్నారు నటుడు రేవంత్. లాస్య, శోభిత, రేవంత్, నోయల్, హేమంత్ ముఖ్య పాత్రల్లో కృష్ణ కిషోర్ దర్శకత్వంలో రాజ్‌కుమార్.ఎం నిర్మించిన ‘రాజా మీరు కేక’ ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా రేవంత్ పాత్రికేయులతో మాట్లాడారు.‘‘ఈ చిత్రంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే మధ్య తరగతి యువకుడిగా కనిపిస్తా. నేను, నా స్నేహితులు కుటుంబానికి విలువ ఇస్తుంటాం. మన వ్యవస్థలోని ఓ సమస్యను మేం ఎలా పరిష్కరించామన్నదే కథ. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నాలో ఉంది. కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించా. దర్శకునికి కథపై ఉన్న పట్టు, స్క్రీన్‌ప్లే నచ్చింది. నిర్మాతగారు అందరికీ స్వేచ్ఛ ఇవ్వడంతో సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. నా తర్వాతి చిత్రం గురించి త్వరలోనే చెబుతా’’ అన్నారు. -
అందరికీ పింఛను ప్రయోజనాలు దక్కాలి
⇒ ఎన్‌పీఎస్‌లో చేరేలా అసంఘటిత రంగం వారిని ప్రోత్సహించాలి ⇒ ఈక్విటీల్లో ప్రభుత్వోద్యోగుల పెట్టుబడుల పరిమితి పెరగాలి ⇒ పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ హేమంత్ కాంట్రాక్టర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయంగా అత్యధిక శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్న నేపథ్యంలో వారందరికి పింఛను ప్రయోజనాలు దక్కేలా చర్యలు అవసరమని పెన్షన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్ హేమంత్ కాంట్రాక్టర్ తెలిపారు. వారు నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)లో చేరేలా తోడ్పడేందుకు తగు ప్రోత్సాహకాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే దిశగా ఎన్పీఎస్పై అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాంట్రాక్టర్ వివరించారు. ఎన్పీఎస్కు సంబంధించి సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీగా (సీఆర్ఏ) కార్వీ కంప్యూషేర్ పూర్తి స్థాయి కార్యకలాపాల ప్రారంభం సందర్భంగా గురువారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)లో చేరేందుకు ప్రస్తుతం 40 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయోపరిమితిని 50 ఏళ్లకు పెంచాలని, అలాగే రూ. 5,000గా ఉన్న గరిష్ట పెన్షన్ కూడా రూ. 10,000కు పెం చాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు కాంట్రాక్టర్ తెలిపారు. ప్రస్తుతం 46 లక్షల స్థాయిలో ఉన్న ఏపీవై ఏపీవై చందాదారుల సంఖ్య మార్చి ఆఖరు నాటికి 50 లక్షల స్థాయికి చేరగలదని చెప్పారు. ఎన్‌పీఎస్‌లో 1.49 కోట్ల చందాదారులు.. ఎన్పీఎస్లోని ప్రభుత్వోద్యోగులు కూడా ఇతర చందాదారుల తరహాలో ఈక్విటీల్లో 50 శాతం దాకా ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు కాంట్రాక్టర్ చెప్పారు. ప్రస్తుతం ఈ పరిమితి 15 శాతంగా ఉంది. ఈ అంశంపై పలు దఫాలు చర్చలు జరిగాయని, త్వరలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోగలదని ఆశిస్తున్నామని కాంట్రాక్టర్ చెప్పారు. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో 1.49 కోట్ల చందాదారులు ఉన్నారని, రోజుకు 10,000 మంది చొప్పున కొత్తగా చేరుతున్నారని కాంట్రాక్టర్ చెప్పారు. సుమారు రూ. 1,70,000 కోట్ల పీఎఫ్ఆర్డీఏ నిధిని ఏడు సంస్థలు నిర్వహిస్తున్నాయని వివరించారు. ఇందులో సింహభాగం చందాదారులు ప్రభుత్వోద్యోగులే ఉంటున్నారని కాంట్రాక్టర్ చెప్పారు. కార్పొరేట్ రంగం నుంచి కూడా సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. మరోవైపు చందాదారులు ఏటా 35 శాతం మేర, సబ్స్క్రిప్షన్ సుమారు 40 శాతం మేర వృద్ధి చెందుతున్నాయని కాంట్రాక్టర్ వివరించారు. ఎన్పీఎస్ సుమారు 10.5 శాతం మేర రాబడులు అందిస్తోందని ఆయన తెలిపారు. సీఆర్ఏగా కార్వీ..: ఎన్పీఎస్ చందాదారులకి సర్వీసులు అందించేందుకు రెండో సీఆర్ఏగా (సీఆర్ఏ)గా గతేడాది లైసెన్సు దక్కించుకున్నట్లు కార్వీ గ్రూప్ చైర్మన్ సి. పార్థసారథి తెలిపారు. కేవలం 34 వారాల్లో అత్యంత తక్కువ చార్జీలతో పూర్తి స్థాయిలో సర్వీసులు ప్రారంభించగలిగామని ఆయన వివరించారు. ఎన్పీఎస్ను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చే దిశగా రాబోయే రోజుల్లో కార్పొరేట్లు, ప్రభుత్వ అధికారులతో భేటీ కానున్నట్లు పార్థసారథి పేర్కొన్నారు. -
రాజా మీరు... హిట్టవ్వాలి
– డి. సురేశ్‌బాబు తారకరత్న, రేవంత్, నోయెల్, హేమంత్, లాస్య, శోభిత ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాజా మీరు కేక’. కృష్ణ కిశోర్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ, ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత డి.సురేశ్ బాబు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘మా సంస్థలో పలు విజయవంతమై చిత్రాలకు కృష్ణ కిశోర్ కో–డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇప్పుడు దర్శకునిగా ‘రాజా మీరు కేక’ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం హిట్ అయి తనకు, యూనిట్‌కు మంచి పేరు రావాలి’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో నిర్మించిన మొదటి చిత్రం ‘గుంటూరు టాకీస్’ హిట్ అయింది. మలి ప్రయత్నంగా నిర్మించిన ‘రాజా మీరు కేక’ సినిమా కూడా మా సంస్థకు మరో హిట్‌ను అందిస్తుందనే నమ్మకం ఉంది. నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉంటాయి’’ అని చిత్రనిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ ప్రసాద్ రెడ్డి, సంగీతం: శ్రీ చరణ్. -
క్లైమాక్స్‌లో కేక...
నందమూరి తారకరత్న, రేవంత్, నోయెల్, ‘మిర్చి’ హేమంత్... ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయిన ‘రాజా మీరు కేక’లో ఈ నలుగురూ కీలక పాత్రలు చేశారు. నలుగురిలో రాజు ఎవరు? అనడిగితే... ‘వచ్చే నెల వరకూ ఆగండి. సినిమా చూపిస్తాం’ అని టి. కృష్ణకిశోర్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్. ఎం ఈ చిత్రం నిర్మించారు. యాంకర్ లాస్య ఓ హీరోయిన్గా నటించారు. ఆడియో ఫిబ్రవరిలో సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘కొత్త కథతో తీసిన చిత్రమిది. క్లైమాక్స్‌లో తారకరత్న నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుంటుంది. అంత అద్భుతంగా నటించారు’’ అన్నారు కృష్ణ కిశోర్. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్. -
ఆరిపోతూ వెలుగిచ్చిన జీవన దీపం
పాతపోస్టాఫీసు: కొన్ని జీవితాలను చూస్తే విధికి ఎందుకంత కంటగింపో ఎవరు చెప్పగలరు? విధి వైచిత్రిని, వైపరీత్యాన్ని ఎవరు ఊహించగలరు? మృత్యు కెరటంలా విరుచుకుపడే విధి ఎన్నో కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచెత్తుతుంది. అనూహ్య పరిణామాలతో జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంది. ఎంవీపీ కాలనీకి చెందిన పిళ్లా ధనలక్ష్మి కుటుంబం పరిస్థితీ అదే విధంగా మారింది. ఏడాది వ్యవధిలో మృత్యువు ఆమె భర్తను, తర్వాత ఆమెను దిగమింగడంతో ఇద్దరు పిల్లల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇంత విషాదంలోనూ ఆమె బం ధువులు, పిల్లలు అవయవదానానికి సమ్మతించడంతో ధనలక్ష్మి జీవితం కడతేరినా, మరికొందరికి ప్రాణదానం చేసి నట్టురుుంది. ఎంవీపీ కాలనీకి చెందిన పిల్లా ధనలక్ష్మి (35) శుక్రవారం అనకాపల్లిలోని బంధువుల గహ ప్రవేశానికి వెళ్లి బావ గోవింద్ ద్విచక్రవాహనంపై నగరానికి వస్తుండగా సబ్బవరం దేవీపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలయ్యారు. తలకు దెబ్బ తగలడంతో ఆమెను రాంనగర్ కేర్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. శనివారం ఉదయం ధనలక్ష్మి బ్రెరుున్‌డెడ్ అరుునట్టుగా వైద్యులు నిర్ధారించారు. తర్వాత వారి సూచన ప్రకారం ఆమె బంధువులు, పిల్లలు అవయవదానానికి సమ్మతించారు. నగరంలోని మొహిసిన్ ఐ బ్యాంక్‌కు కళ్లను, లివర్‌ను అపోలో ఆస్పత్రికి, ఒక కిడ్నీని కేర్‌కు, ఒక కిడ్నీని సెవన్ హిల్స్ ఆస్పత్రికి అందజేయడానికి అంగీకరించారు. గత ఏడాది ధనలక్ష్మి భర్త గుండె పోటుతో మరణించారు. ఇప్పుడు తల్లికూడా మరణించడంతో వుడాపార్క్ చేరువలోని గాయత్రి విద్యాపరిషత్ పాఠశాలలో టెన్త చదువుతున్న హేమంత్ (15), ఎంవీపీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న రమ్యశ్రీ (11) రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. -
చింతల చీకటిలో వెన్నెల
అడవి కడుపులో చింతచెట్లు.. ఆ కడుపులో చిమ్మచీకటి!కడుపుచించినా అక్షరంరాదు అక్షరాస్యత అన్న చింత ఇద్దరిని కదిలించింది వీళ్లే టామరిండ్ ట్రీ నిర్వాహకులు! టామరిండ్ ట్రీ అంటే చింతచెట్టు... ఈ చింతచెట్టు కిందే ఆ అడవిబిడ్డలకు జ్ఞానోదయం అయింది!చింతచీకటిలో వెన్నెల కురిసింది..చింతచెట్టే చింతలేని వనమైంది!! హేమంత్ ఓ జర్నలిస్ట్. మిషెల్ సోషల్‌వర్కర్. ఇద్దరూ ముంబై వాసులే. ఒక అసైన్‌మెంట్‌లో ఒకరి గురించి ఒకరికి తెలిసింది. తొలి పరిచయంలోనే హేమంత్‌కి మిషెల్ నచ్చింది. కొన్నాళ్లకు వారి మధ్య స్నేహం బలపడింది. ఇరువురు పెద్దలను ఒప్పించారు. పెళ్లి చేసుకున్నారు. తెల్లవారే రైలు ఎక్కారు. హనీమూన్‌కి కాదు.. అడవుల్లోకి. ‘కుర్రతనం కదా.. జీవితం అంటే ఏంటో తెలిసొచ్చి ఆర్నెల్లలో వాళ్లే తిరిగొస్తారు’ అనుకున్నారు పెద్దలు. ఆర్నెల్లు కాదు పద కొండేళ్లయినా ఆ జంట తిరిగిరాలేదు. ఇది తమ కుర్రతనం కాదనీ బాధ్యత అనీ పెద్దలకు తెలియజెప్పారు. ఇంతకీ ఎక్కడికి వెళ్లారు? ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘దహను’ అనే గిరిజన ప్రాంతానికి వెళ్లారు. అది అభివృద్ధికి అందని ప్రదేశం. వర్లి తెగ ఆదివాసీలు ఉంటారక్కడ. అజ్ఞానం.. మూఢ విశ్వాసాలు.. జబ్బులు... పెద్దాళ్లకు పని ఉండదు. పిల్లలకు బడి ఉండదు. ఆ పరిస్థితులను మార్చడానికి ‘దహను’ ప్రవేశించారు హేమంత్, మిషెల్. వద్దు పొమ్మంది కాని వాళ్లు నాగరికులు. గత అనుభవాల వల్ల నాగరికులు ప్రమాదకారులు అని ఆదివాసీలకు తెలుసు. మాయ చేసి మోసం చేస్తారని భయం. అందుకే హేమంత్, మిషల్లను కూడా అనుమానంగా చూశారు. మీకు మేలు చేయడానికి వచ్చాం అంటే సందేహించారు. వాళ్లు గుడిసె వేసుకొని ఉంటే రాత్రి నిద్రపోయాక వచ్చి పీకేసేవారు. నీళ్లు నింపి పెట్టుకున్న కుండలను పగలగొట్టేవారు.. వండిపెట్టుకున్న దాంట్లో మట్టి కలిపేవారు. ఏం చేసైనా సరే వాళ్లు ఆ ఊరి నుంచి తరిమేయాలనే పంతం ఆ ఆదివాసీలది. అన్ని సహించి అక్కడే ఉండాలనేది ఆ ఆలుమగల పట్టుదల. చివరకు ఆ మొగుడుపెళ్లామే గెలిచారు. వాళ్ల మంచితనం ఆ గిరిజన బిడ్డలను కదిలించింది. నమ్మకం పెరిగింది. ఆ మార్పు కోసమే.. హేమంత్, మిషెల్ ఇక ఒక్క క్షణం కూడా వృథా చేయలేదు. దహనుకు కొంచెం దూరంలో ఉన్న ఊళ్ల నుంచి సేంద్రియ సాగు చేసే రైతులను పిలిపించి కొందరికి శిక్షణ ఇప్పించే ప్రయత్నంలో పడ్డారు. అక్కడే ఉన్న ఓ చింత చెట్టు కింద బడి మొదలెట్టారు. మొదట ఐదుగురే వచ్చారు. నెమ్మదిగా గూడెంలో ఉన్న పిల్లలందరూ పోగయ్యారు. మిషెల్ సాయంకాలాలు గూడెంలోని ఆడవాళ్లకు చదువు చెప్పేది. వాటితో పాటు ఇంటి శుభ్రత నుంచి నెలసరి సమయాల్లో పాటించాల్సిన పరిశుభ్రత వరకు అన్నీ చెప్పేది. అయిదేళ్లకు.. దహను స్వరూపం మారిపోయింది. ఇక్కడి సేంద్రియసాగు ఉత్పత్తులకు ముంబై, పుణేల్లో మంచి గిరాకీ ఏర్పడింది. ఆ గిరిజన ప్రాంతం చరిత్రను, జానపదగాథలను, వారి పట్ల కార్పొరేట్ సాగించిన దోపిడీని బయటి ప్రపంచానికి తెలియజేయడానికి కమ్యునిటీ రేడియోను స్థాపించారు. చరిత్రనంతా రికార్డ్ చేసి ప్రసారం చేయడమే కాక యూట్యూబ్‌లోనూ పెట్టారు. ఊహించని స్పందన వచ్చింది. ఆ స్ఫూర్తితో ‘నొమాడ్ ఇండియా’ అనే సంస్థనూ ప్రారంభించాడు హేమంత్. దేశంలోని ఏ గిరిజన ప్రాంతం వారైనా కమ్యునిటీ రేడియోను పెట్టుకోవాలనుకుంటే వెళ్లి సాంకేతిక సహకా రాన్ని అందించి దాని నిర్వహణలో శిక్షణకూడా ఇస్తాడు. టామరిండ్ ట్రీ చింత చెట్టుకింది స్కూల్‌ను ఈ పదకొండేళ్లలో మూడు వందల మంది విద్యార్థులతో టామరిండ్ ట్రీ అనే పెద్ద స్కూల్‌గా మార్చేసింది. ప్రతివారం ముంబై నుంచి పేరొందిన టీచర్లు వచ్చి పాఠాలు చెప్తుంటారు. రిటైరైన కొంతమంది టీచర్లయితే దహనులోనే ఉంటూ ఆ గిరిజన బిడ్డలకు ఇంగ్లిష్, కంప్యూటర్స్, వొకేషనల్ ట్రైనింగ్, లైఫ్‌స్కిల్స్ డెవలప్మెంట్ కోర్సులను నేర్పిస్తున్నారు. సర్కారు బళ్లలో పనిచేసే టీచర్లలాగా వాళ్ల పిల్లలను కాన్వెంట్ స్కూల్లో చేర్పించలేదు హేమంత్, మిషెల్‌లు. గిరిజనపిల్లలతో సమానంగా తమ ఇద్దరు బిడ్డలనూ ఈ టామరిండ్ ట్రీ స్కూల్లోనే చదివిస్తున్నారు. గాంధియన్ అభివృద్ధికి కూడా కొన్ని దుర్లక్షణాలు ఉంటాయి. అవి అభివృద్ధి ఉన్న చోట తిష్ట వేస్తాయి. దహను అభివృద్ధి అయ్యేకొద్దీ అక్కడి పురుషులు తాగుడికి బానిసలై పనికి దూరమయ్యారు. ఆడవాళ్ల సంపాదననూ హారతికర్పూరం చెయ్యనారంభించారు. దీంతో మిషెల్ ఆ గిరిజన పిల్లలకు నెలకు రెండువందల రూపాయలిస్తేనే చదువు అని తేల్చిచెప్పింది. ఈ షరతుతో అక్కడి స్త్రీలు పురుషుల మీద తిరగబడ్డారు. పిల్లల చదువుకు డబ్బు సంపాదించి తెస్తేనే ఇంట్లో తిండి, స్థానం అని మొండికేసారు. మొదట్లో భార్యలను కొట్టారు. అయినా వాళ్లు పట్టువీడలేదు. పిల్లలు తండ్రుల మీదకి తిరగబడ్డారు. ఈ తతంగం యేడాది గడిచింది. తర్వాత దార్లోకి వచ్చారు మగవాళ్లు. ఇప్పుడు వాళ్లు కట్టే రెండువందల రూపాయల ఫీజు ఆ ఇంటి ఆడవాళ్ల పేరు మీద జమవుతుంది. దాన్ని ‘గాంధియన్’ అనే సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ కిందకి మార్చారు. ఈ విషయం ఇప్పటికీ ఆ గూడెంలోని మగవాళ్లకు తెలియదట. -
ప్రేమకు వారధి ఎవ రు?
ఇద్దరు యువకులు ఒక అమ్మాయినే ప్రేమించారు. మరి ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది...? చివరికి ఎవరి ప్రేమకు ఎవరు వారధిగా నిలిచారనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘వారధి’. క్రాంతి, శ్రీదివ్య, హేమంత్ ముఖ్యతారలుగా ఇమాజినేషన్స్ పతాకంపై వివేకానంద వర్మ నిర్మించారు. సతీష్ కార్తికేయ దర్శకుడు, ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో క్రాంతి సైకో పాత్ర చేశారు. విజయ్ గొర్తి అందించిన పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సాహిత్యం: చైతన్య వర్మ, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్. -
మాఫియా కారణంగా...
ఓ ప్రేమజంటను విడదీయడానికి మాఫియా రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. మాఫియా కారణంగా ఆ ప్రేమజంట చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో ‘ప్యారడైజ్’ చిత్రం ఉంటుందంటున్నారు దర్శకుడు రవిచంద్రన్. షఫీ ప్రధాన పాత్రలో హేమంత్, షిప్రా జంటగా సత్యనారాయణ బత్స నిర్మిస్తున్న ‘ప్యారడైజ్’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి అల్లు రామకృష్ణ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత దామోదర్ ప్రసాద్ క్లాప్ ఇచ్చారు. షఫీ మాట్లాడుతూ -‘‘చాలా మంచి కథ ఇది. ఇందులో నాది పోలీసాఫీసర్ పాత్ర’’ అని చెప్పారు. ఇది విభిన్న ప్రేమకథ అని, క్లాస్‌నీ, మాస్‌నీ ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: యోగి, సంగీతం: స్ట్రింగ్స్ సతీశ్. -
అనూహ్య హత్య కేసులో హేమంత్‌ను విచారిస్తున్న ముంబై పోలీసులు
మచిలీపట్నం: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో ఆమె స్నేహితుడు హేమంత్‌ను ముంబై పోలీసులు విచారిస్తున్నారు. జనవరి 4న విజయవాడలో లోక్మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన అనూహ్యకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హేమంత్ ఆహార ప్యాకెట్స్ ఇచ్చి వెళ్లాడు. పోలీసులు అతనిని ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. హేమంత్ తండ్రి స్టాప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నత అధికారి అని తెలిసింది. హేమంత్ జెఎన్‌టియులో చదివాడు. పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా హేమంత్‌ను విచారిస్తున్నారు. ముంబై పోలీసులు ఈ రోజు మచిలీపట్నం వచ్చారు. అనుహ్య బంధువుల వద్ద నుంచి ఆధారాలను, ఇతర సమాచారం సేకరిస్తున్నారు. జనవరి 5న కుర్లా రైల్వే స్టేషన్లో అనూహ్యతోపాటు మరో వ్యక్తి ఉన్నట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఆమెతో ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్లు కెమెరాలో రికార్డ్ అయినట్లు కుర్లా రైల్వే పోలీసు ఇన్స్పెక్టర్ శివాజీ దుమాల్ తెలిపారు. వారిద్దరూ టాక్సీ స్టాండ్ వైపు వెళ్తున్నట్లు కనిపించిందని, ఆ తరువాత వారు ఎటువెళ్లింది తెలియలేదని చెప్పారు. అతను ఈ ప్రాంతానికి చెందినవాడేమోనన్న అనుమానంతో పోలీసులు ఇక్కడ ఆరా తీస్తున్నారు.